కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని బొమ్మనకల్ బైపాస్‌రోడ్డులో దుండగులు ఓ మహిళను కత్తులతో బెదిరించి మెడలోని ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. శివాజీనగర్‌కు చెందిన కుంట అంజలి బుధవారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకకు వెళుతున్న క్రమంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించారు. కత్తులతో బెదిరించి ఆమె మెడలోని 20 తులాల బంగారు ఆభరణాలను తెంపుకుని పరారయ్యారు. ఈ క్రమంలో మహిళకు గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.