
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్‌కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు.
మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment