sun in law attacks
-
పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం!
ఉప్పునుంతల: పెళ్లి సమయంలో తనకు కట్నంగా ఇస్తామన్న ఎకరం పొలం విషయంలో తరచుగా అత్తమామలతో గొడవపడుతున్న అల్లుడు మామను దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన మండలంలోని మర్రిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గురుస్వామి వివరాల ప్రకారం.. మండలంలోని మర్రిపల్లికి చెందిన సోనమోని అలివేళ, వెంకటయ్య (50) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు మాధవిని రెండేళ్ల క్రితం ఉప్పునుంతలకు చెందిన గడ్డం సాయిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, రూ.3.50 లక్షలు నగదుతోపాటు ఎకరం పొలాన్ని తమ కూతురుకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడే అల్లుడికి పొలం ఇస్తే అమ్ముకుంటాడనే భావనతో వారు వాయిదా వేస్తూ వస్తున్నారు. తనకు ఇస్తామన్న ఎకరం పొలాన్ని ఇవ్వాలంటూ సాయిబాబు పెళ్లయిన ఆరు నెలల నుంచి తరుచుగా భార్యను కొట్టడంతోపాటు అత్తమామలు సోనమోని అలివేళ, వెంకటయ్యలతో గొడపపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం తన బైక్‌పై మర్రిపల్లికి వెళ్లిన సాయిబాబు ఇంటివద్ద ఉన్న అత్త అలివేళతో పొలం తన పేరిట చేయాలని గొడ వపడ్డాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వా రు తిట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయా డు. మామ వెంకటయ్యను చంపుతానంటూ గ్రా మంలో అతనికోసం వెతికాడు. వెంకటయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లాడు. అతనితో గొడవపడి కొట్టడంతో వెంకటయ్య తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే పడి చనిపోయాడు. పక్క పొలం రైతు రెడ్డమోని జగదీష్ గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వెంకటయ్యను అల్లుడే కొట్టి చంపాడని శుక్రవారం భార్య అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని మహిళ మృతి అచ్చంపేట రూరల్: అనారోగ్యంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. అచ్చంపేట పట్టణంలోని పాతబజార్ ప్రధాన రహదారిపై గతనెల 28న గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా.. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 లో స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ట్రాక్టర్‌తో తొక్కించి.. కల్టివేటర్‌తో చుట్టేసి..
సారంగాపూర్ (జగిత్యాల): ఆస్తి ముందు వారికి అనుబంధాలు కనిపించలేదు. భర్తతో కలసి కూతురే తన తండ్రి ప్రాణాలను తీసింది. ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పూరెల్లి మల్లయ్య(48) కుమార్తె జల అలియాస్ కావ్యను పదేళ్ల క్రితం రేచపల్లికి చెందిన దీటి కొమురయ్యకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కట్నం కింద రెండెకరాల భూమి, రూ.5 లక్షలు ఇచ్చాడు. మల్లయ్య మిగిలిన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ నాలుగెకరాలను సైతం తామే సాగు చేసుకుంటామని అల్లుడు, కూతురు ఇటీవల దున్నారు. విషయం తెలుసుకున్న మల్లయ్య తిరిగి అదే భూమిని ట్రాక్టర్ తో దున్నించాడు. ఈ క్రమంలో అల్లుడు, కూతురు ఆదివారం ఉదయం అదే భూమిలో పసుపు, మొక్కజొన్న వేసేందుకు వెళ్లగా మల్లయ్య, అతని తండ్రి గంగారాం అక్కడికెళ్లి నిలదీశారు. ట్రాక్టర్‌కు అడ్డుగా వెళ్లి నిల్చున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కూతురు తండ్రిని నెట్టివేసింది. అల్లుడు ట్రాక్టర్‌ను మల్లయ్య మీదికి తోలాడు. ట్రాక్టర్ అతనిమీది నుంచి దాట గానే కల్టివేటర్‌తో మల్లయ్య చనిపోయే వరకు పొలంలోనే చక్కర్లు కొట్టించాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న పక్క పొలంలో ఉన్న మల్లయ్య అన్న గంగారెడ్డి అడ్డుకునేందుకు పరుగెడుతూ వస్తుండగా.. ‘రారా! మీ తమ్ముడిని చంపినట్లు నిన్ను కూడా తొక్కిస్తా..’అంటూ కొమురయ్య అరవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు గంగారెడ్డిని అడ్డుకున్నారు. మల్లయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న అల్లుడు, కూతురు ట్రాక్టర్‌పై ఇంటికెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. అల్లుడు, కూతురు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
ఆస్తి వివాదం: అత్తపై అల్లుడి దాడి
వెల్గటూరు: ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరికి గొడ్డలితో దాడిచేసేదాకా వెళ్లింది. గొడ్డలితో అత్తను తీవ్రంగా గాయపర్చిన ఓ అల్లుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లికి చెందిన శంకరమ్మ(50)పై అల్లుడు అంజయ్య మంగళవారం గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలుని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.