sao paulo
-
బ్రెజిల్లో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత!
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
కరోనా: ప్రపంచంలో ముంబై తొలి స్థానం!
ముంబై: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలోనే సగానికిపైగా ఉన్నాయి. ఇక్కడి ముంబై కరోనా పీడితులకు ఆలవాలంగా నిలుస్తోంది. ఈ మహా నగరంలో సుమారు 0.22 శాతం జనాభా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వాణిజ్య నగరం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులతో ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ప్రపంచ పటంలోకి ఎక్కనుంది. ప్రస్తుతానికైతే ఆ స్థానం రష్యా రాజధాని మాస్కో పేరు మీద ఉంది. కానీ అక్కడ కేసులు తగ్గుముఖం పట్టగా ముంబైలో మాత్రం అందుకు విరుద్ధంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మే 22న ఒక్కరోజే ముంబైలో 1751 కేసులు వెలుగు చూశాయి. (మహారాష్ట్రలో ఆగని కరోనా కల్లోలం) మాస్కో(రష్యా) మినహా మరే ఇతర నగరాల్లోనూ ఒకేరోజు ఇంత మొత్తంలో కేసులు నమోదవలేదు. ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే ముంబై ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న నగరాల్లో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకేట్లు కనిపిస్తోంది. మే నెల ప్రారంభంలో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నెల రెండో వారం ముగిసేసరికి కోవిడ్-19తో అతలాకుతలమవుతున్న న్యూయార్క్ నగరాన్ని దాటేసింది. కానీ న్యూయార్క్ జనాభా ముంబైలో మూడు వంతులు మాత్రమే ఉంటుంది. మాస్కో, సావో పౌలో(బ్రెజిల్) జనాభా పరంగా ముంబైతో సమానంగా సరితూగుతాయి. ఇక మరణాల పరంగా మాత్రం ముంబై మెరుగైన స్థానంలోనే ఉంది. కోవిడ్ కారణంగా ముంబైలో 909 మంది మరణించగా, సావో పౌలోలో 678, మాస్కోలో 1867 మంది చనిపోయారు.(రికార్డు స్థాయిలో కరోనా కేసులు) -
బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
బ్రెసిలియ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల గవర్నర్లు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ల ఆరోపణలపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక రాజధాని సావోపాలోలోని కరోనా వైరస్ మరణాల సంఖ్యను తారుమారు చేశారని మండిపడ్డారు. అంతేగాక అక్కడ మరణాల సంఖ్యపై తనకు సందేహం ఉందని కూడా ఆరోపించారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రజా వైద్య ఆరోగ్య సంస్థ సూచనల మేరకు బ్రెజిల్‌లోని 26 రాష్ట్రాల గవర్నర్లు అనవసరమైన వాణిజ్య కార్యకలాపాల సేవలను నిషేధించారు. దీంతో ఆ దేశ ఆధ్యక్షుడు బోల్సోనారో దీనిపై ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘దేశ ఆర్థిక రాజధాని అయిన సావోపాలోలో మరణించే వారిని మనం కాపాడలేనప్పుడు.. వారిని చనిపోనివ్వండి. ట్రాఫిక్ వల్ల కారు ప్రమాదం జరిగితే ఏకంగా కార్ల తయారి కర్మాగారాన్ని మూసి వేయలేం కదా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సావోపాలోలో మరణాల సంఖ్య అధికంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వల్ల శుక్రవారం నాటికి అక్కడ 1,223 పాజిటివ్ కేసులు నమోదు కాగా 68 మంది మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అక్కడి పరిస్థితుల తీవ్రతను మనం గమనించాలి. కానీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే సమయం ఇది కాదు’ అంటూ మండిపడ్డారు. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..) కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు... ఇతర దేశస్థులు తమ దేశంలో ప్రవేశించకుండా విమానాశ్రయ సేవలను బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిలిపివేసింది. దీనిని సోమవారం నుంచి అమలు చేయలనున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాలల్లో కూడా ఈ చర్యలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం కూడా బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ఇతర దేశాలలో 'క్వాంటిటేటివ్ సడలింపు' విధానాలకు అనుగుణంగా అత్యవసర బాండ్-కొనుగోలకు అధికారాలు పిలుపునిచ్చారు. అదే సమయంలో పేరోల్‌తో చిన్న కంపెనీలకు సహాయం చేయడానికి 40 బిలియన్ల రీయిస్ క్రెడిట్ లైన్‌ను ఆవిష్కరించింది. అలాగే 3 నెలల లాక్డౌన్ నేపథ్యంలో స్వయం ఉపాధి, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం తరపున రూ. 45 బిలియన్ల రీయిస్‌లను అందిస్తుందని, ఇలా మూడు నెలల పాటు మొత్తం రూ. 700 బిలియన్ల రీయిస్‌లను ఇవ్వనున్నట్లు సావోపాలో ఆర్థిక మంత్రి పాలో గూడెస్ శుక్రవారం ప్రకటించించారు. అంతేగాక దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,891 నమోదు కాగా, మరణాలు 92కి చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
దిగ్గజ ఫుట్‌బాలర్ ఇంట్లో తీవ్ర విషాదం
సావో పాలో : ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌ను రెండుసార్లు విశ్వవిజేతగా నిలిపిన మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కేఫు ఇంట్లో విషాదం నెలకొంది. కేఫు 30 ఏళ్ల కుమారుడు డానిలో ఫెలిసియానో డి మోరేస్ ఫుట్‌బాల్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన కేఫు బ్రెజిల్‌లోని సావో పాలోలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కేఫు కుమారుడు డానిలో బుధవారం ఇంట్లోనే ఫుట్‌బాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరి ఆడక అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేఫు అభిమానులు, రియల్ మాడ్రిడ్, ఇంటర్ మిలన్ ఫుట్‌బాల్ జట్లు ఈ విషయం తెలుసుకొని కేఫు కుమారుడు డానిలోకు ఘన నివాళులు అర్పించాయి. ‘యూఈఎఫ్ఏలో ఉన్న ప్రతి టీం తరపున మీ కుమారుడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు’ కేఫునుద్దేశించి యూఈఎఫ్ఏ ట్వీట్ చేసింది. ఈ విషాద సమయంలో ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటుందని యూఈఎఫ్ఏ పేర్కొంది. కేఫు 1990 నుంచి 2006 వరకు ఫుట్‌బాల్ ఆటగానిగా బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1994, 2002 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టుకు కేఫు నాయకత్వం వహించాడు. అతని హయాంలో మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్ జట్టు రెండు సార్లు విజేతగా నిలవడం విశేషం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన కేఫు ప్రస్తుతం ఫిఫా తరపున ఖతార్‌లో జరగనున్న 2022 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
వామ్మో వీళ్లేం దొంగలు.. భారీ సొరంగం
సావ్పౌలో : ఈ సంగతి వింటే బహుషా ప్రపంచంలోని గజదొంగలు వీరేనని అంటారేమో.. ఎందుకంటే వారు బ్యాంకును దోచుకునేందుకు చేసింది మాములు పని కాదు.. ఏకంగా అరకిలోమీటర్పైగా భూగర్భంలో మార్గాన్ని ఏర్పాటు చేశారు. నేరుగా 600 మీటర్ల పొడవు(రెండు వేల అడుగులు) భూమిలోపల తాము దోచుకోవాలనుకున్న బ్యాంకుకు సొరంగం ఏర్పాటుచేసుకున్నారు. కానీ, దురదృష్టం వారిని వెక్కిరించింది. ఆశలు అడియాశలు అయ్యాయి. పోలీసుల చేతికి చిక్కారు. వారిని పట్టుకున్న తర్వాత వారు దొంగతనం చేయడానికి చేసిన సాహసం చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సావ్ పౌలోలోని బ్యాంకో డు బ్రేసిల్ బ్రాంచ్‌లో దొంగతనానికి పాల్పడేందుకు కొంతమంది దొంగలు ప్లాన్ చేశారు. దాదాపు మూడు నెలలపాటు ఎవరికీ తెలియకుండా భూగర్భంలో పెద్ద సొరంగాన్ని బ్యాంకు వరకు తీశారు. అందులోని 317 మిలియన్ డాలర్లను కొల్లగొట్టాలని అనుకున్నారు. ఒక ఇంటిలో నుంచి ఈ సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు. అందులో ఫ్యాన్లు, లైట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. మొత్తానికి పోలీసులు వారి కుట్రను చేధించి 16మంది అనుమానితులను అరెస్టు చేశారు. -
ఒలింపిక్స్ నిర్వహణపై బ్రెజిల్లో నిరసన
సావో పాలో: బ్రెజిల్లో ఒలింపిక్ గేమ్స్ 2016 ప్రారంభవేడుకలు ఘనంగా జరగగా, మరోవైపు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం వద్దంటూ ఆ దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకంగా సావో పాలోలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్రెజిల్ పోలీసులు కనీసం 35 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్ వాణిజ్య కేంద్రమైన పాలిస్టా ఎవెన్యూ వద్ద శుక్రవారం 100 మంది ఆందోళనకారులు గుమికూడారు. సిటీ సెంటర్ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఒలింపిక్స్ ప్రారంభవేడుకలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. -
దుండగుల కాల్పుల్లో 18మంది మృతి
సావోపోలో: బ్రెజిల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సావోపో నగరంలో శుక్రవారం రాత్రి ఈ భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన కొంతమంది దుండగులు ... వివిధ ప్రాంతాల్లో వరుసగా ఈ కాల్పులకు తెగబడ్డారు. ఓ వాహనంలో వచ్చిన వీరంతా.... అక్కడున్న వారిని వివరాలు అడిగి మరీ కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఒసాస్కో బారౌరీ ప్రాంతాల్లో ఈ కాల్పులు సంభవించాయి. అక్కడ ఉన్న ఓ బార్లోకి చొరబడ్డ ఆగంతకులు ..అక్కడవారిని కాల్చి చంపారు. సీసీ టీవీల్లో ఈ దృశ్యాలు రికార్డు కాగా, ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్నిపోలీసులకు వివరించారు. ఈ మధ్య కాలంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇది చాలా దారుణమైన ఘటన అని మృతుల సంఖ్య కూడా ఎక్కువేనని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. అత్యున్నత స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. ఇంతమందిని కాల్చి చంపిన ఘటన ఇంతకుముందెప్పుడూ తాను చూడలేదని ఫోరెన్సిక్ నిపుణులు మీడియాకు తెలిపారు. కాగా బ్రెజిల్ నగరం రియోడెజెనిరోలో చుట్టూ ఉన్న పేదల బస్తీల్లో ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడూ జరగడం అక్కడ సర్వసాధారణం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతూ ఉంటాయని బీబీసి రిపోర్ట్ చేసింది. -
వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!
రియో డిజనిరో: పాలను నుంచి వేరుచేసిన లినోలిక్ ఆమ్లంతో కూడిన వెన్నను తింటే అల్జీమర్స్‌ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వెన్నను తింటే జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ 'ఫోస్ఫోలిపాస్ ఏ2' పనితీరు మెరుగవుతుందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వుఆమ్లాలపై ఈ ఎంజైమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యవంతుల్లో ఈ కణత్వచాలు ఎప్పటికప్పుడూ మారుతూ, కొత్తవి ఏర్పడుతాయి. అదే అల్జీమర్స్ రోగుల్లో కొవ్వు ఆమ్లాలు బంధించి ఉండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్లు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. -
శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ
శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా సినిమా పక్కీలో జరిగింది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శాంసంగ్ ఫ్యాక్టరీలోకి దాదాపు 20 మంది సాయుధ దొంగలు చొరబడి 215 కోట్ల రూపాయల విలువైన 40 వేల సెల్ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని మరీ పరారయ్యారు. నైట్‌షిప్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి కొంత దూరంలో దొంగలు హైజాక్ చేశారు. బస్సులోని ఎనిమిది మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్ఫోన్లు కూడా తీసుకున్నారు. ఏమీ జరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీస్ లెఫ్టినెంట్ విటర్ చావస్స్ తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లారు. అంటే ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి గురైన సెల్ఫోన్లు, కంప్యూటర్ల మొత్తం విలువను ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది. -
హీరో ఆరో ప్లాంట్.. దక్షిణాదిన
స్థలం కోసం అన్వేషణ కంపెనీ సీఈవో పవన్ ముంజాల్ సావో పాలో: హీరో మోటోకార్ప్ ఆరో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా అక్కడ ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పిన ఆయన ఎప్పటికల్లా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు ప్లాంట్లు-ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో టూవీలర్లను ఉత్పత్తి చేస్తోంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 69 లక్షలు. నాలుగో ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్రాణాలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షలు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముంజాల్ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోని హలోల్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఐదో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 18 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు పెరుగుతుంది. కాగా దేశీయంగా తమ వాహనాలు మంచి అమ్మకాలు సాధించగలవన్న ధీమాను పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు. మరోవైపు తాము క్రీడలకు సంబంధించి టీమ్‌ను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని, కేవలం స్పాన్సరర్లుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ క్రీడ అంటే ఇష్టమని వివరించారు. -
(బ్రె)జిల్... జిల్... జిగేల్...
-
హమ్మయ్య.. సమ్మె ఆగింది!
సావో పాలో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వాహకులు ఇప్పుడు ఇలాగే ఫీలవుతున్నారు. ప్రారంభ వేడుకలతో పాటు ఆరంభ మ్యాచ్ కూడా జరిగే ప్రధాన స్టేడియానికి రవాణా సదుపాయం కలిగించే సావో పాలో సబ్వే కార్మికులు గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో అభిమానులను అక్కడికి ఎలా చేర్చాలనే దానిపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. అయితే తమ సమ్మె కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో.. ఏమో కానీ బుధవారం రాత్రి నుంచి తమ ఆందోళనను విరమించుకున్నారు. జీతాల పెంపు కోరుతూ చేస్తున్న ఈ సమ్మె పట్ల 15 వందల మంది సబ్వే కార్మికులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సరైందని నమ్ముతున్నట్టు యూనియన్ అధ్యక్షుడు అల్టినో ప్రెజర్స్ పేర్కొన్నారు. అయితే పూర్తిగా తాము సమ్మెకు దూరం కాలేదని.. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా తిరిగి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రియో ఎయిర్పోర్ట్ సిబ్బంది సమ్మె రియో డి జనీరో: ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభమైన గురువారం నుంచి ఒక రోజు పాటు రియో విమానాశ్రయ సిబ్బంది పాక్షిక సమ్మెకు దిగారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి 70 శాతం మంది విధుల్లో ఉండగా మిగిలిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రపంచకప్ బోనస్, మంచి వాతావరణ పరిస్థితులను కల్పించడం, 12 శాతం జీతాల పెంపును వీరు డిమాండ్ చేస్తున్నారు.