khilla warangal
-
దారి గొడవలో గాయపడ్డ మహిళలు.. పరిస్థితి విషమం
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి తీవ్రగాయాలు
వరంగల్ అర్బన్: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు శివారులో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా వర్థన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్ కోటను సందర్శించిన గవర్నర్
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని చారిత్రక కాకతీయ రాజుల కోటను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం సందర్శించారు. కోటలోని కుసుమహాల్, ఏకశిలా గుట్ట, కాకతీయుల కీర్తి తోరణాలను ఆయన తిలకించారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయానికి వెళ్లారు. గవర్నర్ దంపతుల వెంట జిల్లా కలెక్టర్ కరుణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. వేయి స్తంభాల ఆలయం సందర్శనతో గవర్నర్ వరంగల్ జిల్లా పర్యటన ముగుస్తుంది.