
సాక్షి, హైదరాబాద్ : ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో బుధవారం మద్యాహ్నం భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కోఠి, దిల్‌సుక్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, నాంపల్లి, అబిడ్స్, మెహదీపట్నం, అత్తాపూర్, అబిడ్స్, బేగంపేట్, ఖైరతాబాద్, పాతబస్తీ, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, లంగర్‌హౌస్, షేక్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీవర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరుచేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కుంగిన రోడ్డు
నగరంలోని కుషాయిగూడ ఏఎస్‌రావునగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రజలు చూస్తుండగానే రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రోడ్డు కుంగడంతో వాహనదారులు ప్రమాదానికి లోనవకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment