ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరికి గొడ్డలితో దాడిచేసేదాకా వెళ్లింది. గొడ్డలితో అత్తను తీవ్రంగా గాయపర్చిన ఓ అల్లుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
వెల్గటూరు: ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరికి గొడ్డలితో దాడిచేసేదాకా వెళ్లింది. గొడ్డలితో అత్తను తీవ్రంగా గాయపర్చిన ఓ అల్లుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే
సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లికి చెందిన శంకరమ్మ(50)పై అల్లుడు అంజయ్య మంగళవారం గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలుని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.