నల్లవాగు నుంచి నీటి విడుదల
ఎమ్మెల్యే కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ రాములునాయక్ హాజరు
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నుంచి రబీ సాగు కోసం ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్సీ రాములునాయక్, స్థానిక ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. రబీ ప్రాజెక్టు కోసం నీటిని విడుదల చేసేందుకు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవలే నల్లవాగును సందర్శించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రాజెక్టు కాల్వలను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. అనంతరం రూ.20 లక్షలతో పూడికతీత, ఇతర మరమ్మతు పను లు చేశారు.
ఇవి పూర్తి కావడంతో ఆయకట్టు ప్రధాన కాల్వ ద్వారా నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 17న నల్లవాగు నుంచి నీటిని విడుదల చే యాలని అధికారులు నిర్ణయించారని తెలిపా రు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భం గా ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రైతుల అవసరాల మే రకు అధికారులు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేస్తారని స్పష్టం చేశారు.
కార్యక్రమం లో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సురేంద్ర, డీఈఈ ధన్‌రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్క ర్ సేట్, సీడీసీ చైర్మన్ నర్సిం హారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మురళీయాదవ్, మోహిద్‌ఖాన్, నాయకులు గుండు మోహన్, సర్పంచ్‌లు అప్పారావు షెట్కార్, రాములు, ఎంపీటీసీలు గోలీ రాములు, కిష్టాగౌడ్, కాంగ్రెస్ నాయకులు బి.పోచయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, దుర్గారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రప్ప, దాడె సాయిలు పాల్గొన్నారు.
సమయ పాలన పాటించరా...?
ఎమ్మెల్సీ రాములునాయక్ సమయపాలన పాటించడం లేదంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనతో గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఎమ్మెల్యే కిష్టారెడ్డి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాములునాయక్ వస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు గుండు మోహన్ ఎమ్మెల్యేతో చెప్పారు.
దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మె ల్సీ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మె ల్సీ అక్కడకు రావడంతో ఆయనతో గొడవకు దిగేందుకు యత్నించారు. మీ కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నాం.. సమయపాలన పాటించరా? అని వాదించారు.దీంతో అ క్కడ ఉన్న అధికారులు టెన్షన్‌కు గురయ్యారు. కానీ వీరి మాటలను ఎమ్మెల్సీ పెద్దగా పట్టిం చుకోకపోవడంతో కార్యక్రమం సాఫీగా జరి గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.