
చెట్లపై వేలాడుతున్న గబ్బిలాలు
సీతంపేట : కేరళలో ఇటీవల నిపా వైరస్ బారిన పడి 10 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి అధికంగా సోకుతుందని వైద్యనిపుణులు చెబుతుండటంతో కలవరపడుతున్నారు. సీతంపేట హెడ్‌క్వార్టర్‌లో అత్యధికంగా చెట్లుపై గబ్బిలాలు తిష్టవేశాయి. స్థానిక మల్బరీ యూనిట్ పెంపక కేంద్రం వద్ద ప్రతీ చెట్టుకు గబ్బిలాలు వేలాడుతున్నాయి. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం, జీసీసీ సమీపంలో ఇలా ఎక్కడ చూసినా చెట్లకు ఉన్నాయి. ఆవాసాల వద్దే ఇవి ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment