Ice Land
-
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి
ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో ఉత్తమ విదేశీ (స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్-571 ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. వారికి తినడానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్‌ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మనిషి బ్రతకడానికి అవకాశమే లేని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్కరించారు. వారిలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఈ కథలో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి మరణించిన తమ స్నేహితుల శవాలను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్ థ్రిల్లర్‌గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి
-
లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి
రేక్జావిక్: నైరుతి ఐస్లాండ్ అంతటా మంగళవారం 5.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ఈ సమయంలో కోవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడానికి దేశంలో చేపడుతన్న చర్యలపై ప్రధానమంత్రి కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్ వాషింగ్టన్ పోస్ట్ లైవ్ స్ట్రీమ్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో జాకోబ్స్ ఆ శబ్ధం విని జో ‘ఓహ్ మై గాడ్, భూకంపం’ అని పెద్దగా అని తరువాత మళ్లీ యధాస్థితికి వచ్చారు. కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్ అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చూడండి: గూగుల్ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు -
కరోనా కుయ్యో మొర్రో
ప్రపంచమంతా కరోనా వర్రీలో ఉంది. మహిళా దేశాధినేతలు ఉన్న చోట మాత్రం.. కరోనానే.. కుయ్యో మొర్రో అంటోంది! చాల్లెద్దూ.. మాట వినే రకమా కరోనా? వినే రకం కాకపోవచ్చు. కానీ.. జర్మనీ, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, డెన్మార్క్ దేశాల పాలకులు ఊరుకునే రకం కాదు. కరోనాను ఎలా దారికి తేవాలో ప్రజలకు చెప్పారు. ‘మీ దగ్గరకు కరోనాను రప్పించుకోండి. అప్పుడు కరోనా ఎవరి దగ్గరకూ వెళ్లదు’ అన్నారు. అదే నిజమైంది. ఈ దేశాల్లో కరోనా గ్రాఫ్ సాగిలపడుతోంది. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వయసు 39 ఏళ్లు. నవ్వు ముఖం. బొద్దింకలపై హిట్ కొట్టినట్లు ప్రజా సమస్యల్ని పోగొట్టేస్తుంటారు. కొత్త సమస్య.. కరోనా వచ్చింది. యాభై లక్షల జనాభా. కరోనాకు కావలసినంత పాడి. కానీ దగ్గరకు వెళ్లలే కపోయింది! ప్రజలకు ఒకటే మాట చెప్పారు జెసిండా. ‘‘యాక్ట్ లైక్ యు హ్యావ్ కరోనా వైరస్’’. మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని చెప్పారు. బాధ్యతను పెంచడం ఇది. దెబ్బతో కరోనా కంట్రోల్ అయింది. మనలాగే మార్చి 25 న లాక్డౌన్ విధించారు జెసిండా. విదేశాల నుంచి విమానం దిగిన వారిని వెనువెంటనే ఐసోలేషన్‌కి పంపిన తొలి దేశాలలో న్యూజిలాండ్ ఒకటి. ఏంజెలా మెర్కిల్ సీనియర్ లీడర్. 65 ఏళ్లు. పద్నాలుగేళ్గుగా జర్మనీ చాన్స్‌లర్. 8 కోట్ల 50 లక్షల జనాభా. మార్చి 11న ‘ఒకరికొకరు దూరంగా ఉండండి’ అనే ప్రకటన చేశారు. ‘దూరంగా ఉండకపోతే ముగ్గురిలో ఒకరి వచ్చినా ఆశ్చర్యం లేదు’ అని మర్నాడే హెచ్చరిక. ప్రస్తుతం కేసులూ ఉంటున్నాయి. రికవరీలూ ఉంటున్నాయి. మూసివేసిన కేసుల్లో 95 శాతం రికవరీలు, 5 శాతం మరణాలు. వారానికి జర్మనీ ఇప్పుడు 5 లక్షల కరోనా పరీక్షలు చేస్తోంది. మిగతా ఐరోపా దేశాల్లో జరుగుతున్న పరీక్షల కంటే ఎక్కువ. ఐ.సి.యు. బెడ్లు, వెంటిలేటర్లకు కొరత లేకుండా చూసుకున్నారు. లాక్డౌన్లో ఎకానమీ డౌన్ అవకుండా ముందే లక్ష కోట్ల యూరోలతో ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ ఏంజెలాను.. చలించని ధీమంతురాలు అని కీర్తించింది. ‘‘ఆర్థిక సంక్షోభాలలో పొదుపు ఖాతాల జోలికి వెళ్లని ఏంజెలా, పది లక్షల మంది వలస కార్మికుల్ని దేశంలోకి ఆహ్వానించిన ఏంజెలా.. ఇప్పుడీ కరోనా గడ్డుకాలం నుంచి ప్రజల్ని తేలిగ్గా గట్టెక్కించగలరని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలూ ఆమె చెప్పినట్లే చేస్తున్నారు’’ అని రాసింది. జెసిండా తన ప్రజలకు చెప్పినట్లే ఏంజెలా కూడా.. ‘కరోనా మనకొస్తుందేమో అని కాకుండా.. మనం రప్పిస్తామేమో అన్నంత జాగ్రత్తగా ఉండాలి’ అని విజ్ఞప్తి చేశారు. బెల్జియం ప్రధానమంత్రి సోఫీ విల్మేస్. వయసు 45. మృతుల సంఖ్య 10 కి చేరుకోగానే దేశంలో లాక్డౌన్ విధించారు. బెల్జియం జనాభా కోటీ 20 లక్షలు. లాక్‌డౌన్‌కి ముందు దేశాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా, ప్రజల్ని ఒప్పించేలా ఉంది. ‘‘లాక్డౌన్ అవసరం లేదు. లాక్డౌన్ అవసరం కలగకూడదనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకండి. అత్యవసరం అయినా విదేశీయానం చేయకండి’’. రెండే మాటలు. బలంగా పనిచేశాయి. కరోనా మరణాలను సోఫీ అతి తక్కువ సమయంలోనే అదుపు చేయగలిగారు. ఫిన్లాండ్లో ఏప్రిల్ 6 నుంచి కరోనా మరణాల సంఖ్య తగ్గడం మొదలైంది. ఫిన్లాండ్ జనాభా 56 లక్షలు. ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన మరణాలు 49. ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ లాక్‌డౌన్‌ని మే 13 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అతి చిన్న వయసు మహిళా ప్రధాని అయిన సనా (34) కూడా న్యూజిలాండ్ ప్రధాని జెసిండాలా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు. ‘‘ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు సహకరిస్తే చాలు’’ అని సనా తన కరోనా ప్రసంగంలో కోరారు. మహిళా ప్రధానులు ఉన్న ఐస్లాండ్, డెన్మార్క్ దేశాలలో కూడా కరోనా కేసులు తక్కువగా ఉండటమో, తక్కువ మరణాలు నమోదవడమో, కోలుకుంటున్నవాళ్లు ఎక్కువగా ఉండటమో కనిపిస్తోంది. ఐస్లాండ్ జనాభా మూడున్నర లక్షలు. డెన్మార్క్ జనాభా 50 లక్షల 80 వేలు. ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్డోటిర్ (44).. దూరాన్ని పాటించాలని ప్రజలకు చెబుతూనే, ఆర్థిక భారాలను పెరగన్వికుండా జాగ్రత్తపడ్డారు. కరోనా ప్రభావాన్ని తట్టుకునేందుకు 23,000 కోట్ల ‘క్రోనా’ల (వంద కోట్ల ఆరవై లక్షల డాలర్లు) అత్యవసర ఆర్థిక నిల్వల్ని పోగేశారు. ఇక డెన్మార్క్ ప్రధాని మ్యాటీ ఫ్రెడ్రిక్సన్ (42) ఈ నెల 15 నుంచి డే కేర్ సెంటర్లను, పాఠశాలలను తిరిగి తెరవబోతున్నారు! గత మూడు వారాలుగా ఆ దేశం లాక్డౌన్లో ఉంది. ఐస్లాండ్ ప్రధాని కత్రిన్లా.. లాక్డౌన్ లాక్‌డౌనే, ఎకానమీ ఎకానమీనే అన్నట్లు మ్యాటీ కూడా ఒకదాని ప్రభావం ఇంకోదానిపై పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎంత కష్టంలోనూ దేశంలోని ప్రైవేటు కంపెనీల సిబ్బంది జీతాలలో 25 శాతానికి మించి కోత విధించడానికి వీల్లేదని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు దేశాధినేతలు మహిళలు కాబట్టి సమర్థంగా పని చేస్తున్నారని, మహిళలు అయినప్పటికీ కరోనాను ఎదుర్కోగలుగుతున్నారని చెప్పడం కాదిది. ప్రపంచ దేశాలకు పనికొచ్చే కష్టకాలపు పాఠాలు వీళ్ల దగ్గర ఉన్నాయని చెప్పుకోవడం. -
చలాకీ నవ్వులకు కేరాఫ్ అడ్రస్!
విదేశాలలో... పిల్లలకు ఆనందం మాత్రమే కావాలి. పిల్లలున్న చోట ఆనందం మాత్రమే ఉంటుంది. వారి కళ్లల్లో ఆశ్చర్యం, మోములో సంతోషం తుళ్ళి తుళ్ళి ఆడాలంటే పర్యటనలు చేయాలి. వారి సంబరం అంబరాన్ని అంటాలంటే ఆ పర్యటనలు పసందుగా మారాలి. ఈ ఏడాది ప్రపంచంలో పిల్లలు మెచ్చే అత్యుత్తమమైన విహార ప్రదేశాలను అతి పెద్ద ట్రావెల్ గైడ్ వెబ్సైట్ ‘లోన్లీప్లానెట్’ శోధించి మరీ మన ముందుంచింది. ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా! పిల్లలను ఆనందసాగరంలో ఓలలాడించే ఈ పర్యాటక ప్రదేశాలను వీలును బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మంచులో షికార్లు... లాప్లాండ్ ఫిన్లాండ్ దేశంలోని ‘లాప్లాండ్’ చలికాలం అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక్కడి ‘రిసిటంటూరి’జాతీయ ఉద్యానంలో చలికాలమంతా మంచు కిరీటాలను ధరించిన వృక్షాలతో అలరారుతుంటుంది. గడ్డకట్టిన మంచులో బండ్లు లాగే కుక్కలు, జింకల పరుగులు, ఉండుండి చేపలు ఎగరడం.. వాటి మధ్యే మనం తిరగడం ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. రాత్రుళ్లు ఎక్కువ సమ యం ఉండే నెలలు అక్టోబర్ - మార్చి. ఈ ఆరు నెలలు మంచుపై పడే సన్నని సూర్య కిరణాలు అబ్బురపరుస్తాయి. జూన్- ఆగస్టు వరకు రోజంతా పగటి వాతావరణమే ఉంటుంది. అంటే అర్థరాత్రి కూడా సూర్యుడు వెలుగుతుంటాడన్నమాట. ఇసుక గూళ్లు... బెలిజ్ మధ్య అమెరికాలోని బెలిజ్ ప్రాంతంలో వందల సంఖ్యలో దీవులు ఉన్నాయి. అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కట్టుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. 7-12 ఏళ్ల పిల్లలకైతే ఈ ప్రాంతం పండగ సంబరాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ వన్యప్రాణుల జీవనశైలిని పిల్లలు అతి సమీపం నుంచి పరిశీలించవచ్చు. బీచ్‌లలో డ్రమ్స్‌ను ఎలా వాయించాలో నేర్చుకోవచ్చు. నీటిలోని అందాలను చూడటానికి, సుదూరంగా ఉండే అటవీ ప్రాంతానికి బోట్లలో స్విమ్మింగ్ హోల్స్ ద్వారా చేరుకోవచ్చు. జలపాతాల హోరు ఐస్లాండ్ యూరోప్‌లో అతి పెద్ద జలపాతపు ప్రవాహాలు, అతి పెద్ద హిమనీనద ప్రవాహం, నిరంతరం మండే అగ్నిపర్వతాలు, వేడినీటి కొలనులు... ఏ వయసు వారికైనా థ్రిల్ కలిగించే అద్భుతాలకు ఐస్లాండ్ చక్కని వేదిక. ఇక్కడ గుర్రపు స్వారీలు, నీటిపై పడవలతో షికార్లు, కీచురాళ్ల రొదలు, తిమింగిలాలు,.. ఇవన్నీ పిల్లల్ని మరో లోకంలో విహరించేలా చేస్తాయి. విదేశీ పర్యాటకులకు ఈ దేశం చక్కని విడిదిని ఏర్పాటు చేస్తుంది. యూరోప్ దేశాల నుంచి ఐస్‌ల్యాండ్‌కు విమానయాన సదుపాయాలు ఉన్నాయి. కథల పందిరి.. డెన్మార్క్ మిగతా దేశాలతో పోల్చితే డెన్మార్క్‌లో పిల్లల ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలిచే అంశా లు లెక్కకు మించి ఉన్నాయి. ‘టివోలి’ ప్రాంతంలో కథలలో చెప్పినట్టు కళ్లకు కట్టే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇందులో సంగీత హోరులో ఉరకలెత్తవచ్చు. రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల ను తిలకిస్తూ పసందైన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఇక ‘లెగోల్యాండ్ బిల్లండ్’లో ప్రపంచంలోని విగ్రహాల నమూనాలు 20 కోట్ల దాకా ఉన్నాయి. ఇక్కడి రంగులరాట్నంలో తిరగడం.. పిల్లలకు ఎనలేని థ్రిల్ ఇస్తుంది. గుర్రపు బగ్గీలు... ప్రేగ్ చెక్ రిప్లబ్లిక్లోని ప్రేగ్ వారాంతపు వినోదాలకు పెట్టింది పేరు. ఇక్కడ గుర్రపు బగ్గీలపై ప్రయాణం మరచిపోలేనిది. ఇక్కడి ఎత్తై పర్వతప్రాంతాలు, నిర్మాణాలన్నీ జానపద కథలలోగా అనిపిస్తాయి. నలుచదరంగా ఉండే పాత పట్టణం, చార్లెస్ బ్రిడ్జి, పెట్రిన్ హిల్‌లోని అద్దాల గది, కొయ్యబొమ్మలు, అపార్ట్మెంట్ నెంబర్ 46 అనే అద్భుతమైన భవనపు దీపాల సొగసు... పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకుంటాయి.