
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది.
ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment