![తాడేపల్లిలో ఈదురుగాలుల బీభత్సం](/styles/webp/s3/article_images/2017/09/3/41439128689_625x300.jpg.webp?itok=yDK8FKDM)
తాడేపల్లిలో ఈదురుగాలుల బీభత్సం
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు మున్సిపాలిటీలోని పలు ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, సీతానగరంలోని 15 ఇళ్లపై ఉన్న రేకులు ఈదురుగాలుల దెబ్బకు ఎగిరి పోయినట్లు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలుల దెబ్బకు చాలా చెట్లు నేలకులాయి. కాగా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న చెట్టు కూలి కరెంటు తీగలపై పడటంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.