huge rain
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం : కుంగిన రోడ్డు
సాక్షి, హైదరాబాద్ : ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో బుధవారం మద్యాహ్నం భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కోఠి, దిల్‌సుక్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, నాంపల్లి, అబిడ్స్, మెహదీపట్నం, అత్తాపూర్, అబిడ్స్, బేగంపేట్, ఖైరతాబాద్, పాతబస్తీ, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, లంగర్‌హౌస్, షేక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీవర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరుచేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కుంగిన రోడ్డు నగరంలోని కుషాయిగూడ ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రజలు చూస్తుండగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రోడ్డు కుంగడంతో వాహనదారులు ప్రమాదానికి లోనవకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు. చదవండి : మూడ్రోజుల పాటు వర్షాలు... -
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లన్నీ వర్షపు నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా పలుప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. -
నేడూ కొనసాగనున్న అల్పపీడన ద్రోణి
సాక్షి,సిటీబ్యూరో: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. మహేశ్వరంలో 1.7 సెంటీమీటర్లు, శామీర్‌పేట్‌లో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలు,ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో రహదారులపై వరదనీరు పోటెత్తింది. పలు ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు ట్రాఫిక్ రద్దీతో విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఉరవకొండలో భారీ వర్షం
ఉరవకొండ(అనంతపురం): అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా మంగళవారం కూడా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని రవాణా మార్గాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మండల కేంద్రంలోని 25 ఇళ్లు కూలిపోయాయి. కాగా, మూలగిరిపల్లెలో వర్షానికి 250 గొర్రె పిల్లలు మృతి చెందాయి. -
తాడేపల్లిలో ఈదురుగాలుల బీభత్సం
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు మున్సిపాలిటీలోని పలు ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, సీతానగరంలోని 15 ఇళ్లపై ఉన్న రేకులు ఈదురుగాలుల దెబ్బకు ఎగిరి పోయినట్లు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలుల దెబ్బకు చాలా చెట్లు నేలకులాయి. కాగా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న చెట్టు కూలి కరెంటు తీగలపై పడటంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. -
అతలాకుతలమైన అమెరికా
-
చెరువులో పాగా చేలు పండేదెలా ?
ఆక్రమణలకు కాదేదీ అనర్హం అన్నట్టు చిన్న తరహా నీటి వనరులపైనా కబ్జాదారుల కన్నేస్తున్నారు. అందినకాడికి దున్నేస్తున్నారు. సరైన వర్షాలు లేక, సాగు చేపట్టలేక చతికిల పడుతున్న రైతులు ఆక్రమణదారులతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 500 ఎకరాలకు సాగునీరందించే దోసపాటి చెరువు భూముల్లో పాగా వేయడం సాగర్ జలాల పారుదలకు అడ్డంకిగా మారింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నీళ్లు లేక బీళ్లుగా మారడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆక్రమణలను తొలగించి సాగర్ జలాలు ఇవ్వాలని చేస్తున్న విజ్ఞప్తులు అధికారుల చెవిని సోకడం లేదు. వానలు లేక, సాగర్ జలాలు రాక సాగుచేపట్టే దారి లేక అచ్చంపేట ప్రాంత రైతులు బిక్క మొహాలతో దిక్కులు చూస్తున్నారు. అచ్చంపేట: స్థానిక దోసపాటి చెరువు ఆక్రమణకు గురైంది. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న చెరువు భాగంలో దాదాపు వంద ఎకరాలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చే మార్గాలు మొత్తం మూసుకుపోయాయి. భారీ వర్షం పడితేనే ఈ చెరువు నిండుతుంది. కానీ ఆ స్థాయి వర్షం రెండు మూడేళ్లుగా కురవలేదు. నీళ్లు లేక చెరువు ఆయకట్టులోని 500 ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. వీటిలో 150 ఎకరాలు మాగాణి భూములు కాగా, మిగిలిన 350 ఎకరాలు మెట్టభూములు ఉన్నాయి. ఏటా చెరువు నిండుతుందని ఎదురు చూస్తున్న రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మండలంలోని వేల్పూరు, చిగురుపాడు, ఓర్వకల్లు, రుద్రవరం చెరువు లు కూడా నీళ్లు లేక కళతప్పాయి. వీటిలో కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. వీటి పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఆక్రమణలను తొలగించి నాగార్జున సాగర్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నా అధికారులను పట్టించుకోవడం లేదు.సాగర్ నుంచి వచ్చే నీటిని చెరువులకు మరల్చుకునే మార్గాలు మూసుకు పోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చెరువుల ఆయకట్టులోని భూముల్లో ఏటా సమృద్ధిగా పంటలు పండించుకునేవారు. రెండేళ్లుగా చెరువులు నిండకపోవడంతో దిగువన ఉన్న భూములు మొత్తం బీళ్లుగా మారుతున్నాయి.చెరువుకు నీళ్లు రావాలంటే.... దోసపాటి చెరువు నిండాలంటే ముందుగా తాళ్లచెరువులో ఉన్న అదాటి చెరువు నిండాలి. అక్కడ నుంచి నీళ్లు రావాలంటే ముందుగా ఆక్రమణలను తొలగించాల్సి ఉంది. ఈ రెండు చెరువుల మధ్య ఉన్న భూములు, కాలువలను కొంతమంది ఆక్రమించుకోవడం వల్లనే సాగునీళ్లు రావడం లేదు.చింతపల్లి మేజర్ కాలువ నుంచి నేరుగా దోసపాటి చెరువుకు నీటి సరఫరా చేసినట్లయితే ఏటా చెరువు కింద ఉన్న 500 ఎకరాల భూముల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చొరవచూపి దోసపాటి చెరువు నింపేందుకు ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు. -
అకాల వర్షం
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: జిల్లాలో వర్షాకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున 4నుంచి 9గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చొప్పదండి, ధర్మపురి, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో గింజ పోసుకునే దశలో ఉన్న వరి నేలవాలింది. కొన్నిచోట్ల వరి కోసి ధాన్నాన్ని కల్లాల్లో ఆరబెట్టగా తడిసి ముద్దయింది. ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలగా, బట్టీలకు సిద్ధంగా ఉన్న ఇటుక తడిసి ముద్దయింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపో యి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అత్యధిక ంగా ధర్మారం మండలంలో 62.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రామడుగులో 1.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 8 మండలాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లాలో సగటున 6.7 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షపాతం ఇలా... కరీంనగర్ 33.6మిల్లీమీటర్లు, మానకొండూర్ 24.2, రామడుగు 1.3, చొప్పదండి 61.4, పెగడపల్లి 9.3, వేములవాడ 6.8, శ్రీరాంపూర్ 20.0, పెద్దపల్లి 6.0, ఓదెల 5.4, రామగుండం 19.8,, సుల్తానాబాద్ 10, వెల్గటూర్ 12.2, ధర్మారం 62.2, జూలపల్లి 46.2 ఎలిగేడ్ 56.2, మంథని 3.2, కమాన్‌పూర్ 5.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
గాలివాన బీభత్సం
పెనుగాలతో నేలకు వరిగిన వరిపంట వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు రెండు నిండు ప్రాణాలను బలితీసుకోగా, రైతులకు అపార నష్టం మిగిల్చాయి. జిల్లాలోని పడమటి పల్లెల వాసులను బుధవారం సాయంత్రం అకాల వర్షం, గాలులు గడగడలాడించాయి. పెదనాన్నతో కలిసి పొలంలోకి వెళ్లి వస్తున్న బాలుడితో పాటు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మరోచిన్నారిని పిడుగులు బలితీసుకున్నాయి. గాలుల తీవ్రతకు వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి, నిమ్మతోటల్లో కాయలు రాలిపోయాయి. కోతకు వచ్చిన వరితో పాటు ధాన్యం రాశులు తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కలువాయి, న్యూస్‌లైన్ : కలువాయిలో బుధవారం సాయంత్రం పెనుగాలుల తో కూడిన వర్షం కురిసింది. అర్ధగంట సేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పెనుగాలులు వీచాయి. పెనుగాలులకు మామిడి కాయలు నేలరాలా యి. కలువాయి, కుల్లూరు, రాజుపాళెం, వెంకటరెడ్డిపల్లి, పెన్నబద్వేలు, బ్రాహ్మణపల్లి, తెలుగురాయపురం, నూకనపల్లి, కొలవపల్లి గ్రామాల్లో రైతు లు వరియంత్రాలతో వరి పంట కోతల ను కోస్తున్నారు. అకాల వర్షంతో ధా న్యంతో పాటు పంట తడిసిపోయింది. కోత జరగని వరిపంట వర్షంతో వరి గింజలు నేలరాలాయి. రాజుపాళెం, క లువాయి, ఉయ్యాలపల్లి గ్రామాల్లో మామిడితోటలు ఉన్నాయి. గాలులకు మామిడి కాయలు నేలరాలడంతో రైతుగుండె చెరువైంది. మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. తరలిపోయిన వరికోత యంత్రాలు వర్షంతో కోత కోస్తున్న వరి కోత మిషన్లు రోడ్డెక్కాయి. మళ్లీ కోతలు ప్రారంభం కావాలంటే వారం రోజులు పడుతుందనే ఉద్దేశంతో యంత్రాలను యజమానులు తరలించుకెళ్లారు. గాలీవాన బీభత్సం డక్కిలి: మండలంలోని పాతనాలపా డు, భీమవరం, దగ్గవోలు, శ్రీరాంపల్లి, డక్కిలి, మోపూరు తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఉరుములతో కూడి న వడగళ్ల వాన, గాలి సుమారు గం టపాటు జనాలను బెంబేలెత్తించాయి. దీంతో నిమ్మకాయలు, మామిడిపూత, కాయులు నేలరాలాయి. కొన్ని చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. రాపూరులో భారీ వర్షం రాపూరు మండలంలోనూ ఉరుము లు, మెరుపులు, పెనుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. రైతులకు తీరని నష్టం వింజమూరు: అకాల వర్షంతో వింజ మూరు మండలంలో అరటి , మొక్కజొ న్న, తమలపాకు, మిరప, మామిడి, ప త్తి రైతులకు నష్టం వాటిల్లింది. పది రో జుల్లో చేతికిరానున్న గెలలతో కూడిన అరటి చెట్లు నేలకూలాయి. యర్రబల్లిపాళెంలో చెట్లు నేలకూలి రైతులు బ య్యపురెడ్డి యల్లారెడ్డి, యల్లాల సుబ్బారెడ్డి, కాసా రఘు, కందల కొండారెడ్డి, బయ్యపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, వం గాల వెంకటేశ్వరరెడ్డి తదితరుల నష్టపోయారు. జీబీకేఆర్ఎస్టీ కాలనీ సమీపం లో రైతు పైడాల వెంకటెశ్వరరెడ్డికి చెం దిన 1200 అరటిచెట్లు నేలకొరిగాయి. సాతానువారిపాలెంలో భువనేశ్వరప్రసాద్, తిరుపతయ్యకు చెందిన మొక్కజొన్న పంట నేలవాలింది. చింతలపాళెం, నందిగుంటలో మిరపతోటలు దె బ్బతిన్నాయి. కల్లాల్లోని మిరపకాయలు తడిచిపోయాయి. మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి. నాలుగు వి ద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో చౌ టపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బీసీకాలనీలోనూ రెండు స్తం భాలు నేలకొరగడంతో గ్రామం అంధకారంలో చిక్కుకుంది. మామిడి రైతును ముంచిన గాలులు సీతారామపురం: పెనుగాలులతో కూడి న వర్షం కురవడంతో మామిడి రైతులు నిండా మునిగారు. బసినేనిపల్లి, రంగనాయుడుపల్లి, అయ్యవారిపల్లి, సీతారామపురంలోని మామితోటల్లో కాయ లు, పిందెలు రాలిపోయాయి. రైతుల కు సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే సమయంలో వ రి, మొక్కజొన్న పంటలు నేలవాలా యి. చాలా మంది రైతులకు చెందిన ధా న్యం రాశులు తడిచిపోయాయి. చెట్ల కొమ్మలు విరగడంతో పాటు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
కడగండ్ల వాన.. వడగళ్ల వానలు
* ఈదురు గాలులతో భారీగా పంటనష్టం * దెబ్బతిన్న వరి, మొక్కజొన్న.. * తడిసిపోయిన మిర్చి వేల ఎకరాల్లో నష్టం.. * రాలిపోయిన మామిడిపూత * పలుచోట్ల ధ్వంసమైన ఇళ్లు, గుడిసెలు సాక్షి, నెట్వర్క్: కాలం కాని కాలంలో ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానలు అన్నదాతను కన్నీటిలో ముంచేశాయి. వేల ఎకరాల్లో పంటలను దెబ్బతీసి, కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు నేలవాలాయి. వడగళ్లు, ఈదురుగాలులకు మామిడిపూత రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న: వరంగల్ జిల్లాలో వడగళ్ల వానలకు స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్, మద్దూరు, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట, నెక్కొండ, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి, దుగ్గండి, చెన్నారావుపేట, గూడూరు, సంగెం, కేసముద్రం, ఆత్మకూరు మండలాల్లో పంటలు దెబ్బతిన్నారుు. 14వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 15 గ్రామాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోయింది. మొక్కజొన్న, వరి నేలకొరిగాయి. పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోగా.. వడగళ్లతో పలువురు గాయపడ్డారు. తడిసిన మిర్చి: ఖమ్మం జిల్లాలో వడగళ్ల వానలు మిర్చి రైతులకు కన్నీళ్లు పెట్టించాయి. మొక్కజొన్న, మామిడి పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచ మండలంలో మామిడిపూత రాలిపోయింది. పలు ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. వాజేడులో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి రూ. 40లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పినపాక, బూర్గంపాడు మండలాల్లో వెయ్యి ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది. వెంకటాపురం మండలంలో 1,400 ఎకరాల్లో మిర్చి, 1,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లెందులో 500 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. 5,520 హెక్టార్లలో నష్టం: కరీంనగర్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 5,520 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 1,177 హెక్టార్లలో మామిడి తోటలు, 2,550 హెక్టార్లలో మొక్కజొన్న, 600 హెక్టార్లలో వరి, 240 హెక్టార్లలో ఆవాలు, 1,600 హెక్టార్లలో నువ్వులు, 500 హెక్టార్లలో సజ్జలు దెబ్బతిన్నట్లు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేలవాలిన పంటలు: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. జొన్న, మొక్కజొన్న, వరి, నువ్వులు, శనగ, వేరుశనగ పంటలు బాగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు నానిపోయింది. టమాటా పంట కూడా బాగా దెబ్బతిన్నంది. అంతా అతలాకుతలం: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు ఎర్రజొన్న, నువ్వు పంటలు నేలకొరుగుతున్నాయి. వర్ని మండలం తిమ్మాపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు మరణించారు. బాల్కొండ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన పసుపు, ఎర్ర జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మాక్లూర్ మండలంలో సుమారు 600 ఎకరాల్లో టమాటా, 400 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలో వరి, మొక్కజొన్న నేలమట్టమయ్యాయి. డిచ్పల్లిమండలంలో ఉల్లి పంటకు నష్టం జరిగింది. జిల్లాలో 12,910 ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నేలరాలిన బత్తాయి, మామిడిపూత: నల్లగొండ జిల్లాలో బత్తాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. వరి నేలకొరిగింది. భువనగిరి, తుర్కపల్లిలో, ఆలేరు, రామన్నపేట మండలాల్లో వడగళ్ల వానకు పలు పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లి: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట, పరిగి, ఘట్కేసర్ ప్రాంతాల్లో వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. శామీర్‌పేటలో దాదాపు ఆరు వందల ఎకరాల్లో ద్రాక్షతోట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మోమిన్‌పేటలో దాదాపు 800 ఎకరాల్లో ఉల్లి పంట నీటమునిగింది. 224 ఇళ్లు ధ్వంసం: మెదక్ జిల్లాలో వడగళ్ల వానల ధాటికి గత రెండు రోజుల్లోనే 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ నిర్ధరించింది. రాజధానిని ముంచెత్తిన వాన: హైదరాబాద్ నగరాన్నీ అకాల వర్షాలు వీడడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు కురియడంతో పలు చోట్ల రహదారుల పక్కన నిలిపిన వాహనాల అద్దాలు పగిలాయి. కొన్ని చోట్ల రహదారులపై వరద నీరు పోటెత్తడంతో కాలువలను తలపించాయి. గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 477 చోట్ల భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అల్పపీడనాలకు.. తేమ తోడైంది! అసాధారణ వర్షాలకు కారణమిదే వేసవి మంటెక్కించే ముందు అక్కడక్కడా ఒకటీ అరా జల్లులు పడటం మనం చూసే ఉంటాం. కానీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో కూడా వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలు పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. పడమటి గాలుల్లో వచ్చిన మార్పులు.. దేశ మధ్యప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనాలు వీటికి బంగాళాఖాతంతోపాటు అరేబియా సముద్రం నుంచి కూడా తేమ అందుతూండటం దీనికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత నెలలో అత్యంత అసాధారణ రీతిలో పశ్చిమ గాలుల్లో తేడాలు చోటు చేసుకున్నాయని, తెలంగాణలోని కొన్ని భాగాలతోపాటు విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా భూతల అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ సమాచార సేకరణ సంస్థ ‘స్కైమెట్’ శాస్త్రవేత్త పి.మహేశ్ తెలిపారు. మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే వరుసగా అల్పపీడనాలు ఏర్పడటం.. పీడనాన్ని భర్తీ చేసేందుకు దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల నుంచి తేమతో కూడిన గాలులు దూసుకురావడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని ఆయన చెప్పారు. మహారాష్ట్రను ఆవరించిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు నాలుగు రోజులపాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. -
ముంచిన ‘అకాలం’
న్యూస్‌లైన్ నెట్వర్క్: అకాల వర్షం రైతన్నను నట్టేటముం చింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చే దశలో మిర్చి రైతును కన్నీరు పెట్టిస్తోంది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో సుమారు రెండువేల ఎకరాల్లో సాగుచేసిన మిర్చి కల్లాల్లో నీటిపాలైంది. దుగ్గొండి మండల పరిధిలోని తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, బొబ్బరోనిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో మిర్చితోపాటు మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ధర్మసాగర్ మండల పరిధిలో రైతులు మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగుచేసారు. పంట పూర్తిగా నేలకు ఒరిగి పనికి రాకుండా పోయాయి. తీవ్రమైన గాలులతో కూడిన వర్షానికి మండల పరిధిలో అనేక చోట్ల చెట్లు విరిపడ్డాయి, రేకుల షెడ్ల కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలపై చె ట్ల కొమ్మలు విరిగి పడడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. సోమవారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. నిజామాబాద్‌లో జిల్లాలో మొక్కజొన్న, వరి, సజ్జ, జొన్న, టమాట, నువ్వుపంటలకు నష్టం వాటిల్లింది. కల్లాలలో ఆరబోసిన పసుపుకొమ్ములు తడిసి ముద్దయ్యాయి. భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లిలో వడగండ్లు కురియడంతో, 11ఆవులు చనిపోయాయి. ముచ్కూర్‌లో బస్టాండ్ సమీపం లో వందల ఏళ్ల నాటి మర్రి మహావృక్షం కుప్పకూలింది. నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్వాగతతోరణం వర్షానికి కూలిపోయింది. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రూ. 50లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. వర్షాలతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, మిరప పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు నేలరాలాయి. కాగా నర్సాపూర్ మండలంలో వర్షాలకు రెండు పౌల్ట్రీషెడ్లు పూర్తిగా ధంసమవ్వగా సుమారు 500కోళ్లు మృతి చెందాయి. సోమవారం రాత్రి వర్షం సృష్టించిన బీభత్సవానికి నష్టం వేలఎకరాలకు పెరిగిపోయింది. జిల్లాలో పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి ఈ నెల 5న ప్రభుత్వానికి తుది నివేదిక పంపించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. సీమలో వడగండ్ల వాన అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సోమవారం వడగండ్ల వాన కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, కూడేరు, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, రాప్తాడు, గార్లదిన్నె తదితర మండలాల్లో రూ.కోట్లు విలువ చేసే పండ్ల తోట లు నేలకూలాయి. నగర శివారులోని నర్సరీకి చెందిన పాలీహౌస్ ధ్వంసం కావడంతో రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. బుక్కరాయసముద్రం మండలంలో చెట్టు విరిగిపడటంతో విశాలాంధ్ర పత్రికా విలేకరి ఉజ్జినప్ప(40) మృతిచెందాడు. ఈదురు గాలులతో పైకప్పులు, హోర్డింగ్‌లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలగా.. భారీవృక్షాలు కూకటివేళ్లతో కూలిపో యాయి. నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కరెంటు సరఫరా పూర్తిగా నిలిచి అంధకారం అలుముకుంది. చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు కనీసం రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని చెంబకూరు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వానతో ప్రజలు బెంబేలెత్తారు. -
కుండపోత.. గుండెకోత
అన్నదాత గుండె చెరువైంది. అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన తరుణంలో ముసురువాన నిండాముంచింది. రైతన్న రెక్కలకష్టమంతా వర్షార్పణమైంది. పత్తి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మార్కెట్‌కు విక్రయానికి తెచ్చిన వేలాది బస్తాల మొక్కజొన్న తడిసిముద్దయింది. జిల్లాలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నల్లమలలో భారీవర్షం కురియడంతో చంద్రవాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. దుందుబీ ఉరకలేస్తోంది. శ్రీశైలం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంతో పాటు పలుప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పాలమూరు, న్యూస్‌లైన్: జడివాన జిల్లాను ముం చెత్తింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఏకమైపారుతున్నాయి. నల్లమలలో కురిసిన భారీవర్షానికి చంద్రవాగు ఉధృతం గా ప్రవహిస్తోంది. గురువారం అచ్చంపేట మం డలంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం న మోదైంది. జిల్లాలోని పలుచోట్ల లోతట్టుప్రాం తా లు జలమయమయ్యాయి. రహదారులు తెగి పోయి రాకపోకలకు నిలిచిపోయాయి. అన్నదాత రెక్కల పూర్తిగా వర్షార్పణమైంది. జిల్లాలో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పత్తిపంట నీటమునిగింది. కేవలం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనే దాదాపు 50వేల ఎకరాల్లో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. గద్వాల, అలంపూర్, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి, నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వర్షానికి రూ.200కోట్ల పంటనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అచ్చంపేట, అమ్రాబాద్ పరిధిలో వరి, పత్తి, మిర్చి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందిసాగులో ప్రత్యేకతను చాటుకునే కొడంగల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాల్లో కందిపంట సాగయింది. ప్రస్తుత వర్షానికి పంటమొత్తం నాశనమైపోయింది. రబీలో సాగుచేసిన వేరుశనగ విత్తనాలు కూడా నీటిలోనే మురిగిపోయార ుు. జిల్లాలో వర్షం ధాటికి 620 ఇళ్లు కూలి రూ. 17.50కోట్ల నష్టం వాటిల్లింది. ఆర్అండ్బీ రోడ్లు సుమారు 50కిలోమీటర్ల మేర పాడైపోయాయి. అలాగే జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి మార్కెట్లలో వేలాది మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. జిల్లాలో 45.1 మి.మీ వర్షపాతం గురువారం జిల్లా వ్యాప్తంగా 45.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నా రు. అచ్చంపేట మండల పరిధిలో అత్యధికంగా 220.0మి.మీ మేర వర్షపాతం నమోదైంది. బల్మూర్ 200.0 మి. మీ, లింగాల 132.0, అమ్రాబాద్ 109.0, తెలకపల్లి 106.0, కల్వకుర్తి 100.2, వంగూరు, పెద్దకొత్తపల్లి 90.0, కోడే రు 88.0, వెల్దండ 85.6, నాగర్‌కర్నూల్ 82.4, బిజినేపల్లి 67.4, కొల్లాపూర్ 66.0, షాద్‌నగర్ 63.2, ఆమనగల్లు 56.0, తిమ్మాజిపేట, మాడ్గుల 55.0, దరూర్ 51.0, ఉప్పునుంతల 50.0, ఆత్మకూర్ 49.0, గద్వాల 43.6, పెబ్బేరు, తలకొండపల్లి 43.0, కొత్తూరు 40.2, తాడూరు 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. -
వరుణుడు కరుణిస్తేనే...!
కటక్: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో భారీ వర్షంతో ఇప్పటికే ఒక వన్డే రద్దు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి తర్వాత జరగబోయే ఐదో వన్డేపై నిలిచింది. అయితే ఒడిశాలోని కటక్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. సోమవారంనుంచి ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం శుక్రవారం ఉదయం వర్షాలు ఆగితే గానీ శనివారం మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం లేదు. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ భారీ వర్ష సూచన ఉంది. ఇక్కడి బారాబతి స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మైదానంలో భారీగా నీరు చేరినా పిచ్‌లను మాత్రం పూర్తిగా కవర్ చేసి జాగ్రత్త పడినట్లు క్యురేటర్ పంకజ్ పట్నాయక్ చెప్పారు. మరో వైపు మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. 45 వేల సామర్థ్యం గల స్టేడియంలో ఇప్పటికే 42 వేల టికెట్లను ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు. బావులు తవ్వేశారు! భారత క్రికెట్ బోర్డు అనుకుంటే కొండ మీది కోతినైనా తేగలదు. ఎలాగైనా మ్యాచ్‌ను నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఒరిస్సా క్రికెట్ సంఘం (ఓసీఏ) అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా... మైదానంలోని వర్షపు నీరును బయటికి పంపించేందుకు దాని చుట్టుపక్కల పరిధిలో ఏకంగా నాలుగు బావులు కూడా తవ్వేశారు! మరో వైపు వర్షం ఆగిన తర్వాత పిచ్, అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగించాలని కూడా ఓసీఏ నిర్ణయించింది. ఇందు కోసం స్థానిక ఎంపీకి చెందిన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోనున్నారు. అయితే ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఓసీఏ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. -
రాంచీని ముంచిన వాన
వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకోవాలంటే 6-1తో సిరీస్ గెలవాల్సిన ఆస్ట్రేలియా లెక్క తప్పినట్లే. భారీ వర్షం ఆ జట్టు ఆశలను ముంచేసింది. దాంతో భారత్ తమ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. వర్షం కారణంగా నాలుగో వన్డే అర్ధాంతరంగా రద్దయింది. ఫలితంగా సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది. తుపాన్‌తో ఐదో వన్డే కూడా సందేహాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ సుదీర్ఘ సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే. రాంచీ: సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేయాలని భావించిన ధోని ఆశలకు అడ్డుకట్ట పడింది. లక్ష్యఛేదనను ఆరంభించిన భారత్ జోరును వర్షం అడ్డుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన భారత్, ఆస్ట్రేలియా నాలుగో వన్డేలో వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనువుగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1తో ఆధిక్యం ఉంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే శనివారం కటక్‌లో జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ బెయిలీ (94 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (77 బంతుల్లో 92; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు చేజార్చుకున్నా, జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... వినయ్ కుమార్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ధావన్ (14), రోహిత్ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో పడిన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. కీలక భాగస్వామ్యం... వరుసగా విఫలమవుతున్న ఇషాంత్‌తో పాటు భువనేశ్వర్‌ను కూడా పక్కన పెట్టడంతో ఉనాద్కట్, మొహమ్మద్ షమీలకు తుది జట్టులో చోటు దక్కింది. ఉనాద్కట్ పెద్దగా ప్రభావం చూపకపోగా, షమీ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇన్నింగ్స్ ఆసాంతం 140-145 కి.మీ. వేగంతో బంతులు విసురుతూ, చక్కటి స్వింగ్ కూడా రాబట్టిన షమీ... తన తొలి నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసి శుభారంభాన్ని అందించాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికే చక్కటి ఇన్‌స్వింగర్‌తో ఫించ్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అతను... మూడో ఓవర్లో హ్యూస్ (11)ను పెవిలియన్‌కు పంపించాడు. ఆసీస్ స్కోరు 28/0గా ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ ప్రారంభమయ్యాక మరో అద్భుతమైన బంతి వాట్సన్ (14) వికెట్లను గిరాటేసింది. షమీ జోరుతో ఆసీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి స్పెల్‌లో షమీ గణాంకాలు 6-1-21-3గా ఉండటం విశేషం. కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో వోజెస్ (7) కూడా వెనుదిరగడంతో ఆసీస్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ బెయిలీ, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆరంభంలో మెల్లగా ఆడినా నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు బ్యాట్ ఝళిపించారు. బెయిలీ తన వన్డే ఫామ్‌ను కొనసాగించగా, మ్యాక్స్‌వెల్ కూడా భారీ సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో బెయిలీ 57 బంతుల్లో, మ్యాక్స్‌వెల్ 45 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరకు వినయ్ కుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. భారీ షాట్ ఆడబోయిన బెయిలీ, డీప్ మిడ్ వికెట్లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్‌ను కూడా వినయ్ అవుట్ చేశాడు. అయితే జాన్సన్ (31 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (29 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్) చివర్లో ధాటిగా ఆడి ఆస్ట్రేలియాకు మెరుగైన స్కోరు అందించారు. ఆసీస్ తమ చివరి 10 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరు క్యాచ్‌లు నేలపాలు... నాలుగో వన్డేలో మన ఆటగాళ్ల ఫీల్డింగ్ 90లనాటి భారత జట్టును గుర్తుకు తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం ఫీల్డింగ్ పరిస్థితిని చూపిస్తోంది. వీటిలో రెండు మినహా మిగతా క్యాచ్‌లు పట్టదగినవే! ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దిన బెయిలీ సున్నా స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లి వదిలేయడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. అతను 35 వద్ద ఉన్నప్పుడు కూడా మరో సునాయాస క్యాచ్‌ను అశ్విన్ వదిలేశాడు. మ్యాక్స్‌వెల్‌కు కూడా రెండు సార్లు అదృష్టం కలిసొచ్చింది. 44 పరుగుల వద్ద యువరాజ్, 69 పరుగుల వద్ద ధోని క్యాచ్‌లు వదిలేశారు. యువీ క్యాచ్ కష్టమైనదే అయినా... ధోని గ్లవ్‌కు తగిలి వెళ్లిన బంతి మ్యాక్స్‌వెల్‌ను బతికించింది. జాన్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు రైనా, ఇన్నింగ్స్ చివరి బంతికి ఫాల్క్‌నర్ క్యాచ్‌ను ధావన్ జారవిడిచారు. ఈ రెండింటి వల్ల పెద్దగా తేడా రాకపోయినా మనవాళ్ల ఫీల్డింగ్‌కు ఇది నిదర్శనం. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 5; హ్యూస్ (సి) ధోని (బి) షమీ 11; వాట్సన్ (బి) షమీ 14; బెయిలీ (సి) రోహిత్ (బి) వినయ్ 98; వోజెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 7; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) వినయ్ 92; హాడిన్ (బి) జడేజా 3; ఫాల్క్‌నర్ (నాటౌట్) 23; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 25; మెక్కే (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 7, వైడ్ 3) 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 295. వికెట్ల పతనం: 1-5; 2-24; 3-32; 4-71; 5-224; 6-232; 7-238; 8-281. బౌలింగ్: ఉనాద్కట్ 6-0-31-0; షమీ 8-1-42-3; వినయ్ 8-0-52-2; అశ్విన్ 9-0-57-2; జడేజా 10-0-56-1; యువరాజ్ 1-0-12-0; రైనా 8-0-38-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 9; ధావన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 4) 4; మొత్తం (4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 27 బౌలింగ్: జాన్సన్ 2.1-0-10-0; మెక్కే 2-0-13-0. -
ఎలిగెంట్, సత్య సీసీ మ్యాచ్ డ్రా
జింఖానా, న్యూస్‌లైన్: భారీ వర్షం కారణంగా ఎ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఎలిగెంట్, సత్య సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎలిగెంట్ 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. అజయ్ రెడ్డి (44) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. ఎంపీ కోల్ట్స్, హైదరాబాద్ బాట్లింగ్ల మధ్య జరిగిన ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్ కూడా డ్రా అయ్యింది. మొదట ఎంపీ కోల్ట్స్ 110.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 307 పరుగులు సాధించింది. రాధాకృష్ణ (49 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడాడు. పృథ్వీ రెడ్డి 4 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ బాట్లింగ్ 69 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.