mumbai metro train
-
వైరల్ వీడియో: కదులుతున్న రైలు డోర్లో యువతి డ్రెస్ చిక్కుకుని..
-
షాకింగ్ వీడియో: కదులుతున్న రైలు డోర్లో యువతి డ్రెస్ చిక్కుకుని..
మెట్రో స్టేషన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి డ్రెస్క్ మెట్రో రైలు డోర్లో చిక్కుకుపోయింది.. అది గమనించని లోకోపైలట్ రైలును ముందుకు కదిలించాడు. దీంతో, బాధితురాలు రైలుతో పాటుగా ప్లాట్‌ఫ్లామ్‌పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లోకోపైలట్ నిరక్ష్యంగా కారణంగా గౌరీ కుమారీ సాహు అనే యువతి ప్రాణాపాయం స్థితిలోకి చేరింది. కాగా, చాకలా మెట్రో స్టేషన్లో ప్లాట్‌ఫ్లామ్‌పై రైలు ఆగింది. ఈ క్రమంలో రైలు నుంచి దిగుతుండగా.. గౌరీ కుమారీ డ్రెస్ రైలు ఆటోమేటిక్ డోర్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో గౌరీ కుమారీ.. పక్క కోచ్‌లో ఉన్న లోకోపైలట్‌కు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేసింది. ఇంతలోనే ప్లాట్‌ఫ్లామ్‌పై ఉన్న మరో ప్రయాణికుడు సైతం లోక్‌పైలట్‌ను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేమీ పట్టించుకోకుండా లోక్‌పైలట్.. రైలును ముందుకు కదిలించడంతో ఆమె.. రైలుతో పాటే కొంత దూరం పరిగెత్తి తర్వాత కిందపడిపోయింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ చివరి వరకు కింద ఈడ్చుకెళ్లింది. ఈ సందర్బంగా గౌరీ కుమారీని మరో వ్యక్తి కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇలా జరుగుతున్న తరుణంలో స్టేషన్లో మెట్రో సిబ్బంది.. ఈ విషయాన్ని లోకోపైలట్ దృష్టికి తీసుకువెళ్లడంతో సడెన్ బ్రేకులు వేసి రైలును ఆపివేశాడు. ఈ ప్రమాదంలో గౌరీ కుమారీకి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న అంథేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తలించి వైద్య సాయం అందించారు. కాగా, ఆమె వైద్యానికి అయిన ఖర్చును మెట్రో రైలు యాజమాన్యం భరించింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. చాకలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోక్‌పైలట్ నిర్లక్ష్యం కారణంగానే తాను గాయపడినట్టు.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
లాక్డౌన్ సడలింపు.. ప్రతి పది నిమిషాలకో మెట్రో!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ముంబైలో కొన్ని లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మెట్రో రైళ్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సుమారు 30 శాతం ట్రిప్పులు పెరగనున్నాయి. ఇదివరకు రెండు రైళ్ల మధ్య 15 నిమిషాల వ్యత్యాసముండేది. కానీ సోమవారం నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రతి 10 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడపాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. దీంతో రోజు 130 ట్రిప్పులు మెట్రో రైళ్లు తిరగనున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని.. మొదటి దశలో ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు, రెండో దశలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు మాత్రమే అనుమతి ఉండేది. శని, ఆదివాలు బంద్ పాటించాల్సి వచ్చేది. కానీ తాజా సడలింపుల నేపథ్యంలో ఉదయం ఏడు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పనిచేసుకునేలా వెసులుబాటు లభించింది. దీంతో శివారు, ఉప నగరాల నుంచి విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల సంఖ్య పెరగనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల ట్రిప్పులు పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. రద్దీ తక్కువ ఉండే సమయంలో 15 నిమిషాలకు ఒక రైలు, ఉదయం, సాయంత్రం రద్దీ ఉండే సమయంలో ప్రతీ 10 నిమిషాలకు ఒక రైలు నడపుతున్నట్లు ప్రకటించింది. సిబ్బందికి మొదటి డోసు పూర్తి మెట్రో–1 ప్రాజెక్టులో వర్సోవా–అంధేరీ– ఘాట్కోపర్ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా విడుదల చేసిన టైం టేబుల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6.50 గంటలకు మొదటి రైలు వర్సోవా స్టేషన్ నుంచి బయలు దేరుతుంది. చివరి రైలు ఘాట్కోపర్ స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలు దేరనుంది. ఉదయం మొదటి రైలు బయలు దేరడానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులను స్టేషన్లోకి అనుమతిస్తారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 18–44 ఏళ్ల మధ్య వయసున్న 400పైగా మెట్రో సిబ్బందికి మొదటి కరోనా డోసు వేసినట్లు మెట్రో–1 తెలిపింది. అలాగే 45 ఏళ్ల పైబడిన సిబ్బందికి మొదటి డోసు ఏప్రిల్‌లోనే వేసినట్లు తెలిపింది. దీంతో కరోనా వైరస్‌పై ప్రయాణికులెవరూ ఆందోళన చెందవద్దని మెట్రో–1 స్పష్టం చేసింది. చదవండి: వామ్మో.. ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు Mumbai: తెలుగువారి కోసం కరోనా టీకా -
మెట్రో రైలెక్కిన శ్రుతిహాసన్
పుడుతూనే నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టిన అమ్మాయి.. శ్రుతిహాసన్. అప్పటికే విశ్వవిఖ్యాత నటుడైన కమల్‌హాసన్ కూతురిగా ఆమెకు అందుబాటులో లేని సౌకర్యాలంటూ ఏమీ లేవు. దానికి తోడు ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఆమె సొంత సంపాదన కూడా చాలానే ఉంటోంది. ఏసీ కార్లు ఒకటి కాదు.. రెండు మూడైనా సమకూర్చుకోగలదు. కానీ అలాంటి శ్రుతి.. ముంబై నగరంలో మెట్రో రైలు ఎక్కి తిరిగింది. ముంబై మహానగరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఘోరంగా ఉంటుందని, దాన్నుంచి తప్పించుకోడానికి ఆమె మెట్రో రైలు ఎక్కింది.. ఆ ప్రయాణం చాలా బాగుందని గురువారం ట్వీట్ చేసింది. తాజాగా శ్రుతిహాసన్ నవరతన్ కూల్ టాల్కం పౌడర్ ప్రకటనలో కూడా పాల్గొంది. ఆ ఫొటోను ఆమె రీట్వీట్ చేసింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమా చేసింది. అందులో అక్షయ్ కుమార్ సరసన నటించింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మించారు. 2002లో విడుదలైన రమణ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. Took the metro this morning in Mumbai and I must say I'm impressed !! — shruti haasan (@shrutihaasan) April 30, 2015