ఐఎన్‌ఎస్ నిరీక్షక్‌లో పేలుడు: ముగ్గురికి గాయాలు
త్రివేండ్రం:
భారత నేవీకి చెందిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్‌ఎస్ నిరీక్షక్‌లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ ఛార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నౌక విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్తుండగా త్రివేండ్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 16న నౌకలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక డైవర్, ఇద్దరు నావికులు గాయపడినట్లు కెప్టెన్ శర్మ బుధవారం వెల్లడించారు.