ఈటానగర్: ఈశాన్య రాష్ట్రాల్లో సాంప్రదాయ నృత్యాలు, ఆచార వ్యవహారాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఓ గ్రామంలో ఆయన నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్రంలోని కజలాంగ్ గ్రామాన్ని సందర్శించారు.
ఈ క‍్రమంలో మిజి అని పిలువబడే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాటలు నృత్యాలతో కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. ప్రజలంతా కరతాల ధ్వనులు చేస్తుంటే.. ఒక్కొక్కరిగా వచ్చి తమ సంప్రదాయ నృత్యం చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కూడా నృత్యం చేసి అక్కడి ప్రజలను ఉత్సాహపరిచారు. తాను చేసిన సంప్రదాయ డ్యాన్స్ వీడియోను కిరణ్ రిజిజ్ తన ట్వీటర్ ఖాతాలో షేర్‌చేశారు.
ప్రస్తుతం ఆయన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి నృత్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ కూడా ఓ మంచి డ్యాన్సర్, అద్భుతమైన అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని చూడటం చాలా ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
— Narendra Modi (@narendramodi) September 30, 2021
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
Comments
Please login to add a commentAdd a comment