మహిళా సర్పంచ్ సజీవదహనం | Woman Sarpanch burned alive | Sakshi
Sakshi News home page

మహిళా సర్పంచ్ సజీవదహనం

Published Wed, Dec 18 2013 8:37 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

Woman  Sarpanch  burned alive

మహబూబ్నగర్: జిల్లాలో ఓ మహిళా సర్పంచ్పై కొందరు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మద్దూరు మండలం మన్నాపూర్లో ఈ దారుణం జరిగింది.

మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మ పొలం నుంచి వస్తుందడగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె సజీవదహనం అయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురంలో యువతిపై ఓ యువకుడు ఈరోజే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువతికి  మూడు రోజుల్లో పెళ్లి.   నవీన్ అనే పెయింటర్ ప్రేమిస్తున్నానని రేవతి అనే యువతి వెంటపడుతున్నాడు.  ప్రేమ తిరస్కరించడంతో ఆ యువతి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆ యువతి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement