warangal kota
-
కాకతీయుల స్థావరాలు
జయశంకర్ జిల్లా అటవీ సంపదకు పెట్టింది పేరు. జిల్లా విస్తీర్ణంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతమే ఉంది. ఈ అటవీ ప్రాతంలో ఆదిమానవులు, సమాధులు మొదలుకోని అనేక ఆలయాలు, గుహలు, రాతి చిత్రాలు ఉన్న ప్రాంతాలు, శత్రుదుర్బేధ్యమైన కోటలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్ని గతంలోనే వెలుగులోకి రాగా మరికొన్ని ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇందులో ఒకటి కాపురం గుట్టల్లో ఉన్న సైనిక స్థావరాలు. – మల్హర్ అల్లంత దూరాన దట్టమైన అడవి మల్హర్ మండలంలో తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో కాపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సరిహద్దులోని కాపురం చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్తే అల్లంత దూరాన దట్టమైన అడవిలో మూడు కొండలు కనిపిస్తాయి. ఉలి పట్టుకుని శిల్పులు చెక్కారా అన్న తరహాలో ఈ కొండలు కనిపిస్తాయి. ఈ కొండలు కాకతీయుల కాలంలో సైనిక స్థావరాలుగా ఉపయోగించారనేందుకు అనేక ఆధారాలు లభించాయి. కొండ పైభాగంలో విష్ణుమూర్తి ఆలయంతో పాటు ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గోడ, ఆ పక్కనే అనేక మానవ నిర్మిత గోడలు, బురుజులు, కొండ పైభాగంలో కుంట పెంకులు, వాన నీటి నిల్వ కోసం బావులను పోలిన చెక్‌డ్యాంలను నేటికీ చూడొచ్చు. ఇక గుట్టల చుట్టూ ప్రహరీలు, సైనికులు నివాసం ఉండేందుకు అనుకూలంగా రెండు భారీ గుహాలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కొండ పైభాగం నుంచి చూస్తే సుమారు 20 కిలోమీటర్ల దూరం వరకు పరిసర ప్రాంతాలు కనబడుతాయి. బావులు.. గుహలు కొండలపై ఉండే సైనికుల దాహార్తి తీర్చేందుకు అనుకూలంగా రెండు చెక్ డ్యాంలను తలిపించే బావుల నిర్మాణాలు చేసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడను కట్టి నీటిని నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపుల రెండు గుహలు కనిపిస్తాయి. ఈ రెండు గుహల్లో 200 మంది వరకు ఉండేలా స్థలం కనిపిస్తుండడం విశేషం. సహజసిద్ధమైన రాతి గోడ మొదటి, రెండో కొండను కలుపుతూ సుమరు 500 మీటర్ల మేర సహజసిద్ధంగా ఉంటుంది. ఇది పెట్టని కోట వలె ఉండి శత్రు దుర్భేద్యమైన కోటగోడలా కనిపిస్తుంది. శిథిలావస్థకు చేరిన ఆలయం చారిత్రక నేపథ్యం కొండల నిర్మాణాలు పరిశీలించిన చర్రితకారుల కథనం ప్రకారం.. ఈ నిర్మాణం రెండో ప్రతాపరుద్రుడి కాలం నాటి రహస్య సైనిక స్థావరం కావొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి పశ్చిమ దిక్కులో రామగిరి ఖిల్లా, తూర్పు దిక్కున ప్రతాపగిరి కోట ఉంది. క్రీ.శ. 1303 సంవత్సరంలో ఢిల్లీ పరిపాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యంపై అంటే నేటి వరంగల్‌పై దండెత్తగా ఉప్పరపల్లి గ్రామం వద్ద సైనిక అధ్యక్షు పోతుగంటి మైలి తన సైన్యంతో ప్రతాపగిరి, రామగిరి ఖిల్లా నుంచి వచ్చిన సైన్యం సహకారంతో మాలిక్కాఫర్ని మప్పు తిప్పలు పెట్టారు. కానీ ఢిల్లీ సైనికులకు బలం ఎక్కువగా ఉండటం మూలన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సూల్తాన్కు ఏటా కప్పం కట్టేలా సంధి చేసుకున్నాడు. అనంతరం సైనిక కోటను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ రెండు సైనిక స్థావరాల వివరాలు శత్రువులకు తెలిసిపోవడంతో ప్రతాపరుద్రుడు ఇదే ప్రాంతంలోని కాపురంలో ఉన్న ఎత్తైన మూడు కొండల మీద సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడని స్థానికులు చెబుతుంటారు. కోట గోడలు శత్రువుల నుంచి రక్షణ కోసం రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెలుగా ఈ భద్రత ఉండగా.. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పట్టిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కాసేందుకు నలువైపులా బురుజు వంటి నిర్మాణాలు ఉన్నాయి. అలాగే కొండ పైభాగంలో ఒకటి, రెండో కోట గడీల మధ్య భాగంలో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాం తరహాలో నిర్మాణం చేశారు. వర్షపు నీరు వృథా కాకుండా కొండ పైభాగం నుంచి జాలు వారే నీటిని నిల్వ చేయడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
వరంగల్ కోటను సందర్శించిన గవర్నర్
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని చారిత్రక కాకతీయ రాజుల కోటను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం సందర్శించారు. కోటలోని కుసుమహాల్, ఏకశిలా గుట్ట, కాకతీయుల కీర్తి తోరణాలను ఆయన తిలకించారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయానికి వెళ్లారు. గవర్నర్ దంపతుల వెంట జిల్లా కలెక్టర్ కరుణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. వేయి స్తంభాల ఆలయం సందర్శనతో గవర్నర్ వరంగల్ జిల్లా పర్యటన ముగుస్తుంది. -
కాకతీయుల కోటలో జెండా పండుగ!
ఖిలా వరరంగల్ : స్వాతంత్య్ర వేడుకలను ఈ ఏడాది కాకతీయులు నిర్మించిన కోట ఆవరణలో నిర్వహించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నందున వరంగల్లోనూ చారిత్రక కాకతీయుల కోటలో నిర్వహించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. భద్రత పరమైన అంశాలను పరిశీలించి ఈ విషయంపై రెండు రోజుల్లో తు ది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ మంగళవారం చెప్పారు. పంద్రాగస్టు వేడుకలు వరంగల్ కోటలో నిర్వహించాలని విజ్ఞప్తులు రావడంతో అక్కడి స్థలాన్ని స్వయంగా పరిశీ లించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థలం విస్తీర్ణం విషయంలో చిన్న పాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ... భద్రతాపరంగా పోలీస్ శాఖ ఇచ్చే నివేదిక బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాకతీయుల కోట ప్రాంతాంలోని ఖుష్‌మహల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువుగా ఉందని కలెక్టర్ పేర్కొ న్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించే విషయంపై అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు, వరంగల్ నగర కమిషనర్ సువర్ణ పండాదాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ కిషన్ మంగళవారం ఉదయం కోట ప్రాంతాన్ని సందర్శించా రు. చారిత్రక కోటలోని ఖుష్‌మహల్ పక్కన, కాకతీయలు కీర్తితోరణాల నడుమ అందమైన శిల్పాల మధ్య ప్రదేశాలను పరిశీలించారు. అధికారుల పర్యటనలో భాగంగా కోటలో ప్ర త్యేక పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది శి ల్పాల ప్రాంగణం, ఖుష్‌మహల్ తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ కిషన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి స్వా తంత్య్ర వేడుకలను చారిత్రక ప్రదేశాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. పంద్రాగస్టు వేడుకల పరేడ్ నిర్వహణకు ఒక్కచోటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుందని, ఖుష్‌మహల్‌ను ఆనుకుని ఉన్న రెండు ఎకరాల ప్రైవేట్ వ్యక్తుల భూమి, ఆ పక్కన మినీపార్క్ స్థలం, కాకతీయుల కళాతోరణాల నడుమ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. కేంద్ర పురావస్తుశాఖ, ప్రైవేటు భూమి యజమానులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. మధ్యకోటలో స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి త్వరలో తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు. భద్రతపై సమీక్షిస్తాం : అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు స్వాతంత్య్ర వేడుకలను కోట ఆవరణలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణరుుస్తే తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షిస్తామని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు చెప్పారు. ఖిలావరంగల్ కోట ప్రాంతంలో గతంలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థలాన్ని, ప్రాంతాన్ని పరిశీ లించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్సవాలు కోటలోనే జరిగితే ట్రాఫిక్ నియంత్రణ ప్రధాన సమస్య అవుతుందని చెప్పారు. కోట లో వేడుకల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్‌ను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆదేశిం చారు. ఈమేరకు నివేదిక రూపొందిస్తున్నారు. ఖిలా వరంగల్ పరిశీలన కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, కేంద్ర పురావస్తు శాఖ సమన్వయకర్త సుబ్బారావు, పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి, స్థానిక నాయకులు సం గరబోయిన చందర్, బొలుగొడ్డు శ్రీనివాస్, ప్రభాకర్, బి.దామోద ర్, బిల్ల రవి, కరుణాకర్, మేకల ఎల్లయ్య, పుట్ట మోహన్, పుప్పాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.