జిల్లాలో వర్షాకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున 4నుంచి 9గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: జిల్లాలో వర్షాకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున 4నుంచి 9గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చొప్పదండి, ధర్మపురి, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో గింజ పోసుకునే దశలో ఉన్న వరి నేలవాలింది. కొన్నిచోట్ల వరి కోసి ధాన్నాన్ని కల్లాల్లో ఆరబెట్టగా తడిసి ముద్దయింది.
ఆరబెట్టిన మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలగా, బట్టీలకు సిద్ధంగా ఉన్న ఇటుక తడిసి ముద్దయింది. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపో యి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అత్యధిక ంగా ధర్మారం మండలంలో 62.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రామడుగులో 1.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 8 మండలాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లాలో సగటున 6.7 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వర్షపాతం ఇలా...
కరీంనగర్ 33.6మిల్లీమీటర్లు, మానకొండూర్ 24.2, రామడుగు 1.3, చొప్పదండి 61.4, పెగడపల్లి 9.3, వేములవాడ 6.8, శ్రీరాంపూర్ 20.0, పెద్దపల్లి 6.0, ఓదెల 5.4, రామగుండం 19.8,, సుల్తానాబాద్ 10, వెల్గటూర్ 12.2, ధర్మారం 62.2, జూలపల్లి 46.2 ఎలిగేడ్ 56.2, మంథని 3.2, కమాన్‌పూర్ 5.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.