ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు మృతి చెందారు.
షాద్‌నగర్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం పటేల్ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పటేల్ రోడ్డుకు చెందిన యాదగిరి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా అతను అక్రమంగా ఇంట్లో కిరోసిన్, పెట్రోలును నిల్వ ఉంచుతున్నాడు.
అయితే ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నిద్రస్తున్న అతని భార్య జయ(50), కుమారులు చిట్టి(19), చరణ్(7)లు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన మరో కుమారుడు భరత్ షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.