
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పులిగిలిపాడు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలో కూలిపనులకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన మహిళను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో క్వారీ వద్ద గాయపడిన మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment