అక్రమ విద్యుత్‌ మోటార్లు స్వాధీనం | illegal electrical motors along the canal | Sakshi
Sakshi News home page

అక్రమ విద్యుత్‌ మోటార్లు స్వాధీనం

Published Mon, Jan 9 2017 11:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

అక్రమ విద్యుత్‌ మోటార్లు స్వాధీనం - Sakshi

అక్రమ విద్యుత్‌ మోటార్లు స్వాధీనం

► సింగసముద్రం కాలువ వెంట విద్యుత్‌ మోటార్లతో నీటి మళ్లింపు

ఎల్లారెడ్డిపేట: సింగసముద్రం కాలువ వెంట అక్రమంగా విద్యుత్‌ మోటార్లను అమర్చి నీటిని మళ్లిస్తున్న మోటార్లను ఆయకట్టు రైతులు స్వాధీనం చేసుకొని ఆదివారం గ్రామపంచాయతీకి అప్పగించారు. మండలంలోని బొప్పాపూర్‌ శివారులో గల సింగసముద్రం ఆయకట్టు కింద ఆరు గ్రామాల పరిధిలో 2200ల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. కాలువల వెంట కొంతమంది రైతులు అనుమతులు లేకుండా విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మళ్లిస్తుండగా గుర్తించిన రైతులు వాటిని స్వాధీనం చేసుకొని గ్రామపంచాయతీకి తరలించారు.

కొంతకాలంగా రాత్రిపూట రైతులు అక్రమంగా బిగించిన మోటార్ల ద్వారా నీటి దొంగతనానికి పాలుపడుతున్నారు. అక్రమ నీటి వాడకానికి పాల్పడుతున్న రైతులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement