జింఖానా, న్యూస్‌లైన్: భారీ వర్షం కారణంగా ఎ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఎలిగెంట్, సత్య సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎలిగెంట్ 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. అజయ్ రెడ్డి (44) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. ఎంపీ కోల్ట్స్, హైదరాబాద్ బాట్లింగ్‌ల మధ్య జరిగిన ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్ కూడా డ్రా అయ్యింది.
మొదట ఎంపీ కోల్ట్స్ 110.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 307 పరుగులు సాధించింది. రాధాకృష్ణ (49 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడాడు. పృథ్వీ రెడ్డి 4 వికెట్లు తీశాడు. తర్వాత హైదరాబాద్ బాట్లింగ్ 69 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
ఎలిగెంట్, సత్య సీసీ మ్యాచ్ డ్రా
Published Sat, Aug 17 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement