ఖిలా వరరంగల్ : స్వాతంత్య్ర వేడుకలను ఈ ఏడాది కాకతీయులు నిర్మించిన కోట ఆవరణలో నిర్వహించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నందున వరంగల్‌లోనూ చారిత్రక కాకతీయుల కోటలో నిర్వహించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. భద్రత పరమైన అంశాలను పరిశీలించి ఈ విషయంపై రెండు రోజుల్లో తు ది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ మంగళవారం చెప్పారు.
పంద్రాగస్టు వేడుకలు వరంగల్ కోటలో నిర్వహించాలని విజ్ఞప్తులు రావడంతో అక్కడి స్థలాన్ని స్వయంగా పరిశీ లించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థలం విస్తీర్ణం విషయంలో చిన్న పాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ... భద్రతాపరంగా పోలీస్ శాఖ ఇచ్చే నివేదిక బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాకతీయుల కోట ప్రాంతాంలోని ఖుష్‌మహల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువుగా ఉందని కలెక్టర్ పేర్కొ న్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించే విషయంపై అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు, వరంగల్ నగర కమిషనర్ సువర్ణ పండాదాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ కిషన్ మంగళవారం ఉదయం కోట ప్రాంతాన్ని సందర్శించా రు.
చారిత్రక కోటలోని ఖుష్‌మహల్ పక్కన, కాకతీయలు కీర్తితోరణాల నడుమ అందమైన శిల్పాల మధ్య ప్రదేశాలను పరిశీలించారు. అధికారుల పర్యటనలో భాగంగా కోటలో ప్ర త్యేక పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది శి ల్పాల ప్రాంగణం, ఖుష్‌మహల్ తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ కిషన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి స్వా తంత్య్ర వేడుకలను చారిత్రక ప్రదేశాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు.
పంద్రాగస్టు వేడుకల పరేడ్ నిర్వహణకు ఒక్కచోటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుందని, ఖుష్‌మహల్‌ను ఆనుకుని ఉన్న రెండు ఎకరాల ప్రైవేట్ వ్యక్తుల భూమి, ఆ పక్కన మినీపార్క్ స్థలం, కాకతీయుల కళాతోరణాల నడుమ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. కేంద్ర పురావస్తుశాఖ, ప్రైవేటు భూమి యజమానులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. మధ్యకోటలో స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి త్వరలో తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ తెలిపారు.
భద్రతపై సమీక్షిస్తాం :
అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు
స్వాతంత్య్ర వేడుకలను కోట ఆవరణలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణరుుస్తే తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షిస్తామని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు చెప్పారు. ఖిలావరంగల్ కోట ప్రాంతంలో గతంలో ఉన్న మావోయిస్టుల ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థలాన్ని, ప్రాంతాన్ని పరిశీ లించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్సవాలు కోటలోనే జరిగితే ట్రాఫిక్ నియంత్రణ ప్రధాన సమస్య అవుతుందని చెప్పారు. కోట లో వేడుకల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్‌ను ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆదేశిం చారు.
ఈమేరకు నివేదిక రూపొందిస్తున్నారు. ఖిలా వరంగల్ పరిశీలన కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, కేంద్ర పురావస్తు శాఖ సమన్వయకర్త సుబ్బారావు, పర్యాటక శాఖ గైడ్ దేనబోయిన రవి, స్థానిక నాయకులు సం గరబోయిన చందర్, బొలుగొడ్డు శ్రీనివాస్, ప్రభాకర్, బి.దామోద ర్, బిల్ల రవి, కరుణాకర్, మేకల ఎల్లయ్య, పుట్ట మోహన్, పుప్పాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల కోటలో జెండా పండుగ!
Published Wed, Aug 6 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement