స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి | Five dead, two injured in Canada school shooting | Sakshi
Sakshi News home page

స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి

Published Sat, Jan 23 2016 8:51 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి - Sakshi

స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి

విన్నిపెగ్: కెనడాలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కెనడా పశ్చిమ ప్రాంతంలోని సస్కాట్చెవాన్ ప్రాంతంలోని లా లోచి కమ్యూనిటీ పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై ఓ విద్యార్థి మాట్లాడుతూ.. 'మధ్యాహ్నం సమయంలో ఆరు నుండి ఏడు రౌడ్ల కాల్పులు వినిపించాయి. కాల్పుల శబ్దం వినిపించగానే పాఠశాల బయటకు పరిగెత్తాను. అందరూ షాక్కు గురయ్యారు' అని తెలిపాడు. పాఠశాల విద్యార్థి లేదా పూర్వ విద్యార్దే.. స్కూల్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడినట్లు స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. అధికారులు అప్రమత్తమై సమీపంలోని ఇతర పాఠశాలలను మూసివేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement