
వరంగల్ కోటను సందర్శించిన గవర్నర్
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని చారిత్రక కాకతీయ రాజుల కోటను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం సందర్శించారు. కోటలోని కుసుమహాల్, ఏకశిలా గుట్ట, కాకతీయుల కీర్తి తోరణాలను ఆయన తిలకించారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయానికి వెళ్లారు. గవర్నర్ దంపతుల వెంట జిల్లా కలెక్టర్ కరుణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. వేయి స్తంభాల ఆలయం సందర్శనతో గవర్నర్ వరంగల్ జిల్లా పర్యటన ముగుస్తుంది.