release of water
-
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించామన్నారు.మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్‌తోపాటు ఏఎంఆర్పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్‌రెగ్యులేటర్ ప్యానల్‌బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్విచ్ ఆన్‌చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేతసాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్‌ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/గద్వాల: ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో జల సవ్వడి మొదలైంది. ఎగువ కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ నిండటంతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. నారాయణపూర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో జూరాలకు 1.2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. శ్రీశైలానికీ ప్రవాహాలు క్రమం గా పెరుగుతున్నాయి. ఎగువ నుంచి వరద మరిం త పెరగనుండటంతో శుక్రవారం ఉదయానికి ప్రవాహాలు జోరందుకోనున్నాయి. కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్‌లను వరద ముంచెత్తుతోంది. ఆల్మట్టిలోకి గురువారం ఉదయం 1.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. రాత్రికి మరిం త పెరిగి ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 1.53 లక్షల క్యూసెక్కుల దాకా దిగువకు వదులుతున్నారు. దాంతో జూరాలకు గురువారం ఉదయం 27వేల క్యూసెక్కులున్న వరద సాయంత్రానికి 90 వేల క్యూసెక్కులకు, రాత్రికల్లా 1.2 లక్షలకు పెరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ కూడా 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.84 టీఎంసీలకు చేరుకుంది. దాంతో మొత్తంగా లక్ష క్యూసెక్కులను దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం సైతం నిండటంతో 68 వేల క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేశారు. దీంతో నేడో రేపో శ్రీశైలానికి భారీగా వరద చేరుకునే అవకాశం ఉంది.శ్రీశైలం డ్యామ్‌లో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 29.13 టీఎంసీల నిల్వలున్నాయి. గురువారం ఎగువ జూరాల జల విద్యుత్క్రేందంలో 6 యూనిట్లు ప్రారంభించి 240 మెగావాట్లు, లోయర్ జూరాలలో 4 యూనిట్లు ప్రారంభించి 160 మెగావాట్లు ఉత్పత్తి చేశారు. జూరాలకు భారీ వరద వస్తుండటంతో ప్రభుత్వం ఆదేశం మేరకు దాని పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకూ 73,898 క్యూసెక్కుల వరద వస్తోంది. 68,643 క్యూసె క్కులు దిగువకు వదులుతున్నారు. దాంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
సాగర్‌కు పెరిగిన నీటి ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్‌కు 70,054 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 150.74 టీఎంసీలకు పెరిగి.. నీటిమట్టం 520.8 అడుగులకు చేరుకుంది. మరో 70 అడుగుల మేర (162 టీఎంసీలు) నీళ్లు వస్తే సాగర్ పూర్తిగా నిండుతుంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి 7,536 క్యూసెక్కులు నీరు చేరుతుండటంతో నీటి నిల్వ 11.64 టీఎంసీలకు చేరుకుంది. సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన 44 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు, సుంకేసుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 13,437 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి 57,437 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 12 టీఎంసీలు వస్తే శ్రీశైలం జలాశయం నిండనుంది. -
అక్రమ విద్యుత్ మోటార్లు స్వాధీనం
► సింగసముద్రం కాలువ వెంట విద్యుత్ మోటార్లతో నీటి మళ్లింపు ఎల్లారెడ్డిపేట: సింగసముద్రం కాలువ వెంట అక్రమంగా విద్యుత్ మోటార్లను అమర్చి నీటిని మళ్లిస్తున్న మోటార్లను ఆయకట్టు రైతులు స్వాధీనం చేసుకొని ఆదివారం గ్రామపంచాయతీకి అప్పగించారు. మండలంలోని బొప్పాపూర్ శివారులో గల సింగసముద్రం ఆయకట్టు కింద ఆరు గ్రామాల పరిధిలో 2200ల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. కాలువల వెంట కొంతమంది రైతులు అనుమతులు లేకుండా విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మళ్లిస్తుండగా గుర్తించిన రైతులు వాటిని స్వాధీనం చేసుకొని గ్రామపంచాయతీకి తరలించారు. కొంతకాలంగా రాత్రిపూట రైతులు అక్రమంగా బిగించిన మోటార్ల ద్వారా నీటి దొంగతనానికి పాలుపడుతున్నారు. అక్రమ నీటి వాడకానికి పాల్పడుతున్న రైతులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల
మద్దిపాడులోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 50 క్యూసెక్కుల నీటిని గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో.. అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ అంశంపై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు రావడంతో.. రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాల్వను పరిశీలించి మరో 50 క్యూసెక్కులను త్వరలోనే విడుదల చేస్తామని ఏఈలు తెలిపారు. -
నల్లవాగు నుంచి నీటి విడుదల
ఎమ్మెల్యే కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ రాములునాయక్ హాజరు కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నుంచి రబీ సాగు కోసం ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్సీ రాములునాయక్, స్థానిక ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. రబీ ప్రాజెక్టు కోసం నీటిని విడుదల చేసేందుకు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవలే నల్లవాగును సందర్శించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రాజెక్టు కాల్వలను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. అనంతరం రూ.20 లక్షలతో పూడికతీత, ఇతర మరమ్మతు పను లు చేశారు. ఇవి పూర్తి కావడంతో ఆయకట్టు ప్రధాన కాల్వ ద్వారా నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 17న నల్లవాగు నుంచి నీటిని విడుదల చే యాలని అధికారులు నిర్ణయించారని తెలిపా రు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భం గా ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రైతుల అవసరాల మే రకు అధికారులు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమం లో నీటి పారుదల శాఖ ఎస్ఈ సురేంద్ర, డీఈఈ ధన్రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్క ర్ సేట్, సీడీసీ చైర్మన్ నర్సిం హారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మురళీయాదవ్, మోహిద్‌ఖాన్, నాయకులు గుండు మోహన్, సర్పంచ్‌లు అప్పారావు షెట్కార్, రాములు, ఎంపీటీసీలు గోలీ రాములు, కిష్టాగౌడ్, కాంగ్రెస్ నాయకులు బి.పోచయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, దుర్గారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రప్ప, దాడె సాయిలు పాల్గొన్నారు. సమయ పాలన పాటించరా...? ఎమ్మెల్సీ రాములునాయక్ సమయపాలన పాటించడం లేదంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనతో గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఎమ్మెల్యే కిష్టారెడ్డి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాములునాయక్ వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు గుండు మోహన్ ఎమ్మెల్యేతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మె ల్సీ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మె ల్సీ అక్కడకు రావడంతో ఆయనతో గొడవకు దిగేందుకు యత్నించారు. మీ కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నాం.. సమయపాలన పాటించరా? అని వాదించారు.దీంతో అ క్కడ ఉన్న అధికారులు టెన్షన్‌కు గురయ్యారు. కానీ వీరి మాటలను ఎమ్మెల్సీ పెద్దగా పట్టిం చుకోకపోవడంతో కార్యక్రమం సాఫీగా జరి గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
నేటి నుంచి కృష్ణా డెల్టాకు నీరు
విజయవాడ బ్యూరో: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం ఆదివారం ఉదయం నుంచి మూడో విడత నీటిని విడుదల చేయాలని ఇంజనీర్ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు 2.88 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయనున్నారు. ఈ నీటిని కేవలం తాగు నీటి అవసరాలకే వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం కృష్ణాడెల్టా అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా...మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర రిజర్వాయర్లకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఆల్మట్టిలో శనివారం సాయంత్రం 50,328 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, ఆదివారం ఇన్‌ఫ్లో 52,063గా ఉంది. తుంగభద్ర డ్యాంకు ఆదివారం ఉదయానికి 42,726 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల రిజర్వాయర్‌కు 250 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జూరాల, నారాయణపూర్, శ్రీశైలం రిజర్వాయర్లు నిండి నాగార్జునసాగర్ జలాశయానికి నీరు చేరాలంటే భారీ వర్షాలు పడాల్సిందే. -
కరువుఛాయలు
- జిల్లాలో జాడలేని వానలు - దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ రైతులు - ఇరవై శాతం మించని సాగు - అదును దాటుతోందని అన్నదాతల ఆందోళన కరీంనగర్ అగ్రికల్చర్ : కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప.. వరుణుడు మాత్రం కరుణించడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లున్న రైతులు కాస్తాకూస్తో సాగు చేసినా.. కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో వేసిన పంటలు కాస్తా ఎండిపోతున్నాయి. వర్షాలు లేక.. కరెంట్ ఉత్పత్తి తగ్గిపోయిందని, ఇందులో తామేమీ చేయలేమని విద్యుత్ అధికారులు చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కాలువల కింది రైతులు కూడా ఈసారి నీటి విడుదల ఉంటుందో.. లేదోనని అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం (ఇప్పటివరకు) 194 మిల్లీమీటర్లు కాగా.. గతేడాది 208.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ సంవత్సరం మాత్రం 83.6 మిల్లీమీటర్లకు మించలేదు. అంటే.. 57 శాతం లోటు ఏర్పడింది. గ్రామాల్లో కప్పతల్లి ఆడుతున్నా.. ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా చినుకు జాడే కరువైంది. రోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. రైతన్నల ఆశలతో దోబూచులాడుతున్నాయి. వెరసి అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా ఆశించిన వర్షం కురవలేదు. మరోవైపు అదునుదాటుతోంది. ఈ క్రమంలో రెండుమూడు భారీ వర్షాలు కురిస్తే తప్ప రైతులు ముందుకు కదలడం కష్టంగా ఉంది. రోహిణి, మృ గశిర, ఆరుద్ర కార్తెలు ముగిశాయి. ఆదివారం నుంచి పునర్వసు మొదలైంది. ఈ కార్తెలో కాలం పోతే పత్తి, వరి సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. అదును దాటితే ఆరుతడి పంటలే మేలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తుండటం కరువుకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఆరుతడి విత్తనాల కోసం ప్రభుత్వ ఆమోదానికి జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. జిల్లావ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 194 మిల్లీమీటర్లు కాగా.. రెండు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో లోటు, 27 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,18,349 హెక్టార్లు కాగా ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు జాడలేని వర్షాలు.. వీటికితోడు కరెంట్ కోతలు.. వెరసి ఖరీఫ్ సాగును ఆగమ్యగోచరంగా మార్చింది. పత్తి మొక్కలు మొలిచి ఎండిపోతుండటంతో వాటిని బతికించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కూలీలతో నీరు పోయిస్తున్నారు. ఈనెల 4న 29 మండలాల్లో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 5న 44 మండలాల్లో 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక మోస్తరు వర్షంగానే వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చాయని పేర్కొంటున్నారు. గడ్డుకాలం.. దాదాపు జూన్‌లోనే 50 శాతం విస్తీర్ణంలో సాగు చేయటం ఆనవాయితీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వ్యవసాయ శాఖ రికార్డులు ప్రకారం కూడా సాగు నామమాత్రంగానే ఉంది. గతేడాది 5,61,049 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయగా.. ఈ సమయం వరకు నాలుగు లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 1,03,072 హెక్టార్లకే పరిమితమైంది. బోర్లు, బావుల్లో నీరున్న రైతులు 1071 హెక్టార్లలో వరి నార్లు పోవారు. 68,536 హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటారు. మరో 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జూలై 15 వరకు వర్షాలు రాకుంటే మూడు దశల్లో విత్తనాలు నాటి పంటలు సాగు చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పనలో తుదిమెరుగులు దిద్దుతున్నారు. -
వంశ‘ధార’పారింది
ప్రధాన కాలువల ద్వారా సాగునీరు విడుదల హిరమండలం: వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎస్ఈ బి.రాంబాబు ముందుగా వంశధార నదికి పూజలు నిర్వహించి నీరు విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారుమడులు ఎండిపోతున్నాయన్న రైతుల కోరికతోపాటు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నీరు విడిచి పెట్టామన్నారు. నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తున్నందు నీటిని రైతులు పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుడికాలువ ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలోని హిరమండలం, ఎల్.ఎన్,పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లోని 62,280 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 104 కిలోమీటర్ల మేర హిరమండలం, జలుమూరు. టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, నరసన్నపేట, మెళియాపుట్టి, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నట్టు ఎస్ఈ పేర్కొన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఈఈ లు రామచంద్రరావు, మన్మథరావు, డీఈఈ ఎస్.జగదీశ్వరరావు, ఏఈఈలు పాల్గొన్నారు. -
మరో వారంపాటు కృష్ణా డెల్టాకు నీటి విడుదల
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మరో వారం రోజులపాటు మూడున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విడుదల చేయాలని కోరిన 10 టీఎంసీల నీటిలో తొలివిడతగా మూడున్నర టీఎం సీలు విడుదల చేశారు. అయితే ఈ నీరు సరిపోదని, ఎక్కువ నీరు ఆవిరి రూపంలో, ఎండిపోయిన నదీ ప్రవాహంలో ఇంకిపోవడం వల్ల వృథా అయిందని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. దీంతో మరో మూడున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం మరో వారం రోజులపాటు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తారు. ఈ మేరకు బోర్టు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాశారు. అయితే కృష్ణాబోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నీటి విడుదల పొడిగింపునకు సంబంధించి కనీసం తమతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల సంఘం చైర్మన్, కృష్ణాబోర్డు తాత్కాలిక అధ్యక్షుడు ఏబీ పాండ్యాకు ఫోన్ చేసి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలు పట్టించుకోకుండా నీటిని విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. కాగా, కృష్ణాబోర్డు ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖ రాయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. -
నేటి నుంచి గలగలా గోదారి
తూర్పు, మధ్య డెల్టాలకు నేడు నీటి విడుదల ధవళేశ్వరం : సుమారు రెండు నెలల అనంతరం గోదారమ్మ పంట కాలువల్లోకి పరుగులు తీయనుంది. తూర్పు,సెంట్రల్ డెల్టాలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. 58 రోజుల విరామం అనంతరం తూర్పు డెల్టాకు, 55 రోజుల విరామం అనంతరం సెంట్రల్ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మధ్య డెల్టాకు, 10.30 గంటలకు తూర్పు డెల్టాకు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి. అయితే రబీ పంట ఆలస్యం కావడంతో ఏప్రిల్ 17 వరకు తూర్పు డె ల్టాకు, ఏప్రిల్ 20 వరకు మధ్య డెల్టాకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. దాంతో కాలువలకు షార్ట్ క్లోజర్ పనులను మాత్రమే చేయడానికి వీలైంది. ఆ పనుల కోసమే ఇంతవరకు నీటిని విడుదల చేయలేకపోయారు. తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు రూ. 50 కోట్ల మేరకు పనులను పూర్తి చేసినట్టు ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం తెలిపారు. సహజ జలాలే ఆధారం కాలువలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వర్షాలు ఇంకా పడకపోవడంతో గోదావరి సహజ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజుకు సుమారు 3,500 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌కు చేరుతుంది. వానలు పడేంతవరకు ఈ నీరే శరణ్యం. ప్రాజెక్టులవారీ క్యాడ్ కమిటీలు వేయాలి రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి క్యాడ్ కమిటీ ద్వారా ఎటువంటి పనులూ జరగడం లేదని, ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి చిన్న పనికీ రాష్ట్రస్థాయి క్యాడ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. రైతులకు అనువుగా ఉండేలా ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలను వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల రైతుల సమస్యలను సకాలంలో గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే పనులు చేపట్టడానికి వీలవుతుందన్నారు. నీటితీరువా నిధులు ఇప్పుడా! నీటితీరువా నిధులు ఇప్పుడు విడుదల చేశారని, కాలువలకు నీళ్లు ఇచ్చే సమయంలో ఈ నిధులు విడుదల చేయడంవల్ల ప్రయోజనమేమిటని త్రినాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది తూర్పు డెల్టాలో ఎ-కేటగిరీ పనులకు రూ.2.85 కోట్లు, బి-కేటగిరీ పనులకు రూ.3.02 కోట్లు నీటి తీరువా నిధులు విడుదలయ్యాయన్నారు. మధ్య డెల్టాలో ఎ-కేటగిరీకి రూ.38 లక్షలు, బి-కేటగిరీకి రూ.3.93 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలువల్లో తూడు తీత పనులు చేపట్టక పోవడంవల్ల వర్షాకాలంలో పంటలు ముంపు బారిన పడే అవకాశం ఉందని అన్నారు. -
డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ నీరు విడుదల
వరంగల్, న్యూస్‌లైన్ : రబీకి ఎస్సారెస్పీ నీటి విడుదల ఖరారైంది. ఎస్సారెస్పీ స్టేజ్-1లోని 3.37 లక్షల ఎకరాల ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండో దశలో కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండడం, కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో స్టేజ్-2కు ఈసారి నీరు విడుదల చేసేందుకు సంశయిస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ నుంచి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఏడు తడులు నీరివ్వనున్నారు. నీటి పారుదల శాఖ నుంచి కూడా ఆ మోదం లభించినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31 వరకు నీటిని ఇవ్వనున్నారు. ఈసారి కూడా ఆన్ ఆఫ్ పద్ధతిలోనే నీరందింస్తామని, 9 రోజులు ఆన్... 6 రోజులు ఆఫ్ ఉంటుందని ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి చె ప్పారు. ఇప్పటికే ఉప కాల్వల వద్ద చిన్నచిన్న మరమ్మతులు, ప్రధాన కాల్వలో మట్టి తొలగిం చడం, చెట్లు తీసేయడం వంటి పనులు అధికారులు చేపట్టారు. డిసెంబర్ 15 వరకు కాల్వలను సిద్ధం చేసి, 20 నుంచి నీటిని ఇవ్వనున్నా రు. అయితే ఖరీఫ్ సీజన్లోనే కావాల్సినంత నీటిని విడుదల చేయడంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. రబీ సీజ న్కు మాత్రం విడుదల చేస్తున్న నీటిని కేవలం పంటల సాగుకే వినియోగించుకోవాలని, రెం డో పంట వేసే రైతులు కొంత మేరకు ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిం చారు. పూ ర్తి ఆయకట్టులో వరిసాగు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.