మెట్రో స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి డ్రెస్క్ మెట్రో రైలు డోర్‌లో చిక్కుకుపోయింది.. అది గమనించని లోకోపైలట్ రైలును ముందుకు కదిలించాడు. దీంతో, బాధితురాలు రైలుతో పాటుగా ప్లాట్‌ఫ్లామ్‌పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. లోకోపైలట్ నిరక్ష్యంగా కారణంగా గౌరీ కుమారీ సాహు అనే యువతి ప్రాణాపాయం స్థితిలోకి చేరింది. కాగా, చాకలా మెట్రో స్టేషన్‌లో ప్లాట్‌ఫ్లామ్‌పై రైలు ఆగింది. ఈ క్రమంలో రైలు నుంచి దిగుతుండగా.. గౌరీ కుమారీ డ్రెస్ రైలు ఆటోమేటిక్ డోర్‌లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో గౌరీ కుమారీ.. పక్క కోచ్‌లో ఉన్న లోకోపైలట్‌కు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్లాట్‌ఫ్లామ్‌పై ఉన్న మరో ప్రయాణికుడు సైతం లోక్‌పైలట్‌ను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమీ పట్టించుకోకుండా లోక్‌పైలట్.. రైలును ముందుకు కదిలించడంతో ఆమె.. రైలుతో పాటే కొంత దూరం పరిగెత్తి తర్వాత కిందపడిపోయింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ చివరి వరకు కింద ఈడ్చుకెళ్లింది.
ఈ సందర్బంగా గౌరీ కుమారీని మరో వ్యక్తి కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇలా జరుగుతున్న తరుణంలో స్టేషన్‌లో మెట్రో సిబ్బంది.. ఈ విషయాన్ని లోకోపైలట్ దృష్టికి తీసుకువెళ్లడంతో సడెన్ బ్రేకులు వేసి రైలును ఆపివేశాడు. ఈ ప్రమాదంలో గౌరీ కుమారీకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తలించి వైద్య సాయం అందించారు. కాగా, ఆమె వైద్యానికి అయిన ఖర్చును మెట్రో రైలు యాజమాన్యం భరించింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. చాకలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోక్‌పైలట్ నిర్లక్ష్యం కారణంగానే తాను గాయపడినట్టు.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment