p.krishna reddy
-
నల్లవాగు నుంచి నీటి విడుదల
ఎమ్మెల్యే కిష్టారెడ్డి, ఎమ్మెల్సీ రాములునాయక్ హాజరు కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నుంచి రబీ సాగు కోసం ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్సీ రాములునాయక్, స్థానిక ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశారు. రబీ ప్రాజెక్టు కోసం నీటిని విడుదల చేసేందుకు కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవలే నల్లవాగును సందర్శించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రాజెక్టు కాల్వలను కలెక్టర్ స్వ యంగా పరిశీలించారు. అనంతరం రూ.20 లక్షలతో పూడికతీత, ఇతర మరమ్మతు పను లు చేశారు. ఇవి పూర్తి కావడంతో ఆయకట్టు ప్రధాన కాల్వ ద్వారా నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 17న నల్లవాగు నుంచి నీటిని విడుదల చే యాలని అధికారులు నిర్ణయించారని తెలిపా రు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భం గా ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రైతుల అవసరాల మే రకు అధికారులు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమం లో నీటి పారుదల శాఖ ఎస్ఈ సురేంద్ర, డీఈఈ ధన్రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్క ర్ సేట్, సీడీసీ చైర్మన్ నర్సిం హారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మురళీయాదవ్, మోహిద్‌ఖాన్, నాయకులు గుండు మోహన్, సర్పంచ్‌లు అప్పారావు షెట్కార్, రాములు, ఎంపీటీసీలు గోలీ రాములు, కిష్టాగౌడ్, కాంగ్రెస్ నాయకులు బి.పోచయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, దుర్గారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రప్ప, దాడె సాయిలు పాల్గొన్నారు. సమయ పాలన పాటించరా...? ఎమ్మెల్సీ రాములునాయక్ సమయపాలన పాటించడం లేదంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనతో గొడవకు దిగేందుకు ప్రయత్నించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఎమ్మెల్యే కిష్టారెడ్డి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాములునాయక్ వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు గుండు మోహన్ ఎమ్మెల్యేతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు ఎమ్మె ల్సీ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో ఎమ్మెల్సీపై కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. ఎట్టకేలకు ఎమ్మె ల్సీ అక్కడకు రావడంతో ఆయనతో గొడవకు దిగేందుకు యత్నించారు. మీ కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నాం.. సమయపాలన పాటించరా? అని వాదించారు.దీంతో అ క్కడ ఉన్న అధికారులు టెన్షన్‌కు గురయ్యారు. కానీ వీరి మాటలను ఎమ్మెల్సీ పెద్దగా పట్టిం చుకోకపోవడంతో కార్యక్రమం సాఫీగా జరి గింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
చేవెళ్లలో రచ్చరచ్చ
చేవెళ్ల/ చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: ‘బట్టలూడదీసి కొడతా.. మీ సంగతి చూస్తా..’ అంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం చేవెళ్లలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా మారింది. ఎమెల్యే చేవెళ్లకు ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రచ్చరచ్చ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. సభ ప్రారంభించబోతుండగా ఎంపీడీఓ చేతులోనుంచి మైకును మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తీసుకున్నారు. శంకర్‌పల్లిలో గురువారం నిర్వహించిన రచ్చబండలో కాంగ్రెస్ నాయకులను పరుష పదజాలంతో దూషిం చినందుకు ఎమ్మెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని, అప్పటివరకూ కార్యక్రమం జరగనిచ్చేది లేదన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘కాంగ్రెస్ నాయకులను దుర్భాషలాడతావా.. ఎమ్మెల్యే హోదాకు తగునా...కులాల మధ్య చిచ్చు పెడతావా... బట్టలూడదీసి కొట్టు చూద్దాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా వేదిక వద్దకు చేరుకున్నారు. కోపోద్రిక్తులైన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నేతల వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను వేదికకు దూరంగా తీసుకెళ్లారు. నేనెవరి జోలికీ పోను.. నా జోలికి వస్తే ఊర్కోను : ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగి స్తుండగానే ఎమ్మెల్యే రత్నం వివరణ ఇచ్చారు. శంకర్‌పల్లిలో తనను అవమానిం చడానికి, విమర్శించడానికి ప్రయత్నించిన వారిని ఉద్దేశించే అలా అన్నాను తప్ప కాంగ్రెస్ నాయకులందర్నీ అనలేదన్నారు. అసభ్య పదజాలంతో దూషించలేదన్నారు. తాను ఎవరి జోలికీ పోనని, తన జోలికి ఎవరైనా వస్తే ఎలా ఊరుకుంటానని అన్నారు. పరిస్థితులను బట్టి అలా అనాల్సి వచ్చింది తప్ప, కావాలని అనలేదని వివరించారు. దీంతో ఇరువర్గాలు శాంతించడంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. కొనసాగుతున్న సీఎం ఫొటో లొల్లి ‘రచ్చబండ’లో ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలో సీఎం ఫొటో వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఫొటో ఫ్లెక్సీల్లో కనిపించకూడదంటూ రచ్చబండ వేదికవద్ద తెలంగాణవాదులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాక్రమానికి ముందే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం బొమ్మ కనిపించకూడదంటూ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్ తదితరులు ఫ్లెక్సీని తొలగిం చడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అంతలోనే తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీనివాస్, అంజయ్య తదితరులు వేదికమీదకు దూసుకువచ్చి ఫ్లెక్సీని చించివేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. చివరికి బ్యానర్లో ఉన్న సీఎం బొమ్మను కనిపించకుండా మలి చివేయడంతో వివాదం సద్దుమణిగింది.