
టొరంటో: మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్, గబ్బిలాలను ఏమీ చేయలేకపోవడంపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్(యూఎస్‌ఏఎస్‌కే), ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేసింది. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విక్రమ్ మిశ్రా వివరించిన ప్రకారం కరోనా వైరస్ గబ్బిలం కణజాలంపై దాడి చేయదు. వాటి రోగ నిరోధక వ్యవస్థకు నష్టం చేయదు. గబ్బిలంలోని కణజాలాలతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. గబ్బిలాల్లోని అసాధారణ రోగ నిరోధక శక్తి వైరస్ అలా బంధం ఏర్పర్చుకోవడానికి ఒక కారణం. మెర్స్ వైరస్‌పై పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.