అనంతపురం : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. గుంతకల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు కుటుంబం తన కుమార్తె, అల్లుడితో కలిసి ఉంటోంది. అల్లుడు బాబుకు వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆ కుటుంబం ఈ ఘటనకు పాల్పడింది. ముందుగా చిన్నారులు నవనీత్, యశశ్రీని గొంతు నులిమి చంపి అనంతరం శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శ్రీనివాసులు ఆ సమయంలో ఇంట్లో లేడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Published Tue, Jul 22 2014 7:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement