నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వద్ద ఓ లారీ క్యాబిన్‌లోని వంట సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలింది.
నల్గొండ : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వద్ద ఓ లారీ క్యాబిన్‌లోని వంట సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. నెల్లూరు జిల్లా నుంచి వస్తున్న (ఏపీ25డీబీ 5468) లారీ వంట చేసుకోవడానికి వేములపల్లి వద్ద ఆగింది. వంట చేసుకోవడానికి లారీ క్యాబిన్‌లో ఉన్న చిన్న సిలిండర్ పొయ్యిని డ్రైవర్ నాగరాజు వెలిగించారు.
అయితే అది ప్రమాదవశాత్తూ పేలింది. ఈ ఘటనతో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమయింది. క్యాబిన్‌లో ఉన్న రూ. 30 వేల నగదు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
(మిర్యాలగూడ)