గాలివాన బీభత్సం | huge rain in nellore district | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Published Thu, Apr 10 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

huge rain in nellore district

పెనుగాలతో నేలకు వరిగిన వరిపంట
 వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులు రెండు నిండు ప్రాణాలను బలితీసుకోగా, రైతులకు అపార నష్టం మిగిల్చాయి. జిల్లాలోని పడమటి పల్లెల వాసులను బుధవారం సాయంత్రం అకాల వర్షం, గాలులు గడగడలాడించాయి. పెదనాన్నతో కలిసి పొలంలోకి వెళ్లి వస్తున్న బాలుడితో పాటు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మరోచిన్నారిని పిడుగులు బలితీసుకున్నాయి. గాలుల తీవ్రతకు వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి, నిమ్మతోటల్లో కాయలు రాలిపోయాయి. కోతకు వచ్చిన వరితో పాటు ధాన్యం రాశులు తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  
 
 కలువాయి, న్యూస్‌లైన్ : కలువాయిలో బుధవారం సాయంత్రం పెనుగాలుల తో కూడిన వర్షం కురిసింది. అర్ధగంట సేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పెనుగాలులు వీచాయి. పెనుగాలులకు మామిడి కాయలు నేలరాలా యి. కలువాయి, కుల్లూరు, రాజుపాళెం, వెంకటరెడ్డిపల్లి, పెన్నబద్వేలు, బ్రాహ్మణపల్లి, తెలుగురాయపురం, నూకనపల్లి, కొలవపల్లి గ్రామాల్లో రైతు లు వరియంత్రాలతో వరి పంట కోతల ను కోస్తున్నారు. అకాల వర్షంతో ధా న్యంతో పాటు పంట తడిసిపోయింది. కోత జరగని వరిపంట  వర్షంతో వరి గింజలు నేలరాలాయి. రాజుపాళెం, క లువాయి, ఉయ్యాలపల్లి గ్రామాల్లో మామిడితోటలు ఉన్నాయి. గాలులకు మామిడి కాయలు నేలరాలడంతో రైతుగుండె చెరువైంది. మామిడి రైతులు లబోదిబోమంటున్నారు.
 
 తరలిపోయిన వరికోత యంత్రాలు
 వర్షంతో కోత కోస్తున్న వరి కోత మిషన్లు రోడ్డెక్కాయి. మళ్లీ కోతలు ప్రారంభం కావాలంటే వారం రోజులు పడుతుందనే ఉద్దేశంతో యంత్రాలను యజమానులు తరలించుకెళ్లారు.  
 
 గాలీవాన బీభత్సం
 డక్కిలి: మండలంలోని పాతనాలపా డు, భీమవరం, దగ్గవోలు, శ్రీరాంపల్లి, డక్కిలి, మోపూరు తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఉరుములతో కూడి న వడగళ్ల వాన, గాలి సుమారు గం టపాటు జనాలను బెంబేలెత్తించాయి. దీంతో నిమ్మకాయలు, మామిడిపూత, కాయులు  నేలరాలాయి. కొన్ని చోట్ల వృక్షాలు నేలకొరిగాయి.  
 
 రాపూరులో భారీ వర్షం
 రాపూరు మండలంలోనూ   ఉరుము లు, మెరుపులు, పెనుగాలులు, వడగళ్లతో కూడిన  భారీ వర్షం కురిసింది.  దీంతో వాతావరణం చల్లబడింది.  
 
 రైతులకు తీరని నష్టం
 వింజమూరు: అకాల వర్షంతో వింజ మూరు మండలంలో అరటి , మొక్కజొ న్న, తమలపాకు, మిరప, మామిడి, ప త్తి రైతులకు నష్టం వాటిల్లింది. పది రో జుల్లో చేతికిరానున్న గెలలతో కూడిన అరటి చెట్లు నేలకూలాయి. యర్రబల్లిపాళెంలో చెట్లు నేలకూలి రైతులు బ య్యపురెడ్డి యల్లారెడ్డి, యల్లాల సుబ్బారెడ్డి, కాసా రఘు, కందల కొండారెడ్డి, బయ్యపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, వం గాల వెంకటేశ్వరరెడ్డి తదితరుల నష్టపోయారు.
 
 జీబీకేఆర్‌ఎస్టీ కాలనీ సమీపం లో రైతు పైడాల వెంకటెశ్వరరెడ్డికి చెం దిన 1200 అరటిచెట్లు నేలకొరిగాయి. సాతానువారిపాలెంలో భువనేశ్వరప్రసాద్, తిరుపతయ్యకు చెందిన మొక్కజొన్న పంట నేలవాలింది. చింతలపాళెం, నందిగుంటలో మిరపతోటలు దె బ్బతిన్నాయి. కల్లాల్లోని మిరపకాయలు తడిచిపోయాయి. మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి. నాలుగు వి ద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో చౌ టపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బీసీకాలనీలోనూ రెండు స్తం భాలు నేలకొరగడంతో గ్రామం అంధకారంలో చిక్కుకుంది.
 
 మామిడి రైతును ముంచిన గాలులు
 సీతారామపురం: పెనుగాలులతో కూడి న వర్షం కురవడంతో మామిడి రైతులు నిండా మునిగారు. బసినేనిపల్లి, రంగనాయుడుపల్లి, అయ్యవారిపల్లి, సీతారామపురంలోని మామితోటల్లో కాయ లు, పిందెలు రాలిపోయాయి. రైతుల కు సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే సమయంలో వ రి, మొక్కజొన్న పంటలు నేలవాలా యి. చాలా మంది రైతులకు చెందిన ధా న్యం రాశులు తడిచిపోయాయి.  చెట్ల కొమ్మలు విరగడంతో పాటు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement