మల్లాపూర్: కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావు పేటలో శనివారం మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన మిట్ట లక్ష్మి భర్త ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అతడు ఇటీవల రూ.1.90 లక్షల నగదు భార్యకు పంపాడు. ఆ నగదును లక్ష్మి బీరువాలో భద్రపరిచి శనివారం ఉపాధి పనులకు వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని నగదును ఎత్తుకుపోయారు. భోజన సమయంలో ఇంటికి చేరుకున్న లక్ష్మి దొంగతనం విషయం గ్రహించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై షేక్ జాన్‌పాషా సంఘటన స్థలిని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.