property lose
-
పేలిన సిలిండర్
నందిపేట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం బస్టాండు సమీపంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రోడ్డున గల ఆరు దుకాణాలు (కోకాలు) పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 లక్షల వరకు ఆస్తినష్టం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిన్న సిలిండర్లు విక్రయించుకునే బుక లింబాద్రి డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో ఆయ న బయటకు పరుగులు తీశాడు. ఆయనను చూసి పక్క దుకాణాల యజమానులు సైతం పరుగులు పెట్టి బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే పెద్ద శబ్ధంతో సిలిండర్‌పేలి పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో గాలి వీయడం, చుట్టుపక్కల ఎలాంటి నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకా ణ యజమానులు తమ దుకాణాలలో గల సామగ్రిని కాపాడుకునేందుకు బయటకు విసి రేశారు. ఫైర్ ఇంజనుకు ఫోన్ చేసినా సమాయానికి రాలేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో మంటలు అంటుకున్న దుకాణాలను పక్కకు తొలగించారు. ఇతర దుకాణాలకు మంటలు అంటకుండా ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో సిలిండర్ దుకాణంతో పాటు చెప్పుల దుకాణం, కిరాణ షాఫు, పెస్టిసైడ్, బట్టల దుకాణం, పూల దుకాణం మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇందులో బిల్ల నారాయణ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణం, రాంబాబుకు చెందిన పెస్టిసైడ్, ఇతరుల చెప్పులు, బట్టల దాకాణాల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ. 30లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితులు వాపోయారు. అగ్రి ప్రమాదం సాయత్రం 5.15 గంటలకు జరుగగా సుమారు గంట ఆలస్యంగా అగ్ని మాపక సిబ్బంది వచ్చారు. వారు సకాలంలో వచ్చి ఉంటే నష్టం అంతగా జరిగేది కాదని స్థానికులు పేర్కొన్నారు. -
మావోయిస్టుల ఘాతుకం.. భారీ ఆస్తినష్టం
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. దాదాపు మూడు కోట్ల విలువచేసే వాహనాలను తగలబెట్టారు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లా సూరజ్ గఢ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 47 లారీలు, 4 జేసీబీలు, 2 ట్రాక్టర్లు, 2 రోడ్డ రోలర్లను మావోయిస్టులు అటవీ ప్రాంతానికి తరలించి అనంతరం వారి ప్లాన్ ప్రకారం వారిని తగలబెట్టి భారీ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని గడ్జిరోలి జిల్లా ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. దాదాపు 400 మంది సభ్యులుగా ఉన్న మావోయిస్టు గ్రూపు ఆ దారుణానికి పాల్పడి ఉంటుందని ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన బృందం అభిప్రాయపడింది. మావోయిస్టులు ఎందుకు ఈ విధ్వసానికి పాల్పడ్డారో ఇప్పటివరకూ తెలియరాలేదు. -
తాడేపల్లిలో ఈదురుగాలుల బీభత్సం
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు మున్సిపాలిటీలోని పలు ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, సీతానగరంలోని 15 ఇళ్లపై ఉన్న రేకులు ఈదురుగాలుల దెబ్బకు ఎగిరి పోయినట్లు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలుల దెబ్బకు చాలా చెట్లు నేలకులాయి. కాగా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న చెట్టు కూలి కరెంటు తీగలపై పడటంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. -
మెడికల్ షాపులో అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్(హైదరాబాద్): ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించి మెడికల్ షాపు పూర్తిగా కాలిపోయిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని పీడీపీ చౌరస్తాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మెడికల్ షాపులో ఉన్న సుమారు రూ. 4 లక్షల విలువైన మందులు మంటల్లో బుడిదయ్యాయి. తెల్లవారుజామున మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కరమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.