Bats
-
HKU5-CoV-2: చైనాలో మరో మహమ్మారి!
బీజింగ్: ఐదేళ్ల క్రితం కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా! చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గబ్బిలాల నుంచి హెచ్‌కేయూ5–కోవ్–2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరి, మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా, అలాంటిదేమీ లేదని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంపీవీ) కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఇవి హెచ్‌కేయూ5–కోవ్–2కు సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ గబ్బిలాల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకు, అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నాయి. గాంగ్జౌ లేబోరేటరీ, గాంగ్జౌ అకాడమీ అఫ్ సైన్సెస్, వూహాన్ యూనివర్సిటీ, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం సార్స్–కోవ్–2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోటెన్సిన్–కోవర్టింగ్ ఎంజైమ్(ఏసీఈ2) అనే రిసెప్టర్‌ను ఉపయోగించుకొని కణాలపై దాడి చేసింది. ఫలితంగా కోవిడ్–19 పంజా విసరింది. గబ్బిలాల నుంచి పుట్టిన హెచ్‌కేయూ5–కోవ్–2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అంటే కోవిడ్–19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్‌మిల్‌పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్‌మిల్‌పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఫుల్ డిమాండ్.. వన్డే ప్రపంచకప్‌కు తొలిసారి
అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్ సేన కప్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్ విల్లో బ్యాట్లను వాడుతున్నారు. వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు. బ్యాట్ల తయారీతో కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Heega Kashmir willow Hx 509 cricket bat (Grade 2) is manufactured using selected Kashmir willow and is hand-crafted with utmost precision. The bat is suitable for leather balls.https://t.co/Xzxz6ys3JS#englishwillowbat #kashmirwillowbat #heegasports pic.twitter.com/Vqo7kgGaEs — Heega Sports (@HeegaSports) May 20, 2023 చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా 13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు -
గబ్బిలాలుగా మారి ఆకాశంలో ఎగురుతున్న మనుషులు! వీడియో వైరల్
-
దంచికొడుతున్న ఎండలకు గబ్బిలాలు విలవిల.. చలించిపోయిన గ్రామస్తులు
భువనేశ్వర్: దంచికొడుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక పక్షులు, జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కబటబంధా గ్రామంలో గబ్బిలాలు ఎండ వేడికి విలవిల్లాడిపోతున్నాయి. హీట్ స్ట్రోక్ కారణంగా మృత్యువాత పడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో మూడు రోజుల్లోనే 8 గబ్బిలాలు మరణించాయి. ఈ గ్రామం సమీపంలో దాదాపు 5వేలకు పైగా గబ్బిలాలు మూడు చెట్లపై నివసిస్తున్నాయి. రోజంతా వీటి చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎండదెబ్బకు వందల కొద్ది గబ్బిలాలు నేలపై పడిపోతున్నాయి. గ్రామస్థులు వీటిని చూసి చలించిపోతున్నారు. వాటికి ఉపశమనం కల్పించేందుకు వాటర్ స్ప్రే కొడుతున్నారు. గబ్బిలాలు పవిత్రమైనమని తాము భావిస్తామని, అందుకే వాటిని 20 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని కేశవ్ చంద్ర సాహు అనే స్థానికుడు తెలిపాడు. ఎండ వేడికి తట్టుకోలేక గబ్బిలాలు కిందపడి చనిపోవడం చూస్తుంటే బాధగా ఉందన్నాడు. కాగా.. ఒడిశాలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో ఒడిశాలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు -
Khosta-2: రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్
వాషింగ్టన్: సార్స్–కోవ్–2.. అంటే కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. అచ్చంగా కోవిడ్–19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేవని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్లలో (సార్బీకోవైరస్లు) ఖోట్సా–2, సార్స్–కోవిడ్–2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు చెప్పారు. అధ్యయనం వివరాలను ప్లాస్ పాథోజెన్స్ పత్రికలో ప్రచురించారు. కేవలం సార్స్–కోవ్–2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్ మైఖేల్ లెట్కో చెప్పారు. ఖోట్సా–2 వైరస్ వ్యాపిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్–19, ఖోట్సా–2 లాంటి వైరస్లు ప్రొటీన్ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి. -
Khosta-2: గబ్బిలాల నుంచి మానవాళికి కొత్త వైరస్!
కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నచందాన తయారు అయ్యింది మనిషి పరిస్థితి. కొత్త కొత్త వైరస్లు, వ్యాధుల పేర్లు వినాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు గబ్బిలాల నుంచే మానవాళికి మరో ముప్పు పొంచి ఉందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్ పేరు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే గుర్తించామని, అది ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం.. ఇప్పుడు ఇది మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వైరస్ గనుక మనుషులకు వ్యాపిస్తే.. విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్ పీఎల్ఓఎస్లో పబ్లిష్ చేశారు. కరోనా కంటే డేంజర్! Khosta-2.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్ఫెక్షన్ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. ఖోస్టా-2 అంటే.. ఖోస్టా-2.. సార్స్-కోవ్-2కి చెందిన వైరస్. ఇది కూడా కరోనావైరస్లోనే ఉపవర్గానికి చెందిన వైరస్సే. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు సోకదు. కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు దీని బారి నుంచి తప్పించుకోలేరు. Omicron వేరియంట్ లాగా.. ఈ వైరస్‌లో తీవ్రమైన వ్యాధిని కలిగించే జన్యువులు లేవని పరిశోధకులు అంటున్నారు. కానీ SARS-CoV-2 జన్యువులతో కలిస్తే అది చివరికి మారే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం నిర్వహించిన మైకేల్ లెట్కో. గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్, రకూన్ డాగ్స్, పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్ విజృంభణపై, వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకి రాలేమని ఆయన అంటున్నారు లెట్కో. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత వ్యాక్సిన్లు మానవ కణజాలంపై ప్రభావం చూపెడుతున్న.. నిర్దిష్ట వైరస్ల కోసం రూపొందించబడుతున్నాయని, అన్ని సార్బెకోవైరస్ల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోందని అని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: ఈ దోమలు.. మలేరియాను అడ్డుకుంటున్నాయోచ్! -
హ్యామర్ హ్యాండ్స్..
బేస్‌బాల్ బ్యాట్.. క్రికెట్ బ్యాట్ లాగే చాలా బలంగా ఉంటుంది. గొడ్డలితో నరికితేగానీ ప్రాపర్‌గా విరగదు. అలాంటి బలమైన బ్యాట్స్‌ను తన చేతితో విరగ్గొట్టాడు మార్షల్ ఆర్టిస్ట్ మహమ్మద్ కహ్రిమనోవిక్. హ్యామర్ హ్యాండ్స్‌గా పేరుపొందిన జర్మనీకి చెందిన 63 ఏళ్ల మహమ్మద్.. ఒక నిమిషంలో 68 బ్యాట్స్‌ను విరగ్గొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఇటలీలోని మిలన్లో ఈ ఫీట్ సాధించాడు. కూరగాయలు కట్చేసినంత ఈజీగా అతను బ్యాట్స్ విరగ్గొడుతున్న వీడియోను గిన్నిస్ వరల్డ్రికార్డ్స్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వీడియోను చూసిన కొందరు అతనికి కుడోస్ చెబుతుంటే... ఆ వీడియో చూశాక తమ చెయ్యి నొప్పెట్టిందంటూ మరికొందరు చలోక్తులు విసురుతున్నారు. -
న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ సంచలన విజయం
మౌంట్ మాంగనుయ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సంచలన విజయంతో బోణీ కొట్టింది. ఆతిథ్య న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 3 పరుగుల తేడాతో గెలిచింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు అవసరంకాగా చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. విండీస్ బౌలర్ డీండ్రా డాటిన్ (0.5–0–2–2) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు న్యూజిలాండ్ ఐదు బంతుల్లో 2 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. కేటీ మార్టిన్ (44), జెస్ కెర్ (25)లను డాటిన్ అవుట్ చేయగా... ఫ్రాన్ జొనాస్ రనౌట్ కావడంతో విండీస్ విజయం ఖాయమైంది. అంతకుముందు విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (119; 16 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ సెంచరీ సాధించింది. చదవండి: Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
ఈసారి కరోనా వస్తే ఎలుకల నుంచే!
రెండేళ్ల కింద మొదలైన కరోనా వైరస్ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా ఒక్కటే కాదు.. దీనికి ముందు పంజా విసిరిన సార్స్, మెర్స్ వంటి వైరస్లు గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఇక ముందు ఎలుకల నుంచి కూడా కరోనా వంటి వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ పరిశోధన ఏమిటి, ప్రమాదం ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గబ్బిలాల నుంచి వచ్చినట్టుగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (సార్స్ కోవ్–2) వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్టు ఇప్పటికే గుర్తించారు. చైనాలో ఉండే హార్స్‌షూ రకం గబ్బిలాల్లో కరోనా వంటి వైరస్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఆ గబ్బిలాలు వైరస్‌ను తట్టుకుని సహజీవనం చేస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలోనే మనుషులకు దగ్గరగా ఉండే మరేవైనా జంతువులు, పక్షుల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా, వాటి నుంచి మనుషులకు వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉందా అన్న దానిపై అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. జన్యుపరమైన పోలికలున్న జీవులతో.. మనుషులకు దగ్గరగా ఉండే కోతులు, చింపాంజీలతోపాటు ఇతర జంతువుల్లో.. కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనయ్యే వాటిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. వాటి శరీరకణాల్లో ఏసీఈ–2 రిసెప్టార్ల (కరోనా వైరస్లు శరీర కణాలకు అతుక్కునేందుకు కారణమయ్యే ప్రోటీన్) తీరును పరిశీలించారు. ఆ జంతువులు కరోనాకు ఎంతగా ప్రభావితం అవుతున్నాయి? ఎలా ఎదుర్కొంటున్నాయి? లక్షణాలు ఎలా ఉంటున్నాయి? అన్నది క్షుణ్నంగా గమనించారు. మిగతా అన్ని జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఆ వైరస్‌తో పోరాడుతుంటే.. ఎలుకలు మాత్రం వైరస్‌ను తట్టుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనుకాకుండా వాటిలోని ఏసీఈ–2 రిసెప్టార్లు పరిణామం చెందినట్టు తేల్చారు. వైరస్‌లకు రిజర్వాయర్లుగా.. ఈ ఎలుకల ముందు తరాలు తరచూ కరోనా వంటి వైరస్ల దాడికి గురవడంతో.. వాటిని తట్టుకునేశక్తిని పెంచుకున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రాఫెసర్లు షీన్ కింగ్, మోనా సింగ్ వెల్లడించారు. అందువల్లే శరీరంలో వైరస్ పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా.. ఆ ఎలుకల్లో ఎటువంటి లక్షణాలు, అనారోగ్యం కనిపించడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయం (రిజర్వాయర్లు)గా మారిపోతాయని.. భవిష్యత్తులో ఆ వైరస్లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క ఎలుకలనే కాకుండా.. మరికొన్ని రకాల జంతువులు, పక్షులు కూడా ఇలా పరిణామం చెంది ఉండవచ్చని.. అలాంటి వాటిని గుర్తిస్తే భవిష్యత్తులో ముందు జాగ్రత్తలకు వీలవుతుందని స్పష్టం చేశారు. జూనోటిక్ వ్యాధులే ఇలా.. సాధారణంగా జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లు.. ఇతర జంతువులు/పక్షులు, మనుషులకు వ్యాపించడం వల్ల వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ వైరస్లు ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించే క్రమంలో.. కొన్నిరకాల జంతువులపై ఎక్కువగా, మరికొన్ని రకాలపై తక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇది ఆయా జంతువుల్లో వైరస్ల పట్ల నిరోధకత, జన్యుపరిణామం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ♦జంతువులు ఎక్కువకాలం ఏదైనా వైరస్/ఇతర సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటే.. తమను రక్షించుకునేలా శరీరంలో మార్పులు చేసుకుంటుంటాయి. వాటి తర్వాతి తరంలో ఈ మార్పులు మరింతగా పెరుగుతాయి. అలా అలా సదరు వైరస్/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. ♦మనుషుల్లో కూడా ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి సమకూరింది. కరోనా వైరస్ దాడి ఇలాగే సాగితే.. భవిష్యత్తులో అది ఒక సాధారణ జలుబు స్థాయికి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. -
AP Special: ఈ గ్రామంలో గబ్బిలాలను రుషిపక్షులుగా పిలుస్తారు
వైఎస్సార్ జిల్లా (పులివెందుల రూరల్): ఈ చిత్రంలో మర్రి చెట్టు కొమ్మలకు వేలాడుతున్నవి కాయలు అనుకుంటే పొరపాటుపడినట్లే.. అవి కాయలు కాదండోయ్ గబ్బిలాలు. పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామానికి వెళ్లే రహదారి పక్కన మర్రిచెట్టు కొమ్మలపై ఉన్న గబ్బిలాలను స్థానికులు కెమెరాతో క్లిక్‌మనిపించారు. వీటిని ఈ ప్రాంతంలో కీతరేవులు, రుషి పక్షులుగా పిలుస్తారు. ఇవి ఎక్కడ ఉన్నా పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. కీళ్ల, కాళ్ల నొప్పులు, మూర్ఛవ్యాధి తదితర వాటికి గబ్బిలాల మాంసం తింటే నయమవుతాయని ప్రజల నమ్మకం. ఈ పక్షులు రాత్రివేళల్లో ఆహారం కోసం బయటకు వెళ్లి.. పగటిపూట చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. చదవండి: పేదరికం నుంచి ...అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా -
నిపా వైరస్: పండ్లు కడిగే తింటున్నారా?
థర్డ్ వేవ్‌తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు కడగాల్సిందే! గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్‌ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన. ప్రాథమిక జాగ్రత్తలు ► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం. ► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం. ► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం ► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. లక్షణాలు ► శ్వాసకోశ సమస్యలు, ► జ్వరం ► ఒళ్లు నొప్పులు ► తలనొప్పి ► వాంతులు ► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం. మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. చదవండి: మరోసారి నిపా కలకలం -
జంతువుల నుంచే కరోనా!
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి లీకేజీకి అవకాశం లేదంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. కోవిడ్ తొలిసారిగా బయటపడిన చైనా నగరం వూహాన్‌ను జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ పరిశోధకుల బృందం సందర్శించి తయారుచేసిన ముసాయిదా నివేదిక మంగళవారం విడుదల కానుండగా ఆ ప్రతి ముందుగానే తమకు లభ్యమైందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. వైరస్ మొట్టమొదటగా ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక విషయంతోపాటు పలు ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలను చూపలేకపోయింది. మున్ముందు సంభవించే ఇలాంటి మహమ్మారులను నివారించేందుకు ఈ నివేదికలోని వివరాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్ మొదటగా ఎలా వ్యాపించిందన్న విషయంలో డబ్ల్యూహెచ్‌వో– చైనా నిపుణులు తయారు చేసిన ఈ ముసాయిదా నాలుగు అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు సోకింది. ఇలా జరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఒక వేళ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన పక్షంలో ‘కోల్డ్–చైన్’ఆహారోత్పత్తుల ద్వారా వ్యాపించడం సాధ్యం. కానీ ఇలా జరిగేందుకు అవకాశాలు లేవు. గబ్బిలాలను ఆశ్రయించి ఉండే కరోనా వైరస్లు, కోవిడ్‌కు కారణమైన సార్స్–కోవ్–2కు దగ్గరి సంబంధం ఉంది. అయితే, వీటి మధ్య అంతరం ఉంది. పంగోలిన్లలో ఉండే వైరస్‌కు, కరోనా వైరస్‌తో అత్యంత దగ్గర సంబంధం ఉంది. మింక్‌లు, పిల్లుల్లో వైరస్లు కోవిడ్ వైరస్ రకానికి అత్యంత సమీపంగా ఉంటాయి. ఇవి కూడా ఈ వైరస్ వాహకాలే’అని పేర్కొంది. చైనాలోని హువానన్ మార్కెట్లో మొదటిసారిగా వైరస్ కేసులు బయటపడటంపై ఈ నివేదిక ప్రస్తావిస్తూ..ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని వివరించింది. ఈ మార్కెట్లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరిగిన విషయం ప్రస్తావిస్తూ...వీటి ద్వారానే వూహాన్‌కు కొత్త వైరస్ వచ్చి ఉంటుందని అంచనా వేసింది. డిసెంబర్ 2019లో వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచే మొదటిసారిగా కోవిడ్ మొదలయిందా అనే విషయమై ఈ నివేదిక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనా నగరం వూహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రబలేందుకు కారణమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తదితరులు∙విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకేజీకి అవకాశాలున్నాయన్న వాదనలను బలపరిచారు. ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఈ నివేదిక తయారీపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నివేదిక రూపకల్పనలో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉంది’అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌వో బృందానికి బంధనాలు? వైరస్ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందానికి చైనా ప్రభుత్వం పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేవీ వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్ మార్కెట్లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. -
గబ్బిలాల నుంచి కరోనా: చాలా తక్కువ మార్పులతో..
లండన్: కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనాన్ని పీఎల్ఓఎస్ బయోలజీ జర్నల్ ప్రచురించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కలిగించే సార్స్-కోవ్-2 వైరస్‌లో కూడా అనేక జన్యు రూపాలు ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాపించడం కంటే 11 నెలల ముందే సార్స్-కోవ్-2 వైరస్ ప్రత్యేక జన్యు రూపాన్ని గుర్తించినట్లు తెలిపారు. డీ614జీ మ్యూటేషన్ వైరస్‌లోని మార్పులను ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మిగతా వైరస్ వలే సార్స్-కోవ్-2 వైరస్ కూడా కొన్ని మార్పులతో వ్యాపిస్తుందని స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్ వైరస్ రీసెర్చ్ శాస్త్రవేత్త ఆస్కార్ మాక్లీన్ తెలిపారు. కానీ, ఈ వైరస్ వ్యాప్తి చెందే విధానంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో దాని లక్షణాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని, సార్స్-కోవ్-2 వైరస్ కూడా అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్‌లోని టెంపుల్ యూనీవర్సీటి రచయిత సెర్గిపోండ్ తెలిపారు. సార్స్-కోవ్-2 వైరస్ మానవులకు సోకే సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే ఈ వైరస్ లక్షణాలు ముందుగా గబ్బిలాల్లో అభివృద్ధి చెందుతాయిని ఈ అధ్యయనంలో తెలిపారు. ఇది ప్రధానంగా మానవునిలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. అయితే దేశంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అభివృద్ది చేసి ప్రజలకు అందించాలని గ్లాస్గో యూనివర్సీటి పరిశోధకుడు డేవిడ్ ఎల్ రాబర్గ్సస్ పేర్కొన్నారు. చదవండి: పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి.. -
గబ్బిల్లాల్లో ఎప్పటి నుంచో కరోనా వైరస్..
వాషింగ్టన్ : గబ్బిలాల్లో ఎన్నో దశాబ్దాలుగా గుర్తించకుండా కరోనా వైరస్ ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్ షూ గబ్బిలాలు సార్స్ కోవ్-2 వైరస్‌లకు మూలమని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఈ వైరస్లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (కరోనా : భారత్‌లో మరో రికార్డు ) దీంతో శాస్త్రవేత్తలు వైరస్ మూలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. అసలు ఈ కరోనా ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏంటని చాలా మంది శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. గబ్బిలాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని యూఎస్ ప్రభుత్వ అధికారులు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ నెలలో దీనిని అధ్యయనం చేసేందుకు నిపుణులను చైనాకు పంపింది. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. (గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?) అయితే, ఇంతకుముందు భావించినట్లు గబ్బిలాలనుంచి పాంగోలిన్ల(అలుగు)కు వైరస్ సోకి, వాటి నుంచి మానవులకు వ్యాపించిందనే దానికి ఆధారాలు లభించలేవని తెలిపారు. అలుగులు వైరస్‌కు వాహకంగా పనిచేయడం లేదని కనుగొన్నట్లు చెప్పారు. ఈ పాంగోలిన్లకు మాత్రం గబ్బిలాల ద్వారా వైరస్ సోకి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. -
చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!
లక్నో: మహమ్మారి కరోనా పుట్టుకకు గబ్బిలాలకు సంబంధం ఉందని భావిస్తున్న నేపథ్యంలో... గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గోరఖ్‌పూర్‌లోని బేల్గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చిపడిన ఘటన మంగళవారం ఉదయం బయటపడింది. కరోనా వైరస్ కారణంగా అవి చనిపోయి ఉండొచ్చని స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఎండ తీవ్రతతోనే గబ్బిలాలు చనిపోయానని వెటర్నరీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉత్తర భారతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దాంతో చెరువు కుంటలు ఎండిపోయానని తెలిపారు. నీటికి కటకట రావడంతోనే అవి ప్రాణాలు విడిచాయని చెప్పారు. స్థానికంగా ఉండే ప్రజలు పాత్రల్లో వాటికి నీరు ఏర్పాటు చేయాలని కోరారు. మృత గబ్బిలాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ పంపించామని, వాటి మృతికి గల కచ్చితమైన వివరాలు వెల్లడవుతాయని డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ అన్నారు. -
గబ్బిలాలపై కరుణ ఎందుకు?
టొరంటో: మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్, గబ్బిలాలను ఏమీ చేయలేకపోవడంపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్(యూఎస్‌ఏఎస్‌కే), ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేసింది. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విక్రమ్ మిశ్రా వివరించిన ప్రకారం కరోనా వైరస్ గబ్బిలం కణజాలంపై దాడి చేయదు. వాటి రోగ నిరోధక వ్యవస్థకు నష్టం చేయదు. గబ్బిలంలోని కణజాలాలతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. గబ్బిలాల్లోని అసాధారణ రోగ నిరోధక శక్తి వైరస్ అలా బంధం ఏర్పర్చుకోవడానికి ఒక కారణం. మెర్స్ వైరస్‌పై పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. -
అమితాబ్ ట్వీట్.. మండిపడ్డ అభిమానులు
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌పై అభిమానులు మండిపడుతున్నారు. వివరాలు తెలుసుకోకుండా ఫన్నీగా ట్వీట్లు చేయకండంటూ సలహా ఇస్తున్నారు. శనివారం అమితాబ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ‘‘ బ్రేకింగ్ న్యూస్.. మీరు నమ్ముతారా? నా రూములోకి ఓ గబ్బిలం వచ్చింది. అదీ మూడవ అంతస్తులోని నా డెన్లోకి. దాన్ని బయటకు వెళ్లగొట్టటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కరోనా నన్ను విడిచిపెట్టడం లేద’’ని అన్నారు. అమితాబ్ కామెడీగా ట్వీట్ చేసినప్పటికి కొందరు నెటిజన్లు మాత్రం కఠినంగానే స్పందిస్తున్నారు. ( వైరల్ ట్వీట్: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్ ) T 3510 - Ladies and gentlemen of the Jury .. news of the hour .. BREAKING NEWS .. would you believe it .. A Bat , a चमगादर has come into my room .. in Jalsa .. on the 3rd floor .. in my Den .. 😯😯 badi mushkil se use bahar nikala .. Corona peecha chodh hi nahin raha !!! — Amitabh Bachchan (@SrBachchan) April 25, 2020 ‘‘ గబ్బిలాలు హానికరం కావు. మనం వాటికి భయపడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు గల మీలాంటి వ్యక్తులనుంచి ఇలాంటివి వినాల్సి రావటం బాధాకరం. అవి వైరస్‌ను అంటించవని దయచేసి అర్థం చేసుకోండి’’... ‘‘ఇది మంచి పద్దతి కాదు సార్! మీకు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనుషులకు ఆ వైరస్ ఎలా అంటుకుందో ఇప్పటి వరకు తెలియలేదు. గబ్బిలాలను అనుమానించాల్సిన విషయం కాదది. అవి పురుగుల్ని కంట్రోల్ చేసే జీవులు. దాన్ని ఇంట్లోకి రానివ్వండి’’ అంటూ కామెంట్లు చేశారు. -
కరోనా గబ్బిలాలను ఏమి చేయదా..?
-
గబ్బిలాలపై అనుమానపు చూపులు
-
వూహాన్లో ఏం జరిగింది?
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనా లోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధ్యక్షుడు ప్రకటించారు. వూహాన్ మార్కెట్లో ఆ గబ్బిలాలు లేవా ? కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది. ల్యాబ్‌లో భద్రత కరువు? వూహాన్లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది. చైనాలో అమెరికా దౌత్యవేత్తలు అందించిన సమాచారం ప్రకారం 2018లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పలుమార్లు వూహాన్లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు లేవని, గబ్బిలాల్లో వైరస్‌కు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిశోధనల సమయంలో సార్స్ వంటి వైరస్లు బయటకు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని రెండేళ్ల క్రితమే అమెరికా ప్రభుత్వాన్ని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా తన కథనంలో పేర్కొంది. ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు? వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి. పీ4 ల్యాబొరేటరీ -
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?
సింగపూర్ సిటీ: నిఫా, ఎబోలా వైరస్ల తరహాలో కరోనా వైరస్ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇతర వైరస్ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సార్స్ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు. -
మన గబ్బిలాల్లో కరోనా లేదు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని గబ్బిలాల్లో కరోనా (కోవిడ్–19) కారక సార్స్–సీవోవీ2 వైరస్ లేదని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులోని పీటెరోపస్ (ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్), రౌసెట్టూస్ (ఓల్డ్ వరల్డ్ ఫ్రూట్ బాట్స్) జాతి గబ్బిలాల్లో బ్యాట్ కరోనా వైరస్ (బీటీ సీవోవీ) ఉన్నట్లు గుర్తించారు. కరోనా కారక సార్స్–సీవోవీ–2 వైరస్‌కు బీటా కరోనా వైరస్ల మధ్య చాలా తేడాలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల్లో వ్యాధుల వ్యాప్తికి ఈ బ్యాట్ కరోనా వైరస్ కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని వెల్లడించారు. దీంతో భారత్‌లోని గబ్బిలాల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన నమూనాలపై తొలిసారి అధ్యయనం నిర్వహించి ఫలితాలను వెల్లడించారని చెప్పొచ్చు. ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ద్వారా గతంలో భారత్‌లో నిపా వైరస్ వ్యాప్తి చెందినట్లు అప్పట్లోనే గుర్తించిన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేతృత్వంలోని పుణే, కేరళ నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ల సంయుక్త ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు చండీగఢ్, తెలంగాణ, ఒడిశా, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్, కేరళలోని రెండు రకాల గబ్బిలాల జాతుల నుంచి దాదాపు 600 ‘స్వాబ్ శాంపిల్స్’సేకరించారు. గత డిసెంబర్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని వివిధ రకాల గబ్బిలాల జాతుల నుంచి పుణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. ఆ నమూనాలపై రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్) పరీక్షలు నిర్వహించగా, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన కనీసం 25 నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ‘జూనాటిక్ ఇన్ఫెక్షన్స్’పై మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశీలన ద్వారా కరోనా మహమ్మారి ఉధృతి నిలుపుదలకు ఏం చేయాలన్న దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైరస్‌లకు రిజర్వాయర్లుగా.. ప్రస్తుతం పర్యావరణపరంగా, మనుషుల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనుషులు, ఇతర జంతువులు–గబ్బిలాల మధ్య తారసపడే సందర్భాలను గుర్తించడం సవాళ్లతో కూడుకున్న పని అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పరిశోధనలో వెల్లడైన అంశాలను ఐసీఎంఆర్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెబ్సైట్లో ప్రచురించారు. ‘గబ్బిలాలు చాలా వైరస్‌లకు న్యాచురల్ రిజర్వాయర్లుగా పరిగణిస్తుంటారని, వీటిలో కొన్ని మనుషులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇటీవల బయటడిన శ్వాసకోశ సంబంధిత సమస్యలకు దారితీసే సార్స్–సీవోవీ–2 కూడా గబ్బిలాలతో ముడిపడి ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గబ్బిలాల్లోని సహజ స్థావరాల్లో ఎలాంటి క్లినికల్ లక్షణాలను ఉత్పత్తి చేయట్లేదు. ప్రమాదవశాత్తు ఈ వైరస్లు మనుషులు, ఇతర జంతువులకు వ్యాప్తి చెందినప్పుడు శ్వాస కోశ, ఎంటరిక్, హెపాటిక్, నాడీ సంబంధిత వ్యాధుల్లో వివిధ తీవ్రతల్లో బయటపడొచ్చు. వీటిలో కొన్ని సీవోవీ వైరస్లు మాత్రమే మనుషులకు సోకుతున్నాయనేది ఇంకా అర్థం కావట్లేదు‘అని ఈ పరిశోధనల్లో కీలకపాత్ర పోషించిన పుణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డా.ప్రగ్యా డి.యాదవ్ పేర్కొన్నారు. -
వాళ్లంతే.. చైనాలో మళ్లీ మామూలే!
బీజింగ్ : కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రకటించిన చైనాలో ఆహార మార్కెట్లు తిరిగి తెరుచుకోగా, అక్కడ యథాతథ పరిస్థితి కళ్లకు కడుతోంది. చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా ఆహార మార్కెట్లలో కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో చైనాలో ఆహార మార్కెట్ల (వెట్ మార్కెట్స్)ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వైరస్‌ను విజయవంతంగా నిరోధించగలిగామని చైనా ప్రకటించిన క్రమంలో మార్కెట్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే చైనా ఫుడ్ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల విక్రయం ఆందోళన కలిగిస్తోంది. కరోనావైరస్కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని డైలీమెయిల్ పేర్కొంది. అయితే ఎవరినీ ఫోటోలు తీసుకునేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని, ఫోటోలు తీసుకునే వారిని సెక్యూరిటీ గార్డులు అడ్డగించడం ఒక్కటే వ్యత్యాసమని తెలిపింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు దర్శనమిస్తోంది. చైనాలో పునఃప్రారంభమైన ఫుడ్ మార్కెట్లలో చైనా సంప్రదాయ ఆహారంపై సోషల్ మీడియాలోనూ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక కోవిడ్-19ను అధిగమించామని చైనా చెబుతున్నా పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించిన వైరస్ గణాంకాల్లో చిత్తశుద్ధిని పలువురు శంకిస్తున్నారు. చైనా తమ దేశంలో వైరస్ విధ్వంసం గురించి ప్రపంచానికి దాచిన వందల ఉదంతాలను గుర్తించామని నేషనల్ రివ్యూ వెల్లడించింది. చైనాలో 82,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3000 మందికి పైగా మరణించారు. మహమ్మారి వైరస్ వేలాది మంది ప్రాణాలను హరించినా చైనా ఆహారపు అలవాట్లు, అక్కడి ఆహార మార్కెట్లలో అపరిశుభ్రత రాజ్యమేలడం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి: చైనా ఆ పని చేయకపోయుంటే పరిస్థితేంటి! -
ఇలా అయితే నిఫా వైరస్ సోకదా?
బొబ్బిలి : పర్యావరణంలో దేశానికే తలమానికం అంటూ ఇటీవల ఉన్నతాధికారుల నుం చి ఢిల్లీలో అవార్డునందుకున్న బొబ్బిలి మున్సి పాలిటీ నడిబొడ్డున గబ్బిలాల చెట్టు ఆ అవా ర్డుకే ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి సీహెచ్‌సీ వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టుపై పెద్ద సం ఖ్యలో గబ్బిలాలు తిష్టవేసి ఉన్నాయి. దశాబ్దా ల కాలం నుంచి ఈ చెట్టు ఇక్కడే ఉన్నా... ఇటీవల గబ్బిలాల కారణంగా నిఫా వైరస్ సోకుతుందన్న దుమారం రేగడంతో ఇక్కడివారిలో ఆందోళన మొదలైంది. చెట్టు నిండా పెద్ద సం ఖ్యలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా వేల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతునే ఉంటా యి. నిఫా వైరస్ తో దేశంలోని వివిధ ప్రాం తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు మరణించిన విష యం దావానలంలా వ్యాపించడంతో ఇప్పు డు అందరి దృష్టి ఈ గబ్బిలాల చెట్టుపై పడిం ది. ఈ ఆస్పత్రికి నిత్యం 250 నుంచి 300కు పైగా ఓపీ రోగులు వస్తున్నారు. ఇవి గాకుండా 40 వరకూ ఇన్‌పేషెంట్లు విభాగానికి వస్తుం టారు. పక్కనే గబ్బిలా ల చెట్టు ఉండటంతో వా టి వ్యర్థాలు పడుతుంటాయి. అంతేగాదు. ఆస్పత్రి 50పడకలుగా విస్తరింపజేసి.. అదనపు భవనాలు నిర్మించనున్న నేపథ్యంలో ఈ చెట్టుపై ఉన్న గబ్బిలాలనుంచి వైరస్ సోకేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
హైకోర్టు ప్రాంగణంలో గబ్బిలాలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలో పెద్ద సంఖ్య లో గబ్బిలాలున్నాయని.. వీటితో కోర్టుకు వచ్చే వారికి నిపా వైరస్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. న్యాయవాదుల తరఫున ఎన్.కృష్ణకుమార్‌గౌడ్ రిజిస్ట్రార్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టులో వందల సంఖ్యలో గబ్బిలాలున్నాయని, ప్రతీరోజూ న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు కక్షిదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, కాబట్టి నిపా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముం దన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్లు, జ్యూస్ స్టాళ్ల వద్ద శుభ్రత పాటించేలా చూడాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుంటారని, ఆ చెట్ల మీదనే గబ్బిలాలు ఉంటున్నాయని, కాబట్టి ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘బొర్రా’లో నిఫా అలెర్ట్
సాక్షి, విశాఖపట్నం: బొర్రాగుహలు పర్యాటకుల గుండెల్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ బొర్రా గుహల్లో వేల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న ప్రాణాంతక నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు బొర్రాగుహల సందర్శనపై పర్యాటకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొర్రా గుహలకు రోజుకు సగటున నాలుగు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే ఆరు వేల మంది వరకు సందర్శిస్తుంటారు. బొర్రా గుహలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు... విదేశీయుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. బొర్రా గుహలను సందర్శించే వారిలో కేరళ వాసులు కూడా ఉన్నారు. నిపా వైరస్‌తో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెందరో ఈ వ్యాధికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా ఈ వైరస్‌కు మందు కనిపెట్టలేదు. బొర్రా గుహల్లో వేలాది గబ్బిలాలు ఒక్కసారి ఈ వైరస్ సోకినట్టయితే ఆ వ్యక్తికి మరణం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదకర వైరస్‌కు గబ్బిలాలే మూలమని స్పష్టం కావడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు దీనిపై అలెర్టయ్యాయి. ఈ గబ్బిలాలు గుహలు, మర్రిచెట్లు, రావిచెట్లు, చీకటి ప్రాంతాల్లో జనానికి దూరంగా నివసిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లూ బొర్రా గుహలపైనే పడ్డాయి. ఎంతో విశాలంగా ఉండే బొర్రా గుహల్లో వేలకొద్దీ గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. పగటి పూట వీటికి కళ్లు కనిపించవు. అందువల్ల రాత్రి వేళ బయటకు వెళ్లి పండ్లను తింటూ పగటి పూట ఈ గుహల్లో సేదతీరుతాయి. పర్యాటకులు బొర్రా గుహల్లోకి వెళ్లినప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. వేల సంఖ్యలో ఉండడం వల్ల ఈ గుహల్లో ఎప్పుడూ గబ్బిలాల విసర్జితాలతో ఒకింత దుర్వాసన కూడా వస్తుంది. అయినప్పటికీ గుహల అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. గుహల ప్రవేశ ప్రాంతంకంటే లోపల మరింతగా చిమ్మచీకటి అలముకుంటుంది. దీంతో గబ్బిలాల ఆవాసానికి ఈ బొర్రాగుహలు ఎంతో అనువుగా ఉంటాయి. పర్యాటకుల్లో అలజడి గబ్బిలాల ద్వారా నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇప్పుడు బొర్రా గుహల సందర్శనకు వెళ్లే పర్యాటకుల్లో అలజడి రేగుతోంది. గబ్బిలాల జాడ అంతగా లేని ప్రదేశాల్లోనే నిపా వైరస్‌పై యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలాంటిది వేల సంఖ్యలో గబ్బిలాలుండే బొర్రాగుహల్లోకి వేలాదిగా పర్యాటకులు వెళ్తుండడమే వీరిలో ఆందోళనకు కారణమవుతోంది. గబ్బిలాలు అరటి, మామిడి, నేరేడు, జామ తదితర పండ్లను తింటాయి. తాటి, ఈత, జీలుగు కల్లును కూడా తాగుతాయి. నిపా వైరస్ కలిగిన గబ్బిలాలు తిన్న పండ్లను, తాగిన కల్లును ఇతరులు తింటే వారికీ ఈ వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో బొర్రాగుహల ప్రాంతంలో పక్షులు కొరికిన/గాట్లున్న పండ్లను విక్రయించవద్దని, తినవద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే స్థానికులకు సూచించారు. అప్రమత్తంగా ఉన్నాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశాం. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలున్న వారిని తక్షణమే కేజీహెచ్‌కు తరలించాలని సూచించాం. పక్షులు కొరికిన పండ్లను తినవద్దని, బయట దొరికే పండ్లను నీటితో కడిగి తినాలని పర్యాటకులకు అనంతగిరి మండల వైద్య, ఆరోగ్య సిబ్బందితో చెప్పిస్తున్నాం.– రోణంకి రమేష్, డీఎంహెచ్‌వో మాస్క్‌లు అందజేస్తాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహలకు వచ్చే పర్యాటకులకు టిక్కెట్‌తో పాటు మాస్క్‌లను అందజేయాలని యోచిస్తున్నాం. నిపా వైరస్‌పై మా శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని డివిజినల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ఆదేశించారు. గుహలు లోపల వేల సంఖ్యలో ఉన్న గబ్బిలాలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అదే సమయంలో పర్యాటకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోజూ బ్లీచింగ్ చల్లిస్తున్నాం. గబ్బిలాల విసర్జాలను ఎప్పటికప్పుడే క్లీన్ చేయిస్తున్నాం. గుహల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక మాస్కులు, గ్లౌజులు అందజేస్తున్నాం. – గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు -
గబ్బిలాల బామ్మ.. నిపా భయం లేదు..!!
అహ్మదాబాద్, గుజరాత్ : దేశమంతటా నిపా వైరస్ భయంతో వణికిపోతోంటే ఓ 74 ఏళ్ల బామ్మ మాత్రం 400 గబ్బిలాలతో కలసి నివసిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్‌కు చేరువలోని రాజ్పూర్ గ్రామంలో శాంతాబెన్ ప్రజాపతి(74) నివసిస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆమెకు రెండు గదుల ఇల్లు ఉంది. ఇంటిలోని అన్ని గోడలపై, కింద కూడా 400 గబ్బిలాలు నివసిస్తుంటాయి. నిపా వైరస్ గురించి తనకు ఎలాంటి భయం లేదని శాంతాబెన్ తెలిపారు. గత పదేళ్లుగా గబ్బిలాలతో గడుపుతున్నానని, అవి తన కుటుంబం అని చెప్పారు. అందుకే వాటి కోసం ఇంటిని వదిలేసి వరండాలో కాలాన్ని వెళ్లదీస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల క్రితం ఓ గబ్బిలాల గుంపు ఇంట్లోకి వచ్చిందని వాటిని చూసి చాలా భయపడ్డానని శాంతాబెన్ తెలిపారు. రాత్రి పూట అవి బయటకు వెళ్లి, ఉదయాన్నే తిరిగి వచ్చేవని వివరించారు. అప్పటికే తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసినట్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడని దాంతో ఇంటికి గబ్బిలాలకే వదిలేసినట్లు వెల్లడించారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకూ గబ్బిలాలతోనే నివసిస్తానని పేర్కొన్నారు. -
వామ్మో ‘నిపా’
నెల్లూరు(బారకాసు): ‘నిపా‘ వైరస్ ఇప్పుడు అందర్నీ వణికిస్తోంది. కేరళలో ఈ వైరస్ సోకి 11 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి వ్యాధి సోకిందనే వార్తలతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం స్పందించి హై అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో కేరళకు చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. వీరు తరచూ సొంత రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వీరి బంధువులు సైతం జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అప్రమత్తత అవసరం అప్రమత్తంగా లేకపోతే నిపా వైరస్ జిల్లాకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేరళకు చెందిన వారు పెద్ద ఎత్తున జిల్లాలో వివిధ వ్యాపారాల రీత్యా స్థిరపడ్డారు. వీరంతా వారి సొంత రాష్ట్రమైన కేరళకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి వారి బంధువులు కూడా ఇక్కడికి వస్తూ పోతుంటారు. కేరళ, త్రివేండ్రం, కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నెల్లూరు మీదుగానే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణం చేసే వారిలో ఎవరికైనా ఈ వైరస్ సోకి ఉంటే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ల సమీపంలోని చెట్లలో పెద్ద ఎత్తున గబ్బిలాలు దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిపా సోకేది ఇలా.. నిపా వైరస్ గబ్బిలాలు,పందుల ద్వారా సోకుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నా, దాన్ని తాకినా వైరస్ సోకుతుంది. అలాగే గబ్బిలాలు పందులను పొడిచి గాయపరిచినప్పుడు వాటి నుంచి పందులకు సోకుతుంది. గాయపడిన పందులు జనసంచారంలో తిరగడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా..దగ్గినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఇలా.. ♦ నిపా వైరస్ సోకిన వ్యక్తి శ్వాసతీసుకోవడంలో అవస్థ పడతారు. ♦ భరించలేనంతగా తలనొప్పి, తీవ్ర జ్వరం. ♦ ఎండలో తిరిగినప్పుడు మాడు ఎలా మండిపోతుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ♦ మెదడు కూడా మండిపోతున్నట్లు ఉం టుంది. ♦ ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. ♦ రోజుల తరబడి మత్తునిద్రలో ఉంటారు. ♦ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. ♦ మందులు వేసుకున్నా వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ముదిరితే రెండురోజులకే కోమాలోకి వెళ్లిపోయి ప్రాణా పాయం సంభవించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి నిపా వైరస్ సోకితే చికిత్స లేదు. లక్షణాలను బట్టి ప్రాథమిక దశలో గుర్తిస్తే అందుకు అవసరమైన వైద్యసేవలందించే అవకాశం ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డును కేటాయిస్తాం. లక్షణాలు గుర్తించి అవసరమైతే ప్రత్యేక వైద్యం అందిస్తాం. ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ప్రచారాలు చేపడతాం. ఈ విషయమై ఈ నెల 28న మా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. -
అమ్మో గబ్బిలం
సీతంపేట : కేరళలో ఇటీవల నిపా వైరస్ బారిన పడి 10 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి అధికంగా సోకుతుందని వైద్యనిపుణులు చెబుతుండటంతో కలవరపడుతున్నారు. సీతంపేట హెడ్‌క్వార్టర్‌లో అత్యధికంగా చెట్లుపై గబ్బిలాలు తిష్టవేశాయి. స్థానిక మల్బరీ యూనిట్ పెంపక కేంద్రం వద్ద ప్రతీ చెట్టుకు గబ్బిలాలు వేలాడుతున్నాయి. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం, జీసీసీ సమీపంలో ఇలా ఎక్కడ చూసినా చెట్లకు ఉన్నాయి. ఆవాసాల వద్దే ఇవి ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
గబ్బిలం.. దైవంతో సమానం
చిట్టమూరు: గబ్బిలం.. ఊరి చివర చెట్లకు తల్లకిందులుగా వేలాడే పక్షిలాంటి జీవి. నిజానికి ఇది క్షీరద జాతికి చెందినదైనా పక్షి తరహాలో సంచరించే ప్రత్యేక జీవి. ఇవి పగలంతా చెట్లకు వేలాడుతూ.. మేత కోసం రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి.. ఆహారాన్ని వేటాడి సూర్యోదయానికి తిరిగి చెట్లపైకి చేరుకుంటాయి. ఈ జీవులను దైవంగా భావించేవారూ ఉన్నారు. చిట్ట మూరు మండలం గునపాడు, పొదలకూరు మండలం మర్రిపల్లి, ముత్తుకూరు మండలం కొత్తపాలెం, సైదాపురం మండలం పర్సారెడ్డిపల్లి ప్రజలు గబ్బిలాలు గ్రామంలో ఉంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. వేటగాళ్లు వాటిని పట్టికోకుండా.. ఆకతాయిలు చెదరగొట్టకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ గ్రామాల్లో గబ్బిలాలు సుమారు వందేళ్ల నుంచి ఉంటున్నాయని.. అవి వచ్చాకే తమ గ్రామాలు బాగుపడ్డాయని వృద్ధులు కథలుగా చెబుతుంటారు. ఇవి వాన రాకను తెలియజేస్తాయని.. రాత్రివేళ చెట్ల నుంచి కదలకపోతే వర్షం కురవబోతోందని సంకేతమని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వీటి కదలికల ఆధారంగానే రైతులు వ్యవసాయ పనులకు సమాయత్తం అవుతుంటారు. ఇవి పక్షులు కాదు వాస్తవానికి గబ్బిలాలు పక్షులు కాదు. పాలిచ్చే జాతికి చెందిన జంతువులు (క్షీరదాలు). ఇవి గుడ్లను పెట్టవు. పిల్లలను కంటాయి. క్షీరదాలలో ఎగరగలిగిన జంతువు ఇదొక్కటే. వీటికి కళ్లు, చెవులు, నోరు ఉంటాయి. కళ్లతో చూడకుండానే ఇవి దారి తెలుసుకుంటాయి. కటిక చీకట్లోనూ దేనినీ ఢీకొట్టకుండా ఎగరగలుగుతాయి. వీటి కళ్లకంటే చెవులే పవర్ ఫుల్. గబ్బిలం ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడంతో మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా ఉండే అడ్డంకులకు తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగొచ్చి గబ్బిలం చెవులనుయ తాకుతాయి. ఇవి అత్యంత అల్పమైన శబ్దాలను కూడా విని అత్యంత వేగవంతమైన ప్రయాణంలోనూ దిశను మార్చుకోగలుగుతాయి. ఇక్కడి గబ్బిలాలు కేవలం పురుగులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. -
బ్యాట్ ఇప్పుడు స్మార్ట్!
చాంపియన్స్ ట్రోఫీలో సరికొత్త టెక్నాలజీ లండన్: బ్యాట్లు కేవలం షాట్లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ఇప్పుడు స్మార్ట్‌గానూ అక్కరకొస్తాయి. ఇందుకోసం కొత్తగా చిప్‌లను బ్యాట్ హ్యాండిల్‌కు అమరుస్తున్నారు. దీంతో బ్యాట్ కదలికలు, షాట్ల లోతైన విశ్లేషణకు ఈ చిప్ సెట్లు దారి చూపించనున్నాయి. ఐసీసీతో జతకట్టిన ఇంటెల్ సంస్థ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కు చిప్‌ను అమరుస్తారు. ప్రతి జట్టులో ప్రయోగాత్మకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ ‘చిప్’బ్యాట్లతో ఆడతారు. దీనివల్ల బ్యాట్ కదలికలన్నీ సునిశితంగా పసిగట్టవచ్చు. అంతేకాదు... బ్యాట్స్‌మెన్ శైలిని అభిమానులకు మరింత చేరువ చేయడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అంటే ఇప్పటిదాకా కేవలం రిప్లేలే చూసిన ప్రేక్షకులు లోతైన విశ్లేషణలు చూడొచ్చన్నమాట. కోచ్‌ల పని సులువవుతుంది. షాట్ సెలక్షన్లో స్పష్టంగా ఎక్కడ తప్పుజరిగిందో తెలుసుకోవచ్చు తద్వారా బ్యాట్స్‌మెన్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవచ్చు. ఇందుకోసం మ్యాచ్ వేదికల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచారు. స్పైడర్‌క్యామ్‌తో పాటు హాక్ ఐ కెమెరా, డ్రోన్ కెమెరాలతో ఈ చిప్ పనితీరు అనుసంధానించిన నెట్‌వర్క్‌కు చేరుతుంది. ఈ చిప్‌లతో బ్యాట్ స్పీడ్, బ్యాక్‌లిఫ్ట్ యాంగిల్, టైమ్ టు ఇంపాక్ట్‌లను తెలుసుకోవచ్చు. భారత్ తరఫున రోహిత్ శర్మ, రహానే, అశ్విన్‌ల బ్యాట్లకు ఈ చిప్‌లను అమరుస్తారు. -
ఎండలకు ఆకుల్లా రాలుతున్న గబ్బిలాలు
చెట్లపైకి పైప్‌తో నీళ్లు కొడుతున్న గ్రామస్తులు కేసముద్రం(మహబూబాబాద్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ఎటు చూసినా గబ్బిలాలే దర్శనమిస్తాయి. ఈ వేసవిలో ఎండ తీవ్రత పెరగడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానికులు వాటిని కాపాడేందుకు చెట్లపై నీళ్లు చల్లుతూ వాటికి ఉపశమనం కలిగిస్తున్నారు. గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపం లోని చెట్లపైనున్న గబ్బిలాలు వడ గాడ్పులకు మృత్యువాత పడుతున్నాయి. దీంతో సర్పంచ్ బాలునాయక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధ వారం వ్యవసాయ బావికి మోటారు పెట్టించి పైపుల ద్వారా చెట్ల మీదున్న గబ్బిలాలకు నీళ్లు కొట్టి గబ్బిలాలను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వీస్తున్న వడగాడ్పులకు 14 మంది మృతి చెందారు. అందులో 12 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే మరణించారు. మృతుల్లో కరీంనగర్ జిల్లా రాచపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంజాల రామయ్య (64), మానకొండూర్ మండలంలోని ముం జంపల్లి గ్రామానికి చెందిన కార్మికుడు పిల్లి రవి (38) కూడా ఉన్నారు. -
గబ్బిలాలకు వేసవి సెగ
పెరిగిపోయిన వేసవి ఉష్ణోగ్రత మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం బలిగొంటోంది. వడదెబ్బ కారణంగా ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో తుమ్మలపెంట శివాలయం వద్ద చింత చెట్లపై వందల ఏళ్ల నుంచి వేల సంఖ్యలో నివాసం ఉంటున్న గబ్బిలాలు ఎండ వేడిమికి విలవిల్లాడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతుండడంతో వేడికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 40కి పైగానే మరణించాయి. గ్రామంతో అనుబంధం పెంచుకున్న గబ్బిలాలు, వాటి సంతతి ఎండదాటికి అంతరించిపోతుండడాన్ని తుమ్మలపెంట వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. - కొలిమిగుండ్ల -
రోబోకు రెక్కలొచ్చాయి...
గబ్బిలాల గురించి మీరు వినే ఉంటారు. రెక్కలు విప్పుకుని పైకి, కిందకు అల్లాడిస్తూ కదిలివెళ్లే గబ్బిలాల మాదిరిగానే ఫొటోలో కనిపించే రోబో కూడా పని చేస్తుంది. అయితే ఏంటి? అని కొట్టిపారేయవద్దు. ఇలా రెక్కలు కొట్టుకోగల రోబోను తయారుచేయడం ఇదే మొదటిసారి కాగా.. దీనివల్ల అనేకానేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు దీన్ని తయారు చేసిన కాల్టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. గాల్లో ఉండేందుకు డ్రోన్ల మాదిరిగా ఇంజిన్లు నిత్యం ఆన్‌లో ఉంచుకోవాల్సిన అవసరం లేకపోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. అతితక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లడం రెక్కల రోబోతోనే సాధ్యం. కేవలం 93 గ్రాముల బరువు ఉండే ఈ రోబోను చిన్న చిన్న ప్రదేశాల్లోనూ సులువుగా తిప్పవచ్చు. దీని రెక్కలు దాదాపు ఒక అడుగు విస్తీర్ణంలో విచ్చుకుంటాయి. గబ్బిలాల మాదిరిగానే తన రెక్కల మధ్యలో ఉండే అనేక కీళ్లను కదిలిస్తూ ముందుకు కదులుతుంది ఇది. గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఈ రెక్కలకు 56 మైక్రాన్ల మందమున్న ప్రత్యేకమైన సిలికాన్ పదార్థంతో తయారు చేశారు. కార్లకు రెక్కలు వచ్చేందుకు... నిలువుగా పైకెగరి గమ్యంవైపు దూసుకెళ్లేందుకు ఇంక ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటారా? ఇప్పటికే కొన్ని ఎగిరే కార్లు మార్కెట్లోకి వచ్చేసేందుకు సిద్ధమవుతూండగా.. జెట్ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా ఫొటోలో చూపినట్టు ఇంకో దాన్ని సిద్ధం చేస్తోంది మరి. మనుషులు నిలువుగా పైకి ఎగరేలా చేసేందుకు జెట్‌ప్యాక్‌ను సిద్ధం చేసింది ఈ కంపెనీనే. విషయం ఏమిటంటే.. ఒకవైపు బ్యాటరీల సామర్థ్యం పెరిగిపోతోంది. ఇంకోవైపు సెన్సర్లు, ఎలక్ట్రిక్ మోటర్ల ఖరీదు తగ్గిపోతోంది. ఒకప్పుడు అందుబాటులో లేని అనేక టెక్నాలజీలు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో జెట్ ఏవియేషన్స్ ఎగిరే కారు తయారీకి నడుం బిగించింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేస్తుంది. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని తయారు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలో ఈ సరికొత్త ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
గబ్బిలాలు ఆ ఊరిని ఆక్రమించాయి!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పట్టణంలోని ఓ తీర ప్రాంతం గబ్బిలాల సామ్రాజ్యంగా మారింది. వాటి కారణంగా అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల దైనందిన కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పదకొండు వేల జనాభా ఉన్న ఈ తీర ప్రాంతంలో దాదాపు ఒక లక్ష కు పైగా గబ్బిలాలు అక్కడి చెట్లను తమ నివాసాలుగా మార్చుకోవడంతో ఆ తీర ప్రాంత పట్టణాన్ని 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'గా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. ఈ గబ్బిలాల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతుండటంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వాటన్నింటిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండటంతో కనీసం ఇంటి కిటికీలు తెరవలేకపోతున్నామని.. అవి చేసే శబ్దాన్ని భరించలేకపోతున్నామని అక్కడి వాసులు వాపోతున్నారు. దాదాపు ఆస్ట్రేలియాలో నివసించే గ్రే-హెడ్ గబ్బిలాల్లో నాలుగింట ఒకటి ఇక్కడ నివసిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ జాతికి చెందిన గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉండటంతో వాటిని అధికారుల చంపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ పట్టణంలో ఉన్న చెట్లన్నింటినీ నరికేసే పనిలో పడ్డారు. -
జల్లికట్టు కోసం తమిళనాట ఉద్యమాలు
-
ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర
-
ఆకుల్లా రాలిన వెయ్యి గబ్బిలాలు
కేసముద్రం(వరంగల్ జిల్లా): ఎండదెబ్బకు ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యల్లో గబ్బిలాలు నేలరాలుతున్నాయి. వరంగల్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయ పరిసరాల్లో గల చెట్లపై వేల సంఖ్యలో గబ్బిలాలు ఏళ్లుగా ఉంటున్నాయి. వేకువ జామున నాలుగు గంటలకు అవి ఊరంతా తిరుగుతూ అరుస్తూంటే.. ఆ అరుపులకు గ్రామస్తులకు నిద్ర లేవడం ఆలవాటుగా మారింది. అయితే, మూడు రోజులుగా ఎండ ప్రతాపం చూపిస్తుండడంతో తట్టుకోలేని గబ్బిలాలు ఆలయ పరిసరాల్లోని చెట్లను వీడి చెరువు కట్టపై ఉన్న రావి, మర్రి చెట్లపైకి చేరాయి. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఒకదానిపై మరొకటి తేనెతుట్టెలా చేరుతున్నాయి. వేడిని తట్టుకోలేక చనిపోతు కుప్పలు.. కప్పులుగా కిందపడుతున్నాయి. ఈ రెండు రోజుల్లో సుమారు వెయ్యి వరకు గబ్బిలాలు చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. -
ఇక మార్కెట్లోకి ఫాల్కన్ బ్లేడ్ బ్యాట్లు
ముంబై ఐఐటీ విద్యార్థుల సృష్టి ముంబై: క్రికెట్లో ఇక నవతరం బ్యాట్లు రానున్నాయి. విదేశీ పర్యటనల్లో భారత ఆటగాళ్లు బంతిని ఎడ్జ్ చేయబోయి వికెట్ కీపర్ చేతుల్లో, స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్‌లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు ఆధునిక రీతిలో పరిష్కారం కనుగొనేందుకు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన విద్యార్థులు నడుం బిగించారు. బ్యాట్ల చివర్ల (ఎడ్జ్)ను పునర్నిర్మాణం చేయాలని భావించారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ఐసీసీ సూత్రాలను అనుసరించి ‘ఫాల్కన్ బ్లేడ్’ పేరిట కొత్త తరహా బ్యాట్లను తయారుచేశారు. బంతి బ్యాట్ చివరన తాకగానే అది పక్కకు వెళ్లి ఫీల్డర్ల చేతిలో పడకుండా నేరుగా కింది వైపునకు వెళ్లేటట్లు బ్యాట్ స్వరూపాన్ని మార్చారు. పక్క నుంచి చూస్తే విమానం రెక్క మాదిరిగా ఈ బ్యాట్ నిర్మాణం ఉంటుంది. ఈ డిజైన్‌ను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా ఆమోదించింది. వచ్చే ఏడాది ఈ బ్యాట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి చాలా తేలిగ్గా ఉండడమే కాకుండా గాల్లో వేగంగా కదులుతాయి. పక్క నుంచి చూస్తే బ్యాట్ మధ్య భాగం సంప్రదాయ బ్యాట్కన్నా కాస్త ఎక్కువగా ఉబ్బినట్టు ఉండి కింద షార్ప్‌గా ఉంటుంది. -
మన్మోహన్‌కు గబ్బిలాల స్వాగతం!
పక్షులు, జంతుజాలంతో నిండిపోయిన మోతీలాల్ బంగ్లా న్యూఢిల్లీ: ఆపద్ధర్మ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం 7 రేస్‌కోర్స్ రోడ్డులోని తన అధికారిక నివాసం నుంచి కుటుంబ సమేతంగా ఖాళీ చేసి 3, మోతీలాల్ నెహ్రూ బంగళాలోకి మారనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ బంగళాలో మన్మోహన్ కుటుంబానికి గబ్బిలాలు, పక్షులు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి! గతంలో ఈ బంగళాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసమున్న సమయంలోనూ ఈ గబ్బిలాలు, జంతుజాలం ఇక్కడే ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని తొలగించేందుకు దీక్షిత్ ససేమిరా అనడంతో ఆయా పక్షులు, క్షీరదాలు అక్కడే ఉండిపోయాయని నివాసాన్ని శుభ్రం చేయిస్తున్న ఓ అధికారి వెల్లడించారు. బంగళా చుట్టూ 40 చెట్లు ఉన్నాయని, వీటికి వేలాడుతూ 200కు పైగా గబ్బిలాలు ఉన్నాయన్నారు. 60 రకాల పక్షులు బంగళాను శాశ్వత నివాసంగా మార్చుకున్నాయన్నారు. వీటిలో ఆకుపచ్చని పావురాలు, మైనా, కోయిలలు, చిలుకలు, గుడ్లగూబలు, లకుముకి పిట్టలు తదితర అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయన్నారు. టైప్-8 బంగళాగా పేరొందిన ఈ నివాసంలోకి సోమవారం సాయంత్రం మన్మోహన్సింగ్ చేరుకుంటారన్నారు. -
మన్మోహన్‌కు గబ్బిలాల స్వాగతం
న్యూఢిల్లీ: పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఘోర పరాజయంతో అధికారం పీఠం నుంచి నిష్ర్కమించారు. ఇకమీదట కాంగ్రెస్ నాయకులే ఆయనను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే అధికారం నివాసం ఖాళీ చేసి మరో బంగ్లాకు మారబోతున్న మన్మోహన్‌కు ఊహించని స్వాగతం లభించనుంది. సోమవారం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని మూడో నెంబర్ బంగ్లాకు మారుతున్న మన్మోహన్‌కు వందలాది పక్షులు, గబ్బిలాలు స్వాగతం పలకనున్నాయి. మూడెకరాల విస్తీర్ణంలో రకరకాల చెట్లు, వివిధ జాతుల పక్షులు, గబ్బిలాలు, ఆవులతో కూడిన పచ్చటి వాతావరణం మధ్య ఈ బంగ్లా ఉంటుంది. జామ, మామిడి వంటి పండ్ల చెట్లు, 60 రకాల పక్షులు ఉన్నాయి. మన్మోహన్‌కు ఈ బంగ్లాను సిద్ధం చేసినట్టు అధికారులు చెప్పారు.