ఈటానగర్: దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నదులు, సరస్సులు మంచుతో గడ్డ కడుతున్నాయి. ఇక, పలు పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల వారు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకులు ప్రమాదానికి గురైన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన సెలా పాస్ వద్ద సరస్సు మంచుతో గడ్డకట్టింది. దీంతో,.సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం సరస్సు వద్దకు వెళ్లిన పర్యాటకుల బృందం అక్కడికి చేరుకుంది. అనంతరం, వారు సరస్సులోకి దిగారు. ఒకచోట గడ్డకట్టిన మంచు పగుళ్లు రావడంతో కొందరు పర్యాటకులు గడ్డకట్టిన నీటిలో పడిపోయారు. దీంతో, మంచు గడ్డ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న పర్యాటకులు వారిని కాపాడారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు(Kiren Rijiju) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్బంగా కిరణ్ రిజుజు.. గడ్డకట్టిన ప్రదేశాల వద్దకు పర్యాటకులు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో స్థానిక గైడ్స్ సలహాలు తీసుకోవడం మంచిది. మంచుపై నడిచే సమయంలో హిమాపాతం గురించి తెలుసుకోండి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కారణంగా వెచ్చని బట్టలు ధరించి ఆనందించండి. మీ భద్రత ముఖ్యం అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.
At Sela Pass in Arunachal Pradesh. My advice to tourists: Walk on the Frozen Lakes with experienced people, drive carefully on slippery snow roads and be aware of snow avalanche. Temperatures is freezing so wear warm clothes and enjoy. Your safety is important. pic.twitter.com/UWz8xOzd57
— Kiren Rijiju (@KirenRijiju) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment