లండన్: లండన్‌లోని భారత సంతతి వ్యక్తికి చెందిన ఇంట్లో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్న కాసేపటికే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలారి్పన అనంతరం ఫస్ట్ ఫ్లోర్‌లో ఐదు మృతదేహాలు పడి ఉండగా గుర్తించినట్లు చెప్పారు.
కాగా, మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ..అది తన బావమరిది ఇల్లు కాగా, అందులో భార్య, ముగ్గురు పిల్లలతో ఆయన ఉంటున్నారన్నారు. మరో ఇద్దరు అతిథులు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు తెలిపారు. ఆ కుటుంబం ఇటీవల బెల్జియం నుంచి లండన్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment