విద్యుదాఘాతంతో రైతు సజీవదహనం | Farmer Burned alive with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు సజీవదహనం

Published Wed, Mar 23 2016 3:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

విద్యుదాఘాతంతో రైతు సజీవదహనం - Sakshi

విద్యుదాఘాతంతో రైతు సజీవదహనం

ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో కోండ్ర నర్సయ్య(64) విద్యుదాఘాతంతో మంగళవారం సజీవ దహనమయ్యూడు.

తెగిపడిన 11కేవీ వైరు
ద్విచక్రవాహనంతో వెళ్తుండగా సంఘటన

 
 నిర్మల్(మామడ): ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో  కోండ్ర నర్సయ్య(64) విద్యుదాఘాతంతో మంగళవారం సజీవ దహనమయ్యూడు. నర్సయ్య ఉదయం తన చేనులో నువ్వు పంటకు నీరందించిన అనంతరం తన ద్విచక్ర వాహనంపై మొక్కజొన్న చొప్పను తీసుకుని ఇంటికి బయల్దేరాడు. చేను సమీపంలో ప్రమాదవశాత్తు 11కేవీ వైరు తెగి నర్సయ్యపై పడింది. మొక్కజొన్నగడ్డి, పెట్రోల్ కారణంగా మంటలు లేచాయి. ఘటనాస్థలంలోనే సజీవ దహనమయ్యూడు. సమీపంలోని రైతులు గమనించి సంఘటనా స్థలంలోకి చేరుకుని మంటలు నీటితో ఆర్పివేశారు.  

 ప్రాణం తీసిన ఉడుత..
 ఉడుత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. 11 కేవీ విద్యుత్ వైరుపైకి వెళ్లిన ఉడుత ఇన్సులెటర్ పిన్‌కు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. ఇన్సులేటర్ పిన్ పగిలిపోయింది. దీంతో స్తంభంపై వైరు వద్ద మంటలు వచ్చి తెగింది. అదే సమయంలో వస్తున్న రైతు నర్సయ్యపై పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఉడుత కూడా మృతిచెంది ఉంది. కాగా, గత ఏడాది నవంబర్‌లో నర్సయ్య కుమారుడు ఇదే పంట చేనుకు నీరందించేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో చనిపోయూడు. నర్సయ్యకు భార్య, మరో కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement