పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా రాజావీధిలో కాలిన స్థితిలో మృతదేహం
అర్ధరాత్రి తిరువళ్లూరులో కలకలం
హత్యకోణంలో పోలీసుల విచారణ
తిరువళ్లూరు: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా రాజావీధిలో కాలిన స్థితిలో మృతదేహం ఉన్న ట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరం పూర్తిగా కాలిపోయి గుర్తుప ట్టడానికి వీలులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మృ తదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరువళ్లూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి కోర్టు విశ్రాంత ఉద్యోగి కృష్ణమూర్తి(70)గా పోలీసులు గుర్తించారు. ఇతన్ని ఎవరైనా హత్య చేశారా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.