గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల | Water released from gundlakamma | Sakshi
Sakshi News home page

గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల

Published Thu, Oct 29 2015 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

Water released from gundlakamma

మద్దిపాడులోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 50 క్యూసెక్కుల నీటిని గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో.. అధికారులు నీటిని విడుదల చేశారు.
ఈ అంశంపై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు రావడంతో.. రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాల్వను పరిశీలించి మరో 50 క్యూసెక్కులను త్వరలోనే విడుదల చేస్తామని ఏఈలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement