
ఆర్టీసీ బస్సు బీభత్సం : ఇద్దరు విద్యార్థినులు మృతి
హైదరాబాద్ : నగరంలోని కవాడిగూడలో ఆర్టీసీ బస్సు శనివారం బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి, మూడు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను ముషిరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థినులు మరణించారు. అయితే బస్సు ఢీకొన్న ఘటనలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.