burned alive
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
లండన్‌లో ప్రవాసభారతీయుని ఇంట్లో మంటలు..
లండన్: లండన్‌లోని భారత సంతతి వ్యక్తికి చెందిన ఇంట్లో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్న కాసేపటికే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలారి్పన అనంతరం ఫస్ట్ ఫ్లోర్లో ఐదు మృతదేహాలు పడి ఉండగా గుర్తించినట్లు చెప్పారు. కాగా, మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ..అది తన బావమరిది ఇల్లు కాగా, అందులో భార్య, ముగ్గురు పిల్లలతో ఆయన ఉంటున్నారన్నారు. మరో ఇద్దరు అతిథులు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు తెలిపారు. ఆ కుటుంబం ఇటీవల బెల్జియం నుంచి లండన్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు చెబుతున్నారు. -
రాజుతో అంగరక్షకుడి సహగమనం
సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్‌పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు. స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి. యుద్ధంలో చనిపోతే... ‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు. -
కబళించిన మంటలు.. ఐదేళ్ల కుమారుడుసహా దంపతుల సజీవ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్): ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం. కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రమైన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి అంటుకుని వ్యాపించాయి. అందులో ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, అందరూ ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుషాయిగూడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా.. సాయినగర్ కాలనీ ప్రధానరోడ్డు మార్గంలో ఉదయ్‌శంకర్, శివసాయి అనే అన్నదమ్ములు శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో గత 25 సంవత్సరాలుగా టింబర్ డిపో నడుపుతున్నారు. ఏ జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి అంటుకున్నాయి. అదే సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు నిద్రలేచిన వాచ్మెన్ కుమార్తె ఉమ మంటలను గమనించి కేకలు పెడుతూ తల్లిదండ్రులను లేపింది. వారు వెంటనే మూడో అంతస్తులో ఉండే యజమాని రాంచందర్షాకు సమాచారం ఇవ్వడంతో పాటు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే భవనమంతా దట్టమైన పొగలతో నిండిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కింద దుకాణాలు, పైన పోర్షన్లు మూడంతస్తుల భవనంలో కింద వాణిజ్య దుకాణాలు ఉండగా, పైన యజమాని నివాసంతో పాటు ఆరు పోర్షన్లు ఉన్నాయి. వాచ్మెన్ అరుపులతో నిద్రలోంచి మేల్కొన్న వారు దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ భవనం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది భవనంపైకి వెళ్లి పక్క భవనంపై నుంచి సురక్షితంగా బయట పడగా, మరికొందరు మంటల్లోంచే బయటకు వచ్చి గాయాలపాలయ్యారు. అయితే రెండో అంతస్తులోని సింగిల్ గదిలో ఉంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రెపినేని నరేష్ (37), అతని భార్య సుమ (28) కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే బయటంతా మంటలు, పొగ తీవ్రరూపం దాల్చాయి. సింగిల్ రూం కావడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారుడు జశ్వంత్ (5)ను తీసుకుని మంటల్లోంచే గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచి..మొదటి అంతస్తు మెట్ల వద్ద పడిపోయి సజీవ దహనమయ్యారు. నరేష్ దంపతుల పెద్ద కుమారుడు అది్వక్ శనివారం రాత్రి అక్కడికి సమీపంలోనే ఉన్న సుభాష్ చంద్రనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక రెండో అంతస్తులో ఉన్న నారాయణ, ఉమ దంపతులు బయటకు వచ్చే క్రమంలో మంటల సెగ తాకి గాయపడ్డారు. పద్మావతి అనే మహిళ రెండో అంతస్తు నుంచి చీర సాయంతో దిగుతుండగా మంటల వేడికి చీర తెగడంతో కింద పడిపోయి గాయపడింది. ఆమె భర్త పూర్ణచందర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా వాచ్మెన్ వీరమల్లేష్ ఇంట్లో ఉన్న సిలిండర్ పేలుతుందోమోనన్న భయంతో లోపలికి వెళ్లి దాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వల్పంగా గాయపడ్డాడు. మంటలు క్షణాల్లోనే మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని వాచ్మెన్ కూతురు ఉమ చెప్పింది. ఆరు గంటలు శ్రమించాం: ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి ‘అగ్ని ప్రమాదం గురించి 4 గంటలకు మాకు సమాచారం అందింది. పది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే మంటలు, దట్టమైన పొగ కారణంగా బిల్డింగ్‌లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి లోనికి ప్రవేశించాం. ఓ కుటుంబం మిస్ అయ్యిందని చెప్పడంతో గాలించగా మొదటి అంతస్తు కారిడార్‌పై ఓ శవం, మెట్లపై రెండు శవాలను గుర్తించాం..’అని చర్లపల్లి అగ్ని మాపక అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా సాయినగర్ కాలనీలో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల కోసం రోడ్డును తవ్వేయడంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి దగ్గరగా చేరుకోలేక పోయాయని స్థానికులు చెప్పారు. ఇలావుండగా అగిప్రమాదాలకు సంబంధించిన ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకుండా టింబర్ డిపో నిర్వహిస్తున్న శ్రీ ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని నూతలపాటి శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నరేష్, సుమ, జశ్వంత్‌ల మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలిన రెండు సిలిండర్లు.. మంటలు భారీఎత్తున ఎగసి పడటానికి భవనం కింద ఉన్న ఆటోమొబైల్ షాప్ గోదామే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదాంలోని టైర్లు, ఆయిల్ డబ్బాలతో పాటుగా ఇతర సామగ్రికి నిప్పు అంటుకోవడం వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన టింబర్ డిపోలో 8 గ్యాస్ సిలిండర్లు ఉండగా వీటిల్లో రెండు పేలిపోయాయి. టింబర్ డిపోలో అన్ని గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయో తెలియరాలేదు. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియరాలేదు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మి క శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంపై హోం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని ఆదుకుంటామన్నారు. గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తానిక్కడికి వచ్చానని, తల్లిదండ్రుల మృతితో అనాథగా మిగిలిన అద్విక్ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. -
ప్రేమోన్మాది బాధిత కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం(మైలవరం): ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిపై నాగభూషణం అనే ప్రేమోన్మాది గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడ హనుమాన్‌పేటలో పెట్రోల్ పోసి నిప్పంటించగా అక్కడికక్కడే సజీవ దహనమైంది. యువతి కుటుంబ పరిస్థితిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ యువతి తల్లిదండ్రులను బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లగా.. జగన్ వారిద్దరికీ ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, కుమారుడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించగా.. రూ.10 లక్షలను అధికారులు అందజేశారు. -
పదే పదే తిడుతున్నారని గుడిసెకు నిప్పు.. సజీవ దహనం
సాక్షి, చెన్నై: పదేపదే తిడుతున్నారంటూ 16 ఏళ్ల బాలుడు అవ్వా, తాతపై కోపం పెంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వారిద్దరినీ సజీవ దహనం చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో కొత్తంపాడి గ్రామం భారతీ నగర్‌కు చెందిన కాటురాజా(75) రైతు. ఆయనకు భార్య కాశిఅమ్మాల్(65)తో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడైన కుమార్ కుటుంబం తల్లిదండ్రుల పంట పొలంలోని గుడిసెకు పక్కనే మరో ఇంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువజామున కాటురాజా, కాశిఅమ్మాల్ నిద్రిస్తున్న గుడిసె తగల బడింది. కుమార్‌తో పాటుగా, పరిసర వాసులు ఆర్పేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది అర్ధగంట శ్రమించి మంటల్ని అదుపు చేశారు. లోనికి వెళ్లి చూడగా, ఆ దంపతులు సజీవ దహనం కావడంతో మృతదేహాల్ని పోస్టుమారా్టనికి తరలించారు. డీఎస్పీ ఇమాన్ వేల్ జ్ఞానశేఖరన్ తొలుత ప్రమాదంగా భావించినా, గుడిసెకు బయట గడియ పెట్టి ఉండడంతో కొడుకులను అనుమానించారు. అదే సమయంలో కుమార్ తనయుడు (16) పోలీసుల్ని చూసి భయపడడంతో అతడ్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో తానే ఆ గుడిసెకు నిప్పు పెట్టినట్టు అతడు అంగీకరించాడు. పదేపదే తనను అవ్వా, తాత తిడుతుండడంతోనే ఆగ్రహించి ఈ ఘాతకానికి ఒడి గట్టిన ట్లు ఆ బాలుడు వెల్లడించాడు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్‌లో 20 ఏళ్లుగా అనురాధ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండుకు తరలించారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఆ కేసుపై భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన అనంతరం భార్య తిరిగి మెదక్‌కి వెళ్లింది. చంద్రశేఖర్ కేపీహెచ్‌బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్లో రూమ్ నం.314లో బస చేశాడు. గదిలోకి వెళ్లిన అతడు ఎంతకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌కు చేరుకొని గది తలుపులు తెరచిచూడగా చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్ర శేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో సర్జికల్ కత్తులు, స్లీపింగ్ పిల్స్ లభించాయని తెలిపారు. ఆయనపై మెదక్ కారు దగ్ధం శ్రీనివాస్ కేసులో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. -
అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవదహనం
అవుకు: కర్నూలు జిల్లా అవుకు మండలంలో మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సుంకేసులలో గురువారం రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో అగ్నిగుండంలోపడి సజీవ దహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దస్తగిరిస్వామి పీర్ల చావిడి వద్ద మొహర్రం వేడుకల సందర్భంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసరిగెత్తు సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు వేశారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చారు. పక్క గ్రామమైన కాశీపురానికి చెందిన చమురు వెంకటసుబ్బయ్య (48) దస్తగిరిస్వామి చావిడిలోని పీర్లను దర్శించుకున్నారు. అనంతరం మద్యం తాగి మత్తులో పక్కనే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడిపోయాడు. గమనించిన ప్రజలు రక్షించేలోపే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. దీంతో సుంకేసుల, కాశీపురం గ్రామాల్లో విషాదం నెలకొంది. -
కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మెదక్: కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. కారులోనే శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపిన నిందితులు మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని 6 గంటలపాటు కారులోనే తిరిగారు. అనంతరం కారుకు నిప్పటించి పరారయ్యారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. రూ.15 లక్షలు సుపారీ తీసుకుని దుండగులు శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించి తగలబడుతున్న ఆ కారు దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుడు పళ్ల ఆధారంగా గుర్తింపు మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని శ్రీనివాస్ భార్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె పేర్కొంది. -
తగులబెట్టిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం
వెల్దుర్తి, మెదక్ జోన్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామశివారులో (యశ్వంతరావ్‌పేట రెవెన్యూ పరిధిలో) దారుణ హత్య జరిగింది. తగులబెట్టిన హోండాసిటీ కారు డిక్కీలో కన్పించిన శవం కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని డిక్కీలో బెట్టి కారును తగులబెట్టారా? లేక సజీవదహనం చేశారా అనేది తెలియలేదు. ఎక్కడో హత్యచేసి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కారుపై ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి మెదక్ పట్టణానికి చెందిన బీజేపీ నేత ధర్మాకర్ శ్రీనివాస్ (45) అలియాస్ కటికె శ్రీనుగా గుర్తించారు. సోమవారం రాత్రి సుమారు 10:30 సమయంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ హత్యోదంతం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మెదక్ ఏఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్‌తో పాటు క్లూస్ టీం సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది. సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆటో డ్రైవర్ వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించాడు. నర్సాపూర్ నుంచి తన ఆటోలో స్నేహితుడితో కలిసి ఇంటికి వస్తూ కారు తగలబడుతున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించారు. 9వ తేదీన శ్రీనివాస్ ఇంట్లో నుంచి ఎన్నిగంటలకు వెళ్లాడు? ఎప్పటివరకు ఫోన్ ఆన్‌లో ఉంది? తదితర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ డైరీతో పాటు ఇంటివద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుడు పళ్ల ఆధారంగా గుర్తింపు మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అయితే మొదట తన భర్తకు రెండే పెట్టుడు పళ్లు ఉన్నాయని, మృతదేహం తన భర్తది కాదని చెప్పిన శ్రీనివాస్ భార్య హైందవి కాసేపటికి మాటమార్చింది. మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని పేర్కొంది. వెల్దుర్తి మండల పరిధిలోని మారెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగు బృందాల ఏర్పాటు: తూప్రాన్ డీఎస్పీ మంగళపర్తి హత్యోదంతం కేసును త్వరలోనే ఛేదిస్తామని తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ చెప్పారు. హంతకులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శ్రీనివాస్‌ను ఎక్కడో హత్యచేసి తీసుకొచ్చి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసి ఉంటారని చెప్పారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యిందన్నారు. -
తేనెటీగలను చెదరగొట్టబోయి వ్యక్తి సజీవ దహనం
మక్తల్: బస్సుల్లో చేరిన తేనెటీగలను చెదరగొట్టేందుకు నిప్పు పెట్టడంతో మూడు బస్సులు దగ్ధం కావడమేగాక, ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన మూడు బస్సులను నిర్వాహకులు ఏడాది కాలంగా స్కూల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఉపయోగంలో లేకపోవడంతో వాటిలో తేనెటీగలు చేరాయి. దీనిని గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ స్థానికులైన బుడగజంగాలు మహదేవ్ (46), గోపీకి వాటిని తొలగించాలని సూచించారు. దీంతో వారిద్దరూ శనివారం సాయంత్రం కొబ్బరికొమ్మను కాల్చి బస్సులో మంటబెట్టారు. తేనెటీగలు చెల్లాచెదురుకాగా ఒక్కసారిగా మంటలు రేగి బస్సులు దగ్ధమయ్యాయి. అందులో చిక్కుకున్న మహదేవ్ సజీవ దహ నం కాగా, గోపీ ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కలవారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రాము లు పరిశీలించి మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బుజ్జమ్మ విలేకరులతో మాట్లాడుతూ, స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేయడంతోనే తన భర్తతో పాటు మరో వ్యక్తి అక్కడికి వెళ్లి తేనెతుట్టెను రాల్చారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. చదవండి: సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్లో మంటలు -
విషాదం మిగిల్చిన ‘దీపం’
నిజాంసాగర్(జుక్కల్): దీపం మంటలకు ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో సోమవారం వేకువజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలే విఠవ్వ (80) ఆదివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి మంచం పక్కన పెట్టుకుని నిద్రకు ఉపక్రమించింది. ప్రమాదవశాత్తు మంటలు బట్టలకు అంటుకున్నాయి. అవి క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు, పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అప్పటికే మంటలకు వృద్ధురాలు సజీవ దహనమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు
పాట్నా : ఇటీవల దేశంలో జరిగిన ఉన్నావ్, దిశ ఘటనలపై ప్రజల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా, మంగళవారం బీహార్‌లో ఉన్నావ్ తరహా ఘటన చోటుచేసుకుంది. బెట్టయ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఒక యువకుడు మైనర్ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక ఒకనెల గర్భంతో ఉండగా, యువకుడిని పెళ్లి చేసుకోమని కోరింది. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు పాట్నాకు తీసుకెళ్లమని సూచించారు. పాట్నాకు వెళ్లేదారిలో బాధితురాలు 80 శాతం కాలిన గాయాలతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. -
26 మంది చిన్నారుల సజీవదహనం
మోన్రోవియా: లైబీరియా రాజధాని మోన్‌రోవియాలోని ఖురానిక్ స్కూల్లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు సజీవ దహనమయ్యారు. మొత్తం 28 మంది మృతి చెందారని దేశ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. ఘటనా స్థలాన్ని అధ్యక్షుడు సందర్శించారు. -
ప్రాణం తీసిన అతి వేగం
పలమనేరు (చిత్తూరు జిల్లా): అతివేగం రెప్పపాటులో ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం కారు బోల్తా పడి అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. కారును నడుపుతున్న టీటీడీ ఉద్యోగి విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా.. తిరుపతికి చెందిన విష్ణు తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్ చేశారు. అనంతరం గంగవరం పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీతో కారును బయటకు తీశారు. అప్పటికే కారులోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మృతులు విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్రామ్ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19)గా గుర్తించారు. పెట్రోలు లీకై మంటలు వ్యాపించడంతో.. చిత్తూరు ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. పెట్రోలు కారు కావడం, ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పి దుర్ఘటన జరిగినట్లు ఎస్పీ చెప్పారు. అందరూ తిరుమలేశుని పరమ భక్తులు టీటీడీ ఉద్యోగి చంద్రశేఖర్, ఆయన భార్య నాగరత్నమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. వారి కుమారుడు విష్ణు ఉన్నత చదువులు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుండేవాడు. కోడలు జాహ్నవి ఆయుర్వేద వైద్య నిపుణురాలు. కాగా తమ బిడ్డ విష్ణు శ్రీవారి చెంత సేవలు చేయాలని భావించిన చంద్రశేఖర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. అమెరికాలో ఉంటున్న తమ బిడ్డకు టీటీడీలో అవకాశం కల్పించారు. దీంతో విష్ణు తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు బెంగళూరులో ఉంటున్న ఆయన చెల్లి శ్రీవారి దర్శనం కోసం బిడ్డ భానుతేజతో కలసి తిరుపతి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధం కాగా.. విష్ణు బెంగుళూరులో ఉంటున్న తమ మామ రామకృష్ణ (భార్య తండ్రి) అనారోగ్యం బారిన పడటంతో ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వారివెంట వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
భూ వివాదం.. దళిత రైతు సజీవ దహనం
భోపాల్ : పంట భూమి కోసం జరిగిన గొడవలో ఓ దళిత రైతుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ప్రత్యర్థులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భోపాల్ జిల్లా పరోసియా ఘట్‌ఖేదికి చెందిన కిషోరీలాల్ జాదవ్(55)కు 2000 సంవత్సరంలో ప్రభుత్వం మూడెకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఆనుకొని అదే గ్రామానికి చెందిన తిరణ్ యాదవ్ భూమి ఉంది. ప్రతి సంవత్సరం జాదవ్ భూమిలోని కొంత భాగాన్ని దున్ని తిరణ్ పంట వేసుకునేవాడు. కొన్ని నెలల ముందు జాదవ్ ల్యాండ్ సర్వే చేయించగా ఆక్రమణ విషయం బయటపడింది. అయితే తిరణ్ ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వటానికి అంగీకరించలేదు. గురువారం ఉదయం యథాప్రకారం ఆక్రమించిన భూమిని దున్నటం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న జాదవ్ భార్యతో కలిసి పంట భూమి దగ్గరకు వెళ్లి అలా చేయవద్దని వారించాడు. దీంతో ఆగ్రహించిన తిరణ్ అతని బంధువులు అతనిపై దాడిచేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన జాదవ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాదవ్ కొడుకు కైలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఘోర అగ్నిప్రమాదం..వృద్ధురాలు సజీవదహనం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం పారాపురంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. ఒక గుడిసెకు నిప్పంటుకుని మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గుడిసెలో నివశించే జనాలు బయటకు పరిగెత్తారు. ప్రమాదవశాత్తు ఆ మంట్లలో చిక్కుకుని వృద్ధురాలు సజీవదహనం అయింది. -
మహేష్గౌడ్ను ఎందుకు చంపేశారు..?
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): కారణం ఏంటో.. ఏమో.. దుండగులు ఓ యువకుడిని దారుణంగా చంపేసి మృతదేహంపై పెట్రోల్ పోసి తగులుబెట్టారు. నిందితులు తాము వినియోగించిన కారును వాషింగ్‌కు ఇచ్చారు.. ఈక్రమంలో సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి సమీపంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మదన్‌పల్లి నుంచి ముచ్చింతల్ వెళ్లే దారి పక్కన కాలిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డుకు అతి సమీపంలో మృతదేహాన్ని పెట్రోలు పోసి కాల్చేసిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా స్థలంలోని ఓ పెట్రోలు డబ్బా పడి ఉంది. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాకపోవడంతో మొదట గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. పోలీసులకు పట్టించిన కారు.. మదన్‌పల్లి సమీపంలో హత్యకు గురై దుండగులు కాల్చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లోని జుమ్మరాత్‌బజార్ నివాసి మహేష్‌గౌడ్(21)గా పోలీసులు గుర్తించారు. ఇతడు బేగంబజార్‌లోని ఓ కిరాణా దుకాణంలో పని చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కడ్తాల్ వెళ్లున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహేష్గౌడ్ను నగరం నుంచి కారులో తీసుకొచ్చిన నిందితులు హత్య చేసి ఇక్కడ తగులబెట్టినట్లు తెలుస్తోంది. మహేష్గౌడ్ను తన ఇంటి పక్కనే ఉండే స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు సమాచారం. మహేష్గౌడ్ను కారులోనే కత్తితో పొడిచి హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని మదన్‌పల్లి దారి పక్కన తగులబెట్టిన దుండగులు కారును తీసుకుని శంషాబాద్ వచ్చారు. పట్టణంలోని ఓ సర్వీసు సెంటరుకు వెళ్లి కారును వాషింగ్‌కు ఇచ్చారు. వాహనంలో రక్తం ఉండడంతో సర్వీసు సెంటరు సిబ్బంది నిరాకరించారు. దీంతో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించారు. వాషింగ్ పూర్తయిన తర్వాత ఫోన్ చేయాలని సెల్‌నంబర్ ఇచ్చి వెళ్లారు. అయితే, కారులోపల ఉన్న రక్తం మరకలపై సర్వీసు సెంటర్ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సెంటరు నిర్వాహకులతో నిందితులకు ఫోన్ చేయించారు. కారు తీసుకెళ్లేందుకు అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు మృతుడి వివరాలు రాబట్టారు. నిందితులు వినియోగించిన కారును ఓ వ్యక్తి వద్ద అడిగి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీరు కారులో ఎక్కడెక్కడ తిరిగారు.. మహేష్గౌడ్ను ఎందుకు చంపేశారు..? అనే కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమాయ్యరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈమేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుంపటే అనుకుంటే... ప్రాణం తీసింది!
జ్వరంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు చలికి తట్టుకునేందుకు తాను నిద్రిస్తున్న పట్టి మంచం కింద నిప్పుల కుంపటి పెట్టమని భార్య పెట్టింది కు చెప్పాడు. భర్త చెప్పిందే తడవుగా ఆ భార్య చలి పులి నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుందని భావించి కుంపటి పెట్టింది. అయితే ఆ కుంపటే అతన్ని సజీవ దహనం చేసింది. ఈ విషాద సంఘటన వివరాల్లోకి వెళ్తే... మెరకముడిదాం: మండలంలోని గోపన్నవలస గ్రామంలో రజక కులానికి చెందిన గురాన పైడియ్య( 65) అనే వృద్ధుడు, అతని భార్య అప్పమ్మలు కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. గురాన పైడియ్యకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో మంచం కూడా దిగలేని పరిస్థితిలో పైడియ్య పడుకున్నాడు. తనకు ఎక్కువగా చలి వేస్తుందని తన మంచం కింద బొగ్గుల కుంపటి పెడితే చలి తగ్గుతుందని తన భార్య అప్పమ్మను పైడియ్య కోరాడు. దీంతో అప్పమ్మ వెంటనే బొగ్గుల కుంపటిని రాజేసి పైడియ్య మంచం కింద పెట్టింది. ఎప్పటిలాగే తను కూలీ పనికి వెళ్లింది. తిరిగి అప్పమ్మ వచ్చేసరికి పైడియ్య కాలిన గాయాలతో కింద పడి వున్నాడు. దీనిని గమనించిన అప్పమ్మ లబోదిబోమని ఏడుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా పరుగున వచ్చారు. అప్పటికే పైడియ్య కుంపటి రాజుకొని మంటలు కాస్తా మంచానికి అంటుకొని సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో లేవలేని పరిస్థితిలో వుండడంతో అతను సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు భార్య అప్పమ్మతో పాటూ ముగ్గురు కొడుకులు వున్నారు. వీరంతా రెక్కాడితేనేగాని కడుపు నిండని పరిస్థితిలో వున్నారు. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్ఐ పి.నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు భార్య అప్పమ్మ, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
కారులోనే కాలిపోయారు!
తల్లి, ఇద్దరు చిన్నారులు సజీవ దహనం ఆళ్లగడ్డ: అతివేగంగా వెళ్తున్న కారు దగ్ధమైన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలసి మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఆ కుటుంబానికే చెందిన వ్యక్తి కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన నుంచి అతడు తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. తిరుగు ప్రయాణంలో వదిన, పిల్లలతో కలసి బయల్దేరి.. పోలీసుల కథనం మేరకు అనంతపురం జిల్లాకు రాజాప్రసాద్ ఆదివారం కారు (కేఏ 53 జెడ్ 21047 ఫోర్డ్ ఫిస్టా)లో బాడుగకు ప్రయాణికులను తీసుకుని గుత్తి నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాడు. అక్కడ వారిని దింపిన తరువాత ప్రొద్దుటూరులోని తన అన్న నాగరాజు ఇంటికి వెళ్లాడు. అనంతరం రాత్రిపూట నాగరాజు భార్య వనితాబాయి (25), పిల్లలు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (2) అతడితో కలసి నంద్యాల కారులో బయల్దేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు బత్తలూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మట్టికుప్పను ఢీకొని సుమారు 20 మీటర్ల దూరం ఎగిరిపడింది. వెంటనే మంటలు వ్యాపించటంతో కారులో వెనుక సీట్లో కూర్చున్న వనితాబాయి, ఆమె కుమారులు ప్రేమ్‌కుమార్, ఉమేష్ కాలి బూడిదయ్యారు. కారు నడుపుతున్న రాజాప్రసాద్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరి కొద్ది సేపట్లో గమ్యం చేరుకునే సమయంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కాటేసింది. వనితాబాయి, ఆమె చిన్న కుమారుడు ఉమేష్ మాత్రమే నంద్యాల వెళ్లాలని తొలుత కారులో కూర్చున్నారు. అయితే ఉదయం ఇంటిదగ్గర ఎవరూ ఉండరని, పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు సూచించటంతో అప్పటికే నిద్రిస్తున్న చిన్నారిని అలాగే కారులో పడుకోపెట్టారు. చిన్నారి నిద్ర నుంచి లేవకుండానే శాశ్వత నిద్రలోకి తల్లీబిడ్డ జారుకున్నారని తండ్రి, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
పేట్రేగిన ప్రేమోన్మాదం!
♦ ప్రియురాలి సజీవదహనం ♦ ప్రియుడి ఆత్మాహుతి ♦ అంబత్తూరు సమీపంలో ఘటన ♦ రెండు కుటుంబాల్లో విషాదం సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదం కోరలు చాచింది. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఓ ప్రియురాల్ని కిరాతక ప్రియుడు సజీవ దహనం చేశాడు. తానూ నిప్పు అంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అంబత్తూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. ప్రేమోన్మాదం: చెన్నై అంబత్తూరు సమీపంలోని పుదురు కరుణానిధి నగర్‌కు చెందిన పార్తిబన్(21), లెనిన్ నగర్‌కు చెందిన మైథిలి(20) రెండున్నరేళ్ల క్రితం అన్నానగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే వారు. ఇక్కడ వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు చెట్టా పట్టలు వేసుకుని తిరిగారు. ఆరు నెలల క్రితం వీరి ప్రేమ వ్యవహారం పెద్దల చెవిన పడింది. మైథిలి తల్లిదండ్రులు తీవ్రంగానే మందలించారు. తల్లిదండ్రుల మందలింపుతో పార్తిబన్‌కు మైథిలి దూరం కావడం మొదలెట్టింది. ఈ సమయంలో ఓ రోజు పార్తిబన్‌కు ప్రమాదం జరగడంతో ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన మైథిలి తదుపరి పూర్తిగా దూరమైంది. తనకు మైథిలి దూరం కావడంతో పార్తిబన్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో పది రోజుల క్రితం మైథిలి పార్తిబన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్తిబన్‌తో తాను కలిసి ఉన్నట్టుగా ఫొటోలు, వాట్సాప్‌లలో మెసేజ్‌లు ఉన్నాయని, వాటన్నింటిని తొలగించకుండా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు అందులో వివరించింది. ఈ ఫిర్యాదు పార్తిబన్‌ను ఉన్మాదిగా మార్చినట్టుంది. సజీవ దహనం : పార్తిబన్‌ను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు మందలించారు. అతడి వద్ద ఉన్న మైథిలి ఫొటోలను, మెసేజ్‌లను తొలగించారు. దీంతో పార్తిబన్ బెడద తీరడంతో యథా ప్రకారం తన పనుల్లో మైథిలి మునిగింది. అయితే, తనకు తెలియకుండా పార్తిబన్ వెంటాడుతుండడాన్ని ఆమె పసిగట్ట లేక పోయింది. తనకు మై«థిలి పూర్తిగా దూరం కావడంతో ఉన్మాదిగా మారిన పార్తిబన్ ఆమె రాకపోకల్ని ఆరా తీసి, పథకం ప్రకారం హతమార్చే యత్నం చేశాడు. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తిరుముల్లైవాయిల్ బస్టాండ్‌లో బస్సు దిగిన మైథిలి వివేకానందనగర్ మీదుగా ఇంటికి నడక మొదలెట్టింది. ఆమెను రహస్యంగా అనుసరించిన పార్తిబన్ నిర్మానుష్యంగా ఉన్న రోజా వీధిలో అడ్డగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే యత్నం చేశాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డులో ఎవ్వరూ లేకపోవడంతో తన ఉన్మాదాన్ని పార్తీబన్ బయటకు తీశాడు. వెన్నంటి తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రియురాలి మీద పోసి నిప్పు అంటించాడు. తాను పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ఈ ఇద్దరు పెడుతున్న కేకలకు సమీపంలోని ఇళ్లల్లో ఉన్న వాళ్లు పరుగులు తీశారు. మంటల్ని ఆర్పేయత్నం చేశారు. అంబులెన్స్‌కు, తిరుముల్లై వాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ ఇద్దర్ని కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో పార్తిబన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో మైథిలి సైతం తుది శ్వాస విడిచింది. ప్రేమోన్మాదానికి ఈ ఇద్దరు బలి కావడంతో ఆ రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాల్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
మహిళ హత్య కేసులో స్నేహితురాలి అరెస్టు
అన్నానగర్ : అదృశ్యమైన ఓ మహిళను ఆమె స్నేహితురాలు కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన సంఘటన తిరువట్టార్ సమీపంలో జరిగింది. తిరువట్టార్ సమీపంలో సారూర్ ప్రాంతానికి చెందిన కూలీ ఇన్సెంట్ (42). ఇతని భార్య శశికళ (36). వీరికి ఇద్దరు కుమారులు. 25న ఉదయం శశికళ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇన్సెంట్ బంధువుల ఇళ్లు సహా పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో అతను తిరువట్టార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శశికళకు నాగర్‌కోవిల్‌కు చెందిన కళతో పరిచయమై ఉన్నట్లు తెలియడంతో ఆమెను పోలీసులు విచారణ చేశారు. విచారణలో నెల్లై జిల్లా దిసైయన్‌విలై శ్మశానంలో శశికళను సజీవదహనం చేశానని ఆమె ఒప్పుకుంది. అనంతరం శశికళ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన చోటును పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
చోరీకి వచ్చి.. మంటల్లో చిక్కుకొని..
మంటలు ఆర్పిన తర్వాత బయటపడిన మృతదేహం కొత్తూరు: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి మంటల్లో చిక్కి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారు జామున జరిగింది. కొత్తూరులోని పోలీస్‌స్టేషన్ వెళ్లే రోడ్డులో దొండిరామ్‌కు చెందిన టీ కొట్టులోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం పరిశీలించగా టీకొట్టు డబ్బాలో సగం కాలిన వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయమై రూరల్ సీఐ మధుసూదన్ ను వివరణ కోరగా.. టీకొట్టులో చోరీకి వచ్చిన దొంగ.. డబ్బాపై ఉన్న రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి నట్లు తెలిపారు. అదే సమయంలో టీకొట్టులో అమ్మకానికి పెట్టిన పెట్రోల్, కిరోసిన్ డబ్బాలపైన దొంగ పడిపోయాడు. చీకటిగా ఉండడంతో వెలుతురు కోసం అగ్గిపుల్లను వెలిగించగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి అతడు సజీవ దహనమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రేసింగ్ చాంపియన్ సుందర్ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరి సజీవ దహనం సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రేసింగ్ చాంపియన్ అశ్విన్ సుందర్, ఆయన భార్య నివేదిత దుర్మరణం పాలయ్యారు. ఎంఆర్సీ నగర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ సజీవ దహనమయ్యారు. మిత్రుని ఇంటి నుంచి బయల్దేరిన అశ్విన్, నివేదితలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. 31 ఏళ్ల ఈ జాతీయ చాంపియన్ టూ వీలర్, కార్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లలో పలుమార్లు టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. 2006లో చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అవార్డును దక్కించుకున్నాడు. జర్మనీకి చెందిన రేసింగ్ టీమ్ మాకాన్ మోటార్‌స్పోర్ట్స్‌తో ఒప్పందం చేసుకున్న అశ్విన్ 2008లో జర్మన్ ఫార్ములా ఏడీఏసీ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్నాడు. వరుసగా 2012, 2013 లలో జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. కాగా ఆయన భార్య నివేదిత చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్. సుందర్ మృతి పట్ల ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అక్బర్ ఇబ్రహీమ్, చైర్మన్ సుజీత్ కుమార్, భారత ఫార్ములా వన్ డ్రైవర్ కరుణ్ చందోక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. -
రిటైర్డ్ ఉద్యోగి సజీవదహనం
అర్ధరాత్రి తిరువళ్లూరులో కలకలం హత్యకోణంలో పోలీసుల విచారణ తిరువళ్లూరు: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా రాజావీధిలో కాలిన స్థితిలో మృతదేహం ఉన్న ట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరం పూర్తిగా కాలిపోయి గుర్తుప ట్టడానికి వీలులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మృ తదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరువళ్లూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి కోర్టు విశ్రాంత ఉద్యోగి కృష్ణమూర్తి(70)గా పోలీసులు గుర్తించారు. ఇతన్ని ఎవరైనా హత్య చేశారా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అడవిలో యువతి సజీవదహనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి సమీపంలోని అడవిలో ఓ యువతిని సజీవదహనం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జాకారం గ్రామానికి చెందిన ఎస్తి రాణి(18)గా గుర్తించారు. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమె అదృశ్యమైంది. బుధవారం సజీవదహనమై కనిపించింది. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఐసిస్ మరో ఘాతుకం
డయాస్కస్/అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదలచేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చిత్ర హింసలకు గురిచేసి సజీవదహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాది గ్రూప్ వెబ్ సైట్లలో గురువారం పోస్ట్ చేసిన ఆ వీడియో కలకలం రేపింది. ఇటీవల 16 మంది సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్యచేసింది. ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను టర్కీ సైనికుల సజీవదహనం ఘటన 2014 డిసెంబర్ లో ఉగ్రవాదులు జోర్డాన్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పైలట్ మాజ్ అల్ కసాస్బ్ ను బోనులో బంధించి, ఆపై చిత్రహింసలకు గురిచేసి బోనులోనే సజీవ దహనం చేసిన ఘటనను తలపిస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సజీవదహనానికి గురైన సైనికులను జిహాదిస్టులు బంధించినట్లు ఐఎస్ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమఖ్ గత నెలలోనే కథనాలు అందించింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా సిరియాలోని పలు ప్రాంతాలలో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. -
సిలిండర్ పేలి మహిళ సజీవదహనం
విజయవాడ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ సంఘటన విజయవాడలోని మధురానగర్‌లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ మంటలకు ఆహుతై సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో బుధవారం చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు. పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
తల్లి, చెల్లికి నిప్పంటించి..
రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలో గురువారం ఉదయం ముగ్గురు సజీవ దహనమయ్యారు. గ్రామానికి చెందిన ఒక యువకుడు తన చెల్లి, తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తను కూడా నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబకలహాలే ఈ ఘోరానికి కారణమని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో రైతు సజీవదహనం
తెగిపడిన 11కేవీ వైరు ద్విచక్రవాహనంతో వెళ్తుండగా సంఘటన నిర్మల్(మామడ): ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో కోండ్ర నర్సయ్య(64) విద్యుదాఘాతంతో మంగళవారం సజీవ దహనమయ్యూడు. నర్సయ్య ఉదయం తన చేనులో నువ్వు పంటకు నీరందించిన అనంతరం తన ద్విచక్ర వాహనంపై మొక్కజొన్న చొప్పను తీసుకుని ఇంటికి బయల్దేరాడు. చేను సమీపంలో ప్రమాదవశాత్తు 11కేవీ వైరు తెగి నర్సయ్యపై పడింది. మొక్కజొన్నగడ్డి, పెట్రోల్ కారణంగా మంటలు లేచాయి. ఘటనాస్థలంలోనే సజీవ దహనమయ్యూడు. సమీపంలోని రైతులు గమనించి సంఘటనా స్థలంలోకి చేరుకుని మంటలు నీటితో ఆర్పివేశారు. ప్రాణం తీసిన ఉడుత.. ఉడుత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. 11 కేవీ విద్యుత్ వైరుపైకి వెళ్లిన ఉడుత ఇన్సులెటర్ పిన్‌కు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. ఇన్సులేటర్ పిన్ పగిలిపోయింది. దీంతో స్తంభంపై వైరు వద్ద మంటలు వచ్చి తెగింది. అదే సమయంలో వస్తున్న రైతు నర్సయ్యపై పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఉడుత కూడా మృతిచెంది ఉంది. కాగా, గత ఏడాది నవంబర్‌లో నర్సయ్య కుమారుడు ఇదే పంట చేనుకు నీరందించేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో చనిపోయూడు. నర్సయ్యకు భార్య, మరో కుమారుడు ఉన్నారు. -
మూడేళ్ల చిన్నారి సజీవ దహనం
నంద్యాలటౌన్ నంద్యాల పట్టణం అరుంధతీనగర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి చిన్నారి శ్రీవాణి సజీవ దహనమైంది. ఐదు గుడిసెలు దగ్ధమై బాధితులు రోడ్డున పడ్డారు. ఓ గుడిసెలో నివాసం ఉన్న గద్వాల బ్రహ్మయ్య.. మున్సిపాలిటీలోని నాల్గో పారిశుద్ధ్యం డివిజన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య జ్యోతి, 8ఏళ్ల కుమారుడు సాయి, ఆరేళ్ల కుమార్తె సాయిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె శ్రీవాణి, ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు సుబ్బరాయుడు ఉన్నారు. శ్రీవాణి మండ్రాల్ చావిడి వద్ద ఉన్న ప్రైవేటు స్కూల్లో నర్సరీ చదువుతోంది. గురువారం రాత్రి 9గంటలకు భోజనం పూర్తయ్యాక, గుడిసెలో వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రిదాటాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి గుడిసెకు నిప్పంటుకుంది. మంటలు పక్కన ఉన్న నాలుగు గుడిసెలకుకూడా వ్యాపించాయి. బ్రహ్మయ్య మేల్కొనే సరికి మంటలు, దట్టమైన పొగ వ్యాపించి ఉంది. భార్య జ్యోతిని, కుమారులు సాయి, సుబ్బరాయుడు, శ్రీలక్ష్మిలను ఒకరివెంట మరొకరిని బయటకు పంపి రక్షించాడు. శ్రీవాణి కూడా వీరితో పాటు బయటకు వచ్చిందని అనుకున్నారు. చీకటిలో, దట్టమైన పొగలో, మంటల్లో ప్రాణాలను రక్షించుకోవడానికి శ్రీవాణి.. బీరువా చాటున వెళ్లి ప్రాణాలను రక్షించుకోవడానికి యత్నించింది. మంటలు వ్యాపించడంతో ఆ బాలిక మృత్యు ఒడికి చేరింది. అగ్ని ప్రమాదం ఘటనా స్థలంలో గందరగోళం నెలకొనడంతో బాలిక ఆర్థనాదాలు ఎవరికీ వినిపించలేదు. మంటలు ఆర్పాక బ్రహ్మయ్య వెళ్లి చూసేసరికి, కాలిపోయిన కుమార్తె శ్రీవాణి కనిపించింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. రోడ్డున పడ్డ ఐదు కుటుంబాలు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గద్వాల బ్రహ్మయ్యతో పాటు గద్వాల చిన్నమ్మ, వీరయ్య, బాలు, పెద్దమాతంగి రమణమ్మల గుడిసెలు కూడా కాలి బూడిదయ్యాయి. ఇంట్లోని తిండి గింజలు, దుస్తులు, వంట సామాగ్రి దగ్ధమయ్యాయి. దీంతో ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సోదరి ఇంట్లో శుభ కార్యం కోసం బ్రహ్మయ్య బీరువాలో దాచిన రూ.లక్ష నోట్ల కట్టలు కాలిపోయాయి. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేశారు. శ్రీవాణి మృతదేహానికి వన్‌టౌన్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ ప్రతాపరెడ్డి కేసు నమోదు చేశారు. -
కాటేసిన కట్నం
వివాహిత సజీవ దహనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కుత్బుల్లాపూర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సంతానం కలగలేదని రాచి రంపాన పెట్టాడు... అదనపు కట్నం తెమ్మని చేయి చేసుకున్నాడు... చివరకు ఆ అభాగ్యురాలు అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మృతి చెందింది. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. సీఐ రంగారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. ఈసీఐఎల్‌కు చెందిన సుశీల కుమార్తె శ్రీలత అలియాస్ భాగ్యలక్ష్మి (29) డిగ్రీ చదువుకుంది. దేవరయాంజల్లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న వరుసకు మేనమామ అయ్యే పోచయ్య(31)ను శ్రీలత 2007లో తన తల్లిదండ్రులను కాదని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె దేవరయాంజల్‌లోని అత్తగారింట్లో ఉంటోంది. పిల్లలు కలగడం లేదని వేధింపులు.. పెళ్లి అయ్యాక కొంతకాలం శ్రీలతను పోచయ్య బాగా చూసుకున్నాడు. తర్వాత పిల్లలు కలగలేదని అందరి ముందే అవమానించడంతో పాటు అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. ఈ క్రమంలో శ్రీలత తన పుట్టింటి నుంచి రూ.50 వేలు తెచ్చి ఇవ్వగా బైక్ కొన్నాడు. తర్వాత ఆటో ట్రాలీ కొనేందుకు రూ.లక్ష కావాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రూ.80 వేలు కావాలని, ఈ మొత్తాలను పుట్టింటి నుంచి తీసుకురమ్మని పోచయ్య భార్యను వేధించసాగాడు. అసలే త ల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో శ్రీలత నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య 10 రోజులుగా రాత్రి సమయంలో గొడవ జరుగుతోంది. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి పోచయ్య భార్యతో గొడవ పెట్టుకుని తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలత చనిపోతానని అంటే.. చస్తే చావు అంటూ పోచయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4.30కి ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటల్లో శ్రీలత కాలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో గ్యాస్ స్టౌ ఉండగా... కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రశ్నగా మారింది. భర్తే కిరోసిన్ పోసి శ్రీలతను హతమార్చాడా? లేదా మనస్తాపంతో శ్రీలతే ఆత్మహత్య చేసుకుందా? అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... ఐపీసీ సెక్షన్లు 306, 498-ఏ, 174 కింద కేసు నమోదు చేసి, పోచయ్య కోసం గాలిస్తున్నారు. -
దారుణం
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోర ప్రమాదం కోడలు సారిక సహా ముగ్గురు మనువళ్ల సజీవ దహనం గ్యాస్ లీక్ కావడంతో ఘటన హత్యా.. ఆత్మహత్యా... అని అనుమానాలు హత్య చేశారని సారిక తల్లి ఆరోపణ పోలీసుల అదుపులో ‘సిరిసిల్ల’ కుటుంబం ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ర్టంలో సంచలనం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(5), శ్రీయోన్(5) మంగళవారం రాత్రి పడుకున్న వారు పడుకున్నట్లుగానే మంటల్లో కాలిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని రాజయ్య కుటుంబీకులు చెబుతుండగా.. కొంతకాలంగా జరుగుతున్న గొడవల్లో భాగంగానే తమ కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని సారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా.. అభం శుభం తెలియని చిన్నారులు మంటల్లో మాడిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది. వరంగల్ క్రైం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు కుమారుల సజీవ దహనంపై శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపడుతున్నట్లు వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. సంఘటనా ప్రదేశం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పిస్తున్నామని పూర్తి స్థారుులో విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత నిజాలు వెలుగుచూస్తాయని పేర్కొన్నారు. విచారణకు ప్రత్యేక టీమ్... సజీవదహనం కేసును చేధించేందుకు ప్రత్యేకం గా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఏసీపీ నేతృత్వంలో నియమించనున్న ఈ బృందంలో ముగ్గురు సీఐ లు విచారణ అధికారులుగా ఉంటారన్నారు. పలుమార్లు ఘటనా ప్రదేశానికి సీపీ ఇదిలా ఉండగా ఘటన జరిగిన రాజయ్య ఇం టికి ఉదయమే చేరుకున్న సీపీ సుధీర్‌బాబు అ క్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, ఘటన జరిగిన గదిని ప్రత్యేకంగా పరి శీలించిన సీపీ ఆ తర్వాత కూడా పలుమార్లు సం ఘటన ప్రదేశానికి వెళ్లడం గమనార్హం. అక్కడి ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోచమ్మమైదాన్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనుమలు మృతి చెందిన విషయం బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక అడిగే అవకాశముండడంతో అధికారులు రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంటికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అధికారులు పరిశీలించి వెళ్తున్న క్రమంలో మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ కరుణ.. పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ నవీన్ చంద్.. మీడియాతో మాట్లాడుతూ సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమైందని తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు ఘటన జరిగిందని, ఈ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ల పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సారిక అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని.. పోస్ట్‌మార్టం అనంతరం సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని వెల్లడించారు. ఇక వరంగల్ సీపీ సుధీర్‌బాబు ఉదయం నుంచి మృతదేహాలను తరలించే వరకు అక్కడే ఉన్నారు. ఇంకా డీఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝ, వరంగల్ ఆర్డీఓ వెంకట మాధవరావు, వరంగల్ తహసీల్దార్ గుజ్జుల రవీందర్ ఉన్నారు. -
తల్లిదండ్రుల సజీవదహనం.. కుమారుడూ మృతి
కృష్ణా: నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తల్లిదండ్రులను సజీవ దహనం చేసిన ఘటనలో గాయపడిన ఏడుకొండలు(35) అనే వ్యక్తి ఆదివారం మరణించాడు. ఈ నెల 11 తెల్లవారు జాము 2 గంటల సమయంలో ఆస్తి విషయమై తల్లిదండ్రులతో గొడవపడి పెట్రోలు పోసి చంపే ప్రయత్నంతో తాను కూడా గాయపడ్డాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు శోభనాచలం, మాణిక్యమ్మ మరణించగా.. గాయపడిన కుమారుడ్ని స్థానికులు నూజివీడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. (నూజివీడు) -
షార్ట్ సర్క్యూట్: వ్యక్తి సజీవ దహనం
గుంటూరు: గుంటూరు జిల్లా కొల్లిపర్ర మండలం దంతలూరులో ఆదివారం ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. వివరాలు.. దంతలూరు గ్రామానికి చెందిన జ్యోతుల ఏలియ్య(70) ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. రెండు నిమిషాల్లో మంటలు గది నిండా వ్యాపించాయి. గది నుంచి బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో ఇంట్లోనే సజీవంగా దహనమయ్యాడు. ఏలియ్యను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేదు. భార్యా, మనవడు పొరుగూరిలో పెళ్లి నిమిత్తం రెండు రోజుల క్రితం వెళ్లారు. (కొల్లిపర్ర) -
21 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. పేలిన డీజిల్ ట్యాంక్ పన్నా: మరికొద్ది సేపట్లోనే గమ్యస్థానాలకు చేరతామని భావించిన ఆ బస్సు ప్రయాణికులు.. మృత్యువు విసిరిన పంజాలో చిక్కుకుని భయానక స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలలు.. చిన్నా పెద్దా సహా మొత్తం 21 మంది ఉసురుదీశాయి. మరో 13 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ నుంచి సత్నా జిల్లాకు 50 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయల్దేరింది. మార్గంమధ్యంలో పాండవ జలపాతం వద్ద ఓ వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతైన కాల్వలోకి పడిపోయింది. రెప్పపాటులో బస్సుకు ఉన్న డీజిల్ ట్యాంక్ పేలి భారీస్థాయిలో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికుల్లో 21 మంది సజీవ దహనమైనట్టు ఎస్పీ అర్జారియా వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైందని అన్నారు. కాగా, ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. -
ప్రాణం తీసిన అతివేగం
కనకదుర్గమ్మ వారధి వద్ద యువకుడి సజీవదహనం రేపోమాపో పెళ్లికావాల్సిన కుర్రాళ్లు.. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగా వేస్తున్న రోడ్డుపై జీబ్రా చారలు వేస్తుండగా పెయింట్ డబ్బాలను ఢీకొనడంతో మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. కనకదుర్గమ్మ వారధిపై గురువారం ఉదయం ఈ సంఘటన సినీఫక్కీలో జరిగింది. తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా) : అతివేగం మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడిని బలితీసుకుంది. పెయింట్ డబ్బాల రూపంలో మృత్యువు వెంటాడగా, పెట్రోల్ రూపంలో సజీవ దహనం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధిపై గురువారం అందరూ చూస్తుండగా అచ్చం సినిమా సన్నివేశంలా జరిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వెలగల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు సీతారామరాజు (23)కు చిలకలూరిపేట సమీపంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన మిత్రుడు మందా నారాయణస్వామితో కలిసి రిలయన్స్ 4జి కంపెనీలో విధులు నిర్వహిస్తుంటారు. వీరిద్దరూ నిత్యం గుంటూరు నుంచి పల్సర్ ద్విచక్రవాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. సీతారామరాజుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. రోజూ మాదిరిగానే గురువారం మిత్రుడితో కలిసి విజయవాడ బయలుదేరిన వీరు కనకదుర్గ వారధిపై అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై జీబ్రా లైన్లు వేస్తున్న పెయింట్ డబ్బాలను ఢీకొట్టారు. అచ్చం సినిమా సన్నివేశంలా.. బైక్ వేగానికి పెయింట్ డబ్బాలతో పాటు అందులో కలిపే టిన్నర్ సైతం ఎగిరి వీరి ఒంటి నిండా పడింది. అప్పటికే ఆ డబ్బాలలో కొంత కిరోసిన్ కలిపి ఉండడం, అది వీరి ఒంటిపై పడడంతో కంగారు పడ్డ వీరు దిచక్రవాహనాన్ని నియంత్రించలేకపోయారు. వారధిపై 8-9 ఖానాల నడుమ బండి అదుపుతప్పి కిందపడి దూసుకు వెళుతుండడంతో బండిలోని పెట్రోల్ ఒలికి రోడ్డుపై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరినీ తడిపేసింది. ఆ సమయంలోనే పల్సర్ వాహనం ఒత్తిడికి రోడ్డుపై నిప్పు రవ్వలు రేగి, ఆ మంట వీరికి అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. బాధితుల కేకలు విని సమీపంలోని వాహనదారులు, పెయింట్ వేస్తున్న వారు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఒంటిపై మంటల ధాటికి ఆర్తనాదాలు చేసిన బాధితులు ఒకానొక తరుణంలో కృష్ణానదిలో దూకేందుకు ప్రయత్నించగా, స్థానికులు నిలువరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు కార్లలో ఉన్న టవళ్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే సీతారామరాజు శరీరం 90 శాతం కాలిపోగా, నారాయణ స్వామికి కొంతమేర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే సీతారామరాజు మృతి చెందగా, నారాయణ స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ చిట్టెం కోటేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు. -
గుర్తు తెలియని యువతి సజీవదహనం
హైదరాబాద్ నడిబొడ్డున దారుణం ఆత్మహత్య కావచ్చంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం, నడుము వరకు ఆనవాళ్ళు కాలిపోగా, కాళ్లు, చేతులు కొద్దిభాగం మాత్రమే కాలిపోకుండా ఉన్నాయి. నాలుక బయటకు ఉండటంతో దుండగులు గొంతుపిసికి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టారా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనాస్థలంలో రెండు వైన్ బాటిల్స్, కిరోసిన్ డబ్బా, అగ్గిపెట్టె లభించాయి. వాచీ, చిల్లర డబ్బులు, హ్యాండ్ బ్యాగ్‌ను ఫోరెన్సిక్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాగిలాలు ఘటనాస్థలం నుండి సమీపంలోని బిగ్‌బజార్ వెనక వైపునకు వెళ్లాయి. కేసు దర్యాప్తునకు నా లుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పో లీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించారు. బతికున్నప్పుడే: యువతి మృతదేహానికి గాంధీ మార్చురి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిం చారు. ప్రాథమిక నివేదికలో యువతి ప్రాణాలతో ఉన్న సమయంలోనే ఒంటిపై కాలిన గాయాలయ్యాయని తేలింది. యువతి ఊపిరితిత్తుల్లో నల్లటి పొగ చేరినట్లు, కాలిన గాయాల వల్లే ఆమె చనిపోయినట్లు నివేదికలో ఉంది. శరీరం కాలుతున్న సమయంలో నాలుక దానంతట అదే నోటి బయటికి వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆమె తనంతట తాను పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఉంటే అటుఇటు పరుగెత్తే అవకాశాలుంటాయి. ఇలాంటి ఆనవాళ్లు ఘటనాస్థలంలో కనిపించలేదు. ఎవరైనా పథకం ప్రకారం ఆమె బతికున్నప్పుడే పెట్రోల్ పోసి నిప్పంటించారా అనే అనుమానా లు కలుగుతున్నాయి. యువతి ఆచూకీ తెలిస్తేనే ఘటనకు సంబం ధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ఆధారాల కోసం అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. -
హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు బేరాలు
తిరువొత్తియూరు: అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన నర్సింగ్ విద్యార్థిని కేసును ఆత్మహత్యగా మార్చేందుకు పోలీసులు డాక్టర్లతో బేరం మాట్లాడుతున్నారు. గత నెల 14వ తేదీ తిరుచ్చి సెంట్రల్ జైలు సమీపంలో వున్న ఆసుపత్రిలో ఒక బైకు చోరీ చేయడానికి ప్రయత్నించిన యువకున్ని ఆటో డ్రైవర్లు చుట్టుముట్టి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ముసిరి తాపేటకు చెందిన తంగదురై (30) అని తెలిసింది. ఇతను తాను చోరీ చేసిన బైకులకు నంబరు ప్లేట్లను మార్చి కోర్టు వేలం ఎత్తినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా విక్రయించిన డబ్బులతో ఉల్లాసంగా గడిపేవాడని తెలిసింది. అతని నుంచి పోలీసులు 103 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన తంగదురై గత 23వ తేదీ జ్యుడిషియల్ కోర్టులో హాజరు పరిచారు. జైలులో బంధించారు. తంగదురైకు సహాయపడిన ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి తురైయూర్ ఆంగియంకు చెందిన ఉదయన్ (29) అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. పోలీసులు తంగదురైను రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. బైకుల విక్రయించగా అందులో వచ్చే నగదుతో కొంతమంది విద్యార్థినులను లోబరచుకునే వాడని తెలిసింది. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి ఉదయన్ సహాయపడినట్టు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో తంజావూరుకు చెందిన నర్సింగ్ విద్యార్థినిపై గత సంవత్సరం జనవరి 1వ తేదీ రాత్రి ఓ డాక్టరుతో కలసి అత్యాచారం చేశాడని, ఆ సమయంలో విద్యార్థిని ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేయడంతో విద్యార్థిని కింద పడి తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. తంగదురై తన మిత్రుని సహాయంతో విద్యార్థినిపై కిరోసిన్ పోసి తగులపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పుదియ తలమురై కార్పొరేషన్ కార్యదర్శి శంకర్ నేతృత్వంలో విద్యార్థిని మృతిపై ఆందోళన చేశారు. ఆందోళనలో విద్యార్థిని మృతిలో సందేహం ఉందని ఆత్మహత్య చేసుకున్న గది అగ్నిజ్వాలలు గోడలపై తగులలేదని హత్య చేసి విద్యార్థిని తగులబెట్టారని సందేహం వెలిబుచ్చారు. ఆ సమయంలో విచారణ అధికారిగా ఉన్న సహాయ కమిషనర్ గణేషన్ హఠాత్తుగా మూడు రోజులకు సెలవు పెట్టి బయటకు వెళ్లారు. తరువాత ఈ కేసును ఆత్మహత్య కేసుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ కేసు ఆత్మహత్యగా రుజువు చేయడానికి సంబంధిత డాక్టరుతో పోలీసులు బేరం మాట్లాడుతున్నట్టు తంగదురై తెలిపాడు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు సజీవ దహనం
హైదరాబాద్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఓ చిన్నారితోపాటు రక్షించబోయిన మరో వ్యక్తి మృత్యువు పాలయ్యారు. సలీంనగర్ కాలనీలో రియాజుద్దీన్ అనే వ్యక్తి భార్య సమీరా బేగం, కుమార్తెలు అప్సాబేగం, బుస్రా (8 నెలలు)తో కలసి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రియాజుద్దీన్ ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సమీరాబేగం పెద్దకుమార్తెతో బయటకు వచ్చేసింది. చిన్న కుమార్తె బుస్రాను కాపాడేందుకు యత్నించగా దట్టమైన పొగలు, మంటలు అప్పటికే ఇంటిని కమ్మేశాయి. పక్కింట్లో నివసించే సయ్యద్ మహబూబ్ అలీ అస్మీ (55) చిన్నారిని రక్షించేందుకు ఇంట్లోకి వెళ్ళాడు. మంటలు వ్యాపించడంతో బయటకి రాలేకపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం లోపలికి వెళ్లగా అస్మీ, బుస్రా విగతజీవులై కనిపించారు. వారిద్దరి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. -
వృద్ధురాలు సజీవ దహనం
కూసుమంచి (ఖమ్మం): ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది. ఎస్సీ కాలనీలోని అరవపల్లిలో అప్పమ్మ(90) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు అదుపు చేసేలోపే బాధితురాలు మంటల్లో పూర్తిగా కాలిపోయి చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
అమానుషం
గొర్రెల దొడ్డికి నిప్పు పెట్టిన దుండగులు 60 జీవాలు సజీవ దహనం {పాణాలతో కొట్టుమిట్టాడుతున్న మూడు పొట్టేళ్లు ఎంత అమానుషం.. కర్కశం.. దుండగుల దాష్టీకానికి మూగ జీవాలు బుగ్గిగా మారాయి. వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేని విధంగా కంచె ఉండడంతో మాంసపు ముద్దలయ్యూరుు. ఆలస్యంగా గమనించిన యజమాని ఏమీ చేయలేని నిస్సయ స్థితిలో కన్న బిడ్డలా పెంచుకున్న జీవాలు కంటి ముందే కాలి బూడిదవుతుంటే నిశ్చేష్టులై ఉండిపోయారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. గంగవరం:గంగవరం వుండలంలోని కొత్తపల్లె అటవీ ప్రాతంలో గురువారం రాత్రి గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పు పెట్టారు. ఈసంఘటనలో 42 గొర్రె లు, 3 పొట్టేళ్లు, 15 పిల్లలు సజీవ దహనవుయ్యూరుు. సుమారు రూ.4 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాతంలో యుర్రయ్యుగారిపళ్లె వంక వద్ద గొర్రెలకు దొడ్డిని నిర్మించుకున్నారు. పక్కనే గుడిసె కట్టుకుని గొర్రెలు మేపుకుంటూ దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వీరికి గొర్రెలే జీవనాధారం. గురువారం రాత్రి వుునిరత్నం అతని భార్య ఆంజవ్ము గొర్రెలదొడ్డికి సమీపంలో వ్యవసాయు పొలం వద్ద నివాసవుుంటున్న బంధువు ఇంటికి వెళ్లారు. ఈ విషయుం గమినించిన గుర్తు తెలియుని దుండగులు గొర్రెలదొడ్డికి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో గొర్రెలు మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యూరుు. వుంటల్లో తప్పించుకోవడానికి కూడా వీలు లేనివిధంగా కంచె ఉండడంతో పూర్తిగా దొడ్డిలో ఉన్న గొర్రెలు, పొట్టేళ్లు, పిల్లలు వూంసపు ముద్దలయ్యూయి. వుంటలు గమనించిన మునిరత్నం అతని భార్య ఆంజమ్మ దొడ్డి వద్దకు చేరుకుని నిస్సహాయు స్థితిలో ఉండిపోయూరు. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కూడా లేవు. సహాయుం చేయడానికి ఆ సమయంలో ఎవరు అందుబాటులో లేరు. గొర్రెల దొడ్డి కాలి బూడిదరుుంది. పక్కనున్న పూరిగుడిసె కూడా కాలిపోరుుంది. శుక్రవారం ఉదయుం విషయుం తెలుసుకున్న సర్పంచ్ గిరిరాజారెడ్డి, గ్రావుస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘోరంపై గంగవరం పోలీసులకు, రెవెన్యు అధికారులకు సవూచారం ఇచ్చారు. సీఐ రవి బాబు, ఎంఆర్ఐ విష్ణురామ్ తవు సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కేసు నమోదుచేసి బాధితులకు తప్పక న్యాయుం చేస్తావుని హామీ ఇచ్చారు. -
గిరిజన రైతు సజీవ దహనం
పాకకు నిప్పంటుకోవడంతో దుర్ఘటన భోగి పండగ పూట డెయిరీనగర్‌లో విషాదం చింతపల్లిరూరల్: పసుపుపంట కాపలాకు వెళ్లిన గిరిజన రైతు అగ్ని ప్రమాదానికి గురై సజీవదహనమయ్యాడు. మండలంలోని డె యిరీ నగర్లో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి పంచాయతీ శివారు డెయిరీనగర్‌లో ఉంటున్న కొర్రా లక్ష్మణరావు(35) గ్రామ సమీపంలోని గరువులో పసుపు పంటను చేపట్టాడు. దానికి కాపలాగా ఉండేందుకు అక్కడే చిన్న పాకను వేసుకున్నాడు. రోజూ భార్య బిమలతో కలిసి కొద్దికొద్దిగా పంటను సేకరించి ఉడకబెట్టి ఆరబెడుతున్నాడు. రోజూ మాదిరి మంగళవారం రాత్రి దంపతులు చలికి చిన్న మంట వేసుకుని ఇద్దరూ పాకలో నిద్రపోయారు. బుధవారం వేకువజామున అది పెద్దదైంది. అగ్నికీలలు ఎగిసిపడి పాకను చుట్టుముట్టాయి. భార్య బిమలమ్మ మేలుకొని కొద్దిపాటి గాయాలతో బయటపడింది. లక్ష్మణరావు అగ్నికీలల్లో చిక్కుకుపోయాడు. తప్పించుకునే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. బిమలమ్మ ఫిర్యాదు తో ఎస్ఐ తారకేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పండగపూట సంఘటనతో డెయిరీనగర్‌లో విషాదం అలుముకుంది. -
ఇంటికి నిప్పంటుకుని నలుగురు సజీవదహనం
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు మార్తాల ప్రకాశ్ (56),రాజమణి,(45),దేవరాజు(19),వంశీ (13) ఇంటి బయట తాళాలు వేసి పెట్రోలు పోసి తగలబెట్టిన దుండగులు . ఈ ప్రమాదం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు చిన్నారుల సజీవదహనం!
హైదరాబాద్: రాజేంద్ర నగర్ బండ్లగూడలోని మల్లికార్జున నగర్లో గుడిసె దగ్ధమై ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. గుడిసెకు నిప్పంటుకున్న సమయంలో తల్లి, ఇద్దరు ఆడపిల్లులు ఉన్నారు. తల్లిని, ఇద్దరు పిల్లలను రక్షించడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే ఇద్దరూ సజీవదహనం అయ్యారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ** -
మిఠాయి దుకాణంలో మంటలు
యువకుడి సజీవదహనం మరో వ్యక్తికి తీవ్రగాయాలు కీసర: మిఠాయి దుకాణంలో మంటలు చెలరేగడంతో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా నోక మండలం మాండేరియా గ్రామానికి చెందిన ఎం.అనిల్(22) కీసర ప్రధాన చౌరస్తాలో ఉన్న బాలాజీ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం రాత్రి దుకాణంలోని వంట గదిలో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున నాలుగుగంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అనిల్ మంటల్లో కాలిబూడిదయ్యాడు. అక్కడే నిద్రిస్తున్న మరో వ్యక్తి కైలాశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేటీపీపీ కూలింగ్ టవర్‌లో ప్రమాదం గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో రెండో దశ 600 మెగావాట్లకు చెందిన కూలింగ్ టవర్‌లో శనివారం సా యంత్రం జరిగిన ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. -
మొహర్రం ఊరేగింపులో విషాదం
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ పంచాయతీ అచ్చాయపల్లిలో బుధవారం జరిగిన మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. గ్రామంలో పీర్లను ఊరేగిస్తున్న బృందం విద్యుదాఘాతంతో ఓ యువకుడు సజీవ దహనం కాగా మరో 26 మంది గాయపడ్డారు. వివరాలు.. మొహర్రం సందర్భంగా అచ్చాయపల్లికి చెందిన కొందరు పీర్లను ఎత్తుకొని ఊరేగింపుగా ఎల్లారెడ్డి మండలం మచాపూర్ నుంచి వస్తుండగా 132 కేవీ హై టెన్షన్ వైర్లకు పీర్ కర్ర తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. వైర్ల నుంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు లేచి వారిపై పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన జింక సాయిలు(35) అక్కడిక్కడే సజీవదహనం కాగా, 26 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
చెట్టును లారీ ఢీకొనడంతో ప్రమాదం పెడిమికొండ అటవీ ప్రాంతంలో దుర్ఘటన నాతవరం : చెట్టును లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మండలంలోని గాంధీనగరం సమీపం పెడిమికొండ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం నుంచి ఎర్రమట్టి లోడుతో తుని వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కనున్న చెట్టును అదుపు తప్పి ఢీకొంది. శనివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు రావడంతో నర్సీపట్నానికి చెందిన పెదిరెడ్ల కన్నాపాత్రుడు (45) సజీవ దహనమయ్యాడు. లారీ యజమాని అయిన కన్నాపాత్రుడే వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ సమయంలో లారీలో అతనుతప్ప మరెవరూ లేరు. చింతపల్లి మండలం డౌనూరు నుంచి శుక్రవారం సాయంత్రం మట్టి లోడు వేసుకొని రాత్రికి నర్సీపట్నంలో తన ఇంటివద్ద ఉండిపోయి శనివారం తెల్లవారుజామున బయల్దేరాడు. ఈలోడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో గల ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంది. ఈ లారీ క్లీనర్ ముందు రోజు సాయంత్రం తూర్పుగాదావరి జిల్లా బిళ్లనందూరులోని తన ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సజీవ దహనమైన కన్నాపాత్రుడికి ఇద్దరు పిల్లలు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తుని నుంచి నర్సీపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు నాతవరం ఎస్ఐ పి.రమేష్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన చేరుకునే సరికి లారీ క్యాబిన్ నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వెంటనే నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది, అందులో ఉన్న కన్నాపాత్రుడు పూర్తిగా కాలిపోయి చివరకు కాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాద స్థలానికి న ర్సీపట్నం రూరల్ సీఐ ఎ.దాశరథి చేరుకుని మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం న ర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. లారీలో ఉన్న ఎర్రమట్టి రోడ్డుపై పడిపోవడంతో తుని -నర్సీపట్నం వెళ్లే వాహనాల రాకపోకలు సూమారు రెండు గంటలు స్తంభించిపోయాయి. పోలీసులు ఆ మట్టిని పొక్లైనర్ సాయంతో తొలగించారు. -
వివాహ వేడుకలో విషాదం
* సిలిండర్ పేలి వ్యాపించిన మంటలు * ఆరుగురి సజీవ దహనం సాక్షి, న్యూఢిల్లీ: వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చ ట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయి గా నవ్వుకుంటున్నారు. అయితే అంతలోనే ఈ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అసలేమి జరిగిందంటే... పెళ్లివారి ఇంటిలో గ్యాస్ సిలిం డర్ పేలడంతో ఆరుగురు మరణించారు. జసోలా గ్రామంలోని మసీదువాలీ గల్లీలో సి -13 ఇంటి సభ్యులంతా శుక్రవారం ఉదయం పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. అంతలోనే ఉదయం 11 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా బారాత్ కోసం బయటకు వెళ్లారు. మంటలు పొరుగున ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయని, వీధులన్నీ ఇరుగ్గా ఉండడంతో మంటలను ఆర్పడానికి అవస్థపడాల్సి వచ్చిందనిఅగ్నిమాపక విభాగం తెలిపింది. కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాలను దిగ్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి
మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఘాతుకం ఆర్మీ వ్యక్తులే చేశారని బాలుడి వాంగ్మూలం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం హైదరాబాద్: మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు. ఈ దారుణం బుధవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మిలిటరీ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముస్తఫా 92 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన మేజిస్ట్రేట్... ముస్తఫా స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తన కుమారుడు వాంగ్మూలమిచ్చాడని తండ్రి షేక్ ముఖీదుద్దీన్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలుడు పేర్కొనడంతో సిద్దిఖీనగర్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. -
రెండుచోట్ల పిడుగుపాటు ఇద్దరు సజీవ దహనం
కొప్పురాయి (టేకులపల్లి): ఏజెన్సీలో దారుణం జరిగింది. పిడుగుపాటుతో ఇద్దరు సజీవంగా దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన సోలెం బుచ్చిరాములు-పొట్టెమ్మ, కుంజా ముత్తయ్య-పుల్లమ్మ, చింత లక్ష్మయ్య-కల్యాణి దంపతులు బర్లగూడెం సమీపం లోని అటవీ ప్రాంతంలో కొన్నేళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. రోజులాగానే వీరు మంగళవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. పొట్టెమ్మ, ముత్తయ్య మాత్రం వెళ్లలేదు. చేను వద్ద పని చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో, దగ్గరలోని గుడిసెలోకి కుంజా పుల్లమ్మ(40), సోలెం బుచ్చిరాములు(33), చింత లక్ష్మయ్య, చింత కల్యాణి తలదాచుకున్నారు. కొద్దిసేపటి తరువాత, సరిగ్గా ఆ గుడిసెపై భారీ శబ్దంతో పిడుగు పడి, మంటలు లేచాయి. గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో చిక్కుకుని కుంజా పుల్లమ్మ(40). సోలెం బుచ్చిరాములు(33) సజీవంగా దహనమయ్యారు. శబ్దం వినపడగానే చింత కల్యాణి బయటకు పరుగెత్తింది. కాలిపోతున్న గుడిసెలో ఉన్న తన భర్త లక్ష్మయ్యను రక్షించేందుకు వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన వద్దనున్న కండువాను లక్ష్మయ్య కాళ్ళకు చుట్టి గట్టిగా బయటకు లాగి దూరంగా తీసుకెళ్లింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజారాం తండాలో కూడా... రాజారాంతండాలోని చేనులో కూడా పిడుగు పడింది. అక్కడికి సమీపంలో అరక కట్టడానికి సిద్ధమవుతున్న పిడుగు ప్రభాకర్ అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ప్రదేశాలను బోడు ఎస్ఐ ముత్తా రవికుమార్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి ఎస్ఐ తరలించారు. రెండు గ్రామాల్లో విషాధం ఈ విషాద ఘటనలతో కొప్పురాయి పంచాయతీలోని ఒడ్డుగూడెం, మోదుగులగూడెం గ్రామా ల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోలెం బుచ్చిరాములు ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన పొట్టెమ్మను వివాహమాడి ఇల్లరికం వచ్చాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో పాప సుమత మానసిక, శారీరక వికలాంగురాలు. పెద్ద పాప స్పందన నాలుగో తరగతి చదువుతోంది. మూడో పాప సాత్వికకు రెండేళ్ళు. చింత పుల్లమ్మ స్వగ్రామం మోదుగులగూడెం. భర్త ముత్తయ్యతో కలిసి వ్యవసాయం చేస్తోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
బస్సు డ్రైవర్ సజీవదహనం
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలు తప్పిన భారీ ముప్పు మూలమలుపు వల్లే ప్రమాదం హైదరాబాద్: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తు డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ప్రయాణికులు మాత్రం గాయాలకు గురైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా బయటపడగలిగారు. ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (ఏపీ25జెడ్0064) సోమవారం మధ్యాహ్నం 58 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి ఆర్మూర్‌కు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సు తిరిగి బయలుదేరింది. బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్.. బస్సు ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ ముందు భాగం బస్సు లోపలికి చొచ్చుకునిపోయి బస్సు డీజిల్ ట్యాంక్ పగిలింది. వెంటనే బస్సులో మంటలు అంటుకొని డ్రైవర్ గంగాధర్ సజీవ దహనం కాగా, ప్రయాణికులు మాత్రం అత్యవసర ద్వారం గుండా కొందరు, అద్దాలు పగులగొట్టుకొని మరికొందరు బయటపడ్డారు. ఈ ఘటనలో మరో డ్రైవర్ మధుతో పాటు ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మధును తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. స్వల్పంగా గా యపడ్డ మరో 15 మంది ప్రయాణికులకు 108 వాహనంలో చికిత్స చేసి పంపారు. కాగా బస్సు ప్రమాదంలో ప్రధాన నిందితుడు డీసీఎం డ్రైవర్ బహదూర్ వాసియైన ఖాజామొయినుద్దీన్(45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డ్యూటీ మారిన 10 నిమిషాలకే.. అప్పటివరకు బస్సు నడిపిన డ్రైవర్ మధు (ఆర్మూర్) జూబ్లీ బస్‌స్టేషన్‌లో డ్యూటీ దిగి, రెండవ డ్రైవర్ గంగాధర్ (నిజామాబాద్ జిల్లా బాల్కొండ సమీప గ్రామానికి చెందిన)కు బస్సును అప్పగించాడు. జేబీఎస్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే యా క్సిడెంట్ అయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, గంగాధర్ కాళ్లు బస్సు క్యాబిన్‌లోనే ఇరుకున్నాయి. ‘నన్ను కాపాడండి’ అని అతడు దీనంగా ఆర్తనాదాలు చేశాడు. కానీ అప్పటికే డీజిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో మృత్యువాత పడ్డాడు. అయితే ఆ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ఎస్ఐ వేణు డ్రైవర్‌ను కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ భారీ మంటలు వ్యాపించడంతో ఫలితం లేకపోయింది. ‘టిమ్స్’మిషన్ కారణమా..? టికెట్ ఇష్యూ మిషన్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. బోయిన్పల్లి వద్ద బస్సు నడుపుతున్న డ్రైవర్ గంగాధర్ ఒక చేత్తో బస్సు నడుపుతూనే మరో చేత్తో టిమ్స్ మిషన్‌ను గేర్‌బాక్స్‌పై ఉంచేందుకు రోడ్డుపై నుంచి దృష్టి మరల్చాడు. ఆ స్వల్ప వ్యవధిలోనే బస్సు కుడివైపునకు వెళ్లిందని, ఎదురుగా వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టిందని తిరుపతయ్య, వినుకొండకు చెందిన వీరాంజనేయులు అనే ప్రయాణికులు తెలి పారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తులో ఉన్న బోయిన్పల్లి బ్లూకోట్ పోలీసులు, సీఐ సుధీర్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు. దురదృష్టకరం : రవాణా మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమా దం జరిగిన తీరును తెలుసుకున్నారు. సజీవ దహనమైన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఓ ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం కావడం ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగలేదని ఎన్ఎంయూ అధ్యక్షకార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సయీద్ మహమూద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
సజీవ దహనం!
సాక్షి, చెన్నై : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బర్గూర్, ఉక్కులి, మిడ్నాపూర్ ప్రాంతాలకు చెందిన 70 మంది ఆగస్టు 22వ తేదీ విహార యాత్రకు వచ్చారు. మిడ్నాపూర్ నుంచి బస్సులో విహారయాత్రకు బయలు దేరిన ఈ బృందంలో అత్యధిక శాతం మంది 50 ఏళ్లకు పైబడ్డ వారే. అనేక ప్రాంతాలను సందర్శించిన ఈ బృందం శనివారం రామనాథపురం చేరుకుంది. రామనాథపురంలోని రామనాథ స్వామి దర్శనానంతరం అక్కడే వంటా వార్పుతో రాత్రి భోజనం ముగించారు. రాత్రి 11 గంటల సమయంలో కన్యాకుమారికి బయలుదేరారు. ఉదయాన్నే కన్యాకుమారిలో సూర్యోదయాన్ని వీక్షించాలన్న తపనతో వీరందరూ బయల్దేరారు. బస్సులో మంటలు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తిరుప్పులాని సమీపంలో బస్సు వెళుతుండగా, ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును హఠాత్తుగా నిలిపి వేసి, కిందకు దూకేశాడు. గాధ నిద్రలో ఉన్న ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. బస్సు నుంచి దూకేయాలంటూ పెద్దఎత్తున అతడు పెట్టిన కేకలకు కొందరు అప్రమత్తం అయ్యారు. తొలుత స్వల్పంగానే మంటలు చెలరేగడంతో కొందరు హుటాహుటిన బయటకు దూకేశారు. వృద్ధులు కిందకు దిగడంలో ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వంటావార్పునకు ఉపయోగించే సిలిండర్ బస్సులో ఉండడం, నిప్పురవ్వలు దాని మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ సిలిండర్ పేలుడు దాటికి మంటలు పూర్తిగా బస్సును ఆవహించాయి. లోపల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు కాలిన గాయాలతో బయట పడ్డారు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో ఎవ్వరూ లేకపోవడం, అగ్నిమాపక కేంద్రానికి ఎలా సమాచారం ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డ వారు అయోమయూనికి గురయ్యూరు. గాయపడ్డవారు నరకయూతన పడ్డారు. చివరకు అటు వైపుగా వచ్చిన ఓ మోటార్ సైకిలిస్టు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు. సజీవ దహనం హుటాహుటీన తిరుప్వులాని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన అంబులెన్స్‌లు అక్కడికి పరుగులు తీశాయి. గాయపడ్డ వాళ్లను ఆగమేఘాలపై రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంటల్లో బస్సు లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది. అలాగే, పర్యాటకుల వస్తువులన్నీ బుగ్గి పాలయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చినానంతరం ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. భాష సమస్య ఊరు గాని ఊరొచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్‌వాసుల రోదన వర్ణనాతీతం. ఐదుగురు మృతి చెందగా, 8 మంది ఆసుపత్రి పలయ్యారు. మిగిలిన 50 మందిని అధికారులు అక్కున చేర్చుకున్నారు. అయితే, భాషా సమస్యతో నానా తంటాలు తప్పలేదు. మృతుల వివరాలు సేకరించడంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతులు, గాయపడ్డ వారిలో కొందరి పేర్లను పోలీసులు ప్రకటించారు. మృతుల్లో విశ్వనాథ దాసు(68), విశ్వనాథ అతుల్(78), దుర్గా శ్యామాదార్( 48), మాలతి(60), గోపాల్ శతృబాగాల్(70) ఉన్నారు. గాయపడ్డ వారిలో సుబాన్ మాల్ సతీమణి గపూర్ రాణి(40), నిఘార్ చంద్ర పాల్ సతీమణి బిజి బియాపాల్(50), కరుపొత్తమకాల్(68), శక్తి సుగన్(43), గాయత్రి బాగల్( 50), శైలేంద్ర రాజకుమార్ భార్య సూర్య రాజా తదితరులు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సులో చెలరేగిన మంటల తీవ్రత తక్కువేనని, అయితే, సిలిండర్ పేలడంతోనే భారీ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. స్వగ్రామాలకు తరలింపు ఏర్పాట్లు బస్సు మంటల్లో సర్వం కోల్పోయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డున పడ్డ 50 మందికి పైగా పశ్చిమ బెంగాల్ వాసులను ఆదుకునేందుకు రామనాధపురం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరందర్నీ తిరుప్పులానిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్టలను అందజేశారు. వీరిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు రామనాథపురం ఎంసీ అన్వర్‌రాజా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు రైలు ద్వారా వీరందరినీ పంపించేందుకు చర్యలు వేగవంతం చేశారు తమ వద్ద ఉన్న వివరాల మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించారు. -
కారులో వ్యక్తి సజీవ దహనం
సిఫ్‌కాట్ : నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలిగొంది. కారులో మంటలు చెలరేగి సోదరుడి కళ్లెదుటే అన్న సజీవదహనమైన విషాద ఘటన గురువారం హొసూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా, మాస్తికి చెందిన అస్లాం, షమీన్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ జావిద్ (23)కు అదే ప్రాంతంలోని గొల్లపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో అతను తన అన్న సయ్యద్ ఇనాయత్ (24)తో కలిసి గురువారం హొసూరులో ఉన్న బంధువులకు శుభలేఖలు పంచిపెట్టేందుకు మాస్తి నుంచి మారుతీ వ్యాన్‌లో బయల్దేరారు. మార్గం మధ్యలో పెట్రోల్ ట్యాంక్ లీక్ కాగా డ్రైవింగ్ చేస్తున్న సయ్యద్ జావిద్ పసిగట్టాడు. హొసూరులో రిపేరు చేయిద్దామని అన్న పేర్కొనడంతో అలాగే చేరుకొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు హొసూరు-రాయకోట రోడ్డు కూడలిలో వ్యాన్‌లో అకస్మికంగా మంటలు చెలరేగడంతో సయ్యద్జావిద్ కిందకు దూకేశాడు. వెనుకసీట్లో నిద్రిస్తున్న సయ్యద్ ఇనాయత్ మంటల్లో చిక్కుకున్నాడు. కళ్లెదుటే అన్న అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసిన జావిద్ స్పృహకోల్పోయాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించి విఫలమయ్యారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే సయ్యద్ ఇనాయత్ పూర్తిగా సజీవదహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుర్తు పట్టలేని విధంగా మారిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జావీద్‌ను సైతం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో లక్షల విలువైన వ్యాన్ కూడా పూర్తిగా దగ్ధమైంది. కేసు దర్యాప్తులో ఉంది. -
చిట్టి తల్లి ఆశ తీరకుండానే..
రావాడ (భోగాపురం) : తమ్ముడికి రాఖీ కట్టాలన్న ఆ చిట్టితల్లి చిన్ని ఆశ తీరనేలేదు..పెద్దవాళ్లతో పాటు కాలిన గాయాలతో రెండురోజుల పాటు ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భోగాపురం మండలంలోని రావాడ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళ సూర్యకుమారి సజీవ దహనం కాగా ఆమె భర్త కలిదిండి సాంబమూర్తి రాజు, చెల్లెలి కూతురు సుధారాణి, కొడుకు కూతురు జాహ్నవి (7) గాయాల పాలైన విషయం విదితమే. క్షత గాత్రులను చికిత్సనిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేర్చారు. అయితే శనివారం సాంబమూర్తి రాజు చికిత్సపొందుతూ మరణించారు. అలాగే ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చిన్నారి జాహ్నవి మృత్యువుతో పోరాడలేనంటూ కన్నుమూసింది. ఒకే ఇంట్లో ప్రతిరోజూ వరుస మరణాలు సంభవిస్తుండడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఎస్సై దీనబంధు చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు. మాజీ సర్పంచ్ వాసుదేవ వర్మ, ఎంపీటీసీ సభ్యుడు ఎ.సూర్యనారాయణ, ఉపసర్పంచ్ అప్పురభుక్త పైడినాయుడులతో పాటు స్థానికులు, యువకులు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
స్కూలు యజమానికి జీవితఖైదు
‘కుంభకోణం స్కూల్’లో మంటలకు 94 మంది ఆహుతి కేసులో.. చెన్నై: తమిళనాడులోని ఓ స్కూల్లో 2004లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవదహనమైన కేసులో స్కూలు వ్యవస్థాపకుడు పళనిస్వామి సహా 10 మందిని దోషులుగా నిర్ధరిస్తూ తంజావూరు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పళనిస్వామికి ఐపీసీ సెక్షన్లు 427, 467, 197, 304 కింద జీవితఖైదు, సెక్షన్ 304 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. 47 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పళనిస్వామి భార్య, పాఠశాల కరస్పాండెంట్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు విజయలక్ష్మి, వంటమనిషి వసంతిలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు మొత్తం రూ. 3.75 లక్షల జరిమానా విధించారు. విద్యాశాఖ ఉద్యోగులు ఎలిమెంటరీ ఆఫీసర్ బాలాజీ, అసిస్టెంట్ ఎలిమెంటరీ ఆఫీసర్ శివప్రకాష్, పీఏ దురైరాజ్, రాష్ట్ర ఎలిమెంటరీ ఆఫీసర్ తాండవన్కు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షలతోపాటు రూ.10వేల చొప్పున జరిమానా, ఇంజనీర్ జయచంద్రన్కు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ అలీ తీర్పు చెప్పారు. 94 మంది విద్యార్థులను బలిగొన్నందున పళనిస్వామి 940 ఏళ్ల శిక్షను అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. అయితే ఇది సాధ్యం కాదు కాబట్టి 10 ఏళ్ల కఠినకారాగార శిక్షను ఏకకాలంలో అనుభవించాలన్నారు. తీర్పు తర్వాత జయచంద్రన్ జరిమానా చెల్లించి బెయిల్ పొందారు. తీర్పుపై బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని తెలిపాయి. ప్రమాదం జరిగింది ఇలా...: తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో ఉన్న ఓ ఇరుకైన భవనంలో పళనిస్వామి నిబంధనలకు విరుద్ధంగా మూడు స్కూళ్లను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే 2004 జూలై 16న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు మొదటి అంతస్తులో ఉన్న స్కూళ్లకు వ్యాపించాయి. 94 మంది సజీవదహనమవగా మరో 18 మంది తీవ్రగాయలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై తొలుత 24 మందిపై అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ముగ్గురిపై అభియోగాలను ఉపసంహరించుకుంది. -
21కి చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య
ఇంకా ఐదుగురి పరిస్థితి విషమం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మంగళవారం అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. సంఘటన జరిగిన జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వానరాశి వెంకటరత్నం (46) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం కాకినాడ అపోలోలో ఆరుగురు, ట్రస్ట్‌లో ఆరుగురు, సాయిసుధలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఐదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు వైద్యులుచెబుతున్నారు. -
31 మంది పిల్లల సజీవ దహనం
కొలంబియాలో బస్సు ప్రమాదం బొగోటా (కొలంబియా): ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని 31 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో 25 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరంతా ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసు వారే. కొలంబియాలో ఫండాసియాన్ పట్టణంలోని ఒక చర్చిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా బస్సులో చెలరేగిన మంటలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పరారైనా తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. డ్రైవర్ బస్సులో తీసుకెళ్తున్న పెట్రోల్ క్యాన్ కారణంగానే మంటలు చెలరేగాయని గాయాలతో బయటపడినవారు చెప్పారు. -
పరిశ్రమలో అగ్ని ప్రమాదం: వ్యక్తి సజీవదహనం
ఘట్కేసర్, న్యూస్‌లైన్: విస్తారాకుల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రం నుంచి కొండాపూర్ వెళ్లే దారిలో స్థానిక సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ రెండేళ్ల క్రితం నంద పేపర్ ప్రొడక్ట్స్ అనే కాగితపు విస్తరాకుల తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్(30), తన ఇద్దరు మిత్రులతో కలిసి ఈ పరిశ్రమను లీజుకు తీసుకున్నారు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం పరిశ్రమ వద్దకు వచ్చిన నవీన్ కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్లాల్సిన విస్తరాకుల బండిళ్లను ట్రాలీ ఆటోలో లోడ్ చేసుకున్నాడు. తెల్లవారుజామునే తాను బయలుదేరుతానని చెప్పడంతో మిగిలిన వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం పరిశ్రమలోని ఓ గదినుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందిచారు. ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసింది. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా నవీన్ మృతిచెంది కనిపించాడు. ప్రమాదానికి తెలియరాని కారణాలు ఈ ప్రమాదానికి కారణాలు తెలియరావడం లేదు. షార్ట్‌సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. పరిశ్రమలోని విస్తారాకుల లోడ్‌పై ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పడి ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు చెప్పారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువుర్ని కంటతడి పెట్టించింది. -
విద్యాదాఘాతంతో విద్యార్థి సజీవ దహనం
తనికెళ్ల (కొణిజర్ల), న్యూస్‌లైన్: తెగిపడిన ఎల్టీ విద్యుత్ వైరు తగలడంతో ఓ విద్యార్థి సజీవంగా దహనమయ్యాడు. ఈ విషాద ఘటన తనికెళ్లలోని బ్రౌన్స్ కళాశాల సమీపంలో బుధవారం జరిగింది. వైరా సీఐ జె.దేవేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం...రఘునాధపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మూడ్ మోహన్(17) ఖమ్మంలోని ప్రయివేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గృహ ప్రవేశ వేడు క కోసమని అతడు ఇటీవలే ఇంటికి వచ్చాడు. మిరప తోట చూసొస్తానంటూ తండ్రితో చెప్పి మోహన్ బుధవారం ఉదయం బయల్దేరాడు. సమీపంలో 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడి ఉంది. దానిని అతడు గమనించలేదు. బంధువులకు పండ్ల పుల్లలు తెంపేందుకని మోహన్ పక్కకు వంగడంతో.. విద్యుత్ వైరు తగిలింది. విద్యుదాఘాతంతో అతను పడిపోయాడు. మంటలు శరీ రానికి అంటుకుని పైగి ఎగిసాయి. మంటలు ఎందుకు వస్తున్నాయో చూసేందుకని స్థానికులు, సమీపంలోగల బ్రౌన్స్ కళాశాల సెక్యూరిటీ సి బ్బంది వెళ్లి, అక్కడి దృశ్యాన్నిచూసి దిగ్భ్రాంతులయ్యారు. అప్పటికే మోహన్ మంటల్లో పూర్తిగా కాలిపోయాడు. ఈ సమాచారమందుకున్న తండ్రి సక్రాం, తల్లి సేవురీ, బంధువులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిం చారు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే కాలిపోవడాన్ని చూసి, వారు గుండె పగిలేలా రోదించడం.. చూపరులకు కంట తడి పెట్టించింది. గృహ ప్రవేశ సంబరం తీరకుండానే... సక్రాం, సేవురీ దంపతులకు మోహన్, కూతురు మౌనిక ఉన్నారు. కొద్దిపాటిపొలాన్ని సాగు చేస్తూ, వారిద్దరినీ సక్రాం చదివిస్తున్నాడు. అతడు ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించాడు. సోమవారం రాత్రి గృహ ప్రవేశ వేడుక జరిగింది. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. బంధువులతో మంగళవారం రాత్రి వరకూ కళకళలాడిన ఆ ఇల్లు.. తెల్లవారేటప్పటికి విషాదమయంగా మారింది. కొడుకు పూర్తిగా కాలిపోయిన విషయం తెలియని తల్లి సేవురీ.. ‘నా కొడుకుని ఒక్కసారి చూపించండి’ అంటూ, రోదిస్తుండడం స్థానికులకు కన్నీరు తెప్పించింది. ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్షమే కారణమంటూ ఆందోళన మోహన్ మృతికి స్థానిక ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యమే కారణ మంటూ వెంకటాయపాలెం వాసులు కళాశాల ఎదుట రాష్ట్రీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తెగిపడిన విద్యుత్ లైన్ నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు కరెంటు సరఫరా అవుతోందని, వైరు మంగళవారమే తెగిపడిన విషయం కళాశాల యాజమాన్యానికి తె లుసని, వారు ట్రాన్స్‌కో సిబ్బందికి చెప్పినా కరెంట్ సరఫరా నిలిపివేయలేదని ఆందోళనకారులు అన్నారు. మోహన్ దుర్మరణానికి ఇటు కళాశాల యాజమాన్యం, అటు ట్రాన్స్‌కో సిబ్బంది బాధ్యులవుతారని అన్నారు. దీనిపై వారు తమకు సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు పట్టుబట్టారు. తగిన చర్యలు తీసుకుంటామంటూ వారికి సీఐ దేవేం దర్ రెడ్డి నచ్చచెప్పి పంపించేశారు. మోహన్ తండ్రి సక్రాం ఫిర్యాదు మేరకు 304ఎ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ వి.రామలింగారెడ్డి తెలిపారు. -
వృద్ధురాలి సజీవ దహనంతో లక్నెపల్లిలో విషాదం
నర్సంపేట, న్యూస్‌లైన్ : కొడుకు తలకొరివి పెడితే పున్నామ నరకం నుంచి బయటపడొచ్చనే విశ్వాసంతో ఓ మహిళ బాలుడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. అయితే విధి వక్రించడంతో ఉంటున్న ఇల్లుకే నిప్పంటుకుని.. చితి మంటగా మారి ఆమె సజీవ దహనమైంది. తల్లి అకాల మరణంతో పెంపుడు కొడుకు రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట వుండలం లక్నెపల్లి గ్రావూనికి చెందిన గజ్జె కొంరవ్ము(60), కొమురమ్మ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో తలకొరివి పెట్టేందుకైనా కొడుకు ఉండాలనే విశ్వాసంతో బంధువుల కుమారుడు సమ్మయ్యను దత్తత తీసుకున్నారు. వారికి పక్కపక్కనే రెండు ఇళ్లు ఉన్నాయి. కొమురమ్మ నిద్రిస్తున్న పెంకుటింట్లో సోవువారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు ఎగిసి ఆమె సజీవ దహనమైంది. ఎదురుగా ఉన్న సమ్మయ్యతోపాటు చుట్టుపక్కల వారు గ్రహించి వుంటలా ఆర్పే ప్రయుత్నం చేసినా ఆరకపోవడంతో ఫైర్ స్టేషన్‌కు సవూచారం అందించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని వుంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలానికి టౌన్ సీఐ వాసుదేవరావు చేరుకుని విచారణ జరిపారు. డీసీసీ అధ్యక్షుడు దొంతి వూధవరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ పెద్ది సుదర్శన్‌రెడ్డి వుృతురాలి కుటుంబాన్ని పరావుర్శించారు. తలకొరివి పెట్టాలని కోరుకుంటివే అవ్వా.. ‘నేను నీకు తల కొరివి పెట్టాలని కోరుకుంటివి కదా అవ్వా.. తల కొరివి పెట్టకుం డానే తగలబడితివా అవ్వా..’ అని సజీవ దహనమైన తల్లి మృ తదేహం వద్ద బోరున విలపించాడు. ఈ ఘటనతో లక్నెపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తెల్లారిన బతుకులు
శంషాబాద్, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతి లేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొల్లలు. గురువారం తెల్లవారుజామున అశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్‌లో ఆందోళన నెలకొంది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెత్తి చూడని అధికారులు అశ్రీత పరిశ్రమలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుం చి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలకు వెల.. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రా ణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు సహకరిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యజమాని అరెస్టు.. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకున్నాడు. -
మహిళా సర్పంచ్ సజీవదహనం
మహబూబ్‌నగర్: జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌పై కొందరు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మద్దూరు మండలం మన్నాపూర్‌లో ఈ దారుణం జరిగింది. మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మ పొలం నుంచి వస్తుందడగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె సజీవదహనం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతిపై ఓ యువకుడు ఈరోజే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువతికి మూడు రోజుల్లో పెళ్లి. నవీన్ అనే పెయింటర్ ప్రేమిస్తున్నానని రేవతి అనే యువతి వెంటపడుతున్నాడు. ప్రేమ తిరస్కరించడంతో ఆ యువతి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆ యువతి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.