కాలుతున్న దుకాణాలు
నందిపేట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం బస్టాండు సమీపంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రోడ్డున గల ఆరు దుకాణాలు (కోకాలు) పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిన్న సిలిండర్లు విక్రయించుకునే బుక లింబాద్రి డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో ఆయ న బయటకు పరుగులు తీశాడు. ఆయనను చూసి పక్క దుకాణాల యజమానులు సైతం పరుగులు పెట్టి బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే పెద్ద శబ్ధంతో సిలిండర్‌పేలి పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
అదే సమయంలో గాలి వీయడం, చుట్టుపక్కల ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకా ణ యజమానులు తమ దుకాణాలలో గల సామగ్రిని కాపాడుకునేందుకు బయటకు విసి రేశారు. ఫైర్ ఇంజనుకు ఫోన్ చేసినా సమాయానికి రాలేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో మంటలు అంటుకున్న దుకాణాలను పక్కకు తొలగించారు. ఇతర దుకాణాలకు మంటలు అంటకుండా ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో సిలిండర్ దుకాణంతో పాటు చెప్పుల దుకాణం, కిరాణ షాఫు, పెస్టిసైడ్, బట్టల దుకాణం, పూల దుకాణం మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఇందులో బిల్ల నారాయణ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణం, రాంబాబుకు చెందిన పెస్టిసైడ్, ఇతరుల చెప్పులు, బట్టల దాకాణాల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ. 30లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితులు వాపోయారు. అగ్రి ప్రమాదం సాయత్రం 5.15 గంటలకు జరుగగా సుమారు గంట ఆలస్యంగా అగ్ని మాపక సిబ్బంది వచ్చారు. వారు సకాలంలో వచ్చి ఉంటే నష్టం అంతగా జరిగేది కాదని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment