వ్యాన్పై కూలిన విమానం: ఐదుగురు మృతి | Five dead in Brazil plane crash | Sakshi
Sakshi News home page

వ్యాన్పై కూలిన విమానం: ఐదుగురు మృతి

Published Thu, Jan 21 2016 9:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

వ్యాన్పై కూలిన విమానం: ఐదుగురు మృతి

వ్యాన్పై కూలిన విమానం: ఐదుగురు మృతి

బ్రెజిల్ : బ్రెజిల్లోని పరానా రాష్ట్రంలోని లోండ్రినాలో రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనంపై మినీ విమానం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారిని  సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది.

పొలాల్లోని పంటలకు మందులు జల్లేందుకు సదరు మినీ విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారని మీడియా పేర్కొంది. రహదారి పనుల కోసం కార్మికులను తీసుకువెళ్తున్న వ్యాన్పై ఈ విమానం కూలిందని మీడియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement