Five dead
-
లండన్‌లో ప్రవాసభారతీయుని ఇంట్లో మంటలు..
లండన్: లండన్‌లోని భారత సంతతి వ్యక్తికి చెందిన ఇంట్లో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్న కాసేపటికే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలారి్పన అనంతరం ఫస్ట్ ఫ్లోర్లో ఐదు మృతదేహాలు పడి ఉండగా గుర్తించినట్లు చెప్పారు. కాగా, మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ..అది తన బావమరిది ఇల్లు కాగా, అందులో భార్య, ముగ్గురు పిల్లలతో ఆయన ఉంటున్నారన్నారు. మరో ఇద్దరు అతిథులు కూడా ఘటన సమయంలో ఉన్నట్లు తెలిపారు. ఆ కుటుంబం ఇటీవల బెల్జియం నుంచి లండన్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. ఐదుగురి మృతి!
బక్సర్: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బిహార్‌లోని బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్‌లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
విష వాయువు పీల్చి.. అయిదుగురు కార్మికులు మృతి
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది. ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు. -
భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఫుల్ స్పీడ్‌లో ఉన్న ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. డెంకానల్ జిల్లాలోని కామక్యానగర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మైనర్ సహా ఐదుగురు మృతి చెందారు. కాగా, మృతులంతా బంగూర గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో పని నిమిత్తం ముక్తపేసి ప్రాంతానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. 5 killed after truck running over-speed hits auto-rickshaw on NH-53 in Kamakhyanagar #Dhenkanal district#Odisha pic.twitter.com/LxVB6sYYkS — Odisha Bhaskar (@odishabhaskar) August 28, 2022 -
అమెరికాలో దారుణం.. జనంపైకి దూసుకెళ్లిన కారు
వాకేషా(అమెరికా): బ్యాండ్ వాయిస్తూ స్థానికుల ర్యాలీ, శాంటాక్లాజ్ టోపీలతో చిన్నారుల కేరింతలతో సందడిగా ఉన్న క్రిస్మస్ పరేడ్ ఒక్క క్షణంలో భీతావహంగా మారింది. పరేడ్‌లో పాల్గొన్న స్థానికులను తొక్కేస్తూ వారిపై నుంచి ఎస్యూవీ వాహనం ఒకటి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ పట్టణం సమీపంలోని వాకేషా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒకతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందా? లేదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. త్వరలో జరగబోయే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరిచుకుని ఇక్కడి స్థానికులు 59వ క్రిస్మస్ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి ర్యాలీగా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్ పరేడ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
కర్ణాటకలో పేలుడు బీభత్సం
శివమొగ్గ: కర్ణాటకలో శివమొగ్గ జిల్లా కేంద్రానికి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు మాత్రం ఆరుగురు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొరుగునున్న దావణగెరె, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఓ మోస్తరు భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భూకంప భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలిపారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు కార్మికులు లారీలో సుమారు 50 బాక్స్‌ల డైనమైట్లు, జిలెటిన్ కడ్డీలను వేసుకుని వస్తుండగా పేలుడు చోటుచేసుకుంది. ఆ తీవ్రతకు లారీ ఆనవాళ్లు లేకుండా పోయింది. మృతదేహాలు మాంసం ముద్దలుగా అర కిలోమీటర్ దూరం వరకు పడిపోయా యి. సమీపంలో ఉన్న బోలెరో వాహనం కాలి బూడిదైంది. చుట్టుపక్కల ఉన్న విద్యుత్ లైన్ల వైర్లు తెగిపడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలతో పాటు కొండలా దట్టమైన దుమ్ము ధూళి కమ్ముకుంది. ఇక్కడ పని చేస్తున్న వారిలో అనేక మంది కార్మికులు బిహార్, అసోంకు చెందిన వారని స్థానికులు తెలిపారు. కనీసం ఆరుగురు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా కనీసం 10–15 మంది చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. కాగా, మృతుల్లో ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంనకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. క్రషర్ యజమాని సుధాకర్, క్వారీ నిర్వాహకుడు నరసింహ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఐదుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
‘సీరం’లో అగ్ని ప్రమాదం
పుణే: కోవిడ్–19 టీకా ‘కోవిషీల్డ్’తయారు చేస్తున్న పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అయితే, ఈ ప్రమాదంతో టీకా తయారీపై ఎటువంటి ప్రభావం ఉండబోదని సీరం యాజమాన్యం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సీరం ఇన్స్టిట్యూట్లోని నిర్మాణంలో ఉన్న ఒక భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. మంటలు, భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగి భవనంలో ఉన్న మరో 9 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో యంత్రాలకు గానీ, పరికరాలకు గానీ నష్టం వాటిల్ల లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. సీరం ఇన్స్టిట్యూట్లోని బీసీజీ టీకా యూనిట్లో ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఘటనకు విద్యుత్ వ్యవస్థలో లోపాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందులో ఎటువంటి కుట్ర కోణానికి అవకాశం లేదన్నారు. ప్రాణనష్టంపై ప్రధాని విచారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు. గత ఏడాది సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించిన ప్రధాని మోదీ..ఘటన జరిగిన భవనంలోని మొదటి అంతస్తులో టీకా తయారీపై సమీక్ష జరిపారని సంస్థ వర్గాలు తెలిపాయి. టీకా ఉత్పత్తికి ఢోకా లేదు ప్రమాదం జరిగిన ఎస్ఈజెడ్–3 భవనం కోవిషీల్డ్ టీకా తయారవుతున్న మంజరి సముదాయానికి కిలోమీటర్ దూరంలో ఉందని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ప్రమాదంతో కోవిషీల్డ్ టీకా తయారీపై ఎటువంటి ప్రభావం లేదని వివరించారు. ఘటనలో ప్రాణనష్టం జరగడంపై విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కోవిషీల్డ్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...
చిలకలూరిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విగత జీవులుగా మారిన ఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగవెంకటేశ్వరరావు (30) కుటుంబ సభ్యులతో కలసి మొక్కు తీర్చుకునేందుకు జూన్ 28వ తేదీన తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపుగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగ వెంకటేశ్వరరావుతో పాటు అతని భార్య తిరుమల సూర్యభవాని (25), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5), బావమరిది కటికిరెడ్డి అనోద్‌కుమార్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న బంధువులు తిరుమల దుర్గా మణికంఠ, గోకరకొండ సాయికిరణ్, గుమ్మళ్ల సాయిదుర్గా తులసి, గుమ్మళ్ల సాయిదుర్గా శైలజ, టి.అనంతలక్ష్మి, ఏడాదిన్నర బాలుడు టి.తేజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన నాగ వెంకటేశ్వరరావు, గాయపడిన దుర్గా మణికంఠ అన్నదమ్ములు. ఇరువురికి డ్రైవింగ్ రావటంతో ఒకరి తరువాత ఒకరు వాహనం నడుపుకొంటూ వచ్చారు. ప్రమాద సమయంలో నాగ వెంకటేశ్వరరావు వాహనం నడుపుతున్నట్లు గాయపడిన వారు తెలిపారు. నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడపటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గాయపడిన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జీసీ రాజరత్నం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమర్‌నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జార్ఖండ్‌లో మావోల పంజా
సిరాయికెలా–ఖర్సవాన్: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాల్చి చంపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని తిరుల్దిహ్ పోలీస్ స్టేషన్ పరిధి (జార్ఖండ్–బెంగాల్ సరిహద్దు)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవినాశ్‡ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మావోయిస్టులు పోలీసు అధికారులను చంపారని అడిషనల్ డీజీపీ మురారి లాల్ మీనా తెలిపారు. అమరుల కుటుంబాలకు రాష్ట్రమంతా అండగా ఉంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తడోకి ఠాణా పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ముర్నార్ అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారని డీజీపీ గిర్దార్ తెలిపారు. -
ఐదుగురు చిన్నారులను మింగిన బావిగుంత
మల్దకల్ (గద్వాల): ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుతున్న ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు ఓ బావి గుంతలో పడి మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్‌దొడ్డిలో సోమవారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో యమున(12), చిన్నారి (11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో 8 ఏళ్ల పాప ఈ ప్రమాదంలో మృతి చెందింది. అలాగే చిన్న కుర్వ వెంకటేశ్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత (11) మృత్యువాతపడింది. సంఘటన జరిగిందిలా.. సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లలు సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్ద నీటిలో ఆడుకోవడానికి వెళ్లారు. నీటిలో కొంత లోపలికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు బావి కోసం తీసిన పెద్ద గుంతలో పడిపోయారు. చిన్నారులు పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగిపోయారు. సుమారు గంట తర్వాత అటువైపు వెళుతున్న రైతులు బావి గుంతలో పడిన చిన్నారులను చూశారు. రాత్రి 7.30 ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురు బాలికలు ఒకేసారి మృత్యువాతపడడంతో నాగర్‌దొడ్డి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
చెరువులో మునిగి ఐదుగురు మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో తీసిన గుంతలు ఐదుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధిలోని కన్నారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నారం గ్రామానికి చెందిన ఖాజా హసన్అలీ జీహెచ్ ఎంసీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు ఖాజా ఇంతియాజ్ అలీ (41) సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి న ఆయన మంగళవారం తండ్రి, భార్య, ముగ్గురు పిల్లలతో కలసి కన్నారానికి వచ్చాడు. కాగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంనగర్‌లో ఉండే అతని బావమరిది మహ్మద్ ఆసిఫ్, మరికొంతమంది బంధువులు కూడా కన్నారం గ్రామానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి ఊరిలో ఉన్న పెద్దచెరువు సమీపానికి వెళ్లారు. ఖాజా ఇంతియాజ్ అలీ కొడుకులు ఇసాక్‌అలీ (12), హైమద్‌అలీ (9), మహ్మద్ ఆసిఫ్ (30), హుదా ఖరీమా(16) అనే బంధువు, వీరితోపాటు వచ్చిన బంధువుల పిల్లలు జియాద్ ఖాదిర్, ఫాతిమా చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఈ సమయంలో ఇంతియాజ్ అలీ, అతని బావమరిది ఆసిఫ్ చేపలు పట్టేందుకు గాలాలు వేస్తున్నారు. కొంత సేపటికి ఇసాక్‌అలీ, హైమద్‌అలీ, హుదా ఖరీమా ఈతకొడుతూ చెరువు లోపలికి వెళ్లారు. వీరు వెళ్లినచోట పెద్ద గుంత ఉండటంతో అందులో మునిగిపోయారు. అది గమనించిన మహ్మద్ ఆసిఫ్, ఇంతియాజ్ అలీ వారిని రక్షించే ప్రయత్నంలో చెరువులోపలికి వెళ్లగా వారు కూడా మునిగి పోయారు. గట్టుపై ఉన్నవారు అరవడంతో వారి డ్రైవర్ సుబాన్ అలీ చెరువులో మునుగుతున్న ఇద్దరు పిల్లలను అతికష్టం మీద కాపాడాడు. మిగతావారు మునిగిపోయారు. సాయం కోసం ప్రయత్నించగా, బంధువులు, గ్రామస్తులు వచ్చేలోపు ఐదుగురు మృత్యువాత పడ్డారు. తండ్రితోపాటు ఇద్దరు కొడుకులు, బావమరిది, వదిన కూతురు.. మొత్తం అయిదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
నల్లజర్ల: ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళుతోంది. అదే సమయంలో రాజమండ్రి వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టి.. పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బస్సు కుడి వైపు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో తునికి చెందిన కాపుశెట్టి నాగేశ్వరరావు భార్య జ్యోతి (33), కుమారుడు శివసాయి (14), కుమార్తె అఖిల సత్య (12), ఆయన అత్త గేలం లక్ష్మి (50), ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన పల్లా సావిత్రమ్మ (62) అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావుతోపాటు బస్సు డ్రైవర్ శేఖర్, కండక్టర్ కుమారి, దూబచర్లకు చెందిన మద్దు రుహాతి, నిడదవోలుకు చెందిన భవానీతోపాటు పలువురు గాయపడ్డారు. మరొక మహిళ తీవ్రంగా గాయపడి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులకు నల్లజర్ల, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స చేశారు. -
తిరిగివెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
అనుకున్న పని పూర్తి చేసి ఇంటికి తిరుగు ప్రయాణమైన వారికి మృత్యువు ఎదురొచ్చింది. జిల్లాలో నల్లజర్ల, ఆకివీడుల వద్ద జరిగిన ఈ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. తల్లిదండ్రులను కాశీ ట్రైన్ ఎక్కించేందుకు దించి నానోకారులో బయలుదేరిన కుటుంబాన్ని లారీ మృత్యువు రూపంలో కబళించింది. మరోచోట మత్స్యమేళాలో పాల్గొని సొంతిళ్లకు మోటార్ సైకిల్‌పై బయలుదేరిన యువకులను ఆర్టీసీ ప్రైవేటు బస్సు పొట్టన పెట్టుకుంది. ఈ రెండు ప్రమాదాలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆ వివరాలు ఇలా.. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నానో కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన జోస్యుల రామజోగేశ్వరశర్మ కుమారుడు సురేష్ భార్య సుధ రెండుమాసాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అస్తికలను కాశీ తీసుకెళ్లేందుకు రామజోగేశ్వరశర్మ, అతని భార్య లక్ష్మి సోమవారం నానోకారులో విజయవాడ బయలు దేరారు. వారితో పాటు ఆయన కుమారుడు సురేష్(30), అతని కుమార్తెలు సువర్చల, నిశ్చల, రామజోగేశ్వరశర్మ కుమార్తె సత్య సుధా దేవి(30), సురేష్ బావమరిది, మల్లేపల్లికి చెందిన పోడూరి సురేంద్ర ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ట్రైన్‌కు జోగేశ్వరశర్మ, లక్ష్మి వెళ్లాల్సి ఉంది. వారిరువురిని విజయవాడలో దించి మిగిలిన వారంతా స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో అనంతపల్లి శివారుకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి కెమికల్ లోడుతో జీడిమెట్ల వెళ్తున్న లారీ మరో లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న నానో కారును ఢీకొంది. ఈ ఘటనలో జోగశ్వరశర్మ కుమార్తె, కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన సత్య సుధాదేవి(30), సురేష్ చిన్న కుమార్తె నిశ్చల(21 నెలలు)అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సురేష్ పెద్ద కుమార్తె సువర్చల, అతని బావమరిది సురేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు! పెద్దాపురానికి చెందిన రామజోగేశ్వరశర్మ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతుందా? అంటే అవుననే అంటున్నారు ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు. రెండు నెలల వ్యవధిలోనే ఆయన కుటుంబంలో నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో కాకర్ల వారి వీధిలో ఉంటున్న రామజోగేశ్వరశర్మ పౌరహిత్యం చేస్తూ ఆ గ్రామస్తులకు మంచిచెడ్డలకు పెద్దదిక్కుగా ఉంటున్నారు. వివిధ దేవాలయాల్లో పూజాధికాలు నిర్వహించడం, పంచాగశ్రవణంలోను, ముహూర్తాలు పెట్టడంలోను ఆయన దిట్ట. ఆయన అడుగుజాడల్లోనే కొడుకు సురేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రెండు నెలల క్రితమే సురేష్ భార్య సంధ్య(28) అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె ఆస్తికలను కాశీలోని గంగలో కలిపేందుకు తీసుకువెళ్తుండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం అర్ధరాత్రి నాటి రోడ్డు ప్రమాదంలో కొడుకు సురేష్, కూతురు సత్య సుధాదేవి, మనవరాలు నిశ్చల మృత్యువాతపడ్డారు. సురేష్‌కు ఇద్దరు ఆడ పిల్లలు చిన్న వాళ్లు కావడంతో వారిని సాకడానికి కొడుక్కి రెండో పెళ్లి చేసే ఉద్దేశంతో కోడలు దహన సంస్కారాలకు ఆయనే తలకొరివి పెట్టి కర్మకాండలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. ఆమె అస్తికలు కాశీ తీసుకెళ్లి గంగలో కలపడానికి కుటుంబం అంతా బయలుదేరగా మృత్యువు వెంటాడిందని బంధువులు చెబుతున్నారు. గుండెలవిసేలా రోదన∙ సురేష్ ఐదేళ్ళ పెద్ద కుమార్తె సువర్చల తండ్రిని జీవచ్చవంలా చూసి స్పృహతప్పి పడిపోయింది. అదే కారులో ప్రయాణిస్తున్న సురేష్ బావమరిది సురేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనిచ్చిన సమాచారంతో కాశీ వెళ్లాల్సిన జోగేశ్వర శర్మ దంపతులు వెనుతిరిగి వచ్చి కొడుకు, కూతురు, మనవరాలు మృతదేహాలు చూసి గుండెలవిసేలా రోదించారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన కోరుకొండ మండలం దోసకాయల పల్లికి చెందిన జోగేశ్వరశర్మ కుమార్తె సత్య సుధాదేవికి భర్త పొన్నా సత్యకృష్ణ వర్థన రాజు, తొమ్మిదేళ్ల కొడుకు కల్యాణ్, ఏడేళ్ల కుమార్తె లక్ష్మి ఉన్నారు. నా పిల్లలకు దిక్కెవరూ అంటూ ఆమె భర్త విలపించారు. మంగళవారం ఉదయం మానవత సంస్థ వాహనంలో మృత దేహాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఐదుగురిని మింగిన ఆక్వా ప్లాంట్
- మొగల్తూరులో ఘోరం - రొయ్యల ఫ్యాక్టరీలో విరజిమ్మిన విష వాయువులు - ఐదుగురి దుర్మరణం సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం పెనువిషాదం చోటుచేసుకుంది. మొగల్తూరు పంచాయతీ పరిధిలోని నల్లంవారి తోట గ్రామంలోని ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ప్లాంట్‌కు సంబంధించిన వ్యర్థాలు నిల్వ ఉండే ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా 30 ఏళ్లలోపు వారే. కుటుంబాలకు వారే ఆధారం. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు ఉడాయించారు. ఐదుగురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నా పోలీసులు పట్టించుకోక పోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫ్యాక్టరీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేసేందుకు గురువారం ఉదయం 8 గంటలకు దినసరి కూలీలుగా పని చేస్తున్న యువకులు సిద్ధమయ్యారు. తొలుత నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22) ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో మొగల్తూరుకి చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) లోపలకు దిగారు. వాళ్లిద్దరూ కూడా బయటకు రాకపోవడంతో మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది యాజమాన్యానికి తెలియజేయగా.. మేనేజర్‌తో పాటు కీలక ఉద్యోగులు అక్కడి నుంచి పారిపోయారు. ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసి గ్రామస్తులు, మృతుల బంధువులు ఘటన స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. అప్పటికే పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల్ని అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేయగా.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. రోజుల తరబడి నిల్వ చేయడం వల్లే.. ఇక్కడికి సమీపంలోని తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సమీప 40 గ్రామాల్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో ఆనంద అక్వా ప్లాంట్ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో వదలటాన్ని నిలుపుదల చేసి తాత్కాలికంగా నిర్మించిన ట్యాంకులోకి వదులుతున్నారు. ట్యాంకులోకి చేరిన వ్యర్థాలను ప్రతిరోజు రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ పనులేవీ చేయడం లేదు. ట్యాంక్‌లోని వ్యర్థాలను బయటకు వదిలి నెల రోజులు దాటిందని చెబుతున్నారు.దీని వల్ల విష వాయువులు వెలువడ్డాయి. -
స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి
-
స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి
విన్నిపెగ్: కెనడాలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కెనడా పశ్చిమ ప్రాంతంలోని సస్కాట్చెవాన్ ప్రాంతంలోని లా లోచి కమ్యూనిటీ పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఓ విద్యార్థి మాట్లాడుతూ.. 'మధ్యాహ్నం సమయంలో ఆరు నుండి ఏడు రౌడ్ల కాల్పులు వినిపించాయి. కాల్పుల శబ్దం వినిపించగానే పాఠశాల బయటకు పరిగెత్తాను. అందరూ షాక్‌కు గురయ్యారు' అని తెలిపాడు. పాఠశాల విద్యార్థి లేదా పూర్వ విద్యార్దే.. స్కూల్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడినట్లు స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. అధికారులు అప్రమత్తమై సమీపంలోని ఇతర పాఠశాలలను మూసివేయించారు. -
వ్యాన్‌పై కూలిన విమానం: ఐదుగురు మృతి
బ్రెజిల్ : బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలోని లోండ్రినాలో రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనంపై మినీ విమానం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. పొలాల్లోని పంటలకు మందులు జల్లేందుకు సదరు మినీ విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారని మీడియా పేర్కొంది. రహదారి పనుల కోసం కార్మికులను తీసుకువెళ్తున్న వ్యాన్‌పై ఈ విమానం కూలిందని మీడియా తెలిపింది. -
పాక్ కాల్పుల్లో ఐదుగురి మృతి
సరిహద్దుల్లో పాక్ బరితెగింపు.. 22 మందికి గాయాలు! జమ్మూ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన సైతం సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని 4 సెక్టార్లలో.. జనావాసాలపై భారీ కాల్పులు, మోర్టార్ బాంబులతో విరుచుకుపడింది. దాడిలో ఒక సర్పంచ్ సహా నలుగురు పౌరులు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారని అధికారికంగా చెప్తున్నా.. 22 మంది గాయపడినట్లు సమాచారం. పాక్ సేనలు ప్రయోగించిన మోర్టారు బాంబు బసోనీలో ఓ కారుపై పడటంతో అందులోని ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయాలపాలై చనిపోయారు. ఘటనాస్థలి వద్ద గుమిగూడిన స్థానికులపైనా పాక్ సేనలు తూటాల వర్షం కురిపించడంతో ఓ బాలుడు సహా ఐదుగురు గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి శనివారం ఉదయం 7:30 వరకు పాక్ రేంజర్లు 60 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్ బాంబులతో సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. పాక్ దళాల దాడిని భారత జవాన్లు దీటుగానే తిప్పికొట్టారు. కాగా, బిహార్‌లోని నవాడాలో ఓ స్కూళ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుగుతుండగా కొందరు దుండగులు బాంబులు విసరడంతో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. -
హైవేపై కుప్పకూలిన విమానం
ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి క్వెరెటరోకు వెళుతోన్న ఎం7 ఎయిరోస్పేస్ ఎల్పీ అనే చిన్నతరహా విమానం ఒక్కసారిగా హైవేపై కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ ప్రయత్నం చేశాడని, ఆ క్రమంలోనే విమానం అదుపు తప్పి నేలను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా పేలిపోయిందని స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారి గెరార్డో చెప్పారు. చనిపోయిరవారి వివరాలు ఇంకా తెలియాల్సిఉందన్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అనంతపురం : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. గుంతకల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు కుటుంబం తన కుమార్తె, అల్లుడితో కలిసి ఉంటోంది. అల్లుడు బాబుకు వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆ కుటుంబం ఈ ఘటనకు పాల్పడింది. ముందుగా చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి చంపి అనంతరం శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శ్రీనివాసులు ఆ సమయంలో ఇంట్లో లేడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
సుమోను ఢీకొన్న రైలు, ఐదుగురి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాయల్పాడు మండలం ఇట్లంవారిపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ సుమోను గుంతకల్లు ప్యాసింజర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుర్రంకొండ మండలం రామాపురం గ్రామస్తులు. కాగా రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.