saskatchewan
-
దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?
రెజీనా: కెనడాలోని 1899 నుంచి 1997 వరకు నడిచిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో 751 మంది గుర్తు తెలియని పిల్లల సమాధులు కనుగొన్నారు. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఇక ప్రస్తుత ఘటన జరిగిన ప్రాంతం సస్కట్చేవాన్ రాజధాని రెజీనాకు తూర్పున 87 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ఘటనపై కౌసెస్ చీఫ్ కాడ్ముస్న్ డెల్మోర్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలను నిర్వహిస్తున్న రోమన్ కాథలిక్ చర్చి అక్కడ ఆనవాళ్లు తెలియకుండా గుర్తులను తొలగించింది. దీన్ని నేరంగా భావిస్తున్నాం. ఇది ఓ విధంగా దేశంపై దాడి చేయడం వంటిది. ఇక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలను పూడ్చి పెట్టారో.. వాటన్నింటిని తెలుసుకునే వరకు అన్వేషణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని’ పేర్కొన్నారు. ఇలా వెలుగులోకి.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని ఓ పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి ఏం జరిగిందో.. తెలుసుకోవాల్సిందిగా మత, రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కెనడా ప్రభుత్వం పాఠశాలలో శారీరక, లైంగిక వేధింపులు అధికంగా ఉన్నట్లు, అంతేకాకుండా విద్యార్థులు తమ మాతృభాష మాట్లాడితే వారిపై దాడి చేయడం వంటివి క్రూరమైన చర్యలు కూడా జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. చదవండి: వైరల్:అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి! -
గబ్బిలాలపై కరుణ ఎందుకు?
టొరంటో: మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్, గబ్బిలాలను ఏమీ చేయలేకపోవడంపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్(యూఎస్‌ఏఎస్‌కే), ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేసింది. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విక్రమ్ మిశ్రా వివరించిన ప్రకారం కరోనా వైరస్ గబ్బిలం కణజాలంపై దాడి చేయదు. వాటి రోగ నిరోధక వ్యవస్థకు నష్టం చేయదు. గబ్బిలంలోని కణజాలాలతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. గబ్బిలాల్లోని అసాధారణ రోగ నిరోధక శక్తి వైరస్ అలా బంధం ఏర్పర్చుకోవడానికి ఒక కారణం. మెర్స్ వైరస్‌పై పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. -
స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి
-
స్కూల్లో కాల్పులు: ఐదుగురు మృతి
విన్నిపెగ్: కెనడాలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కెనడా పశ్చిమ ప్రాంతంలోని సస్కాట్చెవాన్ ప్రాంతంలోని లా లోచి కమ్యూనిటీ పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రధాని జస్టిన్ ట్రుడేవ్ తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఓ విద్యార్థి మాట్లాడుతూ.. 'మధ్యాహ్నం సమయంలో ఆరు నుండి ఏడు రౌడ్ల కాల్పులు వినిపించాయి. కాల్పుల శబ్దం వినిపించగానే పాఠశాల బయటకు పరిగెత్తాను. అందరూ షాక్‌కు గురయ్యారు' అని తెలిపాడు. పాఠశాల విద్యార్థి లేదా పూర్వ విద్యార్దే.. స్కూల్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడినట్లు స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. అధికారులు అప్రమత్తమై సమీపంలోని ఇతర పాఠశాలలను మూసివేయించారు.