సిలిండర్ పేలి మహిళ సజీవదహనం
Published Wed, Nov 30 2016 2:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
విజయవాడ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన విజయవాడలోని మధురానగర్‌లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ మంటలకు ఆహుతై సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement