Nipah virus
-
నిఫా.. ఇలా సఫా..
హెల్త్ డెస్క్: ఇటీవల కేరళలో నిఫా వైరస్‌తో పద్నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడం కలవరం రేపింది. ఆ వైరస్ వ్యాపిస్తోందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో జనంలో ఆందోళన మొదలైంది. కానీ ‘నిఫా’ విషయంలో అంత భయమేమీ అవసరంలేదని.. ప్రస్తుతం కేరళలో తప్ప మరే రాష్ట్రంలోనూ దాని ఆనవాళ్లు లేవని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే ‘నిఫా’ మన దరికి చేరే ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు.ఎప్పట్నుంచో ఉన్న వైరసే ఇది..ఆరేళ్ల కింద మన దేశంలో తొలిసారిగా ‘నిఫా’ వైరస్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇది ప్రపంచానికి కొత్తదేమీ కాదు. 1998లోనే మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిఫా’ అనే ప్రాంతంలో తొలిసారిగా మనుషులకు సంక్రమించింది. ఆ ప్రదేశం పేరిటే దీన్ని ‘నిఫా’గా పిలుస్తున్నారు. తర్వాత 2004లో బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించింది. కాస్త అరుదుగానైనా అప్పుడప్పుడూ (స్పొరాడిక్గా) భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.వ్యాపించేది ఇలా..» ‘నిఫా’ ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే (జూనోటిక్) వ్యాధి.» తాటి, ఈత, ఖర్జూర జాతికి చెందిన చెట్ల పండ్లను తినే ఫ్రూట్ బ్యాట్స్ రకం గబ్బిలాల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. వీటితోపాటు జామ వంటి ఇతర పండ్లనూ అవి తింటుంటాయి. ఆ పండ్లలో ‘నిఫా’ వైరస్ ఉండే ప్రమాదం ఎక్కువ.» చిలక కొట్టిన పండు అంటూ సగం కొరికి ఉన్న ఏ పండ్లనూ తినకపోవడం మంచిది.» కొన్నిచోట్ల పందుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదముంది. అప్పటికే వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకూ సంక్రమిస్తుంది.నిర్ధారణ చేసేదిలా..‘నిఫా’ లక్షణాలున్న బాధితుల నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. ప్రస్తుతం దేశంలో ‘నిఫా’ వైరస్‌ను కచ్చితంగా గుర్తించే సదుపాయాలు అక్కడే ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్‌లో ఎలిసా టెస్ట్,క్వాంటిటేటివ్ పీసీఆర్ (పాలిమరేజ్ చైన్ రియాక్షన్), సెల్ కల్చర్ (వైరస్ ఐసోలేషన్) తదితర టెస్టుల ద్వారా వైరస్‌ను గుర్తిస్తారు.నిఫా నుంచి రక్షణ ఇలా..» ఏదైనా కొరికినట్టు కనిపించిన ఏ పండునూ కూడా తినకపోవడం.» పందుల ఫామ్స్కూ, పందుల పెంపకందార్లకు కొద్దిరోజులు దూరంగా ఉండటం.» ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి దూరంగా ఉండటం.» వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. శానిటైజర్లను వాడటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు..నిఫా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కచ్చితమైన చికిత్సా విధానం, మందులు లేవు. లక్షణాల తీవ్రతను బట్టి ఉపశమనం కోసం మందులు ఇస్తుంటారు. కొన్నిరకాల యాంటీ వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తారు. వ్యాక్సిన్‌ను రూపొందించినా అది అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని తేలింది. ‘నిఫా’ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. – డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
కేరళలో నిపా వైరస్ కలకలం..!
కేరళలో నిపా వైరస్ కలకలంతో ఒక్కసారిగా యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడింది. వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా ఆరోగ్య కేంద్రాలను అలర్ట్ చేసింది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా బారిన పడ్డాడు. పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. ప్రస్తుతం అతను ఒక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతన్ని అక్కడ నుంచి కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తారని అన్నారు. అతన్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్ల పేర్కొన్నారు వైద్యులు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. అంతకుమునుపు ఆస్ట్రేలియా నుంచి సేకరించి పూణే ఎన్ఐవీలో నిల్వ ఉంచిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. ఆ బాధిత చిన్నారి పాండిక్కాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు కేరళ అధికారులు. అంతేగాదు ఆయా సమీప ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. అంతేగాక నిపా వైరస్ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. పైగా అంటువ్యాధి నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేసేలా ఆరోగ్య కేంద్రాలను కూడా ఆదేశించారు అధికారులు. నిపా వైరస్ లక్షణాలు..తీవ్రమైన తలనొప్పిఅలసటవాంతులుబలహీనత మూర్ఛ, చూపు మందగించడంతో పాటు జ్వరంఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది.పాటించాల్సిన జాగ్రత్తలు..సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులను సందర్శించటం, అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. పక్షులు లేదా జంతువులు సగం తిన్న లేదా కరిచిన పండ్లను తినకూడదు. అలాగే పండ్లను సరిగ్గా కడిగితినాలి. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను తీసుకోకూడదు వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.డాక్టర్ ఎమ్.ఎల్. నీహారిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ (చదవండి: వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?) -
ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఇన్షెక్షన్‌తో పోలిస్తే నిఫా వైరస్‌తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2–3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్‌తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. యాంటీబాడీ డోసుల కొనుగోలుపై రాజీవ్ బహల్ స్పందిస్తూ..ఆస్ట్రేలియా నుంచి 2018లో తెప్పించిన కొన్ని డోసులు ఇప్పటికీ ఉన్నాయనీ, అవి 10 మంది బాధితులకు మాత్రమే సరిపోతాయని వివరించారు. భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు. వీరికి మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ‘అయితే, ఈ యాంటీబాడీలను ప్రారంభదశలో ఉన్న వారికే వాడుతున్నారు. వీటితో చికిత్సపై నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, వైరస్ బాధితుల కుటుంబాలకే వదిలేశాము. మోనోక్లోనల్ యాంటీబాడీలతో విదేశాల్లో భద్రతను నిర్థారించే ఫేజ్–1 ట్రయల్ మాత్రమే జరిగింది. సామర్థ్యాన్ని నిర్థారించే ట్రయల్స్ జరగలేదు. అందుకే దీనిని ‘కారుణ్య వినియోగ ఔషధం’గా మాత్రమే వాడుతున్నారు’అని రాజీవ్ వివరించారు. చదవండి: ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం -
కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా.. వైరస్ వ్యాప్తితో శుక్రవారం ప్రార్థనలు బంద్ చేశారు. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్ట్ లిస్ట్ కూడా క్రమంగా హెచ్చవుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 950 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండగా.. 213 మంది అధిక ముప్పు ఉన్న జాబితాలో ఉన్నారు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారిలో 287 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. అధిక ముప్పులో ఉన్న 15 మంది షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. కంటెయిన్మెంట్ జోన్లో ఏడు గ్రామాలు.. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు బంద్.. నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కంటెయిన్మెంట్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. అప్రమత్తమైన కేంద్రం.. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలను కేరళకు పంపించింది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. బంగ్లాదేశ్ వేరియంట్.. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో అలర్ట్.. కేరళలో నిఫా వైరస్ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. సరిహద్దు జిల్లాల్లో ఫీవర్ సర్వెలెన్స్ వంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులకు ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయడం సహా వైద్యులకు శిక్షణ తరహా చర్యలు చేపడుతోంది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా -
నిఫాపై నిరంతర నిఘా
తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ రాష్ట్రంలో వెలుగుచూడటంతో కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది. నిఫా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించేందుకు కావాల్సిన యాంటీవైరల్ ఔషధాలు కేరళకు చేరుకున్నాయని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖతో రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ‘ నిఫాకు ఉన్న ఏకైక యాంటీవైరల్ చికిత్స.. మోనోక్లోనల్ యాంటీబాడీలే. అందుకే వాటిని హుటాహుటిన రాష్ట్రానికి తెప్పించాం. కోజికోఢ్ జిల్లాలో నిఫా వెలుగుచూడడంపై ఆందోళన వద్దు. జిల్లాలోని ప్రజానీకం సరైన నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కగలం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మహిళా మంత్రి వీణ జార్జ్ వ్యాఖ్యానించారు. కోజికోడ్ జిల్లాలో వ్యాపించిన వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్షెక్షన్ రేటు తక్కువ ఉన్నాసరే మరణాల రేటు ఎక్కువ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. పుణె నుంచి వైరాలజీ నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపిన విషయం తెల్సిందే. 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిఫా సోకడంతో ఇప్పటిదాకా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కోజికోఢ్ జిల్లా మాత్రమేకాదు ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన రాష్ట్రం మొత్తం పడే వాతావరణం అక్కడ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించాయని కేరళ సర్కార్ పేర్కొంది. బుధవారం సాయంత్రం నాటికి కోజికోడ్‌లో 11 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. -
అప్రమత్తత అవసరం
మరపునపడిందనుకున్న ఆ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడును దెబ్బ తీసే ప్రాణాంతక నిపా వైరస్ (ఎన్ఐవీ) మరోసారి దేశంలో జడలు విప్పుతోంది. వస్తూనే కేరళలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకొని, పాజిటివ్ వచ్చిన మరికొందరి ఆరోగ్యాన్ని అయోమయంలోకి నెట్టి, సన్నిహితంగా మెలిగిన మరో 800 మందిపై వైద్యపర్యవేక్షణ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చింది. వీరిలో 77 మంది ప్రమాదస్థితిలో ఉన్నారనీ, వైరస్ సోకినవారిలో 155 మంది ఆరోగ్య కార్యకర్తలూ ఉన్నారనీ వస్తున్న వార్త ఆందోళన పెంచుతోంది. నిపా సోకితే సహాయక చికిత్సే తప్ప, రోగాన్ని తగ్గించే మందులు కానీ, నివారించే టీకా కానీ ఇప్పటిదాకా లేకపోవడమే పెద్ద సమస్య. కోళిక్కోడ్ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, స్కూళ్ళు – ఆఫీసులు – ప్రజారవాణాకు సెలవిచ్చి, సభలూ సమావేశాలపై నియంత్రణలు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేరళలో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేస్తున్నాయి. కలుషిత ఆహారం, రోగితో సాన్నిహిత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించడం నిపా వైరస్ స్వభావం. 1998లో తొలిసారిగా మలేసియా, సింగపూర్లలో పందుల పెంపకందార్లలో, వాటితో సన్నిహితంగా మెలిగే ఇతరుల్లో ఈ వైరస్ తొలిసారి బయటపడింది. అప్పట్లో 300 పైచిలుకు మందికి వైరస్ సోకితే, వంద మందికి పైగా మరణించారు. ఆపై అది వేలాది మైళ్ళు ప్రయాణించి, వివిధ దేశాలకు విస్తరించడం, వైరస్ సోకినవారిలో 72 నుంచి 86 శాతం మంది మరణించడం సంచలనమైంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందుల శరీరద్రవాల ద్వారా మనుషుల కిది వ్యాపిస్తుందట. నిపా సోకితే జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, వాంతులతో మొదలై పరిస్థితి తీవ్రమైతే మెదడువాపు, మూర్ఛలతో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. 1998 – 2015 మధ్య 600కు పైగా కేసులు వచ్చాయని అది లెక్క తేల్చింది. ఈ మాయదారి వైరస్ మన దేశంలో పంజా విసరడం ఇదేమీ తొలిసారి కాదు. గడచిన అయి దేళ్ళలో ఇది నాలుగోసారి. మెదడు మీద దాడి చేసే ఈ అనారోగ్య భూతం 2018 మేలో మొదటిసారి వచ్చినప్పుడు దానిని కట్టడి చేసేలోగా వైరస్ సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. ఆ తరువాత 2019, 2021ల్లో కూడా కేరళ తీరాన్ని ఈ వైరస్ తాకింది. మలబారు సీమలో బయటపడ్డ ఈ తాజా నిపా కేసులకు బంగ్లాదేశ్ వేరియంట్ కారణమని గుర్తించారు. మిగతావాటితో పోలిస్తే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువే అయినా, సోకినవారిలో సగటున నూటికి 70 మంది మరణిస్తున్నారన్న గణాంకాలు గుబులు రేపుతున్నాయి. రోగులకు సన్నిహితంగా మెలిగినవారు ఐసొలేషన్‌లోకి వెళ్ళడం, జనమంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి కార్యాచరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గబ్బిలపు వైరస్ పదేపదే విరుచుకు పడే ప్రమాదం ఎక్కువని మేలో రాయిటర్స్ పరిశోధన తేల్చింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇష్టారాజ్యపు పట్టణీకరణ, ఫలితంగా వన్యప్రాణులతో మానవ సంఘర్షణ – వీటన్నిటి పర్యవసానం ఇదని ఆ పరిశోధన గుర్తించింది. ఇక, మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా 8 రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో ఈ ప్రాణాంతక వైరస్ ఛాయలున్నట్టు ఈ ఏడాది జూలైలో భారతీయ వైద్య పరిశోధనా మండలి అధ్యయనం సైతం నిర్ధరించింది. అయితే, కేరళపైనే తరచూ ఈ వైరస్ దాడికి కారణం – జనసాంద్రత, భౌగోళిక పరిస్థితులు, వానలంటూ రకరకాల ప్రచారాలున్నాయి. కచ్చితమైన కారణా ల్నింకా కనిపెట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర బృందం కేరళ వెళ్ళి సంక్షోభంలో సాయపడుతోంది. నిపాకు ప్రధాన కారణమని భావిస్తున్న ఫ్రూట్ బ్యాట్స్ (పండ్లను కొట్టే గబ్బిలాల) సంఖ్య కేరళలో ఎక్కువైతే కావచ్చు కానీ, వాటి నిర్మూలన కుదరదు. కాబట్టి, ఒకేచోట, ఒకేలా కాకపోయినా ఏటా నిపా వైరస్ ముప్పు తప్పదని గ్రహించి, కేరళ సహా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి. జంతువుల నుంచి మానవులకు సోకే ఇలాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ఆనుపానులు పసిగట్టేందుకు మహమ్మారులపై పరిశోధన అవసరం. కానీ, కేరళే కాదు... కేంద్రం కూడా నిపాపై తగినంత శ్రద్ధ చూపలేదనే చెప్పాలి. పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తరహాలో తిరువనంతపురంలో అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పినా, అది ఇప్పటికీ పూర్తిగా కార్యాచరణలోకి దిగలేదు. అంతకంతకూ పెరుగు తున్న సాంక్రమిక వ్యాధుల రీత్యా తక్షణమే ఆ సంస్థ సేవలపై దృష్టి సారించాలి. 2018 నిపా తాకి డిలో, తర్వాత కరోనా కాలంలో సమర్థనీయంగా పనిచేసిన కేరళ మరోసారి కృతనిశ్చయం చూపాలి. ఇప్పటి వరకు ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆసియా దేశాలకే ఈ వైరస్ పరిమితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇది విస్తరించకపోవడం అదృష్టమే. కానీ, భవిష్యత్తులో విస్తరించదనే నమ్మకం ఏమీ లేదు. వైరస్ల విజృంభణలు, ప్రాణాంతక రోగాలు... ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. అయితే, చికిత్స లేని రోగాలు, వైరస్‌లపై శాస్త్రీయ పరిశోధనలతో ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా నిపా కేసులు గుర్తుచేస్తున్నాయి. నిన్న కాక మొన్న కరోనా కట్టడిలో అలాంటి పోరే మానవాళికి మేలు చేసిందని మరచిపోరాదు. అయితే, అందుకై పరిశోధన – అభివృద్ధి విభాగానికి కావాల్సిన వనరుల్ని అందించడం తక్షణ అవసరం. ఈలోగా చేతుల శుభ్రత, మాస్కుధారణ, స్వచ్ఛమైన ఆహారాన్నే భుజించడం సదా ఆరోగ్యమనీ, అది మన చేతుల్లోని పని అనీ అందరం గుర్తించాలి. ఎందుకంటే... చికిత్స కన్నా నివారణ, భయం కన్నా అప్రమత్తతే పరమౌషధం! -
ఐదుకి చేరిన నిఫా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 706 మంది..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హై రిస్క్ జోన్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిఫా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
నిఫా ఎఫెక్ట్: కంటైన్మెంట్ జోన్లు, స్కూల్స్ బంద్..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడి ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి వైరస్ సోకింది. ఇందులో తొమ్మిది ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో ప్రభుత్వం కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ 130 మందికి సోకిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు రానున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!
తిరువనంతపురం: దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిపా వైరస్ ప్రబలుతోంది. నిపా వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు. #NewsAlert| Nipah Virus alert issued in Kerala's Kozhikode after two 'unnatural' deaths. — NDTV (@ndtv) September 12, 2023 అలాగే, మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. అయితే, 2018, 2021లో కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ కారణంగా పలువురు మరణించారు. మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించింది. నిపా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. ఇది సోకినవారిలో.. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లోలాగానే.. జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్’కు దారితీయవచ్చు. అకస్మాత్తు మరణం.. అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్ఎన్ఏ వైరస్’. మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ‘నిపా’ ఫ్రూట్ బ్యాట్ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే.. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్) వల్ల కాకుండా.. వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్లెట్స్) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి.. మాస్క్ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది. ఇది కూడా చదవండి: క్యాన్సర్ కణాలకు చెక్! -
చైనాలో మరో కొత్త వైరస్
-
మళ్లీ వణికిస్తున్న నిఫా...
మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. కానీ దానికి అప్పుడంత ప్రాచుర్యం లభించలేదు. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించిన నిపా... ఇప్పుడు తాజాగా మరోసారి అక్కడ వ్యాపిస్తోంది. వారం కిందట అక్కడి ఓ చిన్నారిని కబళించింది. ఓ వైపు కరోనా.. మరో వైపు నిపా అక్కడ విలయం సృష్టిస్తున్నాయి. కరోనా సోకితే మరణావకాశాలు కేవలం 2% నుంచి 5% శాతమే. కానీ నిపాతో అది 40% –70%. అయితే కరోనా కంటే దాని వ్యాప్తి ఒకింత తక్కువగా కనిపిస్తున్నందున అంతగా ఆందోళన అక్కర్లేదు. కానీ అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. నిర్ధారణ: ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణే)లో నిర్వహించే అలైజా పరీక్ష ద్వారా దీని నిర్ధారణ చేస్తున్నారు. లక్షణాలు నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24 – 48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. ఇది సోకినవారిలో... అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లోలాగానే... జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్’కు దారితీయవచ్చు. అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్ఎన్ఏ వైరస్’. మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది. మన దేశంలోని కేరళలో 2018 మే నెలలో ఒకసారి... ఆ తర్వాత మళ్లీ తాజాగా ఇప్పుడూ అక్కడే కనిపిస్తూ బెంబేలెత్తిస్తోంది. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్) తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ‘నిపా’ ఫ్రూట్ బ్యాట్ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే... ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్) వల్ల కాకుండా... వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్లెట్స్) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి... మాస్క్ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది. -
నిపా వైరస్: పండ్లు కడిగే తింటున్నారా?
థర్డ్ వేవ్‌తో కరోనా విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నిఫా వైరస్ పేరు మళ్లీ వినిపించడం వైద్యసిబ్బందిని కలవరపాటుకు గురి చేస్తోంది. కేరళలో పన్నెండేళ్ల బాలుడు నిపా వైరస్ కారణంగా చనిపోవడంతో కేరళ, ఆ పొరుగునే ఉన్న తమిళనాడు జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. ఈ తరుణంలో ఫేక్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. నిపా విషయంలో అప్రమత్తంగా ఉంటేనే నష్టనివారణ చేయొచ్చని సూచిస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. నిపా.. జూనోటిక్ డిసీజ్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అయితే మనిషి నుంచి మనిషికి సోకడమనే ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. అందుకే జంతువులు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అశుతోష్ బిస్వాస్ చెబుతున్నారు. ఫ్రూట్ బ్యాట్(గబ్బిలాలు) లాలాజలం నుంచి, వాటి విసర్జితాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రత్యేకించి చికిత్స విధానమంటూ నిపా వైరస్‌కు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండడమే మార్గమని డాక్టర్ బిస్వాస్ అంటున్నారు. సెప్టెంబర్ 5న నిపా కారణంగా కేరళ కోజికోడ్ బాలుడు చనిపోగా.. బాధితుడి ఇంటి నుంచి సేకరించిన ‘రాంభూటాన్ పండ్ల’(చెట్టు నుంచి కిందపడిన పండ్లు) ద్వారా వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు కడగాల్సిందే! గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల(ఫ్రూట్స్) విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిస్వాస్ సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్‌ను అంటిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలామంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను సంబరంగా తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను.. కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు డాక్టర్ బిస్వాస్. పండ్లు ఎలాంటివైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలని ఆయన సూచిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ జాగ్రత్త తప్పక పాటించాలని, లేకుంటే ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారాయన. ప్రాథమిక జాగ్రత్తలు ► పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం.. వాటిని బయటకు తీసుకెళ్లినప్పుడు ఓ కంటకనిపెడుతుండడం. ► చేతులను తరచు సబ్బుతో శుభ్రం చేసుకోవటం. ► ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం ► పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. లక్షణాలు ► శ్వాసకోశ సమస్యలు, ► జ్వరం ► ఒళ్లు నొప్పులు ► తలనొప్పి ► వాంతులు ► లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ► నిపా నిర్ధారణ అయితే వైద్యసిబ్బందిని సంప్రదించడం. మలేషియాలో పందుల పెంపకందారులకు మొదటిసారిగా నిపా వైరస్ సోకింది. భారత్‌లో మొదటిసారి పశ్చిమబెంగాల్లో, రెండోసారి కేరళలో విజృంభించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వచ్చింది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. చదవండి: మరోసారి నిపా కలకలం -
కేరళలో నిఫా కలకలం:రాష్ట్రానికి హుటాహుటిన తరలివెళ్లిన కేంద్ర బృందం
-
కేరళలో నిఫా కలకలం
కోజికోడ్: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్ బయటపడింది. నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది. బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించాం. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్ ఉన్న 20 మందిని కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచాం. వీరిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్ జాడలు బయటపడ్డాయి’అని ఆమె వివరించారు. ‘కోజికోడ్ మెడికల్ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశాం. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించాం’అని మంత్రి తెలిపారు. ‘ఇక్కడే నిఫా వైరస్ నిర్థారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని పుణె ఎన్ఐవీ అధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. కాగా, దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్ బారినపడిన 17 మంది చనిపోయారు. ఏమిటీ నిఫా..! ఇది›జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. లక్షణాలేమిటి? ► బ్రెయిన్ ఫీవర్ ► తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. ► ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ► ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వ రం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం. ► కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం ► 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది. ► మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు. గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్–టైమ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ–పీసీఆర్) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్ ఐసోలేషన్ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు. మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది? నిఫా వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి. చికిత్స ఉందా?: నిఫా వైరస్ బాధితులకు ప్రస్తుతానికి నిరి్ధష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్ డ్రగ్ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు. -
Nipah Virus: 12 ఏళ్ల బాలుడు మృతి
-
నిఫా కలకలం: 12 ఏళ్ల బాలుడు మృతి
తిరువనంతపురం: కోవిడ్‌తో విలవిల్లాడుతున్న కేరళను మరో మహమ్మారి భయపెడుతుంది. కేరళలో మరోసారి నిఫా వైరస్ వెలుగు చూసింది. తాజాగా కేరళలో నిఫా వైరస్ బారిన పడి ఓ బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. 12 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో ఈనెల 3న కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అందులో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నిఫా వైరస్ కారణంగానే బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. వారందరిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పని ప్రారంభించామని తెలిపారు. (చదవండి: Covid-19: పదిరోజులు జాగ్రత్త.. లేదంటే..) కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిఫా వైరస్ వల్లే బాలుడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కోజికోడ్ పంపించింది. కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్‌గున్యా 1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
కేరళలో నిఫా కలకలం!
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి నిఫా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. విద్యార్ధికి సంబంధించిన రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కాలమస్సరి వైద్యకళాశాల ఆస్పత్రివర్గాలు ఆ విద్యార్థికి ప్రత్యేకవార్డు కేటాయించాయని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఎర్నాకుళంకు చెందిన సదరు విద్యార్థి ఇటీవల క్యాంపు నిమిత్తం త్రిశూర్‌కు వెళ్లాడని, ఆ సందర్భంగా అతడికి జ్వరం సోకడంతో ఆసుపత్రిలో చేరాడని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రీనా తెలిపారు. ఆ క్యాంపులో 16 మంది విద్యార్థులు ఉన్నారని, అతడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు విద్యార్థులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఏవైనా అనుమానిత కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి ఆదేశించారు. కేరళలో గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
కేరళలో మళ్లీ నిఫా కలకలం!
తిరువనంతపురం : కేరళకు చెందిన ఒక విద్యార్థి నిఫా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం కలకలం రేపుతోంది. గతేడాది 17 మంది ప్రాణాలు బలిగొన్న నిఫా వైరస్ కేరళ వ్యాప్తంగా డెంజర్ బెల్స్ మోగించిన సంగతి తెలిసింది. ఈ వైరస్ బారిన పడినవారికి చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడా మరణించారు. అయితే తాజాగా ఓ విద్యార్థికి నిఫా వైరస్ సోకిందనే వార్తలు భయాందోళనలు రేకెతిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ వ్యక్తికి నిఫా వైరస్ సోకిందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఇడుక్కి జిల్లాలోని తోడుపుజలోని ఒక కళాశాలలో చదువుకుంటున్న 23 ఏళ్ల ఆ విద్యార్థి ప్రస్తుతం శిక్షణలో భాగంగా త్రిసూర్‌కు వచ్చారు. అయితే అతనికి తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులు గడిచిన జ్వరం తగ్గకపోవడంతో అతన్ని ఎర్నాకులంలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్చారు. అతనికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ సీఎం పినరాయి విజయన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థి రక్త నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్టు తెలిపారు. అతనికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అతడికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తుది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉందన్నారు. మరోవైపు రంగంలోకి దిగిన ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. -
కేరళ పండుగ కళ తప్పింది
మొన్న నిఫాతో బెంబేలెత్తిన స్వర్గసీమ కేరళ నిన్న వరదబీభత్సానికి చివురుటాకులా వణికిపోయింది. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ వరకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కేరళ అనగానే గుర్తొచ్చే పూల పండుగ పది రోజులపాటు ప్రతిఇంటా ఆనందాలు వెల్లవిరిసేవి. బంతులు, చామంతులూ, మల్లెలూ ఒకటేమిటి అన్ని పూలూ కేరళని ముంచెత్తేవి. ఓనమ్ పండుగ పదిరోజులూ ప్రతి ఇంటా పూల తివాచీలే పరిచేవారు. కానీ ఈసారి వరదలు సృష్టించిన బీభత్సం కేరళ ప్రజల జీవితాలను చిందరవందరచేసింది. వ్యాపారుల దగ్గర్నుంచి పూలుకొనేవాళ్ళే కరువయ్యారు. ప్రతియేటా ఇదే సీజన్లో జరిగే కేరళ ప్రసిద్ధ ఓనమ్ పండుగకు దాదాపు 800 టన్నుల పూల వ్యాపారం జరిగేది. కేరళ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని తిరునాల్వేలి నుంచి తరలివచ్చే పూల వ్యాపారులకు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఒక్క తిరునాల్వేలి నుంచే కాకుండా హోసూర్, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగుళూరుల నుంచి వచ్చే పూల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మతాలకతీతంగా కేరళ ప్రజలు జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలో జరిగే మొత్తం వ్యాపారమే కీలకం. ఎలక్ట్రానిక్స్, బట్టల వ్యాపారంలో 15 శాతం బిజినెస్ ఈ పండుగ రెండు వారాల్లోనే జరుగుతుంది. మాల్స్, సూపర్ మార్కెట్స్, బట్టల షాపులు పండుగ ఆఫర్లతో వ్యాపారం మరింత జోరుగా సాగేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారమే లేదని త్రిస్సూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టిఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. కేరళ రాష్ట్రానికి అధికాదాయ వనరు అయిన పర్యాటకరంగం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నది. కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటంతో చాలా మంది టూరిస్టులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. అలప్పుజా, మున్నార్, కుమరకమ్, పెరియార్ లాంటి ప్రధాన పర్యాటకప్రాంతాల్లో దాదాపు 95 శాతం పర్యాటకులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. ’’రోడ్లు పునర్నిర్మించాలి. పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్థం పునః ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా సజావుగా సాగడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది. సహజంగానే స్థానిక ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఎయిర్ ట్రావెల్స్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇఎం నజీబ్ తెలిపారు. కేరళలో పర్యాటకుల తాకిడి అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి మాత్రం 70 నుంచి 80 శాతం రెవెన్యూకి గండిపడుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వైద్యం కోసం, ఇతర ఆరోగ్య అవసరాలకోసం ప్రతియేటా చాలా మంది వివిధ ప్రాంతాలనుంచి కేరళకి వెళుతుంటారు. అయితే ఈసారి మెడికల్ టూరిజం కూడా 50 శాతం నష్టపోయిందని ధాత్రి ఆయుర్వేద ఎండి, సిఐఐ కేరళ అధ్యక్షుడు డాక్టర్ సాజికుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్క పేషెంట్ కూడా రావడం లేదనీ మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందనీ ఆయన వివరించారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించింది. పనిదినాలు, పర్యాటకుల పర్యటనల రద్దు, ఇతరత్రా అన్నీ కలుపుకొని 25,000 కోట్ల రూపాయల వరకూ రాష్ట్రం నష్టపోయినట్టు అంచనా వేసారు. అయితే ఇంత నష్టం జరిగినా కేరళల ప్రజలు, అధికారులు, సాధారణపౌరులూ, వైద్యులూ తమకు తోచిన విధంగా కేరళ పునర్నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. కొచ్చిలోని అస్తర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ సిఇఓ డాక్టర్ హరిప్రసాద్ పిళ్ళై మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ఆసుపత్రిలో పనిచేసే 80 మంది డాక్టర్లు, 150 మంది నర్సులు 20 పునరావాస కేంద్రాల్లోనూ, కొచ్చీ, కలమస్సేరిలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రజాసేవలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అధికారుల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. వైద్య పరంగా ఈ యేడాదిలో నిఫా వైరస్ తర్వాత కేరళ ప్రజలెదుర్కొన్న రెండవ ఛాలెంజ్ ఇదేనని ఆయన అన్నారు. -
కేరళ వరదలు: నర్సు లినీ భర్త పెద్దమనసు
తిరువనంతపురం: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు అనేక మంది సెలబ్రిటీలు, పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ దాత ఆకర్షణీయంగా నిలిచారు. వరదబాధితుల సహాయార్ధం తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇంతకీ ఎవరా దాత అనుకుంటున్నారా... కేరళను వణికించిన నిపా వైరస్ భూతానికి బలైపోయిన లినీ భర్త.. సాజీష్. కేరళలో నిపా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి అందరి మనసుల్లో నిలిచిపోతే.. ఆమె భర్త కూడా ఆమె అడుగుజాడల్లోనే నడిచి పెద్దమనసును చాటుకున్నారు. తన దాతృత్వంతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. లినీ మరణం తరువాత ఆమె భర్త సాజీష్ బహ్రెయిన్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కోసం కేరళకు తిరిగి వచ్చారు. ప్రభుత్వ వాగ్దానం ప్రకారం కొఠారి పబ్లిక్ హెల్త్ సెంటర్లో డివిజనల్ క్లర్క్‌గా ఉద్యోగాన్ని ఇచ్చింది. ఒక నెలక్రితం సాజీష్ ఈ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతలో కేరళ ప్రజలు వరదలతో భారీ విపత్తులో చిక్కుకున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులకు ఈ కథనాలను చూసినసజీష్ తన మొదటి నెలజీతాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్‌కు చెక్‌ను కార్మికశాఖ మంత్రి రామకృష్ణన్‌కు అందించారు. కాగా ఇటీవల కేరళలో ప్రాణాంతక నిపా వైరస్ కలకలం రేపింది. దాదాపు 16మందిని పొట్టన పెట్టుకుంది. అయితే ఈ వ్యాధి బారిన పడిన బాధితులకు విశేష సేవలందించిన నర్సు లినీ చివరకు ఆ నిపా వైరస్‌కు బలైపోయింది. ఈ సందర్భంగా తన చివరి క్షణాల్లో భర్తకు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. అయితే లినీ మరణంపై స్పందించిన కేరళ సర్కారు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. లినీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, లినీ ఇద్దరు పిల్లలకు (5 ఏళ్లు, 2 ఏళ్లు) రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘నిపా’ వైరస్‌కు బైబై చెబుతూ ఓ పాట
-
అలరిస్తున్న ‘బై బై నిపా’
సాక్షి, వెబ్ డెస్క్ : గడగడలాడించిన ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందితే ఎవరికైనా ఎలా ఉంటుంది? మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కలిగితే మరింకెలా ఉంటుంది? ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందే గానీ అక్షరాల్లో అంత అందంగా చెప్పలేకపోవచ్చు. మరి పాటలో ! అందుకే మరి, కేరళ ప్రజలు గత మార్చి నెల నుంచి తమ తీవ్ర భయాందోళనలకు గురి చేసి నగరం నుంచి నిష్క్రమించిన ‘నిపా’ వైరస్‌కు బైబై చెబుతూ ఏకంగా ఓ పాటనే పాడారు. ఏ షాజి కుమార్ పాటను రాయగా, సాయి బాలన్ సంగీతం సమకూర్చగా, బీబీ బాల్ ప్రేక్షకుల హృదయాలను కదిపేలా పాడారు. పాటకు అనుగుణంగా యువకులు, ముఖ్యంగా యువతులు సింపుల్‌గా, ఆకర్షణీయంగా నత్యం చేశారు. నిపా వైరస్ నుంచి ఇల్లు, వాడ, కూడలి, నగరం మొత్తం విముక్తి చెందిందన్నట్లుగా మాల్స్‌ను, బస్టాండ్లను, రైల్వే స్టేషన్లు, బీచ్ ఒడ్డును చూపిస్తూ కెమేరా గంతులేసింది. నిపా వైరస్ సోకినట్లు మొదటి కేసు నమోదైనప్పటి నుంచి వారం రోజుల్లోగా వైరస్ వ్యాప్తిని కేరళ వైద్యులు అరికట్టగలిగారు. నిపా వైరస్ అంతం చూసే వరకూ అవిశ్రాంతంగా కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాట సాగి, నిపాకు బైబై చెబుతూ ముగుస్తుంది. -
ఇలా అయితే నిఫా వైరస్ సోకదా?
బొబ్బిలి : పర్యావరణంలో దేశానికే తలమానికం అంటూ ఇటీవల ఉన్నతాధికారుల నుం చి ఢిల్లీలో అవార్డునందుకున్న బొబ్బిలి మున్సి పాలిటీ నడిబొడ్డున గబ్బిలాల చెట్టు ఆ అవా ర్డుకే ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి సీహెచ్‌సీ వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టుపై పెద్ద సం ఖ్యలో గబ్బిలాలు తిష్టవేసి ఉన్నాయి. దశాబ్దా ల కాలం నుంచి ఈ చెట్టు ఇక్కడే ఉన్నా... ఇటీవల గబ్బిలాల కారణంగా నిఫా వైరస్ సోకుతుందన్న దుమారం రేగడంతో ఇక్కడివారిలో ఆందోళన మొదలైంది. చెట్టు నిండా పెద్ద సం ఖ్యలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా వేల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతునే ఉంటా యి. నిఫా వైరస్ తో దేశంలోని వివిధ ప్రాం తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు మరణించిన విష యం దావానలంలా వ్యాపించడంతో ఇప్పు డు అందరి దృష్టి ఈ గబ్బిలాల చెట్టుపై పడిం ది. ఈ ఆస్పత్రికి నిత్యం 250 నుంచి 300కు పైగా ఓపీ రోగులు వస్తున్నారు. ఇవి గాకుండా 40 వరకూ ఇన్‌పేషెంట్లు విభాగానికి వస్తుం టారు. పక్కనే గబ్బిలా ల చెట్టు ఉండటంతో వా టి వ్యర్థాలు పడుతుంటాయి. అంతేగాదు. ఆస్పత్రి 50పడకలుగా విస్తరింపజేసి.. అదనపు భవనాలు నిర్మించనున్న నేపథ్యంలో ఈ చెట్టుపై ఉన్న గబ్బిలాలనుంచి వైరస్ సోకేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి మరీ..
సాక్షి, కోజికోడ్ : ధనార్జనే ధ్యేయంగా యాంత్రికంగా సాగుతున్న సమాజంలో వృత్తిని ప్రాణంగా ప్రేమించే వైద్యులు అరుదవుతున్న రోజుల్లో ఓ వైద్యుడి చర్య అందరినీ కదిలించింది. ప్రాణాంతక నిపా వైరస్‌తో మరణించిన రోగి అంత్యక్రియలను జరిపేందుకు బంధువులే వ్యాధి సోకుతుందనే భయంతో వెనుకాడితే డ్యూటీని పక్కనపెట్టి మరీ వైద్యుడు స్వయంగా ఆ తతంగం పూర్తిచేశారు. కోజికోడ్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ గోపకుమార్ స్వయంగా నిపా వైరస్‌తో మరణించిన 12 మంది మృతదేహాలకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి అంతిమ యాత్రను పర్యవేక్షించారు. ముగ్గురు నిపా బాధితుల అంత్యక్రియలను తాను నిర్వర్తించానని 41 ఏళ్ల గోపకుమార్ పేర్కొన్నారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటివరకూ 17 మంది మరణించారు. వీరిలో 14 మంది కోజికోడ్‌లో మరో ముగ్గురు పొరుగన ఉండే మలప్పురంలో తుదిశ్వాస విడిచారు. నిపా వైరస్‌తో మరణించిన 17 సంవత్సరాల బాలుడి అంత్యక్రియలను తాను నిర్వహించానని, నిపా వైరస్ సోకిందనే అనుమానంతో అతడి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడ్ని చూసే పరిస్థితిలోనూ లేరని గోపకుమార్ చెప్పారు. బాలుడి అంతిమయాత్రలో అతని సమీప బంధువులు, కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడం తనను బాధించిందని అన్నారు. అయితే బాలుడి అంత్యక్రియలను హిందూ సంప్రదాయాల ప్రకారం పూర్తిచేయాలని భావించి పూర్తి లాంఛనాలతో జరిపించానని చెప్పారు.ఇది తన బాధ్యతగా చేపట్టానని డాక్టర్ గోపకుమార్ చెప్పడం అక్కడివారిని కదిలించింది. -
నిపా కలకలం : కేరళ ఉత్పత్తులపై నిషేధం
రియాద్ : ప్రాణాంతక నిపా వైరస్ వ్యాప్తిపై భయాందోళనల నేపథ్యంలో కేరళ నుంచి ప్రాసెస్డ్ పండ్లు, కూరగాయల దిగుమతుపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. నిపా వైరస్ కారణంగా మెదడులో ప్రమాదకర వాపుతో పాటు తీవ్ర జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం తలెత్తుతాయని గల్ఫ్ న్యూస్ పేర్కొంది. మే 29న కేరళ నుంచి దిగుమతులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స నిషేధించింది. కేరళ నుంచి దిగుమతికి సిద్ధమైన వంద టన్నుల పండ్లు, కూరగాయలు, తాజా ఉత్పత్తులను దేశంలోకి ప్రవేశించేందుకు నిరాకరించామని యూఏఈ అధికారులు పేర్కొన్నారు. కాగా నిపా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మందులతో కూడిన విమానాన్ని యూఏఈ సంస్థ వీపీఎస్ హెల్త్‌కేర్ కేరళకు తరలించింది. కేరళలో నిపా వైరస్‌తో బాధపడే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు. మిగిలిన ఇద్దరు కోజికోడ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరో 2000 మంది అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
రుయా ఆసుపత్రిలో నిఫా వైరస్ కలకలం
-
తిరుపతిలో నిపా వైరస్ కలకలం..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ‘నిపా’ వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌కి ‘నిపా’ వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. ‘నిపా’ వైరస్ కలకలంపై చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న స్పందించారు. మదనపల్లికి చెందిన డాక్టర్‌కి ‘నిపా’ వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని కలెక్టర్ చెప్పారు. రుయా ఆస్పత్రిలో కేరళ వైద్యురాలిని కలెక్టర్ పరామర్శించారు. వైద్యుల పర్యవేక్షణలోనే కేరళ డాక్టర్ ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఒక ‘నిపా’ వైరస్ కేసు నమోదు కాలేదని ప్రద్యుమ్న తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. కేంద్రం సూచనల మేరకు ఆమెను వైద్యుల పర్యవేక్షనలో ఉంచారన్నారు. వైద్య పరీక్షల అనంతరం మహిళకు ‘నిపా’ వైరస్ లేదని డాక్టర్లు వెల్లడించారు. -
కేరళలో విజృంభిస్తున్న నిఫా వైరస్
-
16 మందిని మింగిన ‘నిపా’
కోజికోడ్, కేరళ : ప్రాణాంతక ‘నిపా’ వైరస్ మహమ్మారి కేరళలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ‘నిపా’ బారిన పడి మరణించినవారి సంఖ్య 16కు చేరుకుంది. అంతేకాక కోజికోడ్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ‘నిపా’ వైరస్ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. మధుసూధన్(56), అకిహిల్ కరస్సేరి(28) కోజికోడ్‌లోని మెడికల్ కాలేజ్ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది ‘చికిత్స ప్రారంభంలో కోలుకున్నట్లే కనిపించారు...కానీ తరువాత పరిస్థితి విషమించడంతో వారు మరణించారు. వీరికి ఈ వైరస్ ఆస్పత్రి నుంచే సోకిందన్నా’రు. మరో వ్యక్తికి కూడా నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోజికోడ్ ఆస్పత్రిలో ‘నిపా’ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ముగ్గురు, వైరస్ లక్షణాలు ఉన్న వారు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కోల్‌కతాలో మరణించిన సైనికుడు శీను ప్రసాద్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం తనకు తెలియదని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ సరిత తెలిపారు. శీను ప్రసాద్.. నిపా వైరస్ బారిన పడే మరణించాడనే అనుమానం నేపథ్యంలో అతని శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. అయితే బుధవారం మరణించిన అకిహిల్ ‘నిపా’ వ్యాప్తి ఉన్న ప్రాంతం వాడు కాదని, కనీసం ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే అకిహిల్ ఈ మధ్యే కొజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితున్ని చూడడానికి వచ్చాడని అతని బంధువులు తెలిపారు. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే చాలా వరకూ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రభుత్వం వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తుంది. -
కోల్‌కతాలో నిపా వైరస్ కలకలం
కోల్‌కతా : కోల్‌కతా మహానగరంలో కేరళకు చెందిన సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచారు. శీను ప్రసాద్ ఫోర్ట్ విలియం కోటలో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించని ప్రసాద్ సోమవారం తుది శ్వాస విడిచారు. కాగా, ప్రసాద్ నిపా వైరస్ సోకి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్ శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. కాగా, కేరళలో ఇప్పటికి నిపా వైరస్‌తో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి అంటూ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరికి వచ్చిన వారినందరినీ రాహుల్ నాశనం చేస్తాడని అనిల్ అన్నారు. ‘రాహుల్ నిపా వైరస్ లాంటి మనిషి. పార్టీని సర్వనాశనం చేస్తాడు. దగ్గరైన వారికీ పతనం తప్పదు’ అని అనిల్ అన్న మాటలను ఓ ప్రకటన రూపంలో హరియాణా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. కాగా, అనిల్ విజ్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ తాజ్ మహల్ ఓ అందమైన సమాధి అనీ, మహాత్మాగాంధీ ప్రభావం వల్ల ఖాదీకి విలువ పెరగకపోగా, రూపాయి విలువ తగ్గిపోయిందని అనిల్ వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీ ఓ నిపా వైరస్
చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానమని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడుతున్నారు. ‘రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానం. ఏ రాజకీయ పార్టీ అతనితో కలసినా నాశనం కావల్సిందే.’ అని అనిల్ విజ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ బీజేపీ మంత్రి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్‌లు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని, కానీ నెహ్రు, మహాత్మ గాంధీలు కనీసం ఓ లాఠి దెబ్బకూడ తినలేదని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టినప్పుడు సైతం అనిల్ విజ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పక్షులు తిని పడేసే పండ్లు వల్ల వచ్చే ఈ వైరస్ తొలిసారి 1998 మలేషియాలో గుర్తించారు. राहुल गांधी #निपाह वायरस के समान है । जो भी राजनीतिक पार्टी इसके सम्पर्क में आएगी वह फना हो जाएगी । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 27, 2018 -
హైకోర్టు ప్రాంగణంలో గబ్బిలాలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలో పెద్ద సంఖ్య లో గబ్బిలాలున్నాయని.. వీటితో కోర్టుకు వచ్చే వారికి నిపా వైరస్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు సోమవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. న్యాయవాదుల తరఫున ఎన్.కృష్ణకుమార్‌గౌడ్ రిజిస్ట్రార్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టులో వందల సంఖ్యలో గబ్బిలాలున్నాయని, ప్రతీరోజూ న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు కక్షిదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, కాబట్టి నిపా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముం దన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్లు, జ్యూస్ స్టాళ్ల వద్ద శుభ్రత పాటించేలా చూడాలని కోరారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుంటారని, ఆ చెట్ల మీదనే గబ్బిలాలు ఉంటున్నాయని, కాబట్టి ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రికార్డు సమయంలో నిఫాను పసిగట్టారు
నిఫా వైరస్. ఈ పేరు వింటే ఒక్క కేరళయే కాదు దేశమంతా ఉలిక్కి పడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌కి మందుల్లేకపోవడమే అందుకు కారణం. అయితే వైరస్ సోకినప్పుడు అందరికీ ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని గుర్తించడంలోనూ ప్రతిసారీ జరుగుతున్న ఆలస్యం అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. అయితే ఈసారి మాత్రం కేరళలో ఈ వైరస్ ఆనవాళ్లను సకాలంలో గుర్తించడంలో అక్కడి వైద్యుల బృందం సఫలీకృతం అయ్యింది. అందుకు ఓ వైద్యుడి పఠనాసక్తి కారణమైంది. కేరళని కుదిపేసిన ప్రాణాంతక నిఫా వైరస్ తొలిసారి భారత దేశంలోకి ప్రవేశించినపుడు పశ్చిమ బెంగాల్లో పది రోజుల్లో 45 మందిని మింగేసింది. అంతకన్నా ముందు 20 ఏళ్ల క్రితం 1999లో మలేషియాలోని సంఘై నిఫా అనే ప్రాంతంలో ఈ వైరస్ తొలిసారి బయటపడ్డప్పుడు కూడా దీని బారినపడి అనేక మంది మృత్యువాత పడ్డారు. కేరళలో మాత్రం ఇప్పటి వరకు 12 మంది మరణించారు. ఇప్పటికింకా ఈ వైరస్‌కి మందులు లేవు. అయితే దీన్ని సరైన సమయంలో గుర్తించి, తగు జాగ్రత్తలతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అరికట్టడమొక్కటే పరిష్కారం. అయితే కేరళలో నిఫా వైరస్ ఆనవాళ్లను అతి త్వరగా కనిపెట్టగలడానికి కేరళలోని జయకృష్ణ అనే వైద్యుడు, అతని బృందం కారణమయ్యారు. సరిగ్గా నెల రోజుల క్రితమే మెదడు వాపుకి కారణమయ్యే వివిధ రకాల వైరస్‌లకు సంబంధించిన పుస్తకాన్ని డాక్టర్ జయకృష్ణ చదివారట. ఆ పుస్తకంలో నిఫా వైరస్‌కి సంబంధించిన లక్షణాలు, కేరళలోవైరస్ సోకిన వ్యక్తిలో గుర్తించిన లక్షణాలూ ఒకే రకంగా ఉండటం ఆ వైద్యుడినీ, అతడి బృందాన్నీ తక్షణమే స్పందించేలా చేసింది. రాబోయే ప్రమాదాన్నిముందుగానే పసిగట్టి 48గంటల్లోపే వైరస్ నిర్దారణకు ఉపయోగపడింది. ఇదే కేరళ ప్రభుత్వాన్ని, అక్కడి వైద్య బృందాన్నీ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలందుకునేలా చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ మీడియాకు వెల్లడించారు. -
‘నిపా’ వైరస్‌ను ఎలా కనుగొన్నారు?
సాక్షి, తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌లో మే 17వ తేదీన తెల్లవారు జామున రెండు గంటలకు బేబీ మెమోరియల్ ఆస్పత్రికి అనారోగ్యంతో బాధ పడుతున్న ముహమ్మద్ సలీహ్ను తీసుకొచ్చారు. అప్పుడు అతని రక్తపోటు ఎక్కువ, తక్కువ అవుతోంది. గుండె కొట్టుకోవడం కూడా లయ తప్పింది. అతనికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. అంతుపట్టని లక్షణాలతో వచ్చిన అతనికి వైద్యం అందించేందుకు ఆస్పత్రి వర్గాలు ఆరుగురితో ఓ వైద్య బందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందంలో న్యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సీ. జయకృష్ణన్ కూడా ఉన్నారు. ఆయనకు వివిధ జబ్బులు, వైరస్ల గురించి తెలియజేసే పుస్తకాలు, మాగజైన్లు చదవడం అలవాటు. ఆ అలవాటులో భాగంగా ఆయన నెల రోజుల క్రితమే అత్యంత ప్రాణాంతకమైన ‘నిపా’ వైరస్ గురించి చదివాడు. ముహమ్మద్ లక్షణాలను గమనించగానే డాక్టర్ జయకష్ణన్కు నిపా వైరస్ గురించి గుర్తువచ్చింది. వెంటనే ఈ విషయమై తోటి డాక్టర్లను అప్రమత్తం చేశారు. వారు వెంటనే రోగి వెన్నుముక నుంచి, గొంతు నుంచి స్రావాన్ని వెలికి తీసి, వాటితోపాటు రక్తం, మూత్రం నమూనాలను కూడా మే 18వ తేదీన మణిపాల్‌లోని ‘సెంటర్ ఫర్ వైరస్ రీసర్చ్’కు పంపించారు. వైద్య రంగంలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వైద్యులు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. భారత వైద్య మండలి కూడా డాక్టర్లు వైద్యరంగంలో వచ్చే రోజువారి పరిణామాలను తెలుసుకోవాలని చెబుతోంది కానీ అందుకు నిర్బంధం ఏమీ లేదు. అమెరికాలో పదేళ్లకోసారి వైద్యులు తాజా పరిణామాలపై పరీక్ష పాస్ కావాల్సిందే. కాకపోతే పట్టా రద్దవుతుంది. డాక్టర్ జయకృష్ణన్ స్వతహాగా చదువుకోవడం వల్ల నిపా గురించి తెలుసుకోగలిగారు. మలేసియాలో మొట్టమొదటి సారిగా 1998లో కనుగొన్న ఈ వైరస్ గురించి భారత్‌లో కూడా పెద్దగా ఎక్కువగా తెలియదు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 2001లో, 2007లో నాడియాలో బయట పడింది. ఈ రెండు నగరాల్లో కలిసి 71 మందికి ఈ వైరస్ సోకగా వారిలో దాదాపు 50 మంది మరణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నిపా వైరస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు కేరళలో 14 మంది మరణించారు. వారంతా కోజికోడ్, మురప్పురం జిల్లాలకు చెందిన వారు. శాంపిల్స్‌లో నిపా వైరస్ ఉందా, లేదా అన్న విషయాన్ని కనుగొనేందుకు ఓ లాబోరేటరీకి ఆరేడు గంటల సమయం పడుతుంది. 300 కిలోమీటర్ల దూరంలోని మణిపాల్ వైరస్ పరిశోధనా కేంద్రం నుంచి ల్యాబ్ రిపోర్టులు కొరియర్లో బేబి మెమోరియల్ ఆస్పత్రికి రావడానికి కనీసం రెండు రోజులు పడతుంది. అంతసేపు నిరీక్షించడం కుదరదు కనుక ఈ విషయాన్ని ముహమ్మద్ బంధువులకు తెలియజేయగా, వారే స్వయంగా ల్యాబ్ రిపోర్ట్లు తేవడానికి వెళ్లారు. గంట గంటకు ముహమ్మద్ పరిస్థితి క్షీణిస్తుండడంతో డాక్టర్ జయకృష్ణన్ మణిపాల్ ల్యాబ్‌కు ఫోన్‌చేసి కనుగొన్నారు. ల్యాబ్ వారు ప్రాథమికంగా ‘నిపా’ వైరస్ అని చెప్పారు. వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకపోయింది. ముహమ్మద్ మరణించారు. ఆ లక్షణాలు కలిగిన వారు ముహమ్మద్ ఇంట్లో మరెవరైనా ఉన్నారా? అంటూ డాక్టర్ జయకష్ణన్ వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అవే లక్షణాలతో ముహమ్మద్ సోదరుడు ముహమ్మద్ సబీద్ మే 5వ తేదీన మరణించినట్లు వారు చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ముహమ్మద్ తండ్రి వలసుకెట్టి మూసా, ఆయన మేనత్త మరియమ్‌ను ఆస్పత్రికి రప్పించి వారికి వైద్య చికిత్సలు ప్రారంభించారు. మరియమ్ 19వ తేదీన, మూసా 24వ తేదీన మరణించారు. వాస్తవానికి నిపా వైరస్ నివారణకు ఎలాంటి వ్యాక్సిన్‌గానీ, సరైన మందుగాని ఇంతవరకు లేదు. రోగి లక్షణాలు బట్టి గుండె, ఊపిరితిత్తులు, మెదడు దెబ్బ తినకుండా ఒక్కో అవయవానికి ఒక్కో చికిత్సను అందిస్తారు. ‘నిపా’ వైరస్ లక్షణాలు జ్వరం వచ్చి గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి వస్తుంది. వాంతులు కూడా అవుతాయి. మెల్లగా మెదడు జన్యువులు దెబ్బతింటాయి. తర్వాత క్రమంలో గుండె, రక్తపోటు లయ తప్పుతుంది. మెదడు జన్యువులు దెబ్బతినడం ప్రారంభమైతే తల తిరుగుతున్నట్లు, మత్తు ఎక్కుతున్నట్లు ఉంటుంది. మూర్ఛ రోగం వస్తుంది. కోమాలోకి కూడా వెళ్లవచ్చు. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాలతో వ్యాప్తి చెందుతుంది. నిపా వైరస్ కలిగిన గబ్బిలాలు కొరికిన పండ్లు, ఫలాలు తిన్నా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కల్లు తాగినా వస్తుంది. కల్లు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చెట్టుపైన కల్లు కుండల్లో గబ్బిలాల మూత్రం లేదా నోటి లాలాజలం కలిసినా కల్లులోకి నిపా వైరస్ చేరుతుంది. దాన్ని తాగడం వల్ల మనుషులకు వైరస్ సోకుతుంది. అయితే కల్లును వేడిచేసుకొని తాగితే ఏం కాదట. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే జంతువులు, మనుషులు కొరికిన లేదా ఎంగిలి చేసిన పండ్లు, తినుబండారాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పండ్లను శుభ్రంగా కడగాలి. తిన్నప్పుడు, తాగినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయటి జ్యూస్‌ను తాగకపోవడమే ఉత్తమం. -
‘బొర్రా’లో నిఫా అలెర్ట్
సాక్షి, విశాఖపట్నం: బొర్రాగుహలు పర్యాటకుల గుండెల్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ బొర్రా గుహల్లో వేల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న ప్రాణాంతక నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు బొర్రాగుహల సందర్శనపై పర్యాటకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొర్రా గుహలకు రోజుకు సగటున నాలుగు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే ఆరు వేల మంది వరకు సందర్శిస్తుంటారు. బొర్రా గుహలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు... విదేశీయుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. బొర్రా గుహలను సందర్శించే వారిలో కేరళ వాసులు కూడా ఉన్నారు. నిపా వైరస్‌తో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెందరో ఈ వ్యాధికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా ఈ వైరస్‌కు మందు కనిపెట్టలేదు. బొర్రా గుహల్లో వేలాది గబ్బిలాలు ఒక్కసారి ఈ వైరస్ సోకినట్టయితే ఆ వ్యక్తికి మరణం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదకర వైరస్‌కు గబ్బిలాలే మూలమని స్పష్టం కావడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు దీనిపై అలెర్టయ్యాయి. ఈ గబ్బిలాలు గుహలు, మర్రిచెట్లు, రావిచెట్లు, చీకటి ప్రాంతాల్లో జనానికి దూరంగా నివసిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లూ బొర్రా గుహలపైనే పడ్డాయి. ఎంతో విశాలంగా ఉండే బొర్రా గుహల్లో వేలకొద్దీ గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. పగటి పూట వీటికి కళ్లు కనిపించవు. అందువల్ల రాత్రి వేళ బయటకు వెళ్లి పండ్లను తింటూ పగటి పూట ఈ గుహల్లో సేదతీరుతాయి. పర్యాటకులు బొర్రా గుహల్లోకి వెళ్లినప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. వేల సంఖ్యలో ఉండడం వల్ల ఈ గుహల్లో ఎప్పుడూ గబ్బిలాల విసర్జితాలతో ఒకింత దుర్వాసన కూడా వస్తుంది. అయినప్పటికీ గుహల అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. గుహల ప్రవేశ ప్రాంతంకంటే లోపల మరింతగా చిమ్మచీకటి అలముకుంటుంది. దీంతో గబ్బిలాల ఆవాసానికి ఈ బొర్రాగుహలు ఎంతో అనువుగా ఉంటాయి. పర్యాటకుల్లో అలజడి గబ్బిలాల ద్వారా నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇప్పుడు బొర్రా గుహల సందర్శనకు వెళ్లే పర్యాటకుల్లో అలజడి రేగుతోంది. గబ్బిలాల జాడ అంతగా లేని ప్రదేశాల్లోనే నిపా వైరస్‌పై యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలాంటిది వేల సంఖ్యలో గబ్బిలాలుండే బొర్రాగుహల్లోకి వేలాదిగా పర్యాటకులు వెళ్తుండడమే వీరిలో ఆందోళనకు కారణమవుతోంది. గబ్బిలాలు అరటి, మామిడి, నేరేడు, జామ తదితర పండ్లను తింటాయి. తాటి, ఈత, జీలుగు కల్లును కూడా తాగుతాయి. నిపా వైరస్ కలిగిన గబ్బిలాలు తిన్న పండ్లను, తాగిన కల్లును ఇతరులు తింటే వారికీ ఈ వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో బొర్రాగుహల ప్రాంతంలో పక్షులు కొరికిన/గాట్లున్న పండ్లను విక్రయించవద్దని, తినవద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే స్థానికులకు సూచించారు. అప్రమత్తంగా ఉన్నాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశాం. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలున్న వారిని తక్షణమే కేజీహెచ్‌కు తరలించాలని సూచించాం. పక్షులు కొరికిన పండ్లను తినవద్దని, బయట దొరికే పండ్లను నీటితో కడిగి తినాలని పర్యాటకులకు అనంతగిరి మండల వైద్య, ఆరోగ్య సిబ్బందితో చెప్పిస్తున్నాం.– రోణంకి రమేష్, డీఎంహెచ్‌వో మాస్క్‌లు అందజేస్తాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహలకు వచ్చే పర్యాటకులకు టిక్కెట్‌తో పాటు మాస్క్‌లను అందజేయాలని యోచిస్తున్నాం. నిపా వైరస్‌పై మా శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని డివిజినల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ఆదేశించారు. గుహలు లోపల వేల సంఖ్యలో ఉన్న గబ్బిలాలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అదే సమయంలో పర్యాటకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోజూ బ్లీచింగ్ చల్లిస్తున్నాం. గబ్బిలాల విసర్జాలను ఎప్పటికప్పుడే క్లీన్ చేయిస్తున్నాం. గుహల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక మాస్కులు, గ్లౌజులు అందజేస్తున్నాం. – గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు -
వెంటాడుతున్న ‘నిఫా’ భయం
రాయచోటి : కేరళ, కర్నాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘నిఫా’ వైరస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రాణాంతకమైన వైరస్ పుట్టుకకు కారణమైన గబ్బిలాలు, పందుల సంచారం కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో చెట్లపై గబ్బిలాలు నివాసాలు ఏర్పరచుకుని రాంత్రింబవళ్లు ప్రజలకు అతి దగ్గరగా సంచరిస్తుంటాయి. కేరళలో ఈ వైరస్ కారణంగా 12 మందికిపైగా మృత్యు వాత పడ్డారన్న ప్రచారం జోరందుకుంది. గబ్బిలాలు, పందులతో పాటు వైరస్ సోకిన ప్రాంతానికి చెందిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వైద్యుల హెచ్చరికలతో స్థానికుల ఆందోళనలు మరింత అధికమైంది. రాత్రి వేళల్లో ఆహారం కోసం వెళ్లే గబ్బిలాలు మామిడి, జామ, సపోటా తదితర పండ్లను తింటుంటాయి. గబ్బిలాలు, చిలుకలు, ఇతర పక్షులు కొరికి పడేసిన పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని చాలా మంది వాటిని తింటుంటారు. ప్రస్తుతం పక్షులు తిన్న కాయల ద్వారా ‘నిఫా’ వైరస్ సోకుతుందన్న ప్రచారంతో ఆ పండ్లకు ప్రజలు దూరమయ్యారు. భయం పుట్టిస్తున్న సోషల్ మీడియా... కేరళను వణికిస్తున్న నిఫా వైరస్‌పై సోషల్ మీడియా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను భయకంపితులను చేస్తోంది. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వైరస్ విజృంభిస్తుందని, సోకిన వెంటనే మనుషుల ప్రాణాలు పోతాయని, ఈ వ్యాధికి మందులే లేవంటూ వస్తున్న సమాచారం అందరి గుండెల్లో గుబులు రేపుతోంది. గబ్బిలాలు కాయలను తినే ఫొటోలు సైతం వైరల్ అవుతుండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు మామూలు పండ్లకు సైతం పిల్లలను దూరం చేస్తున్నారు. . జిల్లా వ్యాప్తంగా గబ్బిలాలు, పందుల స్థావరాలు.. ‘నిఫా’ వైరస్ వ్యాప్తికి కారణమనే గబ్బిలాలు, పందులు జిల్లా వ్యాప్తంగా స్థావరాలను ఏర్పరుచుకున్నాయి. కడప నగర పరిధిలోని వన్ టౌన్ పోçలీసు స్టేషన్ వెనుకభాగంలోని వృక్షాలు, సుండుపల్లె పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న మర్రిచెట్టు, రాయచోటి మండల పరిధిలోని యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న ఉన్న చెట్లను, మాధవరం, చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో ఊడల మర్రిచెట్లను గబ్బిలాలు స్థావరాలుగా ఏర్పరుచుకున్నాయి. జిల్లాలో ఇవి మచ్చుకు మాత్రమే. ఇక అటవీ ప్రాంత సమీపాలలోనూ, మామిడి, జామ లాంటి పండ్లతోటలు అధికంగా ఉన్న ప్రాంతాలలో వీటి సంచారం, నివాసాలు అధికంగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఇక పందుల విషయం చెప్పనక్కరలేదు. చిన్నపాటి పల్లెలో సైతం పందుల సంచారం కనిపిస్తుంటుంది. మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలలో అయితే పందుల మందలు ఒక్కొక్క మారు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. పందుల ద్వారా మెదడు వాపు, ఇతర జబ్బులు సోకుతాయని ఎప్పటినుంచో ప్రచారం ఉన్నా వాటి నివారణకు నామమాత్రపు చర్యలు తీసుకోవడమే కాని పూర్తిస్థాయిలో నిలువరించలేదు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని దశాబ్దాలుగా గబ్బిలాలను దేవతలుగా పూజించే గ్రామీణ ప్రజలు వాటిని దూరం చేసేందుకు ఎంతవరకు ఒప్పుకుంటారన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు రావడం, వాంతులు వస్తాయి, వెలుతురు చూస్తే కళ్లుమంటలేస్తాయి. ఈ లక్షణాలున్న వారు వెంటనే స్పృహను కోల్పోవడం జరుగుతుంది. ఈ ప్రభావం అంతా 7 రోజులలోనే జరిగిపోతుంది. ఇలాంటి లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ వైరాలజి ఇన్స్టిట్యూట్కు పంపించి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. -
భయపడొద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలూ!
సాక్షి, తిరువనంతపురం: కేరళను వణికించిన నిపా వైరస్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వదంతులను నమ్మొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు. నిపా వైరస్ జూనోటిక్ వ్యాధికి సంబంధించింది. అంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించేది. ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వారి నుంచి కూడా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందన్నది వైద్యుల మాట. ఈ వైరస్ సోకినవారికి దగ్గరగా వెళ్లినప్పుడు లేదా వైరస్ సోకిన వారు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం వల్ల వ్యాధి విస్తరిస్తుందని చెబుతున్నారు. కోచిలోని అమ్రిత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ప్రొఫెసర్ విద్యామీనన్.. నిపా గురించి పలు సూచనలు చేస్తున్నారు. ‘మలేషియాలో పందుల పెంపకందార్లలో మొదటిసారిగా ఈ వైరస్ సోకగా, నిపా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోనూ 2001, 2007లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలోనూ నిపా వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వస్తోంది. ప్రస్తుతం కూడా కేరళలోని కోజికోడ్, మళప్పురం, కన్నూర్, వేనాడ్ జిల్లాలకే నిపా పరిమితమైంది. దేశంలో మరెక్కడ దీని ఆనవాళ్లు లేదన్న సమాచారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదు’ అని విద్యామీనన్ సలహా ఇస్తున్నారు. - చేతులను తరచుగా సోప్ తో శుభ్రం చేసుకోవటం. - ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం - పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం... ప్రాథమిక జాగ్రత్తలుగా ఆయన చెబుతున్నారు. - శ్వాసకోస ఇన్ఫెక్షన్, జ్వరం, వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. వ్యాధి నిర్ధారణ అయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని వైద్యసిబ్బందికి సూచిస్తున్నారు. -
గబ్బిలాల బామ్మ.. నిపా భయం లేదు..!!
అహ్మదాబాద్, గుజరాత్ : దేశమంతటా నిపా వైరస్ భయంతో వణికిపోతోంటే ఓ 74 ఏళ్ల బామ్మ మాత్రం 400 గబ్బిలాలతో కలసి నివసిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్‌కు చేరువలోని రాజ్పూర్ గ్రామంలో శాంతాబెన్ ప్రజాపతి(74) నివసిస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆమెకు రెండు గదుల ఇల్లు ఉంది. ఇంటిలోని అన్ని గోడలపై, కింద కూడా 400 గబ్బిలాలు నివసిస్తుంటాయి. నిపా వైరస్ గురించి తనకు ఎలాంటి భయం లేదని శాంతాబెన్ తెలిపారు. గత పదేళ్లుగా గబ్బిలాలతో గడుపుతున్నానని, అవి తన కుటుంబం అని చెప్పారు. అందుకే వాటి కోసం ఇంటిని వదిలేసి వరండాలో కాలాన్ని వెళ్లదీస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల క్రితం ఓ గబ్బిలాల గుంపు ఇంట్లోకి వచ్చిందని వాటిని చూసి చాలా భయపడ్డానని శాంతాబెన్ తెలిపారు. రాత్రి పూట అవి బయటకు వెళ్లి, ఉదయాన్నే తిరిగి వచ్చేవని వివరించారు. అప్పటికే తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసినట్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడని దాంతో ఇంటికి గబ్బిలాలకే వదిలేసినట్లు వెల్లడించారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకూ గబ్బిలాలతోనే నివసిస్తానని పేర్కొన్నారు. -
‘నిపా’ వదంతులు నమ్మొద్దు!
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా కేరళను వణికిస్తున్న ప్రమాదకర నిపా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. అయితే నిపా వైరస్ గురించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని నగరంలోని ఫీవర్ ఆస్పత్రి సుపరింటెండ్ కె.శంకర్ చెప్పారు. నిన్న ఇద్దరు అనుమానితుల శాంపిల్స్ మాత్రమే పుణేకు పంపామన్నారు. కానీ ఆ ఇద్దరి బ్లడ్ శాంపుల్స్‌లో వైరస్ లేదని స్పష్టమైందని ఆయన వివరించారు. అయితే నిపా వైరస్ ప్రభావం ఉన్న కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించకపోవడమే మంచిదని తెలుగు ప్రజలను ఆయన హెచ్చరించారు. నిపా వైరస్ సోకినట్లుగా అనుమానం ఉన్నవారు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేపించుకోవాలన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు చెబుతోంది. కాగా, నిపా లక్షణాలతో బాధప డుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రక్తం, మూత్ర, లాలాజల నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం పుణేకు పంపిన విషయం తెలిసిందే. నగరంలోని ఓ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి(24) ఈ నెల 18న కేరళ వెళ్లి 21న తిరిగి వచ్చాడు. ఆ వెంటనే జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుం డటంతో ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే నిమ్స్‌లో మరో వ్యక్తి(31) ఎన్సెఫలైటిస్ (మెదడు సంబంధిత వ్యాధి) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కేరళలో ఇప్పటికే అధికారికంగా 12 మరణాలు సంభవించగా, పలు కేసులు నమోదయ్యాయి. -
వామ్మో ‘నిపా’
నెల్లూరు(బారకాసు): ‘నిపా‘ వైరస్ ఇప్పుడు అందర్నీ వణికిస్తోంది. కేరళలో ఈ వైరస్ సోకి 11 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి వ్యాధి సోకిందనే వార్తలతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం స్పందించి హై అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో కేరళకు చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. వీరు తరచూ సొంత రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వీరి బంధువులు సైతం జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అప్రమత్తత అవసరం అప్రమత్తంగా లేకపోతే నిపా వైరస్ జిల్లాకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేరళకు చెందిన వారు పెద్ద ఎత్తున జిల్లాలో వివిధ వ్యాపారాల రీత్యా స్థిరపడ్డారు. వీరంతా వారి సొంత రాష్ట్రమైన కేరళకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి వారి బంధువులు కూడా ఇక్కడికి వస్తూ పోతుంటారు. కేరళ, త్రివేండ్రం, కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నెల్లూరు మీదుగానే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణం చేసే వారిలో ఎవరికైనా ఈ వైరస్ సోకి ఉంటే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ల సమీపంలోని చెట్లలో పెద్ద ఎత్తున గబ్బిలాలు దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిపా సోకేది ఇలా.. నిపా వైరస్ గబ్బిలాలు,పందుల ద్వారా సోకుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నా, దాన్ని తాకినా వైరస్ సోకుతుంది. అలాగే గబ్బిలాలు పందులను పొడిచి గాయపరిచినప్పుడు వాటి నుంచి పందులకు సోకుతుంది. గాయపడిన పందులు జనసంచారంలో తిరగడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా..దగ్గినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఇలా.. ♦ నిపా వైరస్ సోకిన వ్యక్తి శ్వాసతీసుకోవడంలో అవస్థ పడతారు. ♦ భరించలేనంతగా తలనొప్పి, తీవ్ర జ్వరం. ♦ ఎండలో తిరిగినప్పుడు మాడు ఎలా మండిపోతుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ♦ మెదడు కూడా మండిపోతున్నట్లు ఉం టుంది. ♦ ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. ♦ రోజుల తరబడి మత్తునిద్రలో ఉంటారు. ♦ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. ♦ మందులు వేసుకున్నా వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ముదిరితే రెండురోజులకే కోమాలోకి వెళ్లిపోయి ప్రాణా పాయం సంభవించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి నిపా వైరస్ సోకితే చికిత్స లేదు. లక్షణాలను బట్టి ప్రాథమిక దశలో గుర్తిస్తే అందుకు అవసరమైన వైద్యసేవలందించే అవకాశం ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డును కేటాయిస్తాం. లక్షణాలు గుర్తించి అవసరమైతే ప్రత్యేక వైద్యం అందిస్తాం. ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ప్రచారాలు చేపడతాం. ఈ విషయమై ఈ నెల 28న మా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. -
హైదరాబాద్‌లో ‘నిపా’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా కేరళను వణికిస్తున్న నిపా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. నిపా లక్షణాలతో బాధప డుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం పుణేకు పంపారు. అయితే అది నిపా కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి(24) ఈ నెల 18న కేరళ వెళ్లి 21న తిరిగి వచ్చాడు. ఆ వెంటనే జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుం డటంతో ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే నిమ్స్‌లో మరో వ్యక్తి(31) ఎన్సెఫలైటిస్(మెదడు సంబంధిత వ్యాధి) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి గురువారం రాత్రి రక్తం, మూత్ర, లాలాజల నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం పుణే తీసుకెళ్లారు. అయితే వీరి నమూనాలు పరీక్షించగా ‘నిపా నెగిటీవ్’గా నిర్ధారనైనట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిపా వైరస్ నిర్ధారణ కాలేదని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లో ముందస్తు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో, స్కూళ్లలో పని చేస్తున్న వారిలో కేరళకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజా తెలిపారు. ప్రస్తుతం కేరళలో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో వీరు కొద్ది రోజుల వరకు అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని సూచించారు. కేరళ వెళ్లాలనుకున్న నగరవాసులు కూడా తాత్కాలికంగా తమ ఆలోచణను వాయిదా వేసుకోవడమే మంచిదని ఆమె అన్నారు. భయం వద్దు: మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైరస్ లేనేలేదని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ‘‘వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్న ఇద్దరికి నిపా వైరస్ సోకలేదని వారికి చేయించిన పరీక్షల్లో తేలింది. ప్రజలు అనుమానాలు, ఆపోహలకు, భయాందోళనలకు గురవాల్సిన అవసరం లేదు. వైద్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది’’అని తెలిపారు. -
‘హైదరాబాద్‌లో నిపా వైరస్ లేదు’
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో నిపా వైరస్ కేసులు నమోదైనట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ కే.రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఈ వైరస్‌కు సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అన్నారు. వ్యాధి ప్రబలుతోందనే వదంతులతో ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ‘ఫీవర్ హాస్పిటల్లో జ్వరంతో బాధ పడుతున్న ఓ వ్యక్తికి ‘నిపా’ సోకిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానితుడు కొద్ది రోజుల క్రితం కేరళ వెళ్లొచ్చాడు. వ్యాధి నిర్ధారణ కోసం అతని రక్త నమూనాలను పుణెలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కు పంపామ’ని రమేశ్ తెలిపారు. రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. నిపా వైరస్ ప్రబలిన ప్రాంతానికి అనుమానితుడు సందర్శించిన పట్టణానికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుందని ఆయన తెలిపారు. అనుమానితుడికి వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని రమేశ్ అభిప్రాయపడ్డారు. కాగా, మెదడుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. పళ్లు, కూర గాయలు శుభ్రంగా కడిగిన తర్వాత తినాలని వారు సూచిస్తున్నారు. -
తెలంగాణలో నిఫా వైరస్ లేదు
-
హైదరాబాద్‌లో నిపా అనుమానిత కేసులు
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు కొద్దిరోజుల క్రితం కేరళ వెళ్లి వచ్చారు. ఇరువురి బ్లడ్ శాంపిల్స్‌ను వ్యాధి నిర్ధారణ కోసం పుణెలో గల నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కు పంపారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే రమేష్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భయపడాల్సిన పనేంలేదని, బ్లడ్ శాంపిల్స్‌ను వ్యాధి నిర్ధారణ కోసం పంపినట్లు చెప్పారు. కేరళలో నిపా వైరస్‌కు చికిత్స అందిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనుమానితుడు కేరళలో వెళ్లొచ్చిన ప్రాంతానికి, నిపా వైరస్ సోకిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల కొద్దీ దూరం ఉందని చెప్పారు. కాబట్టి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని, పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో స్పందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో సిబ్బంది భద్రత కోసం ప్రొటెక్టివ్ సూట్లను సైతం తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. చెట్ల నుంచి రాలి పడిన పండ్లను, కొరికిన గుర్తు ఉన్న పండ్లను తినొద్దని ప్రజలను కోరారు. గ్రామల్లో సైతం ప్రజలకు దీనిపై అవగాహన వచ్చేలా ఎన్జీవోలు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. కాగా, ఇప్పటివరకూ 12 మంది నిపా బారిన పడి మృతి చెందారు. -
నిపాకు మరొకరు బలి
కోజికోడ్: కేరళను వణికిస్తోన్న ‘నిపా’ వైరస్‌తో గురువారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో రాష్ట్రంలో నిపాతో చనిపోయినవారి సంఖ్య 11కు చేరుకుంది. ఈ విషయమై కోజికోడ్ జిల్లా వైద్యాధికారి డా.జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వి.ముసా(61) గురువారం చనిపోయినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) నిపుణులు, ఎయిమ్స్ వైద్యుల బృందం కేరళలో పర్యటిస్తోంది. మరోవైపు, కర్ణాటకలో నిపా లక్షణాలతో శివమొగ్గ జిల్లాలోని సాగర ప్రాంతానికి చెందిన మిదున్(21) ఆస్పత్రిలో చేరారు. -
మందులేని మహమ్మారి
గత కొన్నేళ్లనుంచి క్రమం తప్పకుండా వచ్చి బెంబేలెత్తిస్తున్న వైరస్ల జాబితాలో నిపా కూడా చేరింది. కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో బయటపడి ఆ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ మరణించిన ఒక నర్సుతోసహా ఇంతవరకూ పదకొండుమంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్‌ను ఈ ఏడాది అత్యవసరంగా పరిశోధించదగిన 10 వ్యాధికారకాల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం వల్లనైతేనేమి...సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటం వల్లనైతేనేమి ఆ వ్యాధి పేరెత్తితే జనం బెంబేలు పడిపోతున్నారు. పరిశోధించదగిన వ్యాధికారకమని చెప్పడమంటే ఈ వైరస్‌కు ప్రస్తుతం మందు లేదని ప్రకటించడమే. అది కేరళలోని రెండు జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో బయటపడింది తప్ప వేరెక్కడా దాని జాడ లేదని... వెంటనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం గనుక భయాందోళనలు అనవసరమని కేరళ ప్రభుత్వం ప్రకటించాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగానే పొరుగునున్న కర్ణాటకలోని మంగళూరులో దాని ఛాయలు కనబడ్డాయని వార్తలు రావడంతో మళ్లీ వణుకు మొదలైంది. జ్వరంతో మొదలై శ్వాసకోశ ఇబ్బందులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు వగైరాలన్నీ చుట్టుముట్టి రోగిని ఊపి రాడకుండా చేస్తాయని... పది పన్నెండు రోజులకు అపస్మారక స్థితికి తీసుకెళ్తుందని వైద్యులు చెప్పే మాట. చివరిగా బ్రెయిన్ ఫీవర్‌తో మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. వ్యాధి సోకినవారిలో 70 శాతంమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నిపా వైరస్ కావొచ్చు... రెండేళ్లక్రితం జికా వైరస్ కావొచ్చు...అంతకు రెండేళ్ల ముందు ఆఫ్రికాను వణికించిన ఎబోలా కావొచ్చు... మధ్యమధ్యన అడపా దడపా కనిపిస్తూనే ఉన్న స్వైన్‌ఫ్లూ కావొచ్చు–ఇవన్నీ కొత్త వ్యాధులు కావు. కానీ కొత్తగా శక్తి సంతరించుకుని మళ్లీ మళ్లీ వస్తున్న మహమ్మారులు. నిపా కూడా మొదటగా 1999లో మలేసియాలోని కాంపంగ్ సుంగై నిపా అనే పట్టణంలో వెల్లడైంది. అప్పట్లో 300మందికి ఇది సోకగా వారిలో వందమంది చనిపోయారు. ఆ తర్వాత 2001లో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో దీని జాడ వెల్లడైంది. దాన్ని నిపా వైరస్‌గా గుర్తించేసరికే ఆర్నెల్లు పట్టింది. ఈలోగా 45మంది ఆ వ్యాధితో మృత్యువాత పడ్డారు. అప్పటితో పోలిస్తే వ్యాధిని వెనువెంటనే గుర్తించగలిగారు. దాని నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో కేరళ ప్రజారోగ్య సిబ్బందిని ప్రశంసించాలి. రెండో వ్యాధిగ్రస్తుడి తోనే ఈ వైరస్ ఉనికిని అక్కడి వైద్యులు పసిగట్టగలిగారు. అయితే గతంతో పోలిస్తే ఒకచోటు నుంచి మరోచోటుకు రాకపోకలు కూడా బాగా పెరిగాయి గనుక ఒకచోట నియంత్రణకు పూనుకునే లోగానే మరోచోట అది కనబడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్లే ఇటువంటి వ్యాధుల విషయంలో తక్షణ స్పందన అత్యవసరం. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. వ్యాధి నిరోధక వైద్య సంస్థ(ఐపీఎం)ను నోడల్ ఏజెన్సీగా ఉంచి ప్రధాన ఆసుపత్రులన్నిటా ప్రత్యేక వార్డులు నెలకొల్పామని చెబుతోంది. దీంతోపాటు వ్యాధి లక్షణాలపై బాగా ప్రచారం చేసి, అవి కనబడిన వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించాలన్న అవగాహన పెంచాలి. ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించే లక్షణం నిపా వైరస్‌కు లేకపోవడం ఉన్నంతలో ఉపశమనమనే అనుకోవాలి. లేనట్టయితే అధిక జనాభా, అరకొర పారిశుద్ధ్యం ఉన్న మనలాంటి దేశాల్లో అది ఉగ్రరూపం దాల్చడం తేలిక. నిపా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ గనుక అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులంటున్నారు. ఈ రకం వైరస్లలో ఆకస్మిక పరివర్తనం అధికంగా ఉండటమే అందుకు కారణం. అందువల్లే నిపా మనిషి శరీరంలో వేగంగా, అపరిమితంగా విస్తరిస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో ఏకకాలంలో అనేక రకాల లక్షణాలు కనబడటానికి, మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణం ఇదే. అయితే అంటు వ్యాధి కాకపోవడంవల్ల ఇతరులకు వేగంగా సోకే అవకాశం లేదు. ఇప్పుడు గబ్బిలాలు కొరికి పడే సిన పండ్లు తిన్నవారికి ఈ వ్యాధి వ్యాపిస్తోంది. అలాగే వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే ఆసుపత్రి సిబ్బందికి, ఆ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగే బంధువులకు తగిన ముందస్తు చర్యలు తీసు కోనట్టయితే సోకే ప్రమాదం ఉన్నదని గుర్తించారు. కేరళలో మరణించిన 11మందిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వెనక ఇలాంటి కారణమే ఉండొచ్చని అంచనా. అలాగే ఆ కుటుంబం నివసించే ఇంటి ఆవరణలో ఉన్న బావిలోని గబ్బిలాల వల్ల అక్కడ వ్యాధికారక వైరస్‌కు అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వ్యాధులకు ఔషధాలున్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం మన దేశంలో ప్రధాన సమస్య. వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధిని నిర్మూలించడం వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడానికి బదులు దాన్నుంచి ఎంత లాభం తీయొచ్చన్నదే ప్రధానమైనప్పుడు ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు నిపాతో వచ్చిపడిన సమస్యే మంటే దానికి ఇంతవరకూ మందే లేదు. వ్యాధిగ్రస్తుల్లో కనబడే వేర్వేరు లక్షణాలకు వేర్వేరు ఔషధాలు అందించడం ద్వారా దాన్ని అదుపు చేస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి. జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పండ్లు తినకూడదని, పరిశుభ్రత అతి ముఖ్యమని జనంలో అవగాహన కల్పించాలి. అల్లోపతిలో ఔషధాలు లేవు గనుక హోమియో, ఆయుర్వేదం, యునాని రంగాల్లోని వైద్య నిపుణుల సేవలు కూడా ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. -
నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ?
కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. ఒకప్పుడు ఎబోలా వైరస్ బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ గబ్బిలాల వల్లే వచ్చిందని అన్నారని, కానీ తర్వాత ఆ వైరస్ చింపాంజీ, గొరిల్లాల నుంచి వ్యాప్తి చెందిందని తేలిందని వారు గుర్తు చేస్తున్నారు. అసలు మనుషులు సంచరించే ప్రదేశాల్లో గబ్బిలాలు తిరగవని, వాటి నుంచి వైరస్లు వ్యాప్తి చెందడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుందని బయోలజిస్టులు వాదిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గబ్బిలాలు ఆవాసం ఉండడానికి ఎక్కడా చోటు లేకపోవడం, సరైన తిండి దొరకకపోవడం వల్ల వాటిల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్లు వెదజల్లుతున్నాయని,అందువల్ల గబ్బిలాల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుంటే, వాటి వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అసలు భారత్‌లో ఎందరో గిరిజనులు గబ్బిలాల్ని ఆహారంగా తీసుకుంటారని, కానీ వారిలో ఎవరికీ ప్రాణాంతక వ్యాధి నిపా సోకిందనడానికి ఆధారాలు లేవని గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్న మాట. ‘పండ్లు తినేగబ్బిలాలు చూడడానికి భారీ సైజులో కనిపిస్తాయి. కానీ కేరళలో సీజ్ చేసిన బావిలో ఉన్న గబ్బిలాల్ని చూస్తే ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేరళలో వైరస్‌కు గబ్బిలాలే కారణమని ఇప్పట్నుంచి నిర్ధారించలేం‘ అని ఉస్మానియా యూనివర్సిటీకి డాక్టర్ సీహెచ్. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మరో శాస్త్రవేత్త రోహిత్ చక్రవర్తి కూడా ప్రాణాంతక వైరస్లు వచ్చినప్పుడల్లా ఇలా గబ్బిలాలే కారణమని భయపెట్టకుండా, శాస్త్రీయమైన ఆధారాలు కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే గబ్బిలాల ద్వారా 60 రకాల వైరస్లు వ్యాపిస్తాయని, అందులో నిపా, సార్స్ వంటి డజనకు పైగా వైరస్లు ప్రాణాంతకమైనవని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సీజన్లో కొన్ని రకాల గబ్బిలాలు మామిడి పళ్లు, పనస పండ్లు కొరికి పడేస్తాయని, అలా కొరికి పడేసిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళన వద్దు : కేంద్ర బృందం కేరళలో నిపా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) నేతృత్వంలోని కేంద్ర బృందం దీనికి స్థానిక పరిస్థితులే కారణమని అంటోంది. ప్రజలు భయాందోళనలకు గురి కావ్సలిన పనిలేదని చెబుతోంది. కేరళలోని ఒక ఇంట్లో బావిలో ఉన్న గబ్బిలాల నుంచే వైరస్ వ్యాప్తి చెందిందా లేదా అన్నది నిర్ధారించడానికి అక్కడ్నుంచి 60 రకాల శాంపిల్స్ సేకరించింది. ఈ శాంపిల్స్‌ను పరీక్షించే వరకు మరణాలకు కారణాలు వివరించలేమని చెబుతోంది. కేరళలో వైరస్‌కు గబ్బిలాలు కారణం కాకపోవచ్చునని అభిప్రాయపడుతోంది. కర్ణాటకకూ విస్తరించిన నిపా ? కేరళ సరిహద్దుల్ని దాటి నిపా వైరస్ కర్ణాటకకూ విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ పర్యటనకు వెళ్లి తిరిగి స్వస్థలం మంగుళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిపా వ్యాధి లక్షణాలతో బాధపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిపై నిపా వైరస్ దాడి చేసిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘నిపా’ ఎఫెక్ట్..నలుగురు మృతి
కోజికోడ్/కేరళ: ప్రాణాంతక నిపా వైరస్ బారిన పడి కేరళలో మరో వ్యక్తి మరణించాడు. ఇప్పటికే అదే కుటుంబంలోని ముగ్గురు నిపా వైరస్ సోకి చనిపోగా గురువారం వీ.మూసా (61) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ కోజికోడ్ ఆస్పత్రిలో గురువారం ప్రాణాలు విడిచాడు. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఒకే కుటుంబంలోని నలుగురు ఈ కారణంగా చనిపోవడంతో మూసా కుటుంబం నివాసముంటున్న కోజికోడ్ పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. మూసా ఇంటి పరిసరాల్లో గల పాడుబడిన బావిలో చనిపోయిన గబ్బిలాలు పదుల సంఖ్యలో పడి ఉన్నాయని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. బహుశా ఈ బావిలోని గబ్బిలాల ద్వారానే నిపా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యాధికి గురైన మూసా, అతని ఇద్దరి కుమారులు, సోదరికి చికిత్సనందిస్తూ నర్సు లినీ సోమవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. -
అమ్మో గబ్బిలం
సీతంపేట : కేరళలో ఇటీవల నిపా వైరస్ బారిన పడి 10 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి అధికంగా సోకుతుందని వైద్యనిపుణులు చెబుతుండటంతో కలవరపడుతున్నారు. సీతంపేట హెడ్‌క్వార్టర్‌లో అత్యధికంగా చెట్లుపై గబ్బిలాలు తిష్టవేశాయి. స్థానిక మల్బరీ యూనిట్ పెంపక కేంద్రం వద్ద ప్రతీ చెట్టుకు గబ్బిలాలు వేలాడుతున్నాయి. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం, జీసీసీ సమీపంలో ఇలా ఎక్కడ చూసినా చెట్లకు ఉన్నాయి. ఆవాసాల వద్దే ఇవి ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
నర్సు లినీ భర్తకు ఉద్యోగం
తిరువనంతపురం: కేరళలో నిపా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు కేరళసర్కారు ముందుకొచ్చింది. లినీ భర్త సజీష్ విద్యార్హత ఆధారంగా అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లినీ ఇద్దరు పిల్లలకు (5 ఏళ్లు, 2 ఏళ్లు) సీఎం సహాయక నిధి నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నిపా కారణంగా మృతిచెందిన వారికి రూ.5 లక్షల సాయం అందించనుంది. ప్రమాదకర నిపా వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి వచ్చే సందర్శకులు కొజికోడ్, మలప్పురం, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
అప్రమత్తంగా ఉంటే చాలు... ఆందోళన అక్కర్లేదు!
నిపా అంటే చాలు ఇప్పుడు అందరూ బెంబేలెత్తుతున్నారు. నిపా సోకితే సఫా అయిపోవలసిందేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు హోరెత్తుతున్నాయి. అయితే చాలా వైరస్‌లకు మందులు లేనట్టే నిపా వైరస్కూ చికిత్స లేనందున, ప్రస్తుతం ఇది చాలా చురుగ్గా ఉన్నందున, పైగా దీని గురించి వినడం ఇది మొదటిసారి కావడం వల్ల దీని గురించి ఇంతగా చర్చ జరుగుతోందంటున్నారు నిపుణులు. కొత్తదేమీ కాదు... దీని పేరు ఇప్పుడు మనకు కొత్తగా వినిపిస్తోంది కానీ... ఇది అంత కొత్తదేమీ కాదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. మొదటిసారి ఇది 1998లో మలేసియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట ఒక్కసారిగా వ్యాపించడంతో అప్పట్నుంచి దీన్ని నిపా అంటున్నారు. ఆ తర్వాత ఇది 2004లో బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించింది. పైగా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నదాని ప్రకారం ఇది బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాదీ కనిపిస్తూనే ఉంది. ఈ ఏడాది మన దేశంలోని కేరళలో దీని తీవ్రత కనిపిస్తున్నందున, అన్ని వైరస్‌లలాగే దీనికి మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేనందున ప్రస్తుతం ఇది భారత్‌ను వణికిస్తోంది. ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎలా వ్యాపిస్తుంది: ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వ్యాధి. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లనే గాక ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని అపోహ కొందరుæ పడుతుంటారు. అందువల్ల పై అంశాలను దృష్టిలో ఉంచుకొని, అప్పటికే కొరికి ఉన్న ఇలాంటి పండ్లను తినకపోవడమే మంచిది. ఇక ఈ వైరస్ పందుల నుంచి కూడా వ్యాపించడాన్ని గుర్తించారు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించింది. నిర్ధారణ: ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణే)లో నిర్వహించే అలైజా పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తున్నారు. చికిత్స: ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నేరుగా మందు లేదు. అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు ఉపశమనించడానికి మందులు ఇస్తుంటారు. ప్రస్తుతానికి అల్లోపతి విధానంలో నివారణే ఒక్కటే దీనికి మంచి మందుగా పరిగణించవచ్చు. లక్షణాలేమిటి ఈ వైరస్ సోకినప్పుడు అది మెదడును ప్రభావితం చేసి, ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 24 – 48 గంటల్లో అది ఒక్కోసారి కోమాలోకి దించవచ్చు. అందుకే తీవ్రమైన తలనొప్పి వస్తుంటే ఇప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఇక అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లోలాగే జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కూడా ఉంటాయి. ఈ వైరస్ దీర్ఘకాలికంగా ఒంట్లో ఉన్నప్పుడు మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడబిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) మాదిరిగా ఊపిరి అందకపోవచ్చు. ఆ తర్వాత రోగి స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇది ఆ తర్వాత మరణానికి దారి తీయవచ్చు. అయితే కొందరిలో లక్షణాలు అంతగా కనిపించకుండానే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పితో (మెదడువాపు కారణంగా) వెంటనే మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇలా జరగడం కాస్త అరుదు. ఒకరిద్దరిలో ఇలాంటివి సంభవిస్తే... అందరికీ అలాగే జరుగుతుందన్న అపోహతోనే ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులవుతున్నారు. నివారణ ∙ఫ్రూట్ బ్యాట్స్ నుంచి, అవి కొరికిన పండ్ల నుంచి దూరంగా ఉండటం. ∙ఏదైనా కొరికి ఉన్నట్లుగా కనిపించిన ఏ పండునైనా తినకపోవడం ∙డేట్‌పామ్ జాతికి చెందిన తాటి, ఈత, ఖర్జూర జాతి పండ్లకు దూరంగా ఉండటం ∙వాటిల్లో ప్రాసెస్ చేయని రా పండ్లను తినకపోవడం ∙పందుల ఫామ్స్కూ, పందుల పెంపకందార్లకు దూరంగా ఉండటం ∙ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి కూడా దూరంగా ఉండటం ∙వీలైనంతవరకు దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు, సమూహాల్లోకి వెళ్తున్నప్పుడు ‘ఎన్ 95’ రకానికి చెందిన మాస్క్‌ను కట్టుకోవడం ద్వారా దీనికి దూరంగా ఉండవచ్చు. ఇక హెల్త్‌కేర్ రంగంలో ఉన్నవారు పైన పేర్కొన్న మాస్క్‌లు, గౌన్, క్యాప్ వంటి రక్షణ ఉపకరణాలను ధరించడం అవసరం. ఇక వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, మలవిసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఏదైనా డోర్నాబ్స్ను ముట్టుకున్న తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి పర్సనల్ హైజీన్ చర్యల ద్వారా దీన్ని చాలావరకు నివారించవచ్చు. అలాగే పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. – డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ప్రత్యామ్నాయ చికిత్సలు నిపా వైరస్‌కు ప్రస్తుతం ఇతర వైద్య చికిత్స విధానాల్లో నిర్దిష్టమైన మందు లేదు. అందువల్ల ప్రస్తుతం కొన్ని హోమియో మందులతో మనలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని దీన్ని ఎదుర్కోవచ్చు. హోమియో ఔషధాలైన 1) యూపరోటిరమ్ పెర్ఫోలియేటమ్–200 2) జెల్సీమియమ్ సెమ్పర్వియెరెన్స్–200 3) లెడమ్ పాలస్ట్రే–200 అనే ఈ మూడు రకాల గుళికలను ఒక్కొక్కటి రెండు చొప్పున మొత్తం ఆరు గుళికలను ఒక సగం గ్లాసులోని నీళ్లలో కరిగించుకొని రోజుకు రెండుసార్లు చొప్పున రెండు నుంచి మూడు రోజులు తాగాలి. దాంతో శరీరానికి రోగనిరోధక శక్తి సమకూరుతుంది. ఇది అన్ని రకాల సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుతుంది. నిపాతో పాటు మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇక ఈ హోమియో మందులు కూడా దొరకని చిన్న పల్లెటూళ్లలో ఉండేవారు ఈ ఏడు రకాల ఆకులతోనూ వ్యాధి నిరోధకతను సాధించవచ్చు. అవి... 1) గరిక 2) తులసి 3) తిప్పతీగె (అమృతవల్లి) 4) బిల్వపత్రం 5) కానుగ 6) వేప 7) గులాబీ... ఈ ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. ఒక్కోరకం ఆకు తీసుకొని, దాన్ని 150 ఎమ్ఎల్ నీటిలో ఉడికించి, కషాయంలా కాచుకోవాలి. ఆ ద్రవాన్ని వడపోసి, అందులో కాస్తంత తాటిబెల్లం లేదా సాధారణ బెల్లం కలుపుకొని వేడిగా గానీ లేదా బాగా చల్లార్చి ఆ కషాయాన్ని తాగాలి. ఇలా ఒక్కొక్క ఆకు కషాయాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున నాలుగు రోజుల పాటు తాగాలి. ఈ లెక్కన ఇక్కడ ప్రస్తావించిన 7 రకాల ఆకుల వరసను పూర్తి చేయడానికి 28 రోజులు పడుతుంది. ఇలా 28 రోజులు పూర్తయ్యాక మనకు లభించిన వ్యాధి నిరోధకత నిపాతో సహా చాలా రకాల వ్యాధుల నుంచి మనకు దాదాపు ఓ ఏడాదికాలం పాటు వ్యాధి నిరోధకత సమకూరుతుంది. – డాక్టర్ ఖాదర్ వలి హోమియో వైద్యుడు, స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త, ఆరోగ్య రంగ నిపుణులు, మైసూరు -
కర్ణాటకలో నిపా వైరస్..?
సాక్షి, బెంగుళూరు: కేరళను వణికిస్తున్న నిపా వైరస్ కర్ణాటకలోకి ప్రవేశించిందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కేరళలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన మంగుళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు జ్వరం బారిన పడ్డారని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రధానాధికారి బుధవారం తెలిపారు. వారికి నిపా వైరస్ సోకొచ్చనే కారణంగా ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. మంగుళూరు ఆరోగ్య సేవల పర్యవేక్షకుడు బీవీ రాజేష్ మాట్లాడుతూ.. ‘కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన 20 ఏళ్ల యువకుడు, 75 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను మణిపాల్ రీసెర్చి సెంటర్‌కు పంపామ’ని తెలిపారు. రక్త పరీక్షల నివేదిక గురువారం రానుందనీ, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామన్నారు. నిపా వైరస్ కారణంగా కోజికోడ్, మలప్పురం జిలాల్లో 10 మంది మరణించారనీ, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు సమాచారమిచ్చామని ఆమె తెలిపారు. కాగా, ఈ వైరస్ బాధితులకు చికిత్సనందిస్తూ లినీ అనే నర్సు సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నర్సు లినీ మృతి: కేరళ కేబినెట్ కీలక నిర్ణయం
తిరువనంతపురం : ‘నిపా’ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న కేరళ నర్సు అదే వైరస్ సోకి మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వృత్తి ధర్మం నిర్వర్తించిన నర్సు లినీ పుత్తుస్సెరీ (31) కుటంబానికి కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. నర్సు లినీ భర్త సజీశ్‌కు ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంతో పాటు వారి సంతానం ఇద్దరికి (సిద్ధార్థ్, రితుల్) చెరో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సోమవారం మృతిచెందిన నర్సు లినీ సేవలకుగానూ కేరళ కేబినెట్ బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. నిపా వైరస్ బారినపడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్లు కేబినెట్ తెలిపింది. కోజికోడ్‌లోని పెరంబరా హాస్పిటల్లో నిపా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందించిన వైద్య సిబ్బందిలో లినీ ఒకరు. కాగా, నిపా వైరస్ సోకిన ఆమె మృతిచెందే కొన్ని నిమిషాల ముందు భర్త సజీశ్‌కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నిపా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున కుటుంబసభ్యులకు చివరిచూపులు లేకుండానే నర్సు లినీ అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు నిపా వైరస్ కేసులు 13 నమోదు కాగా, 10 మంది మృతిచెందినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. -
నిపా వైరస్: కేరళకు కఫీల్ ఖాన్..
సాక్షి, తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న అరుదైన వైరస్ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తగిన నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానించారు. నిపా వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ కఫీల్ ఖాన్ తెలిపారు. ఆయన కేరళ వెళ్లనున్నారు. కాగా ప్రమాదకర నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వైరస్ గోవా, ముంబై రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ‘అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ కఫీల్ ఖాన్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విజయన్ నిపా బాధితులకు ఉచితంగా వైద్యం చేసేందుకు కేరళ వస్తున్న డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌ని బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలో కఫీల్‌ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసింది. కఫీల్‌ఖాన్ ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. గోరఖ్‌పూర్ వదిలి వెళ్లను ‘నిపా వైరస్‌తో కేరళలో ఒక నర్సుతో సహా పదిమంది మరణించారని తెలుకున్నా. ఎలాగైనా వారికి సహాయం చేయాలని కేరళ వెళ్లాలి అనుకున్నా. యూపీ ప్రభుత్వం నా సస్పెన్షన్ ఇంకా రద్దు చేయలేదు. ఇటీవల ఆసుపత్రిని సంప్రదించాను. గోరఖ్‌పూర్‌ను వదిలి ఎక్కడికి వెళ్లను త్వరలోనే అక్కడికి వెళ్తా’ అని కఫీల్ ఖాన్ పేర్కొన్నారు. -
నిపాపై ఆందోళన చెందవద్దు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వ్యాధికి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల అవగాహనకు వచ్చిన మంత్రి.. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)తో, మణిపాల్‌లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ, రీసెర్చ్(ఎంసీవీఆర్)తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజల్లో చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు. -
నిపా మృతులు 10
న్యూఢిల్లీ: కేరళలో విజృంభిస్తున్న అరుదైన వైరస్ ‘నిపా’ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. మరో 11 మంది వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. ప్రజలెవరూ భయపడవద్దనీ, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నందున ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విజ్ఞప్తి చేసింది. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందనీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మి వాటిని ఇతరులకు పంపి ప్రజలను భయపెట్టవద్దని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలను కోరారు. కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించాలని కేంద్ర అధికారులను ఆదేశించారు. నిపా వైరస్ సోకిన లక్షణాలతో వచ్చే రోగులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆసుపత్రులకు సూచించారు. ఇప్పటికే జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) నుంచి ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని కేంద్రం కొజికోడ్కు పంపడం తెలిసిందే. చికిత్స అందించేందుకు సిద్ధం కేరళకు వచ్చి నిపా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, ఆ అవకాశాన్ని ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కళాశాల వైద్యుడు కఫీల్ ఖాన్ సీఎం విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. ఖాన్ లాంటి వైద్యులను కేరళకు ఆహ్వానించడం తమ ప్రభుత్వానికి ఆనందమేననీ, ఇంకా ఇలా సేవ చేసేందుకు రావాలనుకునే వారెవరైనా ఉంటే తమ కొజికోడ్ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ను సంప్రదిస్తే అన్ని ఏర్పాట్లూ చేస్తారన్నారు. కాగా, గతేడాది ఆగస్టులో బీఆర్డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 63 మంది చిన్నారులు మరణించారు. ఈ కేసులో కఫీల్ ఖాన్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ కేసులో తనను ఇరికిస్తున్నారని అప్పట్లో ఖాన్ చెప్పారు. నిపా ఎలా వ్యాపిస్తుంది ? ♦ పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఇతర జంతువులకి ♦ జంతువుల నుంచి జంతువులకి ద్రవాల ద్వారా ♦ గబ్బిలాలు కొరికి పడేసిన పండ్లు తింటే ♦ స్వేదం తదితర ద్రవాల ద్వారా మనుషుల్లో ఎలా గుర్తిస్తారు? ♦ రక్త పరీక్షలు ♦ కండరాల్లో వచ్చే మార్పుల్ని గుర్తించడం ♦ వైరస్‌ను వేరు చేసి పరీక్షించడం చికిత్స ♦ ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రత్యేకంగా టీకాలు లేవు ♦ రోగుల్ని విడిగా ఉంచి కృత్రిమ పద్ధతుల్లో శ్వాస అందిస్తూ స్వస్థతకు ప్రయత్నిస్తారు. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రిబావిన్ మాత్రల ద్వారా కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చు. మరణాల రేటు ♦ వ్యాధి సోకిన వారిలో దాదాపు 70 శాతం మంది మరణిస్తారు భారత ఉపఖండంలో ఎప్పుడెప్పుడు వచ్చింది ? ♦ 2001లో సిలిగుడి, పశ్చిమబెంగాల్.. 66 మందికి వైరస్ సోకగా 45 మంది మరణించారు. ♦ 2011లో బంగ్లాదేశ్.. వైరస్ సోకిన 56 మందిలో 50 మంది మృత్యువాత లక్షణాలు ♦ జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మత్తుగా ఉండటం. ♦ కొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపిస్తాయి. ♦ 10–12 రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి ♦ ఆ తర్వాత రోగి నెమ్మదిగా కోమాలోకి వెళ్లిపోతాడు ♦ బ్రెయిన్ ఫీవర్ వచ్చిందంటే అదే ఆఖరి స్టేజి, ఆ తర్వాత మరణం సంభవిస్తుంది. జాగ్రత్తలు ♦ జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పళ్లు తినకూడదు. గబ్బిలాలు తిరిగే చోట ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ♦ నిపా రోగుల దగ్గరకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి ♦ రోగులకు సేవలు అందించేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌లు ,చేతులకు తొడుగులు ధరించాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సిస్టర్ లినీ ప్రాణ తర్పణం!
నిపా వైరస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న కేరళ నర్సు అదే వైరస్ సోకి మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వృత్తి ధర్మం నిర్వర్తించిన సిస్టర్ లినీ పుత్తుస్సెరీకి అంజలి ఘటిస్తోంది. చనిపోయే ముందు లినీ (31) తన భర్తకు రాసిన ఉత్తరాన్ని బట్టి.. మరణానికి సిద్ధపడే, నర్సుగా ఆమె తన సేవలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది!‘‘నేను నిన్ను మళ్లీ కలుసుకుంటానని అనుకోవడం లేదు. పిల్లలు జాగ్రత్త. నీతో పాటు గల్ఫ్ తీసుకెళ్లు. ఎవరికి వారుగా ఒంటరిగా ఉండకండి’’ అని ఉత్తరంలో రాసిన కొద్ది రోజులకే లినీ తన కుటుంబ సభ్యులందరినీ ఒంటరివారిని చేసి, మొన్న సోమవారం మృత్యువు ఒడిలోకి వాలిపోయింది.లినీతో కలిపి ఇప్పటి వరకు ఇండియాలో నిపా వైరస్ సోకి మృత్యువాత పడిన వారి సంఖ్య 10కి చేరింది. విషాదం ఏమిటంటే.. నిపా రోగులకు సేవలు అందించడానికి కోళికోడ్ దగ్గరి పెరంబ్రా ఆసుపత్రిలో నర్సుగా చేరిన లినీ కూడా రోగుల నుంచి ఆ వ్యాధి సోకి మరణించడం! లినీకి ఇద్దరు చిన్నపిల్లలు. భర్త గల్ఫ్‌లో ఉంటాడు. ఆదివారంనాడు నిపా వైరస్‌తో కోళికోడ్‌లో ఇద్దరు, మలప్పురం జిల్లాలో నలుగురు మరణించడంతో అప్పటి వరకు సంభవించిన మూడు నిపా మరణాలతో కలిపి ఈ సంఖ్య తొమ్మిదికి చేరగా, పెరంబ్రా ఆసుపత్రిలో కొన్నాళ్లుగా నిపా రోగులకు సేవలు అందిస్తున్న లినీ మృతితో ఆ జాబితా పదికి చేరింది. నిపా వైరస్‌కు మనిషి నుంచి మనిషికి వ్యాపించే స్వభావం ఉండడంతో నర్సు లినీ మృతదేహాన్ని పెరువన్నముళి సమీపంలోని చెంబనోడా ప్రాంతంలో ఉన్న ఆమె స్వగ్రామానికి తరలించలేకపోయారు. కుటుంబ సభ్యుల అనుమతితో కేరళ ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని కోళికోడ్‌లోనే ఒక విద్యుత్ శ్మశానవాటికలో లినీ అంత్యక్రియల్ని నిర్వహించింది. లినీ జబ్బున పడిందన్న సంగతి తెలిసిన ఆమె భర్త సజీశ్ రెండు మూడు రోజుల క్రితమే కేరళ వచ్చాడు కానీ, వైద్యులు అతనిని లినీని కలవనివ్వలేదు. పిల్లలు సిద్ధార్థ్ (5), రితుల్ (2) కూడా అమ్మ ముద్దుకైనా నోచుకోలేదు. నిపా వైరస్‌తో చంగరోత్ ప్రాంతం నుంచి పెరంబ్రా ఆసుపత్రిలో చేరిన ఒక యువకుడికి మాత్రమే అతడి చివరి రోజులలో నర్సుగా లినీ ఆప్యాయత అందింది. ఆ తర్వాతి నుంచీ లినీలో ఆ జబ్బు లక్షణాలు కనిపించడం మొదలైంది. లినీకి కూడా ఈ వైరస్ సోకిందని నిర్ధారించుకున్న వెంటనే ఆమె భర్తకు వైద్యాధికారులు సమాచారం పంపించారు. అయితే అంతకంటే ముందే లినీ తన అంతిమ ఘడియల్ని పసిగట్టి భర్తకు ఉత్తరం రాశారు. నిపా వైరస్ నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో మానవదేహంలో వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు అతి సమీపంలో ఉండి సేవలు అందించిందన్న కనికరం కూడా లేకుండా లినీని కూడా ఒక మామూలు రోగిలానే మృత్యువు కబళించింది. లినీ అంత్యక్రియలకు కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ హాజరయ్యారు. లినీ తన భర్తకు రాసిన ఉత్తరాన్ని ఆయనే తన ఫేస్బుక్లో పెట్టారు. లినీ మొదట కోళికోడ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. గత సెప్టెంబరులో పెరంబ్రా తాలూకా ఆసుపత్రి కాంట్రాక్టుపై ఆమెను నియమించుకుంది. లినీ మరణానికి సంతాపంగా సోమవారం నాడు పెరంబ్రా ఆసుపత్రి సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ‘యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్’ లినీ త్యాగనిరతిని ఆవేదనతో స్మరించుకుంది. నిద్రలేచిన మహమ్మారి నిపా వైరస్ (Nipah Virus) ►కొత్తవ్యాధి కాదు కానీ, కొత్తగా తలెత్తిన వ్యాధి. ►జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ► ముఖ్యంగా పందుల నుంచి, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. ►ప్రస్తుతం నిపా భయం ఇండియాను ఒణికిస్తోంది. ►దీనికి మందులు గానీ, వ్యాక్సిన్లు గానీ లేవు. ►జ్వరం, తలనొప్పి, తల తూలడం, వాంతులు.. ప్రధాన లక్షణాలు. ►వ్యాధి తీవ్రం అయినప్పుడు శ్వాస కష్టం అవుతుంది. -
బాబోయ్ నిపా!
-
నిపా వైరస్ అప్రమత్తం చేస్తూ ఆదేశాలు
-
నిపా వైరస్ : మరణశయ్యపై నుంచి భర్తకు లేఖ
తిరువనంతపురం, కేరళ : ‘నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నగారిలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు’ ఇవి నిపా వైరస్ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) చివరి మాటలు. నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకింది. కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో కుటుంబసభ్యులకు కనీసం ఆఖరి చూపుకైనా లేకుండా లినీ భౌతికకాయానికి దహనసంస్కారాలు నిర్వహించారు. లినీ మరణంపై స్పందించిన డాక్టర్ దీపూ సెబిన్ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు. ఏంటీ నిపా వైరస్? గబ్బిలాలు, పందుల ద్వారా ఎక్కువగా నిపా వైరస్ సోకుతుంది. గబ్బిలాలు తీసుకున్న ఆహారం ద్వారా ఇది సోకుతుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయల ద్వారా ఇది సోకే ప్రమాదం ఎక్కువ. పందులు, పిల్లి, కోతులు తదితరాల ద్వారా కూడా ఇది మనుషులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు : - శ్వాస తీసుకోలేకపోవడం - జ్వరం - తలనొప్పి - తల∙నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే. సలహాలు : - పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం - పండ్లు, కూరగాయలను పరిశుభ్ర పరిచిన తర్వాతే తీసుకోవడం - చేతులను ప్రతిసారీ సబ్బతో కడుక్కోవడం - మామిడిపండ్లు, జాక్ ఫ్రూట్స్, రోజ్ ఆపిల్స్‌లను గబ్బిలాలు ఆహారంగా ఎక్కువ తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. -
నిపా 'ఎలర్ట్'
ఇటీవల ప్రతి ఏటా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. తొలుత కలరా, మలేరియా, చికున్ గున్యా ప్రజల్ని వణికించాయి. ఆ తదుపరి డెంగీ, స్వైన్ ఫ్లూ, జికా వంటివి ప్రజల్ని భయాందోళనకు గురిచేశాయి. ఈ వ్యాధులు, జ్వరాలన్నీ రాష్ట్రంలోకి ప్రవేశించి వెళ్లినవే. తాజాగా నిపా వైరస్ పేరు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. 1998లో మలేషియాలో కంబన్ సుంగై వద్ద ఈ నిపా వైరస్‌ను గుర్తించారు. 2004లో ఇది బంగ్లాదేశ్‌ను వణికించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. గబ్బిలాలు, గుడ్ల గూబలు, పందుల ద్వారా ఈ వైరస్ సోకుతున్నట్టుగా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు పదిమందికి పైగా మరణించినట్టు, మరెందరో ఈ వైరస్ బారిన పడ్డట్టుగా సమాచారం. దీంతో కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల ప్రజల్లో ఆందోళన బయలుదేరింది. సాక్షి, చెన్నై : నిపా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. కేరళలో ఈ వైరస్ బారిన పడి పదిమందికి పైగా మరణించిన సమాచారం సరిహద్దు వాసుల్ని ఆందోళనలో పడేసింది. అప్రమత్తం చేస్తూ ఆదేశాలు నిపా వైరస్ బారిన పడ్డ వారికి తొలుత శ్వాస సమస్య తలెత్తుతుంది. తల∙నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే. ఈ దృష్ట్యా, సరిహద్దుల్లో ఎవరైనా శ్వాస సమస్య, తలనొప్పితో బాధపడుతుంటే, తక్షణం వైద్యుల్ని సంప్రదించాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా కన్యాకుమారి, తేని, తిరునల్వేలి, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, డైరెక్టర్ కులందై స్వామి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్వాస సంబంధిత, తలనొప్పి, జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే తక్షణం వారికి వైద్య సేవలు అందే రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలు సాగించాలని, సరిహద్దుల్లో వైద్యు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేరళ నుంచి ఎవరైనా జ్వరంతో ఇక్కడికి వచ్చినా, వస్తున్నా తక్షణం వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిపా వైరస్ తమిళనాడులోకి ప్రవేశించకుండా ప్రజా ఆరోగ్య సంరక్షణ నిమిత్తం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలని, పందుల పెంపకందారులకు కఠిన హెచ్చరికలు ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాధి ప్రభావం మెదడు మీద పడ్డ పక్షంలో మనిషి జీవించడం అరుదే. ఆందోళన వద్దు నిపా వైరస్ ఆందోళన వద్దని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ భరోసా ఇచ్చారు. ఈ వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేశామన్నారు. ఇది కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉందన్నారు. సరిహద్దు జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఇక్కడ ఆ వైరస్ ప్రవేశించలేదని,ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేరళలోని కోలికోడ్, మలపురం పరిసరాల్లో ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారని, వారి రక్త నమూనాలను పరిశోధనలకు పంపించి ఉన్నారన్నారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ సరిహద్దుల్లో వైద్య పరీక్షలు చేయిస్తారన్నారు. డైరెక్టర్ కులందై స్వామి పేర్కొంటూ, నిఫాను కట్టడి చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లు, ఫలాలను శుభ్రం చేయకుండా తిన వద్దని సూచించారు. ఈ నిఫా నివారణకు మందులు లేవని, ప్రాథమిక దశలో గుర్తించిన పక్షంలో ప్రత్యేక చికిత్సతో నివారించ వచ్చన్నారు. -
కేరళలో పెరుగుతున్న నిఫా వైరస్ మృతులు