సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి.
ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment